Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#19
ఇప్పుడేమైంది నాన్నా? నాకు చాలా భయంగా ఉంది.” అని నాన్నని గట్టిగా పట్టుకున్నాను.
అమ్మ పెద్దగా ఏడుస్తుంది.
ఏం కాలేదు రా. కాని రేపేమన్నా జరగొచ్చు కదా. అందుకు చెప్తున్నా.” అని సర్దిచెప్పడానికి చూశారు నాన్న.
అరేయ్. అసలే వాడు చిన్న కుర్రాడు. ఇలా భయపెట్టకండి వాడిని. అయినా డాక్టర్ ఏం చెప్పాడు. ఇప్పట్లో ప్రమాదం ఏమీ లేదని చెప్పాడు కదా.” అన్నారు చలపతిరావంకుల్.
అయినా రోజుల్లో పిల్లలతో ఇలాంటి విషయాలు దాచకూడదు.” అని నన్ను లేపి తనవైపుకు తిప్పుకున్నారు.
చూడు భార్గవ్. నాన్నకు ఆరోగ్యం బాగా ఉండటo లేదని నీకు తెలుసు కదా. ఇవ్వాళే డాక్టర్ గారు చెప్పారు. నాన్నకి కాన్సర్ ఒచ్చిందట. ఇప్పుడేo భయం లేదు. కాని మనం జాగ్రత్తగా ఉండాలి. నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలి. నువ్వు పెద్దవాడివి కాబట్టి నీకు చెప్తున్నాం. అమ్మని, నాన్ననీ జాగ్రత్తగా చూస్కోవాలి.”
నాకేం అర్ధం కాలేదు. అమ్మ ఏడుపు తప్ప ఏమీ వినిపించడంలేదు. వయసులో నాకు కాన్సర్ వల్ల ఏమవుతుందో కూడా తెలియదు. నాకు తెలియకుండానే ఏడిచేశాను...చాలా... నాన్నని గట్టిగా పట్టుకున్నాను.
నాన్న ఏమనుకున్నారో ఏమో, “పిచ్చోడా! ఏం ఫరవాలేదు రా. చూడు ఇంట్లో పెద్ద వాడివి, నీకు ఇవన్నీ తెలియాలని చెప్తున్నాం. రేపటినించి ట్రీట్మెంట్ తీస్కుంటున్నా. నాకేం కాదు. మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి.” అని చెప్పారు.
కాని అదంతా అబద్ధం అని తరవాత తెలిసింది.
ఆరోజు మొదలు మా ఇంట్లో కష్టాలు పెరిగాయి తప్ప తరగలేదు. నాన్న ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టారు. అమ్మా, నాన్నా హాస్పిటల్ కి తిరగడమే సరిపోయింది. నాన్న చాలా నీరసంగా అయిపోయారు. నాకు తెలిసి మాకు ఆస్తులేం లేవు. ఉన్నా కూడా అప్పుడు కరిగిపోయి ఉంటాయి. అమ్మకి ఉన్న కాస్త బంగారం కూడా అప్పుడు తీసేసింది. మెళ్ళో మంగళసూత్రం కూడా లేదు.
ఇల్లంతా నరకంలాగా ఉండేది. ఎప్పుడూ అల్లరి, కేకలు వినిపించే మా ఇంట్లో మొత్తం నిశ్శబ్దం కమ్మేసింది. చిన్నుగాడు అప్పుడు సెకండ్ క్లాస్. వాడికేం అర్ధం అయిందో కాని వాడు కూడా ఏదోలా అయిపోయాడు. నాన్నవాళ్ళక్క వాళ్ళు ఒకసారి ఒచ్చి చూసి వెళ్ళారు. అమ్మ సైడ్ వాళ్ళు అసలు రాలేదు అప్పుడు కూడా. మెల్లగా నాన్నకు జుట్టు ఊడిపోయింది. తినటం మానేశాడు. బక్కగా అయిపోయాడు. ఆయన బాధ చూస్తే ఇలా ఉండటం కంటే పోవడమే మంచిది అనిపించింది నాకు. కాని అమ్మతో అనలేదు.
రోజు కూడా రానే ఒచ్చింది. ఏడ్చి ఏడ్చి అమ్మ కళ్ళల్లో నీళ్ళు కూడా అయిపోయాయి. టైములో నాన్న గారి ఫ్రెండ్స్ ఒక్కరే మమ్మల్ని ఆదుకుంది. ముఖ్యంగా చలపతిరావు అంకుల్. పెద్దోళ్ళు ఎవరూ లేరు, అసలు పని ఎలా చెయ్యాలో తెలియదు, అమ్మ లోకంలో లేదు. అన్నీ ఆయనే చూసుకున్నారు. చనిపోయాక చెయ్యాల్సిన పనులన్నీ.
తరవాత ఒక రోజు అమ్మ నన్ను పిలిచింది.
భార్గవా...మీ నాన్న మిమ్మల్ని చూసుకోమని బాధ్యత నా పైన వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా ముందున్న పని ఒక్కటే. మీ ఇద్దరినీ బాగా చదివించాలి. అంతే.. జీవితానికి ఇంకేం అక్ఖర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో..చలపతిరావంకుల్ నాకు నాన్న ఆఫీస్ లోనే చిన్న ఉద్యోగం ఇప్పించారు. కాని..”
అమ్మ ఏడిచింది.
కాని ఉద్యోగానికి వెళ్తే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేను. మన దెగ్గరా డబ్బులు లేవు. నేను పని చేస్తే కాని మనకు పొట్ట గడవదు, నాకా పదో తరగతి దాటి చదువులేదు.దొరికిన పని వదిలిపెట్టలేను. జరిగినదంతా చూశాక మీరిక్కడ మనశ్శాంతిగా చదువుకోలేరు. అందుకే మీ ఇద్దరికోసం ఒక హాస్టల్ చూశాను. ఇక్కడ నా కష్టాలేవో నేను పడతాను. మీరు మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా శ్రద్ధగా చదువుకోండి. సరేనా?” అని నన్ను దెగ్గరకు తీసుకుంది.
ఒద్దమ్మా. అసలే నాన్న లేరు.. ఇప్పుడు మేము వెళ్ళిపోతే నువ్వొక్కదానివే అయిపోతావు. మేము ఇక్కడే చదువుకుంటాం. మా పని మేమే చేసుకుంటాం. నేను కావాలంటే సాయంత్రం ఏదన్నా చిన్న పని చేస్తా. కొన్ని డబ్బులొస్తాయి.” అని ఏడిచాను.
అందుకేరా నేను ఒద్దనేది. మీరు చాలా మంచి స్కూల్లో చదువుకోవాలి. చాలా బాగా చదువుకోవాలి. జీవితంలో పైకి రావాలి. కష్టాల వల్ల మీరెక్కడో ఆగిపోతే అది నేను భరించలేను. మీ నాన్న ఉన్నట్టే మిమ్మల్ని చూసుకోవాలి.”
అమ్మ నిశ్చయించుకున్న తరవాత ఆమెని ఎవ్వరూ ఆపలేరు. నన్నూ, తమ్ముణ్ణి హాస్టల్ కి పంపించేసింది. సెవెంత్ క్లాసులో ఊరికి ఒచ్చాను. లాస్ట్ ఇయర్ టెన్త్ అయిపోయిన తరవాత ఇంటికి ఒచ్చేస్తా అని అమ్మకి చెప్పాను. కాని అమ్మ ఒప్పుకోలేదు. అక్కడ ఒక్కతే కష్టపడుతుంది. నేను ఉద్యోగం చేసే వయసు ఒచ్చేవరకు రావద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. అక్కడుంటే చదువు పైన శ్రద్ధ పెట్టలేను అంటుంది. కరెక్టో కాదో తెలియదు కాని అమ్మ చెప్పింది కాబట్టి అలాగే ఉంటున్నాం.
· * *
పాపం ప్రీతి. ఇంత సీరియస్ గా నా గురించి చెప్తా అని ఊహించలేదనుకుంటా. ఏం మాట్లాడలేదు. సైలెంట్ గా అయిపొయింది.
ఏయ్ పిల్లా...ఏంటి.. ఉన్నావా లేదా?”..ఒక నిమిషo ఆగి అన్నాను.
సారీ భార్గవ్. మీ నాన్న గురించి తెలియక ఊరికే చెప్పు చెప్పు అని అన్నాను. అనవసరంగా గుర్తు తెచ్చుకున్నావు ఇదంతా. రియలీ సారీ..” తన గొంతులో తెలుస్తుంది పాపం ఏడుస్తుందనుకుంటా.
ప్రీతీ.. పిచ్చా? ఏడవకు... అయ్యో నేను బానే ఉన్నా. నాకు గుర్తురావడం, రాకపోవడం ఏమీ ఉండదు. నాన్న ఎప్పుడూ నన్ను ఒదిలేసి వెళ్ళలేదు. ఇప్పుడేం నేను బాధపడట్లేదు. నువ్వు ఏడవకు..ప్లీజ్...”
కాని మీ అమ్మ గ్రేట్ కదా. ఇన్ని ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒక్కరే పాపం అది కూడా.”
అందుకే నాకిక్కడ ఉండబుద్ధి కాదు. అమ్మేమో రానివ్వదు. సంవత్సరానికి రెండు సార్లు వెళ్తాం అంతే.”
సమ్మర్ ఒస్తుంది కదా. ఇప్పుడు వెళ్తావా?”
వెళ్తా... ఈసారయినా అమ్మ ఒప్పుకుంటే బాగుండు. అక్కడే ఎక్కడయినా కాలేజీలో చేరతా..”
అవునా...”. ప్రీతి గొంతు డల్ గా అయిపోయింది.
ఏయ్. అంత ఫీల్ అవ్వకులే...మా అమ్మ సంగతి తెలుసు నాకు... ప్రతిసారి నేను ఉండిపోతా అనడం, మా అమ్మ పంపించెయ్యడం మామూలే.”
అసలే ఆంటీ దేవతా..” అంది నవ్వుతూ... నన్ను ఏడిపిస్తుంది అని అర్ధం అయ్యింది.
పడతాయి నీకు..” అని ఫోను పెట్టేశాను.
రెండు వారాల తరవాత నేను, చిన్ను హైదరాబాద్ వెళ్లాం.
***
హైదరాబాద్ ఒస్తే ఎదో లోకంలోకి ఒచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మ చేతి వంట తింటూ, నెల రోజులు చాలా ఎంజాయ్ చేస్తాం. అమ్మ కూడా మాకోసం నెల రోజులు లీవ్ పెడుతుంది. పనీ పెట్టుకోదు. మాకు వండి పెట్టడం, అప్పుడప్పుడూ మేము ముగ్గురం సినిమాలకు అలా బయటికి వెళ్ళడం అంతే. ఇంకే పని ఉండదు. చిన్నుని నేను చూసుకుంటా, నువ్వెప్పుడయినా ఆఫీస్ కి వెళ్ళమ్మా అవసరం అయితే అని చెప్పినా వినదు అమ్మ. ఆరు నెలల ప్రెమంతా ఒక్క నెలలో చూపిస్తుంటుంది.
ఒక రోజు అందరం టీవీలో సినిమా చూస్తున్నాం.
అమ్మా.. సినిమా అంటే ప్రీతికి ఎంత ఇష్టమో తెలుసా? మాటిమాటికీ సినిమా గురించే మాట్లాడుతూ ఉంటుంది.” అని చెప్పా.
ఇంతకీ ఏం నచ్చిందంట సినిమాలో?”
లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం తనకి. కాని చిన్న పిల్ల లాంటిది. చాలా అమాయకురాలమ్మా.”
చిన్న పిల్ల అంటే?”
అంటే ఏదంటే అది నమ్మేస్తుంది. లవ్ స్టోరీలన్నీ నిజమని నమ్ముతుంది. ఇంకా చాలా ఉన్నాయిలే.”
తను చిన్న పిల్లాంటే నువ్వు కాదా.”
ఇంకా నేనేం చిన్న పిల్లోడినమ్మా. నీకలా అనిపిస్తా అంతే. కాని నేను ఇంకా అలా లేను. అందుకే నీకు సాయం చేస్తా అంటే ఒద్దంటావ్.”
అలా అనగానే అమ్మ మొహం అదోలా అయిపొయింది. బాధో, కోపమో అర్ధం కాలేదు.
సరే సరే... కోపం తెచ్చుకోకమ్మా. ఊరికే అడిగాను. ఒదిలెయ్.” అన్నాను.
అంతలో చలపతిరావు అంకుల్ ఒచ్చారు. మేము హైదరాబాద్ ఒచ్చిన ప్రతిసారీ ఆయన ఒక రెండు మూడు సార్లు ఒస్తారు. మా గురించి కనుక్కొని కొంచం సేపు ఉండి వెళ్ళిపోతారు.
నమస్తే అంకుల్. ఎలా ఉన్నారు.”
బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావ్? బాగా చదువుకుంటున్నావా?”
బానే చదువుతున్నా అంకుల్.”
ఇప్పుడేంటి ఇంటరా?”
అవును.”
నెక్స్ట్ ఏం చదవాలన్నా చదువుకో. మీ అమ్మకి ఇబ్బంది అవుతుంది అని మొహమాట పడకు. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. సరేనా?”
సరే అంకుల్. ప్రతీసారీ మరిచిపోకుండా చెప్తారు మీరు.”
కాస్సేపు మాట్లాడుకున్నాం. అమ్మ టిఫిన్ చేసింది. అందరం తిన్నాం.
అవునoకుల్.. ఆంటీ ఎలా ఉన్నారు. ప్రతీసారి మిమ్మల్నే కలుస్తాం. ఒకసారి అజయ్, అనీష్ లని కూడా కలవాలి.”
బానే ఉన్నారు అందరూఅని ముగించారు అంకుల్.
ఓకే..మరి ఎప్పుడయినా ఇంటికి తీస్కెళ్ళoడి. చాలా రోజులయ్యింది.” అన్నా
చూద్దాం లే.”
ఏమైందో.. అమ్మకి, ఆంటీకి గొడవేమన్నా అయ్యుంటుందేమో. అమ్మ అలాంటిది కాదే. పైగా ఎప్పుడు చెప్పలేదు కూడా. ఎందుకు లే అని మళ్ళీ అడక్కుండా ఓదిలేశా.
తరవాత అంకుల్ వెళ్ళిపోయారు.
కాస్సేపు టివి చూసి మేము పడుకోడానికి వెళ్ళాం. నేను హాల్లో పడుకున్నా, అమ్మా చిన్ను లోపల బెడ్ రూమ్ లో పడుకున్నారు.
నాకెందుకో నిద్ర పట్టలేదు. ప్రీతితో చాట్ చేస్కుంటూ కూర్చున్నాను. మధ్యలో బాత్రూంకి వెళ్దామని లేచి వెళ్ళాను. అమ్మ ఫోనులో మాట్లాడుతుంది, చిన్ను పడుకున్నాడు.
టైంలో ఫోన్ చెయ్యకండి. ఇప్పుడు రావడం కూడా ఒద్దు ప్లీజ్. పిల్లలు పెద్దవుతున్నారు. భార్గవ్ ఇంకా చిన్నపిల్లోడు కాడు. వాడికి అన్నీ అర్ధం అవుతాయి. ఎలాగో ఇన్ని రోజులు అయిపోయాయి. ఇంకా పది రోజులు ఓపిక పట్టండి ప్లీజ్. పిల్లలు వెళ్ళిపోతారు.”
ఇంకా వినే ధైర్యం లేదు నాకు. పక్కకి ఒచ్చేశాను. మనసంతా పిచ్చి ప్రశ్నలతో నిండిపోయింది. వాటి నుంచి తప్పించుకోడానికి చాలా కష్టపడ్డాను.నిద్ర పట్టలేదు రాత్రంతా. ఏమై ఉంటుందో ఆలోచించడానికి కూడా భయం వేసింది.
పొద్దున్న లేవగానే ముందు అమ్మ ఫోన్ తీసుకొని రాత్రి మాట్లాడింది ఎవరితోనో చూసాను, నమ్మలేకపోయాను.
చలపతిరావంకుల్.
* * *
పొద్దున్న అమ్మ ఫోన్ చూసేటప్పుడు అమ్మ అక్కడే ఉంది. నేను కోపంగా ఫోన్ పక్కన పడేసి ఒచ్చాను. రాత్రి వరకు ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడెక్కడో తిరిగాను. ఫ్రెండ్సింటికి వెళ్దామనుకున్నా కానీ వెళ్ళబుద్ధి కాలేదు. కనిపించిన బస్సు ఎక్కాను, అది ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళాను. నాన్న గుర్తొచ్చారు బాగా...ఏడుస్తూనే ఉన్నాను... అమ్మ గురించి ఏమనుకోవాలో అర్ధం కాలేదు. చలపతిరావు అంకుల్ ఎందుకలా చేస్తాడు? అమ్మెందుకు అలా మాట్లాడింది? రోజంతా తిండి లేదు. హాస్టల్ కి వెళ్ళిపోదాం అనుకున్నాను.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 21-09-2023, 06:46 PM



Users browsing this thread: 1 Guest(s)