07-11-2023, 06:43 PM
ప్రియా: ఓకే...అలాంటప్పుడు మా డాడీ గురించి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది?
జోసెఫ్: మీ ఫాదర్ ఎప్పటికప్పుడు తన లొకేషన్ మారుస్తూ వచ్చారు. అసలు మీ సొంతిల్లు తాంబరమ్ లో వుంది అన్న విషయం ఈ మధ్యనే అశుతోష్ వల్ల తెలిసింది. తను ముంబైలో ప్రొఫెసర్ గా పని చేసే కాలేజీలో కూడా మీ సొంత ఇంటి అడ్రస్ ఇవ్వలేదు.
ప్రియా: మరి ఇప్పుడెలా కనిపెట్టారు?
జోసెఫ్: ఆండ్రూ గంబూర్ట్సేవ్ అనే జియాలజిస్ట్ తో మీ నాన్నగారు గుర్గావ్ లో మాట్లాడారు. ఆ మీటింగ్ చివర్లో ఆండ్రూతో మీ నాన్నగారు అడ్రస్ షేర్ చేసుకున్నారు. సిబిఐ ఇంటరాగేషన్ అయిపోయాక ఆండ్రూ అశుతోష్ తో ఈ అడ్రస్ ని షేర్ చేసుకున్నాడు. అలా తెలిసింది మీ ఇల్లు.
ప్రియా: గ్రేట్ వర్క్ ! కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఒకటుంది. మా నాన్నగారు పని చేసే కాలేజీలో సొంత ఇంటి అడ్రస్ ఇచ్చారు. నాకు బాగా గుర్తు. ఆయన సెలవులకి ఇంటికొచ్చినప్పుడు యూనివర్సిటీ నుండి కొన్ని పేపర్స్ వచ్చేవి.
జోసెఫ్: అవునా !
ప్రియా: యా....రీసెంట్ గా అడ్రస్ బుక్ లో ఏమైనా మార్చేసారేమో మరి
జోసెఫ్: అలా అయితే....ఆయన లాస్ట్ టైం ఎప్పుడు అడ్రస్ మార్చారో తెలుసుకోవాలి
ఆ డేట్ అండ్ టైం
మాటల మధ్యలోనే జోసెఫ్ లేచి నడుచుకుంటూ వెళ్లి ఇంట్లోని ప్రతీ గదిని ఒకసారి పరిశీలించాడు. ఒకే ఒక్క రూమ్ మాత్రం లాక్ చేసి వుంది.
జోసెఫ్: మీ నాన్నగారి స్టడీ రూమ్ చూడొచ్చా?
ప్రియా: యా...షూర్. తను మిస్సింగ్ అని తెలిసినప్పటి నుండి నేను తన రూమ్ ని లాక్ చేసుంచా. తన డెస్క్ మీదున్న ఒక్క కాగితం కూడా ముట్టుకోలేదు.
జోసెఫ్: సిబిఐ నుండి మీ ఇల్లు తనిఖీ చెయ్యటానికి నాకు ఇచ్చిన పర్మిషన్ లెటర్ కాపీ ఇది. యు కెన్ రీడ్ ఇట్.
ప్రియా : థాంక్ యు....ఇలా లీగల్ డాక్యుమెంట్ ఒకటుంటే మీకు ఆయన రూమ్ కి యాక్సెస్ ఇవ్వటానికి నాకే ప్రాబ్లం ఉండదు. నేనే అడుగుదాం అనుకున్నాను అంత లోపు మీరే ఇచ్చారు.
జోసెఫ్ అడిగినట్టుగానే ప్రియా రాధాకృష్ణన్ స్టడీ రూమ్ తలుపులు తెరిచింది. ఆ గది నిండా పుస్తకాలే ఉన్నాయి. ఎన్నో అరలు కల ఒక పెద్ద అల్మారా ఉంది. దాని నిండా పుస్తకాలు, పేపర్ లే. స్టడీ చైర్, టేబుల్ ఉన్నాయి. ఆ టేబుల్ కిందున్న అరకు లాక్ వేసి ఉంది. దాని కీ కోసం ప్రియాని అడిగాడు జోసెఫ్. అది ఓపెన్ చెయ్యగానే ఒక ఫైల్ కనబడింది. ప్రాజెక్ట్ టూర్ డే అదృశ్య మందిరం అని వుంది. ఇంతవరకు ఇలాంటిది చూడలేదు జోసెఫ్. ఆ ఫైల్ లో ఏ టు జెడ్ ప్లానింగ్ మొత్తం ఉంది. వెంటనే ఆ ఫైల్ ని తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఫైల్ పెట్టిన చోటే ఒక అడ్రస్ బుక్ కూడా ఉంది. దాన్ని కూడా తీసుకున్నాడు.
ఇంకొన్ని రీసెర్చ్ పేపర్స్ ని కూడా తీసుకుని ప్రియాకు థాంక్స్ చెప్పి అక్కడి నుండి నిష్క్రమించాడు జోసెఫ్.
రిటర్న్ జర్నీ చెన్నై టు ముంబై ఫ్లైట్ బుక్ చేసాడు. ఫ్లైట్ లో తన వెనకే కూర్చున్న ప్యాసెంజర్ ఒకరు తనని గమనిస్తున్నట్టు అనిపించింది జోసెఫ్ కు.
రెండు గంటల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది.
ఎయిర్పోర్ట్ లోని బ్యాగేజ్ కౌంటర్ లో జోసెఫ్ తన బ్యాగ్ కలెక్ట్ చేసుకుని ఎగ్జిట్ వైపుగా వెళ్తున్నాడు.
ఫ్లైట్ లో తన వెనకే కూర్చున్న ప్యాసెంజర్ జోసెఫ్ ను వెంబడిస్తున్నాడు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ