10-08-2023, 08:56 AM
అశుతోష్ ఇంటరాగేషన్
ఇన్వెస్టిగేషన్ వింగ్, సి.బి.ఐ. ముంబై
సి. బి. ఐ. లోని ఇన్వెస్టిగేషన్ వింగ్ ఎనాలిసిస్
సి. బి. ఐ. లోని ఇన్వెస్టిగేషన్ వింగ్ ఎనాలిసిస్ ప్రకారం అదృశ్య మందిరంలో తప్పిపోయి మాయమైపోయిన ఐదు మందిలో హిస్టరీ అండ్ మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్, సైంటిస్ట్ కృష్ణస్వామి కాకుండా
ప్రపంచంలోనే ధనవంతులైన ఇద్దరు బిజినెస్ మాగ్నెట్స్, దేశంలోని అతి పెద్ద అపోజిషన్ పార్టీ నేతకూడా ఉండటంతో ఈ కేసుని అన్ని కోణాల నుండి దర్యాప్తు చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ ఇన్వెస్టిగేషన్ ని అశుతోష్ స్వయంగా హేండిల్ చేస్తున్నాడు. మధ్యలో ఏదైనా డీటెయిల్ మిస్ అయినా, ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా సంజయ్ ని మెయిల్ లో కానీ, కాల్ లో కానీ అడుగుతున్నాడు.
మొదటిగా రాధాకృష్ణన్ ని ఎంచుకున్నాడు ఇన్వెస్టిగేషన్ సబ్జెక్టు గా. అదృశ్యమందిరం కెళ్లే ముందు ఏ ఏ ఆక్టివిటీస్ చేసాడో మొత్తం డే-టు-డే డేటా అంతా ఒక ఫైల్ లో స్టోర్ చేసాడు. అక్కడికి బయలుదేరే ఒక వారం ముందు రాధాకృష్ణన్ ఒక రష్యన్ జియాలజిస్ట్ ని ఢిల్లీలోకలిసాడు. అక్కడ జరిగిన "మదర్ ఎర్త్" అనే కాన్ఫరెన్స్ కి వస్తున్నాడని తెలిసాక ఆ రోజు సాయంత్రం గుర్గావ్ లోని ట్రిడెంట్ హోటల్ లో పర్సనల్ మీటింగ్ ఒకటి షెడ్యూల్ చేసుకున్నాడు. మూడు గంటల పాటు వారు అక్కడ మాట్లాడుకున్నట్టు రికార్డ్స్ లో ఉందని ట్రిడెంట్ హోటల్ మేనేజర్ చెప్పటంతో అశుతోష్ ఆ జియాలజిస్ట్ ను ఇంటరాగేట్ చేద్దామనుకున్నాడు. స్కైప్ లో కనెక్ట్ అయ్యి ఆయనను పర్మిషన్అడిగాడు ఇంటరాగేషన్ కోసం. వెంటనే ఒప్పుకున్నాడాయన.
ప్లేస్ : రూమ్ నెంబర్ 306, సి. బి. ఐ. ఇన్వెస్టిగేషన్ వింగ్, ముంబై
టైం : 11AM
అశుతోష్: హాయ్. థాంక్స్ ఫర్ కో-ఆపరేటింగ్ విత్ అస్. దీన్ని ఇంటరాగేషన్ లా కాకుండా ఒక ఇంటర్వ్యూ అనుకోండి.ఈ ఇంటర్వ్యూలో ప్రతీ సెకండ్ రికార్డు చెయ్యబడుతుంది విజువల్ గా అండ్ ఆడియో కూడా. అది మీకు ఒకే కదా?
ఆండ్రూ: యా. ఇబ్బందేం లేదు. గో ఎహెడ్.
అశుతోష్: మీ ఇంట్రో ఇస్తే....ఇట్ వుడ్ బీ ఏ బెటర్ స్టార్ట్.
ఆండ్రూ: మై నేమ్ ఈజ్ ఆండ్రూ గంబుర్ట్సేవ్. మా ఫాదర్ ఒక వెల్ రెడ్, వెల్ నోన్ అండ్ ఎక్స్పర్ట్ జియాలజిస్ట్. నేను ఆయన అడుగుజాడల్లోనే ఈ కెరీర్ ని చూజ్ చేసుకున్నాను. ఐ యాం హియర్ టు టాక్ అబౌట్ మై మీటింగ్ విత్ ది హిస్టరీ అండ్ మైథాలజీ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ ఇన్ ట్రిడెంట్ హోటల్ గుర్గావ్.
అశుతోష్: గ్రేట్ స్టార్ట్ ఇండీడ్ . ఆ రోజు హోటల్ లో మీరు రాధాకృష్ణన్ గారితో చాలా సేపు దేని గురించో వివరిస్తున్నారని అక్కడ మీకు అపెటైజర్ సర్వ్ చేసిన అతను చెప్పాడు. ఒక గంట సేపు మీరే మాట్లాడుతున్నారంట. రాధాకృష్ణన్ గారేం మాట్లాడట్లేదు అని చెప్పాడతను.
ఆండ్రూ: గ్రేట్. ఇండియాలోప్రతీ ఒక్కరూ సీక్రెట్ ఏజెంట్ అనుకుంటా. వాళ్ళ పని కాకుండా అవతలి వాడు ఎప్పుడేం చేస్తున్నాడని ఒక కంట కనిపెడుతూనే ఉంటారనుకుంటా. కమింగ్ టు ది పాయింట్, ఆ రోజు నేను కోలా సూపర్ డీప్ బోర్ హోల్ గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను రాధాకృష్ణన్ తో.
మోస్ట్ అఫ్ థెమ్ ఆర్ సైంటిఫిక్ డీటెయిల్స్. మిగిలినవి కొన్ని రూమర్స్ అండ్ కొంత ఫిక్షన్.
అశుతోష్: ఆ టాపిక్ అసలెందుకు వచ్చింది?
ఆండ్రూ: సోవియెట్ యూనియన్ నిర్వహించి చాలా రోజుల వరకు రికార్డు ఉన్న డీపెస్ట్ బోర్ హోల్ అది. టెక్నికల్డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు.
ఆ టైములో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో డైమండ్స్ దొరికాయని ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చేసింది అని చాలా మంది విదేశీ మీడియాలో రిపోర్ట్ చేశారు. బయట సామాన్య ప్రజలు కూడా అదే చెప్పుకున్నారు. వీటిలో నిజానిజాలేంటో తెలుసుకుందామని రాధాకృష్ణన్ నన్ను అడగటం జరిగింది. నాకు తెలిసినదంతా చెప్పాను. మా ఫాదర్ ద్వారా విన్నది, చిన్నప్పుడు నేను చూసింది, నా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. అన్నీ చెప్పాను. సోవియెట్ యూనియన్ లోపల ఏం జరుగుతుందో నేనే కాదు ఎవ్వరూ చెప్పలేరు. చెప్పకూడదు కూడా.
అశుతోష్: అదృశ్య మందిరం గురించి మీకేం తెలుసు?
ఆండ్రూ: చాలా డైమండ్స్ ఉన్న ప్యాలస్ అని తెలుసు. హహహ. సారీ. తప్పుగా అనుకోకండి. నవ్వాగలేదు. సి.బి.ఐ. కదా. సో మీకే ఎక్కువ తెలియాలి.
అశుతోష్: కోలా సూపర్ డీప్ బోర్ హోల్ గురించి మిమ్మల్నికొన్ని ప్రశ్నలు అడగొచ్చా?
ఆండ్రూ: యా. అడగండి. నాకు తెలిసింది, నేను చెప్పగలిగినవి మాత్రమే నేను చెబుతాను.
అశుతోష్:ఆ బోర్ హోల్ లో కొన్నికిలోమీటర్స్ డీప్ కెళ్ళాక కొంత మంది ఆర్తనాదాలు, కేకలు వినిపించాయని కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయట వున్నాయి.అందులో నిజం ఎంత? ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరసలు సాధించింది ఏమిటి?
ఆండ్రూ: ఆ క్లిప్పింగ్స్ నేను కూడా విన్నాను. ఆ ఆడియో రికార్డింగ్స్ లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ వెల్ టుహెల్ అని ప్రచారంలో ఉన్న కట్టుకథలే. ఈ బోర్ వెల్ మూత బడ్డాక ఒక్కొక్కరూ వారికి తోచిన, వాళ్లకు నచ్చిన ఫిక్షన్ కథలు అల్లేశారు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను. రీసెంట్ ఫైండింగ్స్ లో భూమి లోపల వుండే మాంటెల్ లోని ఇంకో లేయర్ లో ఎన్నో పర్వతాలు ఉన్నట్టుగా కనుగొన్నారు. దానికి 660 కిలోమీటర్ బౌండరీ అని పేరు పెట్టారు. సో దీన్ని బట్టి చూస్తే మనకు తెలియని మరొకప్రపంచమే వుంది భూగర్భంలో.
ఇకపోతే మీ రెండోప్రశ్నకి జవాబు చాలా సింపుల్. సోవియెట్ యూనియన్ ఎప్పుడూ తన ప్రత్యర్థి అమెరికా మీద విజయం సాధించటానికే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేపడుతూ ఉంటుంది. అంతక ముందు యునైటెడ్ స్టేట్స్ పేరిట ఉన్న 9,583 మీటర్స్ డెప్త్ ని 12 ,262 మీటర్స్ తో క్రాస్ చేసింది రష్యా. రెండు దశాబ్దాల పాటు ఆ రికార్డు రష్యా పేరిట ఉంది. ఈ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంతకంటే సాధించిన ఘనకార్యం ఏదీ లేదు.
అశుతోష్: సో, మీరు అదృశ్య మందిరం గురించి కానీ, డైమండ్స్ గురించి కానీ ఏం మాట్లాడలేదు అన్నమాట?
ఆండ్రూ: నో
అశుతోష్: ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా?
ఆండ్రూ: నేనొక జియాలజిస్ట్ ని. 1984 లో బోర్ వెల్ మూతబడ్డాక మళ్ళీ తిరిగి 1985 లో పునః ప్రారంభించారు. అప్పట్లో ఎంతో మంది ఆఫీసర్ లని మా నాన్న గారు ప్రాధేయపడ్డారు. దయచేసి ఆపెయ్యండి అని. ఎవ్వరూ వినలేదు. ఎన్నో వేల డిగ్రీల టెంపరేచర్ ఉంటుందని ఎస్టిమేట్ చేసి మరీ చెప్పారు అయినా ఎవ్వరూ వినలేదు. చివరికి ఏం జరిగింది? ఆయన చెప్పినట్టే 356 ఫారెన్ హీట్ నమోదు అయ్యింది. ఇక చేసేది లేక 1992 లో పూర్తిగా ఆపేసారు.
1986 లో జరిగిన చెర్నోబిల్ డిజాస్టర్ అత్యంత విషాదకరమైన సంఘటన. అందులో సుమారు 4000నుండి 9000మంది చనిపోయారు. ఇంకా ఎక్కువ మందే ఎఫెక్ట్ అయ్యారు.
ఇప్పుడు దీనికి దానికిఏంటి సంబంధం అనుకుంటున్నారా?
ఒక్కటుంది.
చెర్నోబిల్ మానవ తప్పిదం.
మన భూగర్భాన్ని స్వార్థం కోసం, డబ్బు కోసం, ఆధిపత్యం కోసం ఇలా తవ్వుకోవటం కూడా మానవ తప్పిదమే.
రెండూ మనిషి చేసిన తప్పులే.
మనకు తెలిసిందే సృష్టి అనుకుంటున్నాం. మనకు తెలియని సృష్టి ఎంతో ఉంది. మనం ఆ సృష్టిని గౌరవించినప్పుడే మనకు ఇక్కడ జీవించే అర్హత ఉంటుంది. లేకపోతే ఆక్సిజన్ పీల్చే హక్కు కూడా లేదు. ఎప్పుడైతే ప్రపంచ దేశాల నాయకులు ఈ సత్యాన్ని గుర్తిస్తారో అప్పుడు వాళ్ళ పర్సనల్ ఎజెండా లను పక్కన బెట్టి మానవాళి గురించి, ప్రకృతి గురించి, ప్రపంచ శాంతి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంతో మంది సి. ఈ. ఓ లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధారాళంగా విరాళాలు ఇస్తున్నారు. అది శుభ పరిణామమే. ఇలాంటివి మన రాజకీయ నాయకులు చెయ్యాల్సిన పనులు.
అశుతోష్ : చాలా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు. ఒక నిజమైన జియాలజిస్ట్ కనిపిస్తున్నారు మీలో ఇప్పుడు. ఇట్'స్ మై ప్లెషర్ మీటింగ్ యు.
ఆండ్రూ: థాంక్ యు. మీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఐ యాం జస్ట్ యే ఫోన్ కాల్ యవే అని గుర్తుపెట్టుకోండి. మీకు సాయపడటానికి నేనెప్పుడూ సిద్ధమే.
అశుతోష్ థాంక్స్ ఏ లాట్!
ఇంటరాగేషన్ అక్కడితో ముగిసింది.
అశుతోష్ మొబైల్ రింగ్ అవ్వటం మొదలు పెట్టింది.
ఫోన్ డిస్ప్లేలో ఉన్న పేరు - సంజయ్

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ