01-08-2023, 06:43 PM
సిద్ధపురుషుడి ఆగమనం
శ్వేతద్వీపవాసి రాక
అలా ఒక 5 నిమిషాల పాటు ఆ భేరి నిరంతరాయంగా మోగి ఆ తర్వాత ఆగిపోయింది.
అక్కడేమైందో చూద్దామని అదృశ్య మందిరం వైపుకుబయలుదేరారు అభిజిత్, అంకిత, సంజయ్ లు అధిష్ఠాతో సహా. రాజవరంలోని జనం అందరూ అదృశ్య మందిరం బయటే గుమిగూడారు. నగారా ఆగిపోయినప్పటి నుండి వాళ్ళు తమ మోకాళ్ళ మీదే నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఏదో ధ్యానంలో ఉన్నారు.
అక్కడి ఎంట్రన్స్ గేట్ బయటే నిలబడిఆత్రంగాలోపలికి చూస్తున్నారు అభిజిత్, సంజయ్ లు. అంకిత, అధిష్ఠా కాస్త దూరంగానేనిలబడ్డారు.
తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నవారు కనబడ్డారు వాళ్లకి. వాళ్ళు రాజప్రాకారం వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ నడకలో ఎలాంటి తొందరపాటు కానీ, తడబాటు కానీలేదు. చాలా ప్రశాంతంగా నడుస్తూ వస్తున్నారు. వాళ్లకు భిన్నంగా వున్న మరొక వ్యక్తి కూడా వాళ్ళతో పాటే వస్తున్నాడు. బహుశా అతను వాళ్ళ రాజ్యంలోని మంత్రి ఏమో అనిపించింది సంజయ్ కి. ఎందుకంటే అతనికళ్ళల్లో చురుకుదనం, ముఖవర్ఛస్సులో తెలివితేటలు కొట్టొచ్చినట్టు బయటికి కనబడుతున్నాయి.
అదృశ్య మందిరం ప్రవేశద్వారం చేరుకోగానే తెలుపురంగు వస్త్రాలు ధరించిన వాళ్ళు తమతో పాటు వచ్చిన ఆ వ్యక్తికిచేతులు జోడించి నమస్కరిస్తూవచ్చిన దారినే వెనుదిరిగారు.
ఆ వ్యక్తిని చూడగానే అధిష్ఠా ప్రవేశద్వారం దగ్గరికొచ్చి స్వాగతించాడు.
"మా రాజవరం ప్రజలకుముక్తిని ప్రసాదించటానికి వచ్చిన ఆ యోగి, సిద్ధ పురుషుడు మీరే అనిపిస్తోంది. అందుకోండి ఇవే మా ప్రణామములు", అంటూ తన మోకాళ్ళ మీద నిలబడి శిరస్సును భూమాతకు తాకిస్తూ వందనం తెలిపాడు.
"అధిష్ఠా నువ్వు పలికినదినిక్కమే. నన్ను సమర్థ రాఘవుడు అందురు.
పాతాళలోకంలోని20వ స్థానంలో వుండే శ్వేతద్వీప వైకుంఠవాసిని. పరమాత్ముడైన హరికి దాసుడను."
ఇలా అనగానే అక్కడున్న అభిజిత్, అంకిత, సంజయ్ లు వారికితెలియకుండానే ఆ వ్యక్తికిరెండు చేతులూ జోడిస్తూ, శిరస్సు వంచి నమస్కారం పెట్టారు. ఏదో తెలియని ఒక పారవశ్యంతో వాళ్లకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఆ సిద్ధపురుషుడు పసిపాపలా స్వచ్చముగా వాళ్ళని చూస్తూ ఒక చిరునవ్వు అందించాడు.
"అదే మందస్మితసుందర వదనారవిందము. ఏమి వర్చస్సు స్వామీ మీది. మీ ద్వారా ఆయనను దర్శించుకున్న అనుభూతికి లోనవుతున్నాము", అన్నాడు అధిష్ఠా.
"అదంతా ఆయన రచించే విష్ణుమాయ, అధిష్ఠా. ఆయన ప్రేమకు పాత్రులైనవారికే అలాంటి తీయ్యటి మైకాన్ని కలిగిస్తాడు. ఇందులో నా ప్రమేయం లేశమాత్రమైనను లేదు", అంటూ నవ్వాడు.
ఆ సిద్ధపురుషుడు నడుస్తూ ముందుకెళ్తుంటే.....
ఆయన వెనకే అభిజిత్, సంజయ్, అంకిత ఆయన అంగరక్షకులలా వస్తున్నారు.
అధిష్ఠా వీరి వెనక వస్తున్నాడు.
అధిష్ఠాను అనుసరిస్తూ రాజవరం ప్రజలు వస్తున్నారు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ