Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#59
శంభల రాజ్యానికి పయనం – 1

సిద్ధపురుషుని నేతృత్వంలో మార్గం సుగమం

ప్రపంచాన్ని ఘోర కలి నుండి కాపాడేందుకు కావాల్సిన శక్తులనీ, మనోధైర్యాన్నీ ప్రోది చేసుకోవటానికి శంభల రాజ్యానికి పయనం అవ్వటమే పరిష్కార మార్గంగా సూచించాడు సిద్ధపురుషుడు. రాజవరం గ్రామంలోని అధిష్ఠా నివాస స్థానమున విచ్చేసి ఉన్న సిద్ధపురుషుడు శంభల రాజ్యం గురించి అభిజిత్, అంకిత, సంజయ్ లతో ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
 
"బాహ్యమైన భౌతిక దృష్టికి శంభల రాజ్యం కనిపించదు
కాలచక్ర తంత్రంలో ప్రవేశం ఉన్నవారికి మాత్రమే శంభల రాజ్య దర్శనం దొరుకుతుంది. భారతదేశానికి ఉత్తరాదిన ఉన్న సీతా నదిని దాటిన తర్వాత మాత్రమే శంభల రాజ్యం మనకు కనిపిస్తుంది. శంభల రాజ్యంలో ఏడుగురు ధర్మజ్ఞులు కాలచక్ర తంత్రాన్ని మనకు అందించారు. వాళ్ళు అందించిన తంత్ర శాస్త్రాన్నే శాక్యముని కల్కి రాజులకు ఇచ్చాడు. శంభల రాజ్యంలో మొత్తం 32 మంది రాజులు ఉన్నారు. మొదటి ఏడుగురినీ ధర్మజ్ఞులు అంటారు. మిగిలిన 25 మందినే 
కల్కి రాజులు అంటారు. ప్రస్తుతం 21 కల్కి రాజైన అనిరుద్ధుని కాలచక్రంలో నడుస్తోంది శంభల రాజ్యం."
 
"వాళ్ళని  కల్కి రాజులు అని ఎందుకంటారు స్వామి?"అడిగాడు అభిజిత్.
 
"25 చక్రవర్తి కల్కి ఆగమనంతో కాలచక్రం ముగిసిపోతుంది. అందుకే 25 మంది రాజులనూ కల్కి రాజులు అంటారు", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"కల్కి రాకతో కాలచక్రం ఎలా అంతం అయిపోతుంది స్వామి?" అడిగాడు సంజయ్.
 
"కల్కి రాజుగా ఉన్న సమయంలోనే 'మహాప్రళయ సంగ్రామం
' జరుగుతుంది. సమయంలో ప్రపంచంలో ధర్మం పూర్తిగా నశించిపోవటం వలన దుష్టులైన వారే రాజ్యపరిపాలన చేస్తూ ఉంటారు. ధూమకేతువు లాంటి ఖడ్గంతో  దేవదత్తం అని పిలువబడే తెల్లటి గుర్రాన్ని అధిరోహించి దుష్టశిక్షణ చేస్తూ కల్కి ధర్మాన్ని నిలబెడతాడు. కల్కి శ్రీమహావిష్ణువు అవతారం. ఆయన పరిసమాప్తించిన తర్వాత తిరిగి సత్యయుగం ఆరంభం అవుతుంది. అలా కాలచక్రం అంతం అయిపోతుంది ", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"ధూమకేతువు అంటే ఏమిటి స్వామి?" అడిగింది అంకిత.
 
"తోకచుక్క. అలాంటి ఆకారంలో ఉంటూ భగభగ మండే అగ్నితో పదునైన ఖడ్గమును చేతబూని దుర్మదాంధులను సంహరిస్తాడని మన విష్ణుపురాణంలో చెప్పబడి ఉంది", అన్నాడా సిద్ధపురుషుడు.
 
"శాక్యముని అందించిన కాలచక్ర తంత్రాన్నే ఇప్పుడు మీకు దీక్షగా అందిస్తున్నాను. శ్రద్ధగా దీన్ని తీసుకుని శంభల రాజ్యంలో మీ పయనానికి మార్గాన్ని సుగమం చేసుకోండి", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"స్వామి...ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. శాక్యముని అనగా ఎవరు?" అడిగాడు అభిజిత్.
 
"గౌతమ బుద్ధుడినే శాక్యముని అంటారు. అగ్నిపురాణంలోని 16 అధ్యాయంలో బుద్ధుడి గురించి, కల్కి గురించి చెప్పబడి ఉన్నది. పురాణాల్ని అధ్యయనం చెయ్యటం అన్నది మనకు ఎప్పటి నుంచో విధిగా వస్తున్నది. పురాణాల్ని మననం చేస్తూ ఉంటే వాటిలో ప్రస్తావించిన విషయాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలము", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"మీకు ఇంకా ఏవైనా సంశయాలు ఉన్నచో ఇప్పుడే అడగండి. కాలచక్ర తంత్రాన్ని దీక్షగా తీసుకున్న తర్వాత ఒక్క వాక్యం కూడా మీరు పలుకరాదు. అచంచలమైన శ్రద్ధ, పట్టుదలతో అభ్యసించినప్పుడు మాత్రమే మీకు తంత్రం సిద్ధిస్తుంది ", అన్నాడా సిద్ధపురుషుడు.
"ఇక్కడి నుండి శంభల రాజ్యానికి వెళ్లి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావటానికి ఎంత సమయం పడుతుంది స్వామి?" అన్నాడు సంజయ్.
 
"యుద్ధవిద్యల గురించి ప్రస్తావించిన అథర్వణ వేదంలోని ఎన్నో రహస్యాలను మీరు అక్కడ తెలుసుకోనున్నారు. వాటిని అధ్యయనం చేసి, సాధన చేసి చివరిగా ఒకసారి క్షుణ్ణముగా మొత్తం చదివితే కానీ అర్థమయ్యేవి కావవి. ప్రక్రియ అంతా పూర్తవ్వటానికి 30 దినముల వ్యవధి సరిపోతుంది", అని చెప్పాడు సిద్ధపురుషుడు.
 
సంజయ్ కాసేపు ఆలోచించాడు. అభిజిత్, అంకితలను రెండు ప్రశ్నలు అడిగాడు.
 
"30 రోజుల టైం పడితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ డిలే అయిపోతుందేమో కదా? పైగా మనకి సిబిఐ నుండి పర్మిషన్ ఎలా దొరుకుతుంది?"
 
"అశుతోష్ ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ ని ఆపేశాడో ఇప్పుడు జోసెఫ్ సెబాస్టియన్ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాడు. జోసెఫ్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేటస్ ని సిబిఐ కి అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. మనకు రోజూ మెయిల్స్ పెడుతున్నాడు. మనం మొబైల్, లాప్టాప్ ఇలాంటివి శంభల రాజ్యంలోకి తీసుకుని వెళ్లలేం కాబట్టి ఆటోమేటిక్ రిప్లైస్ వచ్చేలా మెయిల్ లో అవుట్ అఫ్ ఆఫీస్ సెట్టింగ్స్ అప్లై చేసేద్దాం. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో అశుతోష్ ని రెస్క్యూ చెయ్యటం మీదనే అందరి ఫోకస్ ఉంది. పైగా ఘోర కలి ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలియదు. 'అదృశ్య మందిరం' కేసు ఇన్వెస్టిగేషన్ ని ఎవ్వరూ టచ్ చెయ్యకండి అని ఘోర కలి వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి మీడియాలో మన గురించి ఎవ్వరూ పట్టించుకోరు. 30 రోజులు కాబట్టి మనం ఎక్కడికి వెళ్లిపోయాం అని ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. వెళ్లే ముందే ఒక మెయిల్ పెట్టేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను", అన్నాడు అభిజిత్.
 
అదేదో చాలా తేలికైన విషయం అన్నట్టు అభిజిత్ అంత నార్మల్ గా చెప్పేసరికి సంజయ్, అంకిత తననే రెప్పార్పకుండా చూస్తూ ఉన్నారు.
 
చివరికి చేసేదేం లేక అభిజిత్ చెప్పినట్టుగానే సంజయ్ మెయిల్ బాక్స్ ని  వెకేషన్ రెస్పాన్స్ ఇచ్చేలా సెట్ చేసాడు. 30 రోజుల పాటు వీళ్ళు అవుట్ అఫ్ రాజవరం వెళ్తున్నారని...అది కూడా కేసు ఇన్వెస్టిగేషన్ కోసమే అని....అదొక  సీక్రెట్ ఆపరేషన్ కావటంతో డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయలేనని సీబీఐకి మెయిల్ పెట్టేసాడు సంజయ్. ఇన్ని రోజులూ జోసెఫ్ సెబాస్టియన్ కు తను కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ప్రతీ డీటెయిల్ ని అప్డేట్ చేశానని....   సీక్రెట్ ఆపరేషన్
వల్ల మెయిల్ లేదా కాల్ సపోర్ట్ ఇవ్వలేకపోయినా జోసెఫ్ కి కేసు ఇన్వెస్టిగేషన్ లో వచ్చే నష్టమేం లేదంటూ లాజికల్ పాయింట్ ఒకటి మెన్షన్ చేసి మెయిల్ ని కంక్లూడ్ చేసాడు సంజయ్.  
 

 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 04-12-2023, 01:50 PM



Users browsing this thread: 6 Guest(s)