19-09-2023, 06:18 PM
"మీ అబిరాము మస్తు నచ్చిండు నాకు. గిట్ల ఒస్తుంట అప్పుడప్పుడు, ఈన ఇంట్ల లేనప్పుడు. సరేనా?" అంది చిత్ర, హాల్లో నోట్ బుక్ లోని పేజీని చించి రాకెట్ చేస్తున్న అభిరాం వైపు చిరునవ్వుతో చూస్తూ.
"అయ్యో! రండి మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు. నాకు కూడా బోర్ కొడుతుంటుంది అప్పుడప్పుడు. కొత్త ప్లేస్ అనేసరికి భయపడ్డాను నేను. కానీ మీరున్నందుకు చాలా బెటర్ అనిపించింది నాకు." నిజాయితీగా చెప్పింది శ్రీజ.
ఎట్టకేలకు బెల్లం డబ్బాను చిత్ర చేతికి ఇచ్చింది శ్రీజ. కాస్త బెల్లం గడ్డను తీసుకుని ముక్కలు ముక్కలు గా చేయసాగింది చిత్ర. ఆ బెల్లం ముక్కల్ని పల్లీల్లో కలిపి ' సలాడ్ ' ని పూర్తి చేసింది.
శ్రీజ, చిత్ర లు ఇద్దరూ హాల్లో తాను చించిన రెండవ కాగితంతో కత్తి పడవ చేయాలో, లేక మళ్ళీ రాకెట్ చేయాలో తేల్చుకోలేక సతమౌతున్న అభిరాం వద్దకు వెళ్ళారు.
" ఈట్ దిస్...దిస్...దిస్..."
"గ్రౌండ్ నట్ సలాడ్." అంటూ చిత్ర అవస్థను గమనించి వాక్యాన్ని పూర్తి చేసింది శ్రీజ.
"టేక్ అండ్ ఈట్ ." అంటూ అభిరాం చేతికి స్టీలు కప్పునూ, చెంచానూ ఇచ్చింది చిత్ర.
వాడు ఆ ' సలాడ్ ' ని స్పూన్ తో కాస్త తోడుకుని నోట్లో పెట్టుకున్నాడు.
చిత్ర వైపుగా తిరిగి " పర్లేదు, బాగానే చేసావ్ ! " అన్నట్టుగా హావభావాన్ని ప్రకటించాడు.
శ్రీజ, చిత్రలు ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.
అభిరాం టి.వి పెట్టుకుని డోరేమాన్ కార్టూన్ చూడసాగాడు.
శ్రీజ, చిత్ర లు ఇద్దరూ పిచ్చాపాటీ బెడ్ రూం లోకి వెళ్ళి మాట్లాడుకోసాగారు. శ్రీజ తన మాటల్లో తన కొడుకు అభిరాం కి మాటలు రావడానికి చేసిన ప్రయత్నాలూ, అవన్నీ విఫలమైన విషయాలూ అన్నీ చెప్పసాగింది. చిత్రకు అభిరాం విషయమై చాలా జాలి కలిగింది. కానీ తను జాలి పడ్డట్టుగా బయటపడితే శ్రీజ నొచ్చుకుంటుందేమో నని ఊరుకుంది చిత్ర.
" అయినా గీ మద్య మనం వార్తలల్ల సూస్తనే ఉన్నం గద, సయింటిస్టులు ఏదోటి చేస్తరు గానిలే అబిరాము కోసము." అంది చిత్ర, ఏమని మాట్లాడాలో తెలియక.
" ఆశ పోతోంది మేడం రోజురోజుకి. భయం వేస్తుంటుంది కూడా అప్పుడప్పుడు. మా ఆయన నా కన్నా ఎక్కువ బెంగ పెట్టుకున్నాడు వాడి మీద. వీడు చాలా చాలా మొండి. ఎప్పటికీ మేమిద్దరం ఉండం కదా మేడం, మా తరవాత వాడి పరిస్థితేంటో ఆలోచిస్తేనే భయమేస్తూ ఉంటుంది." అంటూ చమర్చిన తన కళ్ళను తుడుచుకుంది శ్రీజ, ఎన్నో రోజుల నుండి తన మనస్సు పొరల్లో ఉన్న బాధను బయటపెట్టడానికి చిత్ర సరైన వ్యక్తిగా తోచింది శ్రీజకు.
చిత్ర ఆమెను దెగ్గరికి తీసుకుని,
" సూడు స్రీజా, మీరప్పుడే చేతులెత్తేస్తె ఎట్ల జెప్పండి? మీ వోడు మస్తు మంచిగ బతుకుతడు. మస్తు ఉషారుండు మీ అబిరాము." అంది చిత్ర.
శ్రీజ ఇంకా బాధలోనే ఉందని అర్థం చేస్కుంది చిత్ర. ఏదైనా మాట్లాడి విషయాన్ని మరల్చాలనుకుంది. వెంటనే ఆమెకు తన చేతిలో ఉన్న ఫోన్ కనిపించింది.
" స్రీజా, గీ ఫోను ఎట్ల వాడాల్నో జెర సూపిస్తవా? ఈన ఒచ్చే వరకు ఆగబుద్ది అవ్తలే. " అంది చిత్ర.
తన భర్త తనకు విపులంగా సెల్ ఫోన్ వాడకాన్ని గురించి చెబుతుంటే విందామని కలలు కన్న తను ఇలా శ్రీజ తో అనడం తాను చేస్తున్న గొప్ప త్యాగం గా భావించుకుంది చిత్ర. ఒక వేళ శ్రీజ తనకు అర్థమయ్యేలా వివరించినా కూడా, తన భర్త దెగ్గర ఏమీ రానట్టుగా నటించి , మళ్ళీ తన భర్త తో చెప్పించుకోవొచ్చులే నని తనకు తాను సర్ది చెప్పుకుంది.
శ్రీజ తన కళ్ళు తుడుచుకుని, చిత్ర చేతుల్లోనుంచి ఫోన్ తీసుకుని, ఫోన్ ని పరికించి చూడసాగింది.
" వన్ ప్లస్ త్రీ టి... నైస్ చాయిస్ . ఐ ఫోన్ కన్నా నన్నడిగితే ఆండ్రాయిడ్ ఫోన్సే బెటర్. చాలా లిమిటేషన్స్ ఉంటున్నాయి ఐ ఫోన్స్ లో ఈ మధ్య. అన్ని ఆప్స్ దొరకవు.డౌన్లోడ్ చేస్కోవాలన్నా తలనొప్పి. బాగా కాస్ట్లీ కూడా అయ్యాయి అవి. ఇదైతే తర్టీ థౌసండ్ లోనే వస్తుంది. " అంది శ్రీజ.
"ఏందీ? ! " అంది చిత్ర, నోరు తెరిచి.
"అదే.. ఈ ఫోన్ బాగుంది అని చెప్తున్నా." అంది శ్రీజ, చిత్రకు అర్థం కాని విషయాలేవేవో చెప్పి, ఆమె నొచ్చుకునేలా చేశానేమో నన్న భావన కలిగిందామెకు.
"ఇది ముప్పైవేలా ఫోను? మూడు వేలు కాదా?" అడిగింది చిత్ర.
" అయ్యో, కాదు. మూడు వేలకి ఈ ఫోన్ బాటరీ కూడా రాదు." అంది శ్రీజ, చిత్ర అడిగిన 'వింత ' ప్రశ్నకు కాస్త ఆశ్చర్యపోతూ.
"ఓ..." అంది చిత్ర.
శ్రీజ చిత్రకు ఫోన్ వాడకం లోని బేసిక్స్ చెప్పసాగింది. చిత్ర కు మాత్రం తన భర్త ఫోన్ ఖరీదు మూడు వేలే నని చెప్పిన విషయమే గుర్తుకు రాసాగింది.
***

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ