Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#14
"హలో.."
"ఓయ్ హీరో.. ఏం చేస్తున్నావు?"
"టీవీలో సినిమా చూస్తున్నా...". అబద్ధం చెప్పాను.
"ఏం మూవీ?"
"నువ్వు నేను."
"హేయ్...పాటలు బాగుంటాయ్. నాకు చాలా ఇష్టం."
"నాకు ఇంతకు ముందు అంత నచ్చేది కాదు. కాని ఇప్పుడు పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది.."
"ఎందుకు?"
"నీవల్లే. ఆరోజు కోచింగ్ సెంటర్లో పాట పాడావు కదా. అప్పటినించీ."
"..అదా..." నవ్వింది..
"మళ్ళీ పాడొచ్చు కదా.?"
"ఇప్పుడా. పనీ పాటా లేదా?"
"పనిలేదు. పాట కావాలి."
"అఖ్ఖర్లేదు. నాకు పనుంది."
"ఇంతకంటే పనా?"
"అవును."
"ఏం పని?"
"గుడికి."
"అబ్బా. తరవాత వెళ్ళొచ్చులే."
"కాదు ఇప్పుడే వెళ్ళాలి. అమ్మ తిడుతుంది."
"అబ్బా ప్లీజ్. కొంచెం సేపు మాట్లాడి వెళ్ళొచ్చు కదా."
"కష్టం చైతూ.. ఒక పని చెయ్యి. నువ్వు కూడా ఒస్తావా గుడికి?."
"ఇంతకీ దేవుడెందుకు గుర్తొచ్చాడివాళ అర్జెంటుగా?"
"అదీ..ఇవ్వాళా...ఇవ్వాళ నా బర్త్ డే.."
"ఓహ్.. అవునా..నాకు చెప్పలేదే...హ్యాపీ బర్త్ డే మిథునా.. రియలీ సారీ.. నాకు తెలియదు.. నిన్న మాట్లాడినప్పుడైనా ఒక్కసారి చెప్పాల్సింది."
"అదేమన్నా పెద్ద విశేషమా? బర్త్ డేనే కదా?"
"కాదా మరి. నాకు పెద్ద విశేషమే....అయ్యో నాకు ముందే తెలిస్తే బాగుండు. రాత్రే విష్ చేసేవాడిని..అనవసరంగా మిస్ అయ్యాను."
"అంత ఫీల్ అవ్వకు. సరే గుడికి రా మరి."
ఒక్క క్షణం ఆలోచించాను.
"ఒద్దు మిథునా..పనుంది. కాని సాయంత్రం మాత్రం ఖచ్చితంగా కలవాలి. ప్లీజ్.."
"ఏం పని. అంత ముఖ్యమా?"
"నిజంగానే చాలా ముఖ్యం. ప్లీజ్..సాయంత్రం కలవాలి.. ఎక్కడ చెప్పు?"
"కష్టం చైతూ...ఇంట్లోనే ఉంటా నేను బర్త్ డే రోజు. పార్టీలు కూడా ఏమీ ఉండవు."
"అలా అనకు.. నువ్వు కలుస్తున్నావు, అంతే..నీకు విషెస్ చెప్పొద్దా నేను? మధ్యాహ్నం మళ్ళీ కాల్ చేస్తా.. ప్లేస్ డిసైడ్ చేసి చెప్పు సరేనా.. నేనింకేం వినను. బాయ్.." అని పెట్టేశాను.
సంగతి ముందే తెలిసుంటే బాగుండేది అని చాలా సార్లు అనుకున్నాను. సాయంత్రం మాత్రం మిథునని కలిసి నా మనసులో ఉన్నది చెప్పేయ్యాలి. ఏదన్నా గిఫ్ట్ కొనాలి. అందుకే గుడికి రానంది. అదేంటో నాకు అప్పుడే ఐడీయా ఒచ్చేసింది.
సాయంత్రం..ఆరున్నర..అప్పుడే చీకటి పడుతుంది. ఇంకా పూర్తిగా కాదు.
ఇంటి ముందుకు వెళ్ళి ఫోన్ చెయ్యగానే బయటికి ఒచ్చి నన్ను నేరుగా మేడ మీదికి తీస్కెళ్ళింది.
ఇంట్లో వాళ్ళమ్మ మాత్రమే ఉన్నారంట. అయినా ఇంటికి వెళ్తే నేను చెప్పాలనుకున్నది చెప్పలేను కదా.. అందుకే రానన్నాను.
"ఏంటిది? నా కోసమేనా? ఇచ్చెయ్..ఇచ్చెయ్." అంది చేతిలో ఉన్న బ్యాగ్ చూసి.
"ఇస్తా..ఇస్తా.. ఇంటికొచ్చినోడికి మంచినీళ్ళన్నా ఇవ్వవా?"
"అబ్బా..ఆగు.. ఇప్పుడే తెస్తా." అని వెళ్ళిపోయింది.
ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా.. చెప్పాల్సింది ఒక వంద సార్లు అనుకున్నా...
మిథునా...నువ్వంటే నాకిష్టం. లవ్ యూ.. ఇంతే కదా. సింపుల్ గా ఉంది...సినిమా డైలాగ్స్ లేవు. ఒప్పుకుంటుంది... ఖచ్చితంగా ఒప్పుకుంటుంది... నాకున్న ధైర్యమంతా కూడగట్టుకున్నా..
ఒచ్చింది..
"ఇంక తే.. అసలేముంది దీంట్లో..?" అని ఆతృతగా నా చేతుల్లోంచి బ్యాగ్ లాక్కుంది.
" డిజైనర్ షాప్ బ్యాగ్ కదా ఇది?.. పిచ్చా చైతూ నీకు? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు? ఒద్దు చైతూ.. ఇది ఇచ్చేసి వేరేదేదైనా కొనివ్వు."
మిథునకి చాలా బాగా నచ్చిన డ్రెస్. అప్పుడే గుర్తు పెట్టుకున్నా.. ఎలాగోలాగ చేసి ఇవ్వాళ కొనేశా..
"ఏమొద్దు..అయినా గిఫ్ట్ అంటే గిఫ్టే.. చీప్, కాస్ట్లీ అని ఉండవు దాంట్లో... ఇంతకీ నీకు నచ్చిందా లేదా అనేది ముఖ్యం. ఓపెన్ చేసి డ్రెస్ చూడు ముందు."
చూసి అశ్చర్యపోయింది.
"అదే డ్రెస్.. అదే.. ఆరోజు చూసింది ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావ్!"
ఇదే కరెక్ట్ టైం.. చెప్పెయ్యాలి..
"మిథునా.."
ఒక్క ఉదుటున ఒచ్చి నన్ను పట్టేసుకుంది. గట్టిగా..
నిమిషం ఇద్దరం మాట్లాడలేదు. ఇంకా అలాగే ఉన్నాం..
"పిచ్చి చైతూ నీకు.." అంది సన్నగా..
ఇప్పుడే చెప్పెయ్యాలి.
"మిథునా..నీకో విషయం చెప్పాలి" అన్నా కదలకుండా..

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 05-09-2023, 12:10 PM



Users browsing this thread: 1 Guest(s)