17-08-2023, 07:59 PM
(14-07-2021, 09:13 PM)naresh2706 Wrote: చాలా కథలు చదవడానికి బాగుంటాయి కానీ కామెంట్ పెట్టడానికి బద్దకం.. కానీ మీ కథకు కామెంట్ పెట్టకపోతే ఒక అద్భుతమైన కథనం ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసి కొంత, మీ కథ మేము కూడా చదువుతున్నాం మాస్టారూ.. కాస్త త్వరగా అప్డేట్ పెట్టండి అని చెప్పడానికి కొంత, రైటర్ కామెంట్స్ లేక కొంతకాలం పక్కన పెడితే అంతవరకు అందులో ఉన్న లయ, సహజత్వం లోపించి నిరాశాజనకంగా సాగుతుంది కథ.. దానిని నివారించడానికి కొంత, శృంగార కథల ఫోరమ్ అయినా సరే దాన్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పాలనే రైటర్ సరైన ప్రోత్సాహం లేక విరమించుకోకుండా కొంత..
ఇలా అన్నీ కలగలిపి కామెంట్ చేసాను. ప్రస్తుత అప్డేట్ విషయానికి వస్తే ఇప్పటివరకు క్యారెక్టర్స్ తీరుతెన్నులు, వాటి ప్రవర్తనా విధానం, మెయిన్ కథలోకి వెళ్ళడానికి అవసరమైన బేస్ వివరించారు. ఇక్కడనుంచి కథనం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడనుంచి మాకు థ్రిల్ కలిగే విధంగా ముందుకు తీసుకుపోండి.
ఇక స్కాచ్ అంటే మద్యపానం జీవితానికి హానికరం. కానీ మా ఆంధ్రాలో జీతానికి హానికరం.
కానీ ఏం చేస్తాం మీరు అడిగాక.. మీరు కథ పూర్తి చేసేయ్యండి. ఈ లోపు యానాం వెళ్ళి అయినా స్కాచ్ తీసుకొచ్చేస్తా?
మంచి మాట చెప్పావు తమ్ముడూ... ఈ కథ నిజంగా అద్భుతంగా వుంది. విక్రాంత్ గారు చాలా బాగా నెరేట్ చేస్తున్నారు. నా అభిమాన కథ అయిన 'పెళ్ళయిన పూజ కథ'కు మళ్ళే కథలో ప్రతి పాత్రకూ చక్కని సంభాషణలతో ఒక క్యారెక్టరైజేషన్ ను రాస్తున్న తీరు అమోఘం. ?
చాలామంది కథను బిల్డప్ చెయ్యకుండా కట్టె కొట్టె తెచ్చె మాదిరి లాగించేస్తారు బండిని. విక్రాంత్ గారు ఎంతో నేర్పుగా ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ చక్కని ఆకృతిని ఏర్పర్చుతున్నారు. మున్ముందు ఎలా వుంటుందా అనే ఉత్సుకత ను కలిగిస్తోంది.
ఆల్ ది బెస్ట్
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK