Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
రెస్టారెంట్ లో భోజనం ముగించుకుని వచ్చారు నలుగురూ. ఇకపై పిల్లల విషయం లో తన లోభత్వాన్ని చూపించకూడదని నిర్ణయించుకుంది చిత్ర. పిల్లలిద్దరూ పడూకోవడానికి చాప , చెద్దర్లు, మెత్తలు సిద్దం చేసింది చిత్ర.
తన భార్య తనను తన గదిలో పడుకొమ్మని ఆహ్వానించింటే బావుండు ననిపించింది ఈశ్వర్ కి.
తన గది వైపుకు వెళ్తున్న చిత్ర తో
" ఎప్పుడైనా నీకు బయటికి వెళ్ళాలి అనిపిస్తే నాకు చెప్పు చిత్రా, వెళ్దాం కలిసి." అన్నాడు ఈశ్వర్.
"అట్లే. " అంది చిత్ర.
"good night "
" నీకు గూడంగ ."
తన గది లోని మంచం పై నడుము వాల్చిన చిత్ర తన మనస్సులో,
' క్రిష్నయ్యా, ఈశ్వరు కి నిజంగనే నా మీద ప్రేమ కల్గిందా లేక నా మీద జాలి పడ్తుండా? గాయ్న నుంచి జాలి ఎప్పుడు కోరుకోలేదయ్యా నేను, నన్ను ఈశ్వరు ప్రేమించాలె, గా అమృత ని ప్రేమించినంతగ ప్రేమించాలె. నేనేమన్న తప్పు జేస్తే నా మీన కోపం తెచ్చ్కోవాలె. గాయ్నకు ఏమన్న సంతోషం కల్గినా బాద కల్గినా ముందు నాకు జెప్పాలె..... గా అమృత సచ్చిపోయ్యిందయ్యా, కాని నేను గంత తొందరగ సచ్చిపోను, గా మనిషిని బాగ సూస్కుంట . ఇంగో నిముషముల నా ప్రాణం పోతుందన్నా గూడ బాగ సూస్కుంట గా మనిషిని నేను . గంత ఇష్టము గా మనిషంటె నాకు. గా మనిషి నన్ను పెణ్లాం లాగ దెగ్గరకు తీసుకుంటె సాలయ్యా నాకు...... ఇయాల గా మనిషి మాటలు యిననీకె చానా బావున్నయయ్యా. ఒకవెయిళ గవి జాలి తోని అన్న మాటలైనా పర్వాలేదయ్యా. రోజు గూడ గా మనిషి నా తోని గిట్లనే మాట్లాడాలె. ఏదోటి మాట్లాడాలె..... రోజు రాత్రి పూట గిట్ల గా మనిషి ఎప్పుడొచ్చి నా పక్కన గీ మంచం పండుకుంటడా అని ఎదురు సూస్తుంటయ్యా నేను. గా మనిషి యెద మీద నెత్తి పెట్టి పండుకోని ఏదోటి జోలి పెట్టాల్నని ఉంటదయ్యా నాకు.... గా మనిషి కి నా మీద ప్రేమ కల్గెటట్టు సూడయ్యా. ఎదురు సూశి సూశి గుండె పగుల్తుందయ్యా నాకు. గా మనిషి నన్ను పెణ్లాం లాగ సూస్తే సాలయ్యా ఇంగేమి అడగను నిన్నెప్పుడూ.' తన గుండె పొరల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్ళను తన చీర కొంగుతో తుడుచుకోసాగింది చిత్ర.
***
చిత్ర తో రోజంతా గడపాలనుకున్న ఈశ్వర్ కి ఆఫీస్ నుండి ఫోన్ చిరాకు తెప్పించింది. అమృత చనిపోయిన తరవాత బాధ నుండి తప్పించుకోవడానికి యంత్రం లా పని చేసుకునే అలవాటు ఏర్పరుచుకున్న ఈశ్వర్ కి , మొదటిసారిగా 'అత్యంత సమర్థుడైన ' ఉద్యోగిగా తన ఆఫీస్ లో అతనికి ఉన్న పేరు అతనికి భారంగా తోచింది.
టి.వి చూస్తున్న చిత్ర వద్దకు వెళ్ళి , " అదీ ... office నుంచి phone వచ్చింది. ఏదో technical issue అంట. I need to go. నేనొచ్చే వరకూ late కూడా అవ్వచ్చు. నువ్వు జాగ్రత్త. " అన్నాడు ఈశ్వర్, చక్కగా దువ్వ బడిన తన జుట్టును చెరుపుకుని, తిరిగి సరి చేసుకుంటూ.
తన భర్త వైపు చూస్తూ , నవ్వుతూ తలుపేసుకుంది చిత్ర. తన పై ప్రేమను నింపుకున్న కళ్ళని ఇంకాసేపు చూడాలన్న కోరిక కలిగింది ఈశ్వర్ కి.
***
చిత్ర వాళ్ళింటి గోడ గడియారం రెండు సార్లు కొట్టి ఇరవై నిమిషాలు కావొచ్చింది. తన భర్త కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వంకాయ కూర , అతను లేక పోయేసరికి కాస్త నిరాశ తో తినసాగింది చిత్ర.
ఇంతలో వాళ్ళింటి కాలింగ్ బెల్ మూడు సార్లు మోగింది. తన భర్త వచ్చాడని వడి వడిగా ఎంగిలి చేతితోటే వెళ్ళి దర్వాజ ను తెరిచింది చిత్ర.
ఎదురుగా శ్రీజ నిలుచుని ఉంది.
చిత్ర చాలా నిరాశ పడిపోయింది. తన రాక చిత్రకు నచ్చలేదేమో నన్న భావన కలిగింది శ్రీజ కు.
" కూరగాయల మార్కెట్ కి వెళ్ళేటప్పుడు చెప్పమన్నారని వచ్చా మేడం. actually phone చేసి వద్దాం అనుకున్నా. but ఎలాగూ ఉంటారు లే అని వచ్చేసా." అంది శ్రీజ కాస్త బెరుకుగా.
" హా పోదం పోదం. నేను నిమ్మకాయ చెట్నీ పెడదం అనుకుంటున్న ఎప్పట్కెళ్ళో. గందుకే చెప్పింటి నిన్ను జెప్పమని. దా లోన కూర్చోండి, నేను గీయింత తిన్నాంక బయల్దేర్దం గాని." అంది చిత్ర, తన తల్లితో పాటుగా వచ్చిన అభిరాం ని చూసి చిరునవ్వుతో.
వాడు తన జేబులో ఉన్న మెలడీ చాక్లెట్ ని చిత్ర ఎంగిలి చేతిలో పెట్టాడు.
" తిను ఇది కూడా. " అన్నట్టుగా నవ్వాడు అభిరాం.
చిత్ర ఆపుకోలేక తన ఎడమ చేతితో అభిరాం యొక్క బుగ్గ ను గిల్లింది.
" మీ పిలగాడి కి నేనంటె మస్తిష్టం." అంది చిత్ర శ్రీజ వంక చూస్తూ, నిండుగా నవ్వుతూ.
" అవును. మొన్న వీడి birthday రోజు మీకు కేక్ తినిపించినప్పుడు నేను, మా ఆయన, మా చుట్టాలూ అందరం shock అయిపోయాం. వీడేంటి అంత సున్నితంగా behave చేయడమేంటీ అని." అని తన కొడుకును తన వైపుకు లాక్కుంటూ నవ్వుతూ చెప్పింది శ్రీజ.
" హహ, రండి లోపటికి. ఐదు నిమ్శాలల్ల తినేస్త." అంటూ లోపలికి ఆహ్వానించింది చిత్ర.
" అయ్యో పర్లేదు మేడం. వెయిట్ చేస్తాం. తొందరేముంది." అని సొఫా పై తన కొడుకుని ఒళ్ళో కూర్చో బెట్టుకుని కూర్చుంది శ్రీజ.
భోజనాన్ని ముగించిన చిత్రకు అభిరాం కి ఏదైనా ' సలాడ్ ' తొందరగా చేసిపెట్టాలని అనిపించింది. వెంటనే వంటింట్లోకి వెళ్ళి నువ్వులూ, పుట్నాలూ, చక్కెర కలిపి ' సలాడ్ ' లా చేసి అభిరాం కోసం తీసుకు వచ్చింది చిత్ర.
" అయ్యో, ఇప్పుడివన్నీ ఎందుకు మేడం ? " అంది శ్రీజ.
" ఉండన్లే. మీ వోనికి చేశిపెట్టడం మస్తనిపిస్తది నాకు. ఐయ్నా ఇందుల ఏముంది జెప్పు? గవిన్ని, గివిన్న కలుపుడు అంతేగద ! " అంది చిత్ర నవ్వుతూ. తన కొడుకు పై చిత్ర చూపిస్తున్న వాత్సల్యం శ్రీజ కు చాలా సంతోషాన్ని కలిగించింది.
అభిరాం చిత్ర ముందుకు వంగమని సైగ చేసి, ఆమె నోట్లో ఒక స్పూన్ నిండా సలాడ్ పెట్టి
" తిను నువ్వు కూడా." అన్నట్టుగా సైగ చేశాడు అభిరాం.
***
ముగ్గురూ ఆటో లో కూరగాయల మార్కెట్ కి బయలుదేరారు. చిత్ర మునుపటి కన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నట్టూగా గుర్తించగలిగింది శ్రీజ. ఏదైనా ' తీపి ' కబురు వల్ల ఆమె అలా ఉందేమో నన్న అనుమానం కలిగింది. ఉత్సుకత ని ఆపుకోలేక,
" మేడం , ఏమైనా విశేషమా? చాలా హ్యాపీ గా కనిపిస్తున్నారు ?" అడిగింది శ్రీజ.
తన భర్త తనతో బాగా మాట్లాడుతున్నాడు అని చెబితే చాలా విడ్డూరంగా ఉంటుందని భావించింది చిత్ర.
" గట్లేమ్లేదే. ఎప్పటిలెక్కనే ఉన్న నేను." అంది చిత్ర, ' మామూలుగా ' ఉండటానికి బాగా ప్రయత్నిస్తూ.
బదులుగా చిరునవ్వు నవ్వింది శ్రీజ. అందరూ తను, తన భర్త లా పెళ్ళైన సంవత్సరం లోగానే పిల్లాడిని ఎత్తుకోరని భావించింది శ్రీజ.
చిత్ర, శీజ మధ్యలో కూర్చున్న అభిరాం కి వాళ్ళ జోలి బాగా ' సోది ' లా అనిపించసాగింది. తన పక్కన వెళ్తున్న వాహనాలను చూడాలన్న కోరిక కలిగింది వాడికి. వెంటనే చిత్ర వైపుకు పూర్తిగా ఒరిగి రోడ్డు వంక చూడసాగాడు.
" హేయ్ అభీ, వెహికిల్స్ వస్తున్నాయ్, కనిపించట్లేదా?! " అంటూ వాడిని కోపంగా తన వైపుగా గట్టిగా లాగింది శ్రీజ.
వాడు తన తల్లి వైపు కళ్ళు పెద్దవి చేసి గుర్రున చూస్తూ, ఏడవసాగాడు.
" చుప్! " అరిచింది వాళ్ళమ్మ.
" దా దా దా " అంటూ వాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని సముదాయించసాగింది చిత్ర.
వాడు చిత్ర వైపు చూసి నిండుగా నవ్వి, వాళ్ళ అమ్మ వైపు తిరిగి ' కటీఫ్ ' అన్నట్టుగా తన చిటికెన వేలిని చూపించాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
ముడి - by k3vv3 - 01-06-2023, 02:58 PM
RE: ముడి - by ANUMAY112911 - 01-06-2023, 05:12 PM
RE: ముడి - by sri7869 - 01-06-2023, 05:54 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:06 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:11 PM
RE: ముడి - by Uday - 05-06-2023, 01:53 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:00 PM
RE: ముడి - by K.R.kishore - 05-06-2023, 03:30 PM
RE: ముడి - by sravan35 - 07-06-2023, 08:21 PM
RE: ముడి - by utkrusta - 08-06-2023, 03:50 PM
RE: ముడి - by appalapradeep - 09-06-2023, 04:58 AM
RE: ముడి - by ramd420 - 09-06-2023, 05:30 AM
RE: ముడి - by taru - 09-06-2023, 10:22 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:01 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:04 PM
RE: ముడి - by sri7869 - 10-06-2023, 07:15 PM
RE: ముడి - by k3vv3 - 16-06-2023, 08:33 AM
RE: ముడి - by Roberto - 04-02-2024, 04:20 AM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 12:58 PM
RE: ముడి - by K.R.kishore - 16-06-2023, 11:39 AM
RE: ముడి - by taru - 16-06-2023, 05:12 PM
RE: ముడి - by Uday - 16-06-2023, 06:42 PM
RE: ముడి - by ramd420 - 17-06-2023, 04:56 AM
RE: ముడి - by sri7869 - 17-06-2023, 11:35 AM
RE: ముడి - by k3vv3 - 18-06-2023, 01:31 PM
RE: ముడి - by cherry8g - 18-06-2023, 03:09 PM
RE: ముడి - by sri7869 - 18-06-2023, 08:26 PM
RE: ముడి - by ramd420 - 18-06-2023, 10:22 PM
RE: ముడి - by K.R.kishore - 18-06-2023, 10:40 PM
RE: ముడి - by appalapradeep - 18-06-2023, 10:56 PM
RE: ముడి - by k3vv3 - 21-06-2023, 09:35 AM
RE: ముడి - by K.R.kishore - 21-06-2023, 09:50 AM
RE: ముడి - by sri7869 - 21-06-2023, 03:12 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:52 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:55 PM
RE: ముడి - by TheCaptain1983 - 25-06-2023, 06:15 AM
RE: ముడి - by taru - 25-06-2023, 06:41 AM
RE: ముడి - by Shabjaila 123 - 24-06-2023, 09:06 PM
RE: ముడి - by adultindia - 24-06-2023, 11:00 PM
RE: ముడి - by K.R.kishore - 24-06-2023, 11:22 PM
RE: ముడి - by the_kamma232 - 25-06-2023, 06:18 AM
RE: ముడి - by cherry8g - 25-06-2023, 12:57 PM
RE: ముడి - by Aavii - 26-06-2023, 01:03 AM
RE: ముడి - by Uday - 26-06-2023, 01:50 PM
RE: ముడి - by AnandKumarpy - 26-06-2023, 02:34 PM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 11:58 AM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 12:00 PM
RE: ముడి - by Rohit009 - 27-06-2023, 12:37 PM
RE: ముడి - by K.R.kishore - 27-06-2023, 04:47 PM
RE: ముడి - by ramd420 - 27-06-2023, 11:02 PM
RE: ముడి - by sri7869 - 28-06-2023, 12:08 PM
RE: ముడి - by Mohana69 - 28-06-2023, 02:24 PM
RE: ముడి - by Uday - 28-06-2023, 03:07 PM
RE: ముడి - by utkrusta - 28-06-2023, 03:10 PM
RE: ముడి - by Vvrao19761976 - 28-06-2023, 08:57 PM
RE: ముడి - by smartrahul123 - 29-06-2023, 01:04 AM
RE: ముడి - by phanic - 29-06-2023, 07:02 AM
RE: ముడి - by itskris - 29-06-2023, 11:30 AM
RE: ముడి - by k3vv3 - 29-06-2023, 10:26 PM
RE: ముడి - by Uday - 29-06-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 01-07-2023, 10:32 AM
RE: ముడి - by sri7869 - 01-07-2023, 11:13 AM
RE: ముడి - by utkrusta - 01-07-2023, 01:00 PM
RE: ముడి - by K.R.kishore - 01-07-2023, 01:14 PM
RE: ముడి - by Arjun0410 - 01-07-2023, 03:25 PM
RE: ముడి - by MKrishna - 02-07-2023, 11:28 AM
RE: ముడి - by taru - 02-07-2023, 10:23 PM
RE: ముడి - by k3vv3 - 03-07-2023, 07:00 PM
RE: ముడి - by k3vv3 - 04-07-2023, 09:06 AM
RE: ముడి - by TheCaptain1983 - 04-07-2023, 09:31 AM
RE: ముడి - by utkrusta - 04-07-2023, 12:58 PM
RE: ముడి - by ramd420 - 05-07-2023, 07:11 AM
RE: ముడి - by K.R.kishore - 05-07-2023, 10:53 AM
RE: ముడి - by sri7869 - 05-07-2023, 11:09 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:55 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:58 AM
RE: ముడి - by sri7869 - 07-07-2023, 08:26 AM
RE: ముడి - by cherry8g - 07-07-2023, 05:52 PM
RE: ముడి - by utkrusta - 07-07-2023, 06:21 PM
RE: ముడి - by K.R.kishore - 07-07-2023, 07:34 PM
RE: ముడి - by k3vv3 - 10-07-2023, 09:24 AM
RE: ముడి - by K.R.kishore - 10-07-2023, 09:47 AM
RE: ముడి - by Arjun0410 - 10-07-2023, 10:42 AM
RE: ముడి - by utkrusta - 10-07-2023, 05:00 PM
RE: ముడి - by k3vv3 - 13-07-2023, 02:26 PM
RE: ముడి - by TheCaptain1983 - 14-07-2023, 07:45 AM
RE: ముడి - by sri7869 - 18-07-2023, 11:23 PM
RE: ముడి - by k3vv3 - 29-07-2023, 10:43 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-07-2023, 03:16 AM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:28 PM
RE: ముడి - by Vyas Kumar - 30-07-2023, 06:37 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:26 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:24 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-08-2023, 08:09 AM
RE: ముడి - by Shabjaila 123 - 08-08-2023, 12:37 PM
RE: ముడి - by k3vv3 - 09-08-2023, 08:46 AM
RE: ముడి - by TheCaptain1983 - 10-08-2023, 07:12 AM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:58 PM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:59 PM
RE: ముడి - by k3vv3 - 19-08-2023, 05:00 PM
RE: ముడి - by TheCaptain1983 - 19-08-2023, 09:02 PM
RE: ముడి - by sri7869 - 19-08-2023, 10:16 PM
RE: ముడి - by k3vv3 - 30-08-2023, 06:39 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-09-2023, 11:46 PM
RE: ముడి - by sri7869 - 31-08-2023, 02:34 PM
RE: ముడి - by sri7869 - 08-09-2023, 03:51 PM
RE: ముడి - by k3vv3 - 08-09-2023, 10:13 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:14 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:16 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:19 PM
RE: ముడి - by sri7869 - 09-09-2023, 02:10 PM
RE: ముడి - by Uday - 09-09-2023, 03:08 PM
RE: ముడి - by Vvrao19761976 - 14-09-2023, 08:37 PM
RE: ముడి - by nalininaidu - 15-09-2023, 12:05 PM
RE: ముడి - by Vishnupuku - 16-09-2023, 11:38 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:03 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:04 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:18 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:19 PM
RE: ముడి - by sri7869 - 19-09-2023, 07:11 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 09:54 PM
RE: ముడి - by Uday - 20-09-2023, 05:41 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:12 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:14 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:15 PM
RE: ముడి - by sri7869 - 27-09-2023, 08:17 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:02 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:05 PM
RE: ముడి - by TheCaptain1983 - 09-10-2023, 06:27 AM
RE: ముడి - by sri7869 - 08-10-2023, 11:29 PM
RE: ముడి - by Uday - 16-10-2023, 08:05 PM
RE: ముడి - by k3vv3 - 23-10-2023, 04:23 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:04 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:08 PM
RE: ముడి - by TheCaptain1983 - 27-10-2023, 04:53 AM
RE: ముడి - by sri7869 - 24-10-2023, 10:06 PM
RE: ముడి - by Uday - 01-11-2023, 02:36 PM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:35 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:36 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:38 AM
RE: ముడి - by TheCaptain1983 - 19-11-2023, 09:26 PM
RE: ముడి - by sri7869 - 24-11-2023, 10:38 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:14 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:52 AM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:15 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:18 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:55 AM
RE: ముడి - by Uday - 13-12-2023, 02:29 PM
RE: ముడి - by sri7869 - 15-12-2023, 02:01 PM
RE: ముడి - by BR0304 - 21-12-2023, 07:46 PM
RE: ముడి - by BR0304 - 23-12-2023, 04:43 AM
RE: ముడి - by k3vv3 - 23-12-2023, 07:17 PM
RE: ముడి - by BR0304 - 29-12-2023, 04:15 AM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:00 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:01 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:03 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-12-2023, 12:32 AM
RE: ముడి - by sri7869 - 30-12-2023, 02:16 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by sri7869 - 01-01-2024, 09:47 AM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 02:43 PM
RE: ముడి - by k3vv3 - 03-01-2024, 05:56 PM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 10:47 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:29 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:32 PM
RE: ముడి - by TheCaptain1983 - 08-01-2024, 05:04 AM
RE: ముడి - by BR0304 - 07-01-2024, 11:04 PM
RE: ముడి - by sri7869 - 08-01-2024, 08:13 PM
RE: ముడి - by BR0304 - 11-01-2024, 08:15 AM
RE: ముడి - by shoanj - 12-01-2024, 09:36 AM
RE: ముడి - by Uday - 13-01-2024, 02:22 PM
RE: ముడి - by BR0304 - 16-01-2024, 07:52 PM
RE: ముడి - by siva_reddy32 - 17-01-2024, 03:08 AM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:09 PM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:12 PM
RE: ముడి - by TheCaptain1983 - 20-01-2024, 05:52 AM
RE: ముడి - by sri7869 - 19-01-2024, 02:42 PM
RE: ముడి - by BR0304 - 19-01-2024, 04:15 PM
RE: ముడి - by Uday - 22-01-2024, 06:43 PM
RE: ముడి - by k3vv3 - 30-01-2024, 04:33 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:38 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by sri7869 - 31-01-2024, 12:53 PM
RE: ముడి - by Uday - 31-01-2024, 02:53 PM
RE: ముడి - by BR0304 - 31-01-2024, 10:09 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:07 PM
RE: ముడి - by 9652138080 - 05-02-2024, 11:08 AM
RE: ముడి - by Roberto - 06-02-2024, 10:29 AM
RE: ముడి - by e.sai - 13-02-2024, 08:51 AM
RE: ముడి - by TheCaptain1983 - 09-03-2024, 11:11 PM
RE: ముడి - by sri7869 - 04-02-2024, 01:31 PM
RE: ముడి - by BR0304 - 04-02-2024, 07:04 PM
RE: ముడి - by Uday - 05-02-2024, 06:37 PM



Users browsing this thread: 9 Guest(s)