19-12-2023, 06:36 AM
కథలు వ్రాయడానికి ఒక్కొక్కరికీ కారణం వున్నట్లే కథ వ్రాయకపోవడానికీ కారణాలు వుంటాయి..
సైట్ లో కథలు వ్రాయడానికి అన్నిటికన్నా ప్రైవసీ చాలా పెద్ద సమస్య. అందరిముందూ కూర్చుని వ్రాసే కథలు కాదు గనుక గోప్యత విషయంలో జాగ్రత్తగా వుండటం, సరైన మూడ్ వుండటం... అనేది అన్నిసార్లూ కుదరకపోవచ్చు!
ఇక్కడ వ్రాయడానికి ఎవ్వరూ ఎవరికీ డబ్బులు చెల్లించడం లేదు. రైటర్స్ అందరూ కేవలం ప్యాషన్ తో వ్రాస్తున్నారు. పాఠకులు సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదుగానీ, అనవసర దూషణలకి దిగితే మాత్రం బాగోదు.
మరో విషయం ఏమిటంటే... సైట్లో ఏ మతాన్నైనా, కులాన్నైనా, వర్గాన్నైనా, వృత్తినైనా కించపరిచేలా లేదా టార్గెట్ చేసే రాతలకి, కచ్చితంగా కత్తెర పడుతుంది. అందుకు ఎవ్వరైనా సరే, వారికి ఎంత రెప్యుటేషన్ వున్నా, ఎటువంటి మినహాయింపు వుండదు. రాసేవాళ్ళకి తమ కథ అంటే ఇష్టం వుండొచ్చు, ఆ కథలను చదివే పాఠకులు వుండొచ్చు, కానీ, సైట్ నిర్వహించేవాళ్ళకి కొన్ని వేల కథలను సంరక్షించే బాధ్యత వుంటుంది. ఏ ఒక్కరి కోసమో ప్రత్యేకంగా నిబంధనలను మార్చడం అనేది కుదరదు. సైట్ అంటూ వుంటేనే ఎవరైనా తమ కథలను పోస్ట్ చెయ్యగలుగుతారు. అసలు సైటే లేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి!? అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో కథలను వ్రాస్తే ఎటువంటి ఆంక్షలనైనా ఎదుర్కొనవలసిన అవసరం ఎందుకొస్తుంది.? అడ్మిన్ బాధ్యత కథలను సంరక్షించడం, సైట్ ని నిర్వహించడం. రచయితలు, పాఠకులు సంయమనంగా అడ్మిన్ కు సహకరించాలి తప్ప తలనొప్పిగా మారకూడదు.
ఇట్లు
వికటకవి౦2
- కొందరు సైట్ లోకి వచ్చినా తమ కథలను వ్రాయడానికి వారికి ఆసక్తి కొరవడటం కారణం కావచ్చు!
- కొంతమందికి పనుల వలన కథ వ్రాయడానికి, సైట్ కి సమయం కేటాయించడం కూడా కుదరక పోవచ్చును. ప్రస్తుతం నా పరిస్థితి ఇదే!
- కొన్నిసార్లు రైటర్స్ బ్లాక్ కూడా కారణం కావచ్చును. అనగా, కలం కదపడానికి మైండ్ స్థిరంగా ఆలోచించలేకపోవడం. అలాంటప్పుడు మరింత ఆలస్యం అవుతుంది.
- ఆనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కారణం కావచ్చు కూడా. 45+ప్యాషనేట్మెన్ బాబాయ్, లక్ష్మిగారు ఈ కారణం చేతనే సైట్ కి దూరమయ్యారు.
- సైట్ అడ్మిన్ తో, పాఠకులతో సరైన rapport కొరవడటం వలన కూడా కథను కొనసాగించే ఆసక్తి తగ్గవచ్చు! పేర్లు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
- అలాగే, కథ వ్రాయకపోవడం వలన పాఠకుల ముందుకి రావడానికి ముఖం చెల్లక కూడా కొందరు రైటర్స్ సైట్లో తచ్చాడుతున్నా కనీసం మెసేజీలను కూడా పెట్టరు. ఆమధ్య ఒక స్టార్ రైటర్ ని కథ కొనసాగించకపోయినా, ఒక్కసారి పాఠకులకి రిప్లై ఇవ్వవచ్చు కదా పర్సనల్ గా అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానమిది. ఒకవేళ వారు రావడం అంటూ జరిగితే, కథ అప్డేట్ తోనే ముందుకి వస్తారు తప్ప సంజాయిషీలు ఇవ్వడానికి మాత్రం కాదు.
సైట్ లో కథలు వ్రాయడానికి అన్నిటికన్నా ప్రైవసీ చాలా పెద్ద సమస్య. అందరిముందూ కూర్చుని వ్రాసే కథలు కాదు గనుక గోప్యత విషయంలో జాగ్రత్తగా వుండటం, సరైన మూడ్ వుండటం... అనేది అన్నిసార్లూ కుదరకపోవచ్చు!
ఇక్కడ వ్రాయడానికి ఎవ్వరూ ఎవరికీ డబ్బులు చెల్లించడం లేదు. రైటర్స్ అందరూ కేవలం ప్యాషన్ తో వ్రాస్తున్నారు. పాఠకులు సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదుగానీ, అనవసర దూషణలకి దిగితే మాత్రం బాగోదు.
మరో విషయం ఏమిటంటే... సైట్లో ఏ మతాన్నైనా, కులాన్నైనా, వర్గాన్నైనా, వృత్తినైనా కించపరిచేలా లేదా టార్గెట్ చేసే రాతలకి, కచ్చితంగా కత్తెర పడుతుంది. అందుకు ఎవ్వరైనా సరే, వారికి ఎంత రెప్యుటేషన్ వున్నా, ఎటువంటి మినహాయింపు వుండదు. రాసేవాళ్ళకి తమ కథ అంటే ఇష్టం వుండొచ్చు, ఆ కథలను చదివే పాఠకులు వుండొచ్చు, కానీ, సైట్ నిర్వహించేవాళ్ళకి కొన్ని వేల కథలను సంరక్షించే బాధ్యత వుంటుంది. ఏ ఒక్కరి కోసమో ప్రత్యేకంగా నిబంధనలను మార్చడం అనేది కుదరదు. సైట్ అంటూ వుంటేనే ఎవరైనా తమ కథలను పోస్ట్ చెయ్యగలుగుతారు. అసలు సైటే లేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి!? అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో కథలను వ్రాస్తే ఎటువంటి ఆంక్షలనైనా ఎదుర్కొనవలసిన అవసరం ఎందుకొస్తుంది.? అడ్మిన్ బాధ్యత కథలను సంరక్షించడం, సైట్ ని నిర్వహించడం. రచయితలు, పాఠకులు సంయమనంగా అడ్మిన్ కు సహకరించాలి తప్ప తలనొప్పిగా మారకూడదు.
ఇట్లు
వికటకవి౦2
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK