26-08-2023, 05:52 PM
మాయా రూపధారులు
షేప్ షిఫ్టర్స్
సిద్ధపురుషుడు అయిన సమర్థ రాఘవుడు రాజవరం గ్రామంలోని అధిష్ఠా నివాస స్థానమున విచ్చేసి ఉన్నారు. అభిజిత్, అంకిత, సంజయ్ లు ఉలుకుపలుకు లేకుండా ఉన్నారు. కళ్ళార్పకుండా ఆ సిద్ధపురుషుణ్ణే చూస్తున్నారు. అక్కడే తగిన చోటు చూసుకుని కూర్చున్నారు. సిద్ధపురుషుడు వారి ముగ్గురికీ ఎదురుగా ఆసీనుడై ఉన్నాడు. అధిష్ఠా గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాడు.
"ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు ఎంతో ముఖ్యమైనవి. చాలా జాగ్రత్తగా నేను చెప్పేవి విని వాటిని మీ మదిలో గుర్తుంచుకోవాలి", అన్నాడు సమర్థ రాఘవుడు.
ముగ్గురూ ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు ఏమీ అర్థం కానట్టు.
"కైలాసంలో శివుడు పార్వతీ దేవికి తంత్ర శాస్త్రాన్ని చెప్పాడు. ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క శాస్త్రం చొప్పున 64 చెప్పాడు. చరిత్ర తీసుకుంటే మనకు ఎంతో మంది తంత్ర శాస్త్ర ఉపాసకులు దొరుకుతారు. తంత్రానికి కావాల్సింది మంత్రం, యంత్రం. మంత్రం శబ్దానికి కట్టుబడి ఉంటుంది. యంత్రం మంత్రశక్తిని ఒక ఆకారంలో ఉద్భవింపజేసి ఉంచుతుంది. తంత్రము రహస్యంగా ఉంచదగినది. బయటికి చెప్పేది కాదు. అలాంటి తంత్ర శక్తి సిద్ధించాలంటే మంత్రం అవసరం. యంత్రానికి మంత్రం తోడైనప్పుడే ఆ తంత్రము పరిపూర్ణంగా సిద్ధిస్తుంది.
కొన్ని అరుదైన మంత్ర శక్తుల కోసం ఎన్నో ఏళ్లుగా ఈ భూమి మీద ఎంతో మంది నాగమణుల కోసం అన్వేషిస్తూ గడిపారు. ఆ క్రమంలోనే ఎన్నో తప్పిదాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. తాము కోరుకునే దేవతలను సంతృప్తి పరిచి మంత్రశక్తిని సంపాదించటానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. నాగమణిని సమర్పిస్తే అలాంటి అద్భుత మంత్ర శక్తులు దక్కుతాయనే భ్రమలో వుంటారు. అత్యాశకు పోయి కొంత మంది మూర్ఖులు దుష్ట శక్తులను ఆశ్రయిస్తారు.
ఈ 'అదృశ్య మందిరం' లోకి అడుగుపెట్టిన 5 మందీ అలాంటి వారే. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన స్వార్థగుణం. ఒకరికి పదవి, ఒకరికి అనంతమైన ఐశ్వర్యం, ఒకరికి పేరు, ఒకరికి యవ్వనం, ఒకరికి ఇంకేదో కొత్తది కనిపెట్టాలి అన్న కాంక్ష వల్ల కలిగిన ఆరాటం.
ఈ సృష్టిలోని గొప్పతనం ఏంటంటే మంచి, చెడు అంటూ వేరువేరుగా దేన్నీ చూడకపోవడం. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి ఏది దక్కాలో అది దక్కి తీరుతుంది. సృష్టి నియమాలను అతిక్రమిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మానవులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఇది కలియుగం. క్రితం యుగాలలో ధర్మాచరణ వల్ల దేవతలు
అశరీరవాణి రూపంలో మనుషులకు జ్ఞానబోధ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. వ్యక్తిగత నియంత్రణ చాలా ముఖ్యం. అది లేకపోతే ఎంత జ్ఞానాన్ని సంపాదించినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీకేమైనా సందేహాలు ఉన్నచో అడగండి. నివృత్తి చేస్తాను."
"స్వామీ , ఈ ఐదుగురికీ మంత్ర సిద్ధి కలిగింది అంటారా?" అడిగాడు సంజయ్.
"ఎప్పటికీ కలగదు", అన్నాడు సిద్ధపురుషుడు.
ఎందుకు అన్నట్టు చూసారు ముగ్గురూ ఆయనవైపు.
"ఈ ఐదుగురూ వాళ్ళ పితృదేవతలకు విముక్తిని కలిగించలేదు. వీరిలానే వారి పూర్వీకులు కూడా ఎంతో స్వార్థం, దురాశ కలిగిన వాళ్ళు. వీరు కనుక పితృ కర్మలు శ్రద్ధగా ఆచరించి ఉంటే ఈ రోజున వారికి ఇలాంటి దుస్థితి కలిగుండేది కాదు."
"పితృకర్మలు ఆచరించకపోతే ఏం జరుగుతుంది?" అడిగాడు అభిజిత్.
"శాపం తగులుతుంది. వీళ్ళకి జరిగింది అదే. వీళ్ళ పూర్వీకులు ఎన్నెన్నో తీరని కోరికలతో చనిపోయారు. వారికి పితృకర్మలు చేయకపోవటం వలన ఆ తీరని కోరికలతో ప్రేతాత్మలుగా మారిపోయారు. వారు ప్రేతలోకంలో ఉండిపోయారు. ప్రేతలోకంలో ఉండే వీరి ద్వారానే ఈ ఐదుగురి గురించి పాతాళలోకం అడుగున వుండే మహాపాతకులకి తెలిసింది", అని సంజయ్ దిక్కు చూసాడు ఆ సిద్ధ పురుషుడు.
"ఈ కేసుని నువ్వే ఇన్వెస్టిగేట్ చెయ్యటానికి కూడా ఒక కారణం ఉన్నది. అదేంటో తెలుసా ?" అని అడిగాడు సంజయ్ ని.
వాళ్ళలా ఇంగ్లీష్ లో నార్మల్ గా మాట్లాడేసరికి షాక్ అయ్యారు ముగ్గురూ ఒక్క నిమిషం. సంజయ్ కూడా ఆ ప్రశ్నకు ఖంగుతిన్నాడు.
"అదేమిటో మీరే వివరించండి స్వామి", అన్నాడు సంజయ్ వినమ్రంగా.
"మీ పూర్వీకులకు... వారి పూర్వీకులు ఎంతో అన్యాయం చేశారు. చాలా రుణపడిపోయారు వాళ్ళు మీకు. అందుకే నువ్వు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చెయ్యగలుగుతున్నావ్. ప్రపంచానికే తెలియకుండా ఆ ఐదుగురూ దాచిపెట్టిన ఈ 'సీక్రెట్ ఆపరేషన్' నీ ఒక్కడికే తెలిసింది."
"స్వామీ మీరు మాకు లానే ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడగలుగుతున్నారు?" అడిగాడు అభిజిత్.
"ఇంగ్లీష్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రొం మెనీ లాంగ్వేజెస్....అందుకే మాట్లాడగలుగుతున్నాను."
కొంచెం సేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
"స్వామీ నాదొక చివరి ప్రశ్న",అని సంశయిస్తూ అన్నాడు సంజయ్.
"అడుగు"
"ఆ ఐదుగురూ పితృకార్యాలు చెయ్యలేదు కాబట్టి ఆ ప్రేతాత్మలు వారికి చెడు తలపెట్టాయి అనటం సబబుగా ఉంటుంది కానీ, పాతాళ లోకం కింద వుండే ఆ మహాపాతకులకి ఇందులో ఏమిటి సంబంధం? ఇప్పుడా మహాపాతకులు ఎక్కడున్నారు? "అని అడిగాడు సంజయ్.
"చాలా సరైన ప్రశ్న అడిగావు. ఇందులో ఒక లోతైన ధర్మసూక్ష్మం ఉంది. ఉపనయనం అయిన ప్రతీ ఒక్కరు భోజనం చేసిన తర్వాత చివరిలో కుడిచేతిలో నీరు పోసుకుని
అమృతాపిధానమసి అని చెబుతూ
రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం
అర్థినాముదకం దత్తం అక్షయ్యము ఉపతిష్ఠతు
అని చెప్పి నీళ్లు వదలటం వల్ల పాతాళలోకం కింద వుండే ఆ మహాపాతకులకు అవి చేరతాయి. అటువంటి దుస్థితిలో ఉంటారు వాళ్ళు.
ఈ ఐదుగురూ ఏ నాడు అలా నీళ్లు వదిలిన పాపాన పోలేదు. సరిగ్గా ఇక్కడే ఆ మహాపాతకులకి సువర్ణ అవకాశం దొరికింది. ఎవరైతే అలా నీళ్లు వదలకుండా వుంటారో వారి తంత్రం సిద్ధించదు. అలాంటివాళ్ళు ఏ అధిదేవత కోసం అయితే తంత్రప్రయోగం చేస్తారో వారి స్థానంలో అసుర అధిపతి ఒకరు ప్రత్యక్షం అవుతారు.
తంత్రం కోసం ఆ ఐదుగురూ ప్రేతాత్మలను ఆశ్రయించారు. ఆ ప్రేతాత్మలు ఈ మహాపాతకులకి భూలోకం వెళ్ళటానికి ఇదే ఏకైక మార్గం అని సూచించాయి.
మహాపాతకులకు నాయకుడైన ఘోరకలి అరుదైన ఒక నాగమణిని దొంగిలించాడు. ఆ నాగమణిని ప్రేతాత్మలు ఆ ఐదుగురికీ అందజేశాయి. ఆ ఐదుగురూ తంత్రం ప్రయోగించి చూసారప్పుడు. అధి దేవత ప్రత్యక్షం అవుతుందని ఆశపడ్డారు. కానీ ప్రచండుడు ప్రత్యక్షం అయ్యాడు. ఘోరకలినీ, తన చీకటి రాజ్యాలు అన్నింటినీ విముక్తి చేసాడు. ఇప్పుడు ఆ చీకటి రాజ్యాలన్నీ భూలోకంలోకి విడుదల చెయ్యబడ్డాయి. తొందరలోనే వాటి సామ్రాజ్యాలు ఎక్కువవుతాయి."
"అమ్మో! దీని వెనకాల ఇంత స్టోరీ ఉందా !" అన్నది అంకిత.
"ఇది కథ కాదు. దేని మీదా పూర్తిగా నమ్మకం లేకుండా కర్మలను ఆచరించే వారి వల్ల ప్రపంచం అనుభవించే వ్యథ !" అని బాధపడ్డాడు ఆ సిద్ధపురుషుడు.
"స్వామి, ఇప్పుడు ఈ చీకటి రాజ్యాల్లో ఉండేవారు బయటి ప్రపంచంలో ఎలా తిరుగుతారు?" అడిగాడు సంజయ్.
"మాయా రూపధారులయ్యి తిరుగుతారు."
"అంటే ఎలా స్వామి?" అడిగాడు అభిజిత్.
"షేప్ షిఫ్టర్స్ తెలుసా?" అడిగాడు ఆ సిద్ధ పురుషుడు.
"హా...తెలుసు....ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తాం కదా", అన్నాడు అభిజిత్.
"హహహ....ఇంగ్లీష్ సినిమాలు కాదు....మన రామాయణంలోనే వీటి ప్రస్తావన ఉన్నది.
మారీచుడు బంగారు లేడిలా మారటం అదే కదా", అన్నాడా సిద్ధ పురుషుడు .
"ఇప్పుడు వాళ్ళు షేప్ షిఫ్టర్స్ గా మారి బయటి ప్రపంచంలో తిరుగుతున్నారా స్వామి?" అడిగాడు సంజయ్.
"ఈ పాటికి ఎవరినో మాయ చేస్తూ ఉండుంటారు ఆ మాయా రూపధారులు", అంటూ అంతః చక్షువులతో చూసాడు.
ఒక దృశ్యం కనిపించింది ముంబై లో

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ