Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#37
అశుతోష్ ఇన్ డేంజర్
మాయా రూపధారి సృష్టించిన గందరగోళం
 
సిద్ధపురుషుడికి ముంబైలో మొట్టమొదటగా కనిపించిన దృశ్యం అశుతోష్ మాసిన గడ్డం ఉన్న పెద్దాయనని ఫాలో అవుతూ వెళ్ళటం. వెంటనే తనకు కనిపించిన దృశ్యాన్ని సంజయ్, అంకిత, అభిజిత్ లతో ఇలా వివరించాడు.
 
"మీ పై అధికారి ఎవరో తన వాహనాన్ని మధ్యలోనే ఆపేసి ఒక మాసిన గడ్డం వున్న పెద్దాయనని వెంబడిస్తున్నాడు. మాయా రూపధారులని తలచుకోగానే నాకు కనిపించినది ఇదే. ఆయనతో మీలో ఎవరైనా మాట్లాడగలరా ఇప్పుడు? వెంటనే ఆయనని హెచ్చరించండి. ఆయన ఒక మయా రూపధారి వలలో చిక్కుకున్నాడని చెప్పండి. ఎవరో అనుకుని పొరబడినట్టున్నాడు."
 
"ఆయనకు వెంటనే ఫోన్ చేసి చెప్తాను స్వామి", అంటూ అశుతోష్ తో మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు సంజయ్.
 
"మాసిన గడ్డం ఉన్న పెద్దాయన అంటే మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కదా?", అంది అంకిత అభిజిత్ తో.
 
"అందులో డౌట్ ఏం ఉంది? ఒక్కసారి చూస్తే మర్చిపోయే ప్రొఫైల్ పిక్కా అయ్యగారిది!" అన్నాడు సర్కాస్టిక్ గా అభిజిత్.
 
"హహహ...అందరూ నీలా హ్యాండ్సమ్ గా ఉండరు లే", అని మెల్లగా అభిజిత్ కి మాత్రమే వినబడేలా అంది అంకిత.
 
"ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది ! ఇవ్వాళ ఏమైంది నీకు?" అన్నాడు అభిజిత్.
 
"ఏంటి ఒక్క కాంప్లిమెంట్ కే అంతలా ఎగ్జైట్ అయిపోతున్నావ్", అంది అంకిత.
 
"సరే అవ్వను లే", అని ఠక్కున బదులిచ్చాడు.
 
"నీకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు", అంది.
 
"ఇప్పుడు నువ్వే కదా మాట్లాడింది", అన్నాడు.
 
"అవును నేనే మాట్లాడా. అయితే ఏంటి?" అంది.
 
"ఏం లేదు. ఇంతకీ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటావ్?" అన్నాడు.
 
"ఇప్పట్లో కాదు. ఎందుకు అలా అడిగావు?" అంది.
 
"నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇదంతా. కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఇలా రాజవరానికి రావటం. ఇవన్నీ జరగటం. కేసు సాల్వ్ అయిపోయి మళ్ళీ మనం ముంబై బ్యాక్ వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అయిపోతానని పక్క బాధగా, మరో పక్క భయంగా ఉంది", అన్నాడు.
 
"ఏంటి నీకు ఇదంతా జోక్ లా ఉందా? అక్కడ అశుతోష్ ట్రాప్ అయ్యాడు బాబు", అంది.
 
"లైఫ్ లో మాత్రం థ్రిల్ ఉండాల్సిందే", అన్నాడు.
 
"ఏదైనా చెప్పటం చాలా ఈజీ.....చెయ్యటం కష్టం", అంది.
 
"ఏదైతే అందరికీ కష్టంగా అనిపిస్తుందో అదే ఎగ్జైట్ చేస్తుంది నన్ను.......చిన్నప్పటి నుంచి నా నేచర్ అంతే", అనేశాడు సూటిగా అంకిత కళ్ళలోకి చూస్తూ.
 
"క్యూటీ", అంది చిన్నగా తనకు మాత్రమే వినబడేలా.
 
"ఏంటి ఏదో అన్నావ్...డ్యూటీ నా?" అన్నాడు.
 
"నీకు వినబడింది అని నాకు తెలుసు. ఎందుకు ఆస్కార్ యాక్టింగ్ లు చేస్తావ్ నా దగ్గర", అంది.
 
"హే....నిజంగానే నాకు వినబడలేదు", అన్నాడు ఏమీ తెలియనట్టు అమాయకంగా. కానీ ఏం లాభం? ఎంతగా నవ్వు ఆపుకుందామని ట్రై చేసినా చిరునవ్వు కబ్జా చేసేసింది అభిజిత్ ఫేస్ ని.
 
అది చూసి అందంగా నవ్వింది అంకిత.
అభిజిత్ కి మరింత ఆనందం కలిగించే నవ్వు అది.
 
 
డిస్ప్లే లో సంజయ్ నెంబర్ కనబడగానే అశుతోష్ కాల్ లిఫ్ట్ చేసాడు.
 
అశుతోష్: హా చెప్పు సంజయ్
 
 సంజయ్: సర్ మీరు ఫాలో చేస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కాదు....
 
 అశుతోష్: అసలు ఎలా తెలిసింది నీకు? ఆర్ యు వాచింగ్ మీ ఫ్రొం డిస్టెన్స్?
 
చుట్టూ ఒక సారి చూసాడు అశుతోష్.
 
సంజయ్: సర్ ఇందాక మీకు కాల్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా. సో నన్ను నమ్మండి. మీరు రాధాకృష్ణన్ అనుకుని ఎవరిని అయితే ఫాలో అవుతున్నారో మాయా రూపధారి అతను.
 
 అశుతోష్: వాట్ !
 
సంజయ్: షేప్ షిఫ్టర్ సర్
 
 అశుతోష్: వాట్ ఆర్ యు టాకింగ్, సంజయ్? ఈజ్ థిస్ సమ్ కైండ్ అఫ్ ప్రాంక్ ?
 
 సంజయ్: లేదు సర్. నాకు ఎన్నో విషయాలు తెలిసాయి ఇక్కడ. విల్ అప్డేట్ ఆల్ అఫ్ దెమ్ టు యు వన్స్ యు ఆర్ సేఫ్....
 
ఇప్పుడు మాత్రం నేను చెప్పేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. చాలా మంది షేప్ షిఫ్టర్లు బయట ప్రపంచంలో తిరుగుతున్నారు. అతనితో జాగ్రత్తగా ఉండండి. అతని మాయలో పడకండి. ఫాలో చెయ్యండి కానీ తొందరపడి అతన్ని ఫిజికల్ గా ఎటాక్ చెయ్యటం కానీ, కస్టడీ లోకి తీసుకోవటం కానీ చెయ్యొద్దు. చాలా డేంజరస్ అది.
 
 అతను రాధాకృష్ణన్ కాదు అంటున్నావ్. షేప్ షిఫ్టర్ అంటున్నావ్. అసలు ఎవరు ఇంతకీ?
 
సంజయ్: చీకటి రాజ్యం అతనిది. పాతాళలోకం కింద వుండే మహాపాతకులలో ఒకడు అతను. భూమ్మీద ఇంకొన్ని రోజుల్లో ఎన్నో చీకటి రాజ్యాలు తమ సామ్రాజ్యాలను విస్తరించుకోనున్నాయి.
 
అశుతోష్ : ఏంటో నాకేం అర్థం కావట్లేదు. దీని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి నేను అతన్ని ఫాలో అవుతున్నాను. లీడ్ ఏదైనా దొరికితే నేను అప్డేట్ చేస్తాను. అండ్ విల్ స్టే సేఫ్. విల్ మైంటైన్ మై డిస్టెన్స్ ఫ్రం ది  షేప్ షిఫ్టర్, యాజ్ యు కాల్ ఇట్.
 
సంజయ్: థాంక్ యు సర్. ప్లీజ్ స్టే సేఫ్
 
ఒక నిర్మానుష్యమైన వీధిలోకి మాయారూపధారుడు అడుగుపెట్టాడు. అతన్నే అనుసరిస్తూ అడుగులో అడుగు వేస్తూ వెళ్ళాడు అశుతోష్. కొంత దూరం నడిచాక మాయా రూపధారి కనబడలేదు.
 
ఎటు వెళ్లిపోయాడా అని ప్రతీ చోటా వెతికాడు అశుతోష్. చుట్టూ చూసాడు. ఎక్కడా కనబడలేదు.
 
ఇంతలో వెనక నుండి ఎవరిదో చెయ్యి అశుతోష్ భుజాన్ని తాకినట్టు అనిపించింది.
తిరిగి చూసాడు.

చీకటి సామ్రాజ్యాల నాయకుడు  ఘోర కలి  కనిపించాడు.
 
భయంతో వణికిపోయాడు అశుతోష్.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 03-09-2023, 06:02 PM



Users browsing this thread: 7 Guest(s)