Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
చిత్ర తలుపు తెరిచే సరికి, తన వైపు నవ్వుతూ వస్తున్న ఈశ్వర్ ని చూసాడు ఆదర్శ్. ఈశ్వర్ కి ఏదో స్పష్టమైన మార్పు కనిపించింది ఆదర్శ్ కి.
*****
చిత్ర చేసిన వెజ్ బిర్యాని చిత్రకి తప్ప మిగిలిన ఇద్దరికీ చాలా రుచికరంగా తోచింది.
' ఏందో ఏమో, గీ మనిషొక్కడే గిట్ల సప్పగ తింటడనుకున్న. నేను తప్ప ప్రపంచముల ఉన్నోళ్ళందరు గిట్లనే ఉన్నట్టున్నరు సప్ప కూడు తినుకుంట. ' అనుకుని నిట్టూర్చింది చిత్ర తన మనస్సులో.
తిన్నాక ఈశ్వర్, ఆదర్శ్ లు బయటకి కార్ లో బయలుదేరారు.
అమృత ని మెల్లిగా మరచిపోతున్న తన భర్త కి తన స్నేహితుడి వల్ల గతం మరింతగా గుర్తుకు వస్తుందేమో నని భయపడింది చిత్ర.
కానీ తన భర్త యొక్క శ్రేయోభిలాషి గా తోస్తున్న ఆదర్శ్ అతన్ని బాధ పెట్టకుండా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాడని తనకు తాను సర్ది చెప్పుకుంది చిత్ర.
తను చేసిన వెజ్ బిర్యానీ పై తను చేసుకున్న ' ప్రత్యేకమైన కారప్పొడి ' ని చల్లుకుని తినసాగింది చిత్ర.
తింటున్నంత సేపూ ఆమెకు తన భర్త , అమృత లే గుర్తుకు రాసాగారు. ఒక వేళ తన భర్తకు అమృత గురించే మాట్లాడాలి అనిపించి ఆదర్శ్ తో ఆమె గురించి మాట్లాడినా పరవాలేదనుకుంది చిత్ర. తన భర్త అమృత విషయం లో తనకు చెప్పుకోలేని బాధంతా తన స్నేహితుడి తో చెప్పుకుంటే మేలనుకుంది. ఒక్క క్షణం ఆమెకు అమృత గురించి తనకు తెలిసిన విషయం తన భర్త కు తెలిసింటే బావుండును అనిపించింది. అప్పుడు అతనికి అమృత గుర్తొచ్చినప్పుడల్లా బాధని తనతో పంచుకునే వీలుంటుందని భావించింది చిత్ర.
' క్రిష్నయ్యా, అసలు ఏందో ఏమో గిదంత అర్తమే గాదు నాకు అప్పుడప్పుడు. కాని ఈశ్వరు మంచిగ, సంతోషంగ ఉంటే మాత్రం చానా బావుంటది నాకు సూడనీకె. నిన్ను చానా సార్లు అడిగిన, మళ్ళ అడుగుతున్న, జెర మంచిగ సూడు గాయ్నని బాదపెట్టకుండగ.... గా మనిషి చానా మంచోడు. బంగారం... ఎట్లనో అనిపిస్తది నాకు, గాయ్న బాదపడ్తె. నువ్వు గా అమృతని నీ కాడికి దబ్బున తీస్కపొయ్నవ్ గాబట్టి జెర నీ మీద కోపమైతడు గా మనిషి .... నీకెమన్న కోపముంటె నా మీద సూపియ్... ప్చ్ , గిన్ని సార్లు అడిగిచ్చుకోకు నాతోని, జెర మంచిగ సూడు గా మనిషిని, ఎప్పుడు సంతోషంగ ఉండెటట్టు సూడు.' , రామాచార్యులు ఆమెకు ఇచ్చిన కృష్ణుడి బొమ్మ కలిగిన పాకెట్ కాలెండర్ ని చూస్తూ మనస్సులో అనుకుంది చిత్ర.
****
ఈశ్వర్ , ఆదర్శ్ లు ఇద్దరూ హైదరాబాద్ రోడ్ల పై తిరిగీ, తిరిగీ సాయంత్రం వారిద్దరికీ ఇష్టమైన టాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. బుద్ధుడిని చూస్తూ కారం తక్కువగా వేయించుకున్న చూడువా తినసాగారు ఇద్దరూ. కాసేపు సాఫ్ట్ వేర్ ముచ్చట్లు పెట్టుకోసాగారు ఇద్దరూ.
తను ఆదర్శ్ ని కలిసిన ప్రతిసారీ జరిగే ఏదో ఒక క్రియ అప్పుడు జరగనట్టుగా తోచిందతడికి. చాలా సేపటికి తనకు అమృత గురించి మాట్లాడాలన్న విషయం గుర్తుకు వచ్చింది. ' తన ' అమృత గురించి మాట్లాడటం తను మరచిపోవడం ఏంటన్న అపరాధభావం తో కూడిన ప్రశ్న కలిగిందతడికి. అమృత విషయమై ఏదోటి గుర్తు తెచ్చుకుని ఆదర్శ్ తో మాట్లాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఈశ్వర్. కానీ ఏం మాట్లాడాలో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావట్లేదసలు. తను అమృత గురించి మాట్లాడలేక పోవడానికి చిత్ర నే కారణంగా తోచింది ఈశ్వర్ కి. అసలు చిత్ర కి తనకూ, తన అమృతకూ నడుమన వచ్చేంత ప్రాధాన్యత తాను ఎందుకిస్తున్నాడో అర్థం కాలేదు ఈశ్వర్ కి. తనే అనవసరంగా చిత్రకు ఇవ్వవలసినదానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా నిర్దారించుకున్నాడు ఈశ్వర్. గత కొంత కాలంగా అమృతని తాను పెద్దగా ' పట్టించుకోనట్టుగా ' తోచింది ఈశ్వర్ కి. ఇకపై అమృత కు మళ్ళీ పాత ప్రాధాన్యత ఇచ్చి, చిత్ర వల్ల తను తన అమృతకు దూరం కాకుండా తగు జాగ్రత్తలు తీస్కోవాలని నిశ్చయించుకున్నాడు ఈశ్వర్.
తన స్నేహితుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాడు ఆదర్శ్. విషయమేంటని అడగబోయి, అది అమృత గురించే అయ్యుంటుందని భావించి, తన స్నేహితుడు ఇప్పుడు అమృత ప్రస్తావన తెస్తే ఏం చెప్పాలో తెలియక అయోమయానికి గురవసాగాడు ఆదర్శ్. చిత్రని కలిసాక ఎందుకో అతడికి అంతకు ముందులా అమృత విషయమై ఈశ్వర్ తో మాట్లాడాలనిపించట్లేదు. ఈశ్వర్ , ఆదర్శ్ లు ఇద్దరూ లోలోన అమృత , చిత్ర గురించి ఆలోచిస్తూ, సంభాషణను కొనసాగించడానికి పైకి పొడి పొడిగా వారి వారి ఉద్యోగ సంబధమైన చర్చ ని పెట్టుకున్నారు.
***
పొద్దున మిగిలొపోయిన ఇడ్లీ పిండి తో ఈటీవీ అభిరుచి చానెల్ లో చూసి నేర్చుకున్న ఊతప్పం లను వండింది చిత్ర. ఈశ్వర్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా తోచింది చిత్రకి. అతనికి అమృత గుర్తొచ్చి ఉంటుందని గ్రహించింది చిత్ర. అమృత గురించి తను ఊహించినంత ' తనివితీరా ' తన భర్త మాట్లాడలేకపోయాడేమో నని భావించింది చిత్ర. తన ప్రాణ స్నేహితుడితో తన మనస్సుని పూర్తిగా ఎందుకు పంచుకోలేక పోయుంటాడో తెలియక ఆశ్చర్యపోయింది చిత్ర. ఏదేమైనా వచ్చే రెండు, మూడు రోజులు తన భర్త ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలనుకుంది చిత్ర. అతనికి విధమైన కలత కలగకుండా చూసుకోవాలని అనుకుంది.
ఆదర్శ్, ఈశ్వర్ లు ఇద్దరూ తిన్నాక వాకింగ్ కి బయలుదేరారు.
***
ఈశ్వర్ ఆదర్శ్ కి తను రోజు పడుకునే గదిలోని మంచం పై పడుకోమని చెప్పాడు. చిత్ర విషయాన్ని గమనిస్తూ ఉంది. తన భర్త సోఫా పై పడుకోబోతున్నాడని గ్రహించిందామె. అతని బదులు సోఫా పై తనే పడుకోవాలని నిర్ణయించుకుంది. కానీ తన భర్త తనని బాగా చూసుకోవడం లేదని అతని స్నేహితుడు భావిస్తాడేమో నని తోచింది చిత్రకు. పైగా తను అలా పడుకుంటే తన భర్తను అపరాధభావానికి లోను చేసినదైతుందని భావించిందామె. తన గదిలోకి వచ్చి, మెత్త, చెద్దరు తీసుకుని సోఫా దెగ్గరికి బయలుదేరుతున్న తన భర్తతో
" ఇదో... ఇట్లంటున్ననని ఏమనుకోకు.... మీ దోస్తు ముందర నువ్వు గిట్ల సోఫాల పండుకుంటే నువ్వు గాయ్న ముందు తక్కువయితవ్ అనిపిస్తది నాకు... నాకు అట్ల మంచిగనిపియ్యదు... నేను నీకు అస్సలు తాకకుండగ పండుకుంట. నన్ను నమ్ము. నువ్వు గిదొక్కరోజు గీ రూములనే పండుకో." అంది చిత్ర.
ఈశ్వర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక, చప్పుడు చేయకుండా చిత్ర రోజూ పడుకునే మంచం పై పడుకున్నాడు ఒక మూలకు. చిత్ర మరో మూలకు పడుకుంది. నిద్రలో అటూ , ఇటూ పొర్లే అలవాటున్న చిత్ర, రాత్రికి మాత్రం అస్సలు కదలకుండా, అస్సలు తన భర్తకు తాకకుండా పడుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇద్దరూ తమ , తమ దుప్పట్లను కప్పుకున్నారు. కానీ వారిద్దరికీ త్వరగా నిద్ర పట్టలేదు , ఒకరి ని గూర్చి మరొకరు చేస్తున్న ఆలోచనల వల్ల.
---------------------సశేషం. ----------------------
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
ముడి - by k3vv3 - 01-06-2023, 02:58 PM
RE: ముడి - by ANUMAY112911 - 01-06-2023, 05:12 PM
RE: ముడి - by sri7869 - 01-06-2023, 05:54 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:06 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:11 PM
RE: ముడి - by Uday - 05-06-2023, 01:53 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:00 PM
RE: ముడి - by K.R.kishore - 05-06-2023, 03:30 PM
RE: ముడి - by sravan35 - 07-06-2023, 08:21 PM
RE: ముడి - by utkrusta - 08-06-2023, 03:50 PM
RE: ముడి - by appalapradeep - 09-06-2023, 04:58 AM
RE: ముడి - by ramd420 - 09-06-2023, 05:30 AM
RE: ముడి - by taru - 09-06-2023, 10:22 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:01 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:04 PM
RE: ముడి - by sri7869 - 10-06-2023, 07:15 PM
RE: ముడి - by k3vv3 - 16-06-2023, 08:33 AM
RE: ముడి - by Roberto - 04-02-2024, 04:20 AM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 12:58 PM
RE: ముడి - by K.R.kishore - 16-06-2023, 11:39 AM
RE: ముడి - by taru - 16-06-2023, 05:12 PM
RE: ముడి - by Uday - 16-06-2023, 06:42 PM
RE: ముడి - by ramd420 - 17-06-2023, 04:56 AM
RE: ముడి - by sri7869 - 17-06-2023, 11:35 AM
RE: ముడి - by k3vv3 - 18-06-2023, 01:31 PM
RE: ముడి - by cherry8g - 18-06-2023, 03:09 PM
RE: ముడి - by sri7869 - 18-06-2023, 08:26 PM
RE: ముడి - by ramd420 - 18-06-2023, 10:22 PM
RE: ముడి - by K.R.kishore - 18-06-2023, 10:40 PM
RE: ముడి - by appalapradeep - 18-06-2023, 10:56 PM
RE: ముడి - by k3vv3 - 21-06-2023, 09:35 AM
RE: ముడి - by K.R.kishore - 21-06-2023, 09:50 AM
RE: ముడి - by sri7869 - 21-06-2023, 03:12 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:52 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:55 PM
RE: ముడి - by TheCaptain1983 - 25-06-2023, 06:15 AM
RE: ముడి - by taru - 25-06-2023, 06:41 AM
RE: ముడి - by Shabjaila 123 - 24-06-2023, 09:06 PM
RE: ముడి - by adultindia - 24-06-2023, 11:00 PM
RE: ముడి - by K.R.kishore - 24-06-2023, 11:22 PM
RE: ముడి - by the_kamma232 - 25-06-2023, 06:18 AM
RE: ముడి - by cherry8g - 25-06-2023, 12:57 PM
RE: ముడి - by Aavii - 26-06-2023, 01:03 AM
RE: ముడి - by Uday - 26-06-2023, 01:50 PM
RE: ముడి - by AnandKumarpy - 26-06-2023, 02:34 PM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 11:58 AM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 12:00 PM
RE: ముడి - by Rohit009 - 27-06-2023, 12:37 PM
RE: ముడి - by K.R.kishore - 27-06-2023, 04:47 PM
RE: ముడి - by ramd420 - 27-06-2023, 11:02 PM
RE: ముడి - by sri7869 - 28-06-2023, 12:08 PM
RE: ముడి - by Mohana69 - 28-06-2023, 02:24 PM
RE: ముడి - by Uday - 28-06-2023, 03:07 PM
RE: ముడి - by utkrusta - 28-06-2023, 03:10 PM
RE: ముడి - by Vvrao19761976 - 28-06-2023, 08:57 PM
RE: ముడి - by smartrahul123 - 29-06-2023, 01:04 AM
RE: ముడి - by phanic - 29-06-2023, 07:02 AM
RE: ముడి - by itskris - 29-06-2023, 11:30 AM
RE: ముడి - by k3vv3 - 29-06-2023, 10:26 PM
RE: ముడి - by Uday - 29-06-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 01-07-2023, 10:32 AM
RE: ముడి - by sri7869 - 01-07-2023, 11:13 AM
RE: ముడి - by utkrusta - 01-07-2023, 01:00 PM
RE: ముడి - by K.R.kishore - 01-07-2023, 01:14 PM
RE: ముడి - by Arjun0410 - 01-07-2023, 03:25 PM
RE: ముడి - by MKrishna - 02-07-2023, 11:28 AM
RE: ముడి - by taru - 02-07-2023, 10:23 PM
RE: ముడి - by k3vv3 - 03-07-2023, 07:00 PM
RE: ముడి - by k3vv3 - 04-07-2023, 09:06 AM
RE: ముడి - by TheCaptain1983 - 04-07-2023, 09:31 AM
RE: ముడి - by utkrusta - 04-07-2023, 12:58 PM
RE: ముడి - by ramd420 - 05-07-2023, 07:11 AM
RE: ముడి - by K.R.kishore - 05-07-2023, 10:53 AM
RE: ముడి - by sri7869 - 05-07-2023, 11:09 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:55 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:58 AM
RE: ముడి - by sri7869 - 07-07-2023, 08:26 AM
RE: ముడి - by cherry8g - 07-07-2023, 05:52 PM
RE: ముడి - by utkrusta - 07-07-2023, 06:21 PM
RE: ముడి - by K.R.kishore - 07-07-2023, 07:34 PM
RE: ముడి - by k3vv3 - 10-07-2023, 09:24 AM
RE: ముడి - by K.R.kishore - 10-07-2023, 09:47 AM
RE: ముడి - by Arjun0410 - 10-07-2023, 10:42 AM
RE: ముడి - by utkrusta - 10-07-2023, 05:00 PM
RE: ముడి - by k3vv3 - 13-07-2023, 02:26 PM
RE: ముడి - by TheCaptain1983 - 14-07-2023, 07:45 AM
RE: ముడి - by sri7869 - 18-07-2023, 11:23 PM
RE: ముడి - by k3vv3 - 29-07-2023, 10:43 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-07-2023, 03:16 AM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:28 PM
RE: ముడి - by Vyas Kumar - 30-07-2023, 06:37 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:26 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:24 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-08-2023, 08:09 AM
RE: ముడి - by Shabjaila 123 - 08-08-2023, 12:37 PM
RE: ముడి - by k3vv3 - 09-08-2023, 08:46 AM
RE: ముడి - by TheCaptain1983 - 10-08-2023, 07:12 AM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:58 PM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:59 PM
RE: ముడి - by k3vv3 - 19-08-2023, 05:00 PM
RE: ముడి - by TheCaptain1983 - 19-08-2023, 09:02 PM
RE: ముడి - by sri7869 - 19-08-2023, 10:16 PM
RE: ముడి - by k3vv3 - 30-08-2023, 06:39 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-09-2023, 11:46 PM
RE: ముడి - by sri7869 - 31-08-2023, 02:34 PM
RE: ముడి - by sri7869 - 08-09-2023, 03:51 PM
RE: ముడి - by k3vv3 - 08-09-2023, 10:13 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:14 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:16 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:19 PM
RE: ముడి - by sri7869 - 09-09-2023, 02:10 PM
RE: ముడి - by Uday - 09-09-2023, 03:08 PM
RE: ముడి - by Vvrao19761976 - 14-09-2023, 08:37 PM
RE: ముడి - by nalininaidu - 15-09-2023, 12:05 PM
RE: ముడి - by Vishnupuku - 16-09-2023, 11:38 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:03 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:04 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:18 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:19 PM
RE: ముడి - by sri7869 - 19-09-2023, 07:11 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 09:54 PM
RE: ముడి - by Uday - 20-09-2023, 05:41 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:12 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:14 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:15 PM
RE: ముడి - by sri7869 - 27-09-2023, 08:17 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:02 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:05 PM
RE: ముడి - by TheCaptain1983 - 09-10-2023, 06:27 AM
RE: ముడి - by sri7869 - 08-10-2023, 11:29 PM
RE: ముడి - by Uday - 16-10-2023, 08:05 PM
RE: ముడి - by k3vv3 - 23-10-2023, 04:23 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:04 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:08 PM
RE: ముడి - by TheCaptain1983 - 27-10-2023, 04:53 AM
RE: ముడి - by sri7869 - 24-10-2023, 10:06 PM
RE: ముడి - by Uday - 01-11-2023, 02:36 PM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:35 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:36 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:38 AM
RE: ముడి - by TheCaptain1983 - 19-11-2023, 09:26 PM
RE: ముడి - by sri7869 - 24-11-2023, 10:38 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:14 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:52 AM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:15 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:18 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:55 AM
RE: ముడి - by Uday - 13-12-2023, 02:29 PM
RE: ముడి - by sri7869 - 15-12-2023, 02:01 PM
RE: ముడి - by BR0304 - 21-12-2023, 07:46 PM
RE: ముడి - by BR0304 - 23-12-2023, 04:43 AM
RE: ముడి - by k3vv3 - 23-12-2023, 07:17 PM
RE: ముడి - by BR0304 - 29-12-2023, 04:15 AM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:00 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:01 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:03 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-12-2023, 12:32 AM
RE: ముడి - by sri7869 - 30-12-2023, 02:16 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by sri7869 - 01-01-2024, 09:47 AM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 02:43 PM
RE: ముడి - by k3vv3 - 03-01-2024, 05:56 PM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 10:47 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:29 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:32 PM
RE: ముడి - by TheCaptain1983 - 08-01-2024, 05:04 AM
RE: ముడి - by BR0304 - 07-01-2024, 11:04 PM
RE: ముడి - by sri7869 - 08-01-2024, 08:13 PM
RE: ముడి - by BR0304 - 11-01-2024, 08:15 AM
RE: ముడి - by shoanj - 12-01-2024, 09:36 AM
RE: ముడి - by Uday - 13-01-2024, 02:22 PM
RE: ముడి - by BR0304 - 16-01-2024, 07:52 PM
RE: ముడి - by siva_reddy32 - 17-01-2024, 03:08 AM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:09 PM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:12 PM
RE: ముడి - by TheCaptain1983 - 20-01-2024, 05:52 AM
RE: ముడి - by sri7869 - 19-01-2024, 02:42 PM
RE: ముడి - by BR0304 - 19-01-2024, 04:15 PM
RE: ముడి - by Uday - 22-01-2024, 06:43 PM
RE: ముడి - by k3vv3 - 30-01-2024, 04:33 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:38 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by sri7869 - 31-01-2024, 12:53 PM
RE: ముడి - by Uday - 31-01-2024, 02:53 PM
RE: ముడి - by BR0304 - 31-01-2024, 10:09 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:07 PM
RE: ముడి - by 9652138080 - 05-02-2024, 11:08 AM
RE: ముడి - by Roberto - 06-02-2024, 10:29 AM
RE: ముడి - by e.sai - 13-02-2024, 08:51 AM
RE: ముడి - by TheCaptain1983 - 09-03-2024, 11:11 PM
RE: ముడి - by sri7869 - 04-02-2024, 01:31 PM
RE: ముడి - by BR0304 - 04-02-2024, 07:04 PM
RE: ముడి - by Uday - 05-02-2024, 06:37 PM



Users browsing this thread: 8 Guest(s)