Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#52
చీకటి రాజ్యాల విస్తరణ
హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా నాయకులతో ఘోర కలి మీటింగ్
 
హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎంతో మంది అమాయకులను   ఎన్నో దేశాలకు తరలిస్తూ ఉంటారు.   హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా దొరికిన వారిని ఎన్నో ఇల్లీగల్ పనులకు వాడుకుంటారు. వాళ్ళను బానిసలుగా చేసి సప్లై చేస్తూ ఉంటారు కొంత మంది. బానిసత్వం ఇప్పటికీ చాలా   దేశాలలో ఉంది. అందుకే ఇలాంటి వాళ్లకు డిమాండ్ బాగా ఉంటుంది మార్కెట్లో. సరిగ్గా   ఇలాంటి వాళ్ళ   మీదే   ఘోర కలి నిఘా పెట్టాడు.  
 
ప్రపంచం మొత్తంలో ఇలాంటి గ్యాంగ్స్ ఒక 183 ఉన్నట్టు గుర్తించాడు. 183 గ్యాంగ్స్ ని నడిపే కింగ్ పిన్ లని పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
"మీరు ఇప్పటిదాకా ఎంత మంది బానిసలను సప్లై చేశారో నాకు తెలియదు. ఇక నుంచి అవన్నీ ఆపెయ్యాలి. మీరందరూ నాకోసమే   పని చెయ్యాలి. ప్రస్తుతం మీ దగ్గరున్న బానిసలను మా సైన్యానికి అప్పగించాలి"  
 
వాళ్లలో ఒకడు,"ఎవడ్రా నువ్వు? మాకు ఆర్డర్ లు ఇస్తున్నావ్?....మొన్న యూట్యూబ్ లో చూసాను నీ వీడియో....బాగా నవ్వుకున్నాం నేను, నా ఫ్రెండ్స్....యూట్యూబ్, టిక్ టాక్ లో పాపులర్ అవ్వటానికి చేసుకో ఇలాంటివి...మా జోలికి రావొద్దు", అంటూ నవ్వుతూ ఉన్నాడు.
 
ఘోర కలి ఇదంతా సైలెంట్ గా గమనిస్తూ   ఉన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. మొహం   సీరియస్ గా అయిపోయింది. బలంగా అడుగులో అడుగు వేస్తూ తన పర్సనల్ ఛాంబర్ లోకి వెళ్ళిపోయాడు ఘోర కలి. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక ఖడ్గంతో బయటికొచ్చాడు. తన రివాల్వింగ్   చైర్ లో కూర్చుని ఖడ్గాన్నే చూస్తూ ఇలా చెప్పాడు.
"నెపోలియన్ బోనాపార్టే స్వోర్డ్ గురించి మీకు ఐడియా ఉందా? 1800 లో బాటిల్ అఫ్ మరెంగో లో ఖడ్గాన్ని ఆస్ట్రియన్ సైన్యంతో పోరాడటానికి ఉపయోగించాడు. ఇటలీని గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అరేబియన్ లు వాడే కత్తులు పదునుగా శత్రువును చీల్చి చెండాడే మృత్యు పాశాలలా ఉండేవి. నెపోలియన్ కి అవి బాగా నచ్చి వాటిలానే   ఉండే ఒక ఖడ్గాన్ని తయారు చేయించాడు. ఖడ్గం తయారీ వెనక ఇంత కథుంది.  
 
దాన్ని రీసెంట్ గా ఆక్షన్   లో అమ్మేశారంట. ఇది తెలిసాక చాలా బాధేసింది. నా గర్ల్ ఫ్రెండ్ నాకు బ్రేక్ అప్ చెప్పినట్టు అనిపించింది. నా చేతిలో ఉండాల్సిన కత్తి ఇంకొకడి చేతిలోకెళ్లటం చూసి తట్టుకోలేకపోయా. నరికేద్దాం అనిపించింది. నెపోలియన్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. అందుకే కత్తి మీద చాలా రోజుల వరకు బెంగ పోలేదు. అది బెంగ కూడా కాదు. విరహ వేదన. నేను ఊరుకుంటానా?  
 
అంతకంటే పదునైన కత్తిని తయారు చేయించా",
అని ఖడ్గాన్ని తీసి తనకు ఎదురుగా   ఉన్న అతన్ని పొడిచేసాడు. అతను మరెవరో   కాదు. ఇంతక్రితం ఘోర కలిని చూసి వెటకారంగా నవ్వుతూ హేళన చేసినతనే.  
 
ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ హడలిపోయారు. వాళ్ళల్లో నుండి ఒకడు ముందుకొచ్చి," మీకేం కావాలో చెప్పండి. అది ఇచ్చేస్తాం. దయచేసి మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు"
 
ఘోర కలి గట్టిగా నవ్వాడు.  
"నాకేం కావాలో ఇందాకే మర్యాదగా అడిగాను కదరా బుజ్జి. విన్నారా ? నవ్వారు. నన్ను చూసి నవ్వారు. ఘోర కలిని చూసి ఎవడైనా నవ్వుతాడా !  
ఎవ్వడైనా నవ్వుతాడా?" అని గట్టిగా అరిచాడు.
 
"నవ్వడు....మేము ఇంకెప్పుడూ   నవ్వము", అని అందరూ ముక్తకంఠంతో జవాబిచ్చారు భయపడుతూనే.
 
దేన్నైతే పెట్టుబడిగా పెడితే జీవితకాలం లాభాలు పొందవచ్చో అలాంటిదే   రోజు పెట్టుబడిగా పెట్టాడు ఘోర కలి.  
 
అదే భయం.
 
భయం ఉన్నన్ని రోజులే   ఆధిపత్యం తనతో ఉంటుందని బాగా తెలిసినవాడు ఘోర కలి.
 
భయాన్ని అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో   చూసి క్రూరత్వముతో మనః పూర్వకంగా నవ్వాడు.
రాబోయే రోజుల్లో ప్రపంచం తన వశం అవ్వబోతున్నదని లోలోపల ఆనందపడ్డాడు.  
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 14-10-2023, 09:50 AM



Users browsing this thread: 6 Guest(s)