08-10-2023, 07:05 PM
చిత్ర జ్యోతి తనని ఏమడగబోతుందో ఊహించగలిగింది. కానీ ఆమె నోటి వెంట అడిగేవరకూ ఊరుకోవాలనుకుంది.
" పిల్లల్ని కూడ మాతో తీసుకుపోదమంటె వాళ్ళ చదువు పాడౌతుందని ఈనకి భయం మేడం. వాళ్ళు బాగా చదివి మంచిగ సెటిలవ్వాలనే గదా మేమిద్దరం కష్టపడుతున్నది.... అందుకే... మేము వచ్చే వరకు పిల్లల్ని మీ దెగ్గర ఉంచితే... రెండు, మూడు రోజులల్లో ఒస్తాము మేడం. వాళ్ళేం అల్లరి చేయరు. అపార్ట్మెంట్ లో మీరే బాగా మాట్లాడతారు మేడం మాతో. అందుకే ఇలా మిమ్మల్నే అడుగుతున్నా. పిల్లలిద్దర్నీ ఒంటరిగా ఒదిలి పోవాలంటే భయమౌతోంది, పొద్దున లేస్తే టివి లల్ల ఏమేమో చెప్తున్నరు. రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తాం మేడం మేము. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాం ..."
అంటూ మొహమాటంగా తన మాటల్ని కొనసాగిస్తున్న జ్యోతికి అడ్డుపడుతూ
" అయ్యో, దాందేముంది ?! ఉంటరు గాని మంచిగ ఈడనే ఇద్దరు. నాకు గూడ మస్తు టైం పాసు అవ్తది మంచిగ, సాయంత్రం పూట." అంది చిత్ర జ్యోతి యొక్క మొహమాటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ.
" అదీ.... మరి సార్ కి నచ్చుతుందో లేదో ?! సార్ కి కోపం వస్తుందేమో నని ...." సణగసాగింది జ్యోతి.
జ్యోతి యొక్క ఉద్దేశం అర్థమయ్యింది చిత్ర కు. తన భర్త ఏదో రాక్షసుడైనట్టుగా భావిస్తున్న జ్యోతి పై ఆమెకు కోపం కలిగింది. తన భర్త పై అపార్ట్మెంట్ లో ఏర్పడ్డ ముద్రను మార్చే ప్రయత్నం చేయాలనుకుంది చిత్ర.
" ఈశ్వరు నిన్ను గాని, మీ ఆయనని గాని ఎప్పుడన్న ఏమన్న అన్నడా ?"
" అయ్యో లేదు మేడం."
" పోనీ, మీకేమన్న ఇబ్బంది జేశిండా ?"
" అయ్యో, లేద్లేదు."
" మళ్ళ ?!"
"అయ్యో అయ్యో... నా ఉద్దేశం అది కాదు మేడం. సార్ పనికి ఏదైనా అడ్డుగా ఉంటుదేమో నని అంతే." చిత్ర కు కోపం కలగడం ఊహించని పరిణామంగా భావించిన జ్యోతి, వ్యవహారానికి హాని జరగకుండా ఉండేలా జాగ్రత్తగా ఉండాలనుకుంది.
" పక్కన పిడుగులు పడ్తున్నగూడా గా మనిషి పనిల ఉన్నడంటె దిక్కు గూడ సూడడు. మీ పిల్లల వల్ల గాయ్నకు ఇబ్బందేమి ఉండదు గాన్లె." అంది చిత్ర, తన వైపు కనీసం చూడకుండా లాప్టాప్ లోపలికి వెళ్తాడేమో అన్నట్టుగా పనిచేసుకునే తన భర్తను తలుచుకుంటూ, నవ్వుతూ.
చిత్ర చేసిన హాస్యానికి నవ్వీ, నవ్వనట్టుగా నవ్వింది జ్యోతి, దానికి చిత్ర ఎలా స్పందిస్తుందో నన్న భయం తో. 'పెద్దోళ్ళ ' తో వ్యవహారం లో జాగ్రత్తగా మెలగాలని మరోసారి రుజువైందని భావించుకుంది జ్యోతి. ఒక్క క్షణం తన పిల్లలు ఈశ్వర్, చిత్ర లకు భారంగా తోస్తారేమో నన్న సందేహం కలిగిందామెకు.
తాను హఠాత్తుగా కోపం తెచ్చుకునే సరికి జ్యోతి తన పిల్లల విషయం లో కాస్త సందేహిస్తున్నదని గ్రహించింది చిత్ర. ఒక్క క్షణం ఆమెకు జ్యోతి ని అనవసరంగా అన్నానేమో నన్న అపరాధ భావం కలిగింది. కానీ తిరిగి, తన భర్త గురించి ప్రతికూలమైన మాటలు మాట్లాడినప్పుడు సహించేది లేదని మనస్సులో అనుకుంది చిత్ర.
పిల్లలిద్దరూ క్షేమంగా ఉండేలా తాను బాగా చూస్కుంటా నని ఆమెకు అర్థమయ్యే మార్గం కోసం ఆలోచించసాగింది చిత్ర.
" అదీ... నా ఫోను నెంబరు రాసుకో. ఊరు కాడ నీకు పిల్లలు గుర్తుకు వొచ్చినప్పుడు మాట్లాడనీకె ఉంటది. " అంది చిత్ర.
*****
అమృత చనిపోయాక ఎన్నో సార్లు ఆమెను మొదటిసారి చూసిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనయ్యేవాడు ఈశ్వర్. కానీ అతనికి ఈసారి తాను అనుకున్నంత భావోద్వేగం కలగలేదు. అమృతకు తాను దూరం అవ్తున్నట్టుగా అనిపించింది ఈశ్వర్ కి. ఇలా తను అమృత కు దూరం కావడానికి చిత్రే కారణంగా అనిపించింది ఈశ్వర్ కి. ఒక్కసారిగా చిత్ర పై మునుపెన్నడూ లేని అక్కసు కలిగిందతడికి.
కాలింగ్ బెల్ మూడు సార్లు మోగడం తో వడివడిగా తలుపుల వద్దకు అడుగులు వేసింది చిత్ర. తలుపు తీయబడిన తరువాత
"ఏమి గింత సేపయ్యింది ?!" వాకబు చేసింది చిత్ర.
" ఫలానా టైం కి వస్తా అని నేనెప్పుడూ నీకు చెప్పలేదు కదా ?! " అన్నాడు ఈశ్వర్, చిత్ర ను ' దూరంగా ' ఉంచే కార్యక్రమాన్ని ' మొదలుపెడుతూ ' .
పుసుక్కున నవ్వింది చిత్ర, తన భర్త హాస్య చతురత చూపిస్తున్నాడని భ్రమపడి.
చిత్ర నుంచి ఊహించని ప్రతిస్పందన ఎదురయ్యే సరికి, ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈశ్వర్ కి.
హాల్లో చాప మీద కూర్చుని, హోం వర్క్ చేసుకుంటున్న రేణుక, రాజేష్ లపై ఈశ్వర్ కంటి చూపు పడింది.
ఈశ్వర్ ని గమనించిన చిత్ర అతని తో
" ఏమ్లే... వాళ్ళమ్మోళ్ళు ఊరికి పోతుర్రంట, గదే ఆ రోజు జ్యోతి జెప్పింది గద పొలం పంచాయితి అని. ఇంగ పిల్లలని మనింట్ల రెండు దినాలు ఉంచుత అంటె, సరే ననే జెప్పిన." అంది చిత్ర, చిరు మందహాసం చేస్తూ.
మౌనంగా ఉండిపోయాడు ఈశ్వర్.
" నీకేమన్న ఇబ్బందవ్తదేమో నని బయపడ్డరు అనోసరంగ. నీకేమి ఇబ్బంది గాదని జెప్పిన." అంది చిత్ర, కాస్త ఆప్యాయత నిండిన స్వరం తో.
చిత్ర కళ్ళల్లో, మాట లో తడితనాన్ని సహించలేక పోయాడు ఈశ్వర్. విఛ్ఛిత్తత కూడిన స్వరం తో
" నాకు ఇబ్బంది అవదని నీకు చెప్పానా ?! " అన్నాడు ఈశ్వర్.
రాజేష్, రేణుక లు ఇద్దరు హోం వర్క్ చేయడం మానేసి వారిరువురి వంక చూడసాగారు.
తన భర్త నుండి ఊహించని ప్రతిస్పందన ఎదురయ్యే సరికి మనసులో కలుక్కుమంది చిత్ర కి. ఆ పిల్లల తల్లైన జ్యోతి వద్ద తన భర్త ను వెనకేసుకొచ్చిన వైనం గుర్తుకు వచ్చి, ఆ పిల్లల ముందు తాను అవమాన పడ్డట్టుగా భావించుకుంది చిత్ర.
చిత్ర పై తన అక్కసు తీర్చుకున్నానని కాస్త ఉపశమనం పొంది తన గదిలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్. చిత్ర ను అనవసరంగా బాధ పెడుతున్నానేమో నన్న అపరాధభావాన్ని తొలగించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ, అమృత ని తలుచుకుంటూ, తను చేసిన పనికి తనకు తాను విమోచనము చేసుకుంటూ తనకిష్టమైన చార్లీ చాప్లిన్ సినిమా చూడసాగాడు ఈశ్వర్. అతని మెదడు నిండా చిత్ర గుర్తుకు రాసాగింది. బలవంతంగా నవ్వు రాకున్నా గట్టిగా నవ్వుతూ సినిమా చూడసాగాడు ఈశ్వర్.
***
సినిమా చూస్తూ, విసుగును అనుభవిస్తున్న ఈశ్వర్ కి చిత్ర యొక్క పట్టీల శబ్దం వినబడింది. అయత్నకృతంగా తల ఎత్తబోయి, చిత్ర ని దూరంగా ఉంచాలన్న తన ' సంకల్పం ' గుర్తుకు వచ్చి, మూకీ సినిమా సౌండ్ పెంచి చూడసాగాడు ఈశ్వర్.
" ఇదో .... ఇదో.... ఇదో"
కావాలని మూడవ సారికి పలికాడు ఈశ్వర్.
" అన్నమయింది. మామిడికాయ పప్పు జేశిన. పుల్లగుంది కాయ మంచిగ. దా తిందువు గాని." అంది చిత్ర.
చిత్ర పిలిచిన వెంటనే వెళ్ళొద్దనిపించింది ఈశ్వర్ కి.
" పని మీదున్నాను కదా . కనిపించట్లేదా ?!" అని అందామనుకుని, తన 'కొత్త రకం ' ప్రవర్తన తనకే మింగుడుపడనట్టుగా అనిపించే సరికి, చిత్ర వైపు చూస్తూ,
" ఒక్క ten minutes." అన్నాడు ఈశ్వర్, తనకు అలవాటు లేని పనులు చేయడం తన వల్ల కాదనుకుంటూ.
ఏమైనా అద్భుతం జరిగి, చిత్రే తనకు దూరంగా ఉండింటే బావుండుననుకున్నాడు. ఒక్క క్షణం చిత్ర కళ్లల్లోకి చూశాడు ఈశ్వర్. అంతకు మునుపు, వాచ్ మెన్ పిల్లల విషయం లో తను కరుకుగా అన్న మాట తాలూకు ప్రభావం ఏమాత్రం కనిపించలేదు ఆమె మోము లో అతడికి. మళ్ళీ అదే మెరుపు కనిపించింది ఆమె కళ్ళల్లో. లోలోన ఒక అసహాయతపు నిట్టూర్పు విడిచాడు ఈశ్వర్.
"అట్లే, నీ ఇష్టం. నువ్వెప్పుడంటె, గప్పుడే." అంటూ వెళ్ళిపోయింది చిత్ర నవ్వుతూ.
ఆ సినిమాని ఏడు నిమిషాలకు మించి చూడలేక పోయాడు ఈశ్వర్.
హాల్లోకి వచ్చిన ఈశ్వర్ కి, సోఫా పైన కూర్చుని టి.వి చూస్తున్న రేణుక, రాజేష్ లు కనిపించారు. ఈశ్వర్ పాదాల అలికిడికి వాళ్ళిద్దరూ అతని వైపు చూశారు.
----------------------సశేషం . ----------------------

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ