Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#55
అశుతోష్ రెస్క్యూ ఆపరేషన్
ఘోర కలిని ఎదుర్కోవటానికి జోసెఫ్ సెబాస్టియన్ చేసే మేధోరచన
 
ఘోర కలి సామ్రాజ్యంలో బందీగా వున్న అశుతోష్ ని ఇలాంటి పరిస్థితులలో కాపాడటం ప్రాణాంతకమే. అయినా సరే జోసెఫ్ సెబాస్టియన్ కున్న పట్టుదలే తనను నిద్రపోనివ్వటం లేదు. ఒక వారం రోజుల నుండి ఆలోచిస్తూనే ఉన్నాడు. షేప్ షిఫ్టర్ అనేది మొదటి ఛాలెంజ్ అయితే అనుమానమొస్తే చాలు ముందు వెనక చూడకుండా చంపేస్తాడు అన్నది అసలైన ఛాలెంజ్. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. మొదటిగా ఘోర కలిని ఎలా అయినా సరే తను నమ్మించగలగాలి. ఘోర కలి అంత త్వరగా ఎవ్వరినీ నమ్మడు. ఎన్నో శల్యపరీక్షలు చేస్తాడు. ఒక్క దశలో విఫలమైనా సరే ప్రాణం పోతుంది.
 
ఘోర కలి అశుతోష్ చేసే ఇన్వెస్టిగేషన్ కి భయపడే అశుతోష్ ని బంధించి తన చీకటి రాజ్యంలో ఉంచాడనిపిస్తోంది. ఎంతో శక్తి గల ఘోర కలి అశుతోష్ ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు భయపడుతున్నాడు? అంటే ఇందులోనే ఏదో క్లూ దాగుంది.
 
'అదృశ్య మందిరం' లో తప్పిపోయిన ఐదుగురికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ జోసెఫ్ సెబాస్టియన్ లాప్టాప్ లో వున్నాయి. కేసు ఇప్పుడు ప్రపంచం మొత్తానికి బహిర్గతం అవ్వటంతో తప్పిపోయిన ఐదుగురి ఫ్యామిలీస్ వుండే ఇళ్ళకి యాక్సెస్ దొరికింది మీడియా వాళ్లకు. ఎన్నో ప్రముఖమైన మీడియా సంస్థలు కోరటంతో కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి గ్రాంట్ చేసింది. కానీ ఒక షరతు విధించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జర్నలిజం చేసిన వాళ్ళని మాత్రమే అనుమతించేలా కండీషన్ పెట్టింది. ఐదు మంది కుటుంబాలకీ రక్షణ అవసరం కాబట్టి ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోక తప్పలేదు. జోసెఫ్ సెబాస్టియన్ సంజయ్ తో కలిసి రెండేళ్ల క్రితమే కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి చాలా విషయాలు తెలుసుకున్నాడు.
 
కాబట్టి ఐదుగురు ఫ్యామిలీస్ ని ఇప్పుడు కలవటం పెద్ద కష్టమేమీ కాలేదు. పైగా సిబిఐ నుండి స్పెషల్ పర్మిషన్ ఇస్తూ ఒక లెటర్ కూడా రావటంతో జోసెఫ్ పని సులువైపోయింది. సంజయ్ సిబిఐ కి మెయిల్ పెట్టడంతో లెటర్ క్షణాల మీద ఫ్యాక్స్ లో జోసెఫ్ కు చేరింది.
 
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మొదటగా రాధాకృష్ణన్ ఇంటిని ఎంచుకున్నాడు జోసెఫ్. చెన్నై లోని తాంబరమ్ లో వున్న రాధాకృష్ణన్ సొంత ఇంటికి వెళ్ళాడు. రోజు ఇంట్లో రాధాకృష్ణన్ కూతురు ప్రియా కృష్ణన్ ఉంది.
 
 బయట షూస్ వదిలేసి పక్కనే ఉన్న టాప్ దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నాడు  జోసెఫ్. టాప్ తిప్పుతున్నప్పుడు వచ్చే నీళ్ల శబ్దంతోటే ఎవరో వచ్చినట్టుగా గుర్తించి ప్రియా డోర్ వైపుగా నడుచుకుంటూ వస్తోంది. జోసెఫ్ కాలింగ్ బెల్ కొట్టడం ప్రియా కృష్ణన్  తలుపు తెరవటం రెండూ ఒకే సారి జరిగాయి. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు జోసెఫ్. ఇలా బెల్ కొట్టగానే అలా తలుపు తెరుచుకోవటం ఏంటబ్బా అని.
 
 జోసెఫ్: మీ రియాక్షన్ టైం ఏంటండీ ....అంత ఫాస్ట్ గా ఉంది !
 ప్రియా: మీరు టాప్ ఆన్ చేసినప్పుడే ఎవరో వచ్చారని అనిపించింది....సో, వెంటనే వచ్చేసా
 
 జోసెఫ్: మై నేమ్ ఈజ్....
 
ప్రియా: యా.... నో యు....సంజయ్ నాకు మీ గురించి మెయిల్ పెట్టాడు. తను మెయిల్ పెట్టకపోయినా మీరెవరో తెలుసు....ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మీ ఒపీనియన్స్ చదువుతా.....
 
 జోసెఫ్: గ్రేట్ !
 
ప్రియా: చెన్నై లో ఎండలు ఎక్కువ....ఏదైనా డ్రింక్ తీసుకుంటారా?
 
జోసెఫ్: గ్లాస్ అఫ్ వాటర్ ప్లీజ్ !
 
 జోసెఫ్ కళ్ళ ముందే ప్రియా వాటర్ ప్యూరీఫైర్ లోంచి ఒక గ్లాస్ వాటర్ తెచ్చిచ్చింది.
 
 జోసెఫ్: మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి....
 
 ప్రియా: యా షూర్.....టేక్ సీట్ అండ్ హావ్ యువర్ వాటర్ ఫస్ట్
 
గ్లాస్ లోని నీళ్లు మొత్తం తాగేశాడు జోసెఫ్. తనతో తెచ్చుకున్న కేసు డైరీ బయటికి తీసాడు. అందులో రాధాకృష్ణన్ అన్న లీఫ్ ఉన్న చాప్టర్ ఓపెన్ చేసాడు.
 
 జోసెఫ్: అదృశ్య మందిరంలోకి ఎంటర్ అవ్వటానికి మీ ఫాదర్ ఎన్నేళ్లు వర్క్ చేసాడు?
 
 ప్రియా: 2 ఇయర్స్ ముందు తప్పిపోయాడు....సో అంతకు ముందు 5 ఇయర్స్ ఇదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేవాడు.
 
జోసెఫ్: ఫ్యామిలీకి అస్సలు టైం కేటాయించేవాడు కాదా?
 
 ప్రియా: హహహ....చిన్నప్పటి నుంచి అలవాటే మాకు
 
 జోసెఫ్: ఓకే.... ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నందుకు శాలరీ వచ్చేదా?
 
ప్రియా: అఫ్ కోర్స్.... ప్రాజెక్ట్ లో వర్క్ చేసే బ్రెయిన్స్ ఇద్దరే ఇద్దరు. ఒకరు మా ఫాదర్ ఇంకొకరు సైంటిస్ట్ కృష్ణ స్వామి....కృష్ణ స్వామి గారి కింద కొన్ని టీమ్స్ వర్క్ చేసేవి....వాళ్ళ డీటెయిల్స్ నాకే కాదు ఎవ్వరికీ తెలియవు ఇప్పటిదాకా.....
 
జోసెఫ్ చిన్నగా నవ్వాడు.
 
ప్రియా: ఎందుకు నవ్వుతున్నారు?
 
జోసెఫ్: కృష్ణ స్వామి కింద మూడు టీమ్స్ పని చేస్తాయి. ఒకటి ఐటి వింగ్. రెండు యాంటీ గ్రావిటీ టీం. మూడోది గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ టీం. ఒక్క టీం కీ ఇంకొక టీం గురించి ఐడియా లేదు. ఒక్క యాంటీ గ్రావిటీ టీం కే కృష్ణ స్వామి గురించి కాస్త ఐడియా ఉంది. మిగతా రెండు టీమ్స్ కి కృష్ణ స్వామి ఎవరో కూడా తెలీదు. వాళ్ళు ఎవరికోసం వర్క్ చేస్తున్నారో కూడా తెలీదు. ఇచ్చిన టాస్క్ అండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేసి డెలివరీ ఇవ్వటమే తెలుసు.
 
ప్రియా: ఇదంతా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కదా?
 
 జోసెఫ్: యా...సిబిఐ కి కేసు హ్యాండోవర్ అయ్యేముందే సంజయ్ అండ్ నేనూ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది
 
 ప్రియా: మరి నాకు చెప్తే మీకు ప్రాబ్లం అవ్వదా?
 
 జోసెఫ్: ఆల్రెడీ వెబ్ లో....రెడిట్ లో కృష్ణ స్వామి కింద పని చేసే టీమ్స్ పైన చాలా థియరీలు ఉన్నాయి.....
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 07-11-2023, 06:42 PM



Users browsing this thread: 8 Guest(s)