Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
#86
ముడి పార్ట్ 13
పొద్దున వ్యాయామాన్ని ముగించుకుని వచ్చిన ఈశ్వర్ కి తలస్నానం చేసి, కొప్పుకు టవల్ ని చుట్టుకున్న చిత్ర కనిపించింది.
తన వైపు చూసి, నిండైన నవ్వును విసిరిన చిత్ర కి బదులుగా ఒక కృతకమైన నవ్వొకటి విసిరాడు ఈశ్వర్. తన భర్త చిరునవ్వు ను చూసిన చిత్ర, మరింతగా ఆనందపడసాగింది.
"దోషల్ జేస్తున్న. నూనె ఏం ఎక్కువెయ్య. బుడ్డల చెట్ని నీకు ఇష్టమే గద?" అడిగింది చిత్ర.
"ఓకే." అన్నాడు ఈశ్వర్.
' హ్మ్మ్మ్ం.... అందరూ అమృతలు కాలేరు.they both are as different as sky and mud ! ' అనుకున్నాడు ఈశ్వర్.
స్నానాల గదిలోనికి వెళ్ళి షవర్ ని ఆన్ చేసుకున్న ఈశ్వర్ కి అసలు తాను చిత్ర ని, అమృత ని ఎందుకు పోల్చుతున్నడో అర్థం కాలేదు! తను పదే పదే చిత్ర అమృత కి సరితూగదని తనకు తాను ఎందుకు సర్ది చెప్పుకోవాలని అనుకుంటున్నాడో అతని అర్థం కాలేదసలు. షవర్ లోనుంచి చల్లని నీళ్ళు అతని పెదవులను తాకాయి. ఒక్క క్షణం అమృత అతనికి పెట్టిన మొదటి ముద్దు గుర్తుకు వచ్చిందతనికి. తన ముని వేళ్ళని తన పెదవులకి ఆనించి, కళ్ళు మూసుకుని అమృత పెదవుల స్పర్శని గుర్తుకు తెచ్చుకున్నాడు ఈశ్వర్. "ఏదో రోజు నాకు ఊపిరాడకుండా చేసి చంపేస్తావ్ రా నువ్వు నీ ముద్దులతోటి! " అని సరదాగా అమృత ఎప్పుడూ అంటూ ఉండే మాటలు గుర్తొచ్చాయి ఈశ్వర్ కి. షవర్ లోనుంచి దుంకే నీళ్ళ ప్రవాహం లో అతని కన్నీళ్ళు కలిసిపోయాయి. అమృత బ్రతికున్నప్పుడు తను చేసిన ఆకతాయి పనులన్నీ నెమరు వేసుకున్నాడు ఈశ్వర్. అప్రయత్నమైన ఒక చిరునవ్వు అతని ముఖం పై వెలిసింది.అలా శోకం లో నవ్వు వెతుక్కోవడం గత మూడు సంవత్సరాలుగా అలవాటు చేసుకున్నాడు ఈశ్వర్.
అమృత ని తలుచుకునేటప్పుడు అనవసరంగా చిత్ర ని గుర్తుతెచ్చుకోవద్దు అని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్. చిత్ర కేవలం తనకు 'భార్య ' మాత్రమే ననీ, తన మనస్సులో నివాసముండేది కాదనీ గట్టిగా తనకు తాను చెప్పుకున్నాడు ఈశ్వర్.
అమృత గ్న్యాపకాల్లో మునిగి తేలుతున్న ఈశ్వర్ టి.వి శబ్దం వినబడే సరికి, ఇహ లోకం లోకి వచ్చాడు. గబా గబా స్నానమనే కార్యక్రమాన్ని ముగించుకుని , బయటకు వచ్చాడు. నీటి తుంపరలు పడి , కిటికి నుండి వస్తున్న సూర్యుణి కిరణాలను ప్రతిఫలింపజేస్తున్న ఈశ్వర్ మేని ని ఓరగా దొంగచూపులు చూడసాగింది చిత్ర. అతను తన తలపై పడ్డ నీటిని తన చేతితో విదిలిస్తూ ఉన్నాడు. 'వి ' ఆకారం లో ఉండే అతని ఊర్ద్వ భాగాన్ని ఒక్కసారి తనివి తీరా కౌగిలించుకోవాలి అనిపించిందామెకు.అతని దృడమైన భుజాలు, బంగారు వర్ణం లో మెరుస్తున్న అతని మేని ఛాయ చిత్ర నరాల్లో తాపాన్ని రేపింది. ఒక్క సారి అతని దేహం లోని అణువణువునూ ముద్దాడాలనిపించింది ఆమెకి. ఒక వైపు భక్తి టి.వి చూస్తూ తనకా ఆలోచనలు రావటమేంటని తనని తాను ప్రశ్నించుకుని, తనను తాను నిభాయించుకుంది.
"దోషలు అయినయ్ జూడు. బుడ్డల చెట్నీ గూడ ఉంది."
"ఓకే, రెడీ అయి వస్తాను."
"దబ్బున దా. సల్లగైపోతయ్ మళ్ళ. వేడి వేడి గనే మస్తుంటయ్ దోషలు."
"ఓకే."
చిత్ర తనకు అలవాటైన రీతిలో మళ్ళీ ఈశ్వర్ వైపు చూస్తూ నిండుగా నవ్వింది.
చిత్ర కన్నా అమృతే చాలా అందంగా , నిండుగా నవ్వుతుందని మనసులో అనుకున్నాడు ఈశ్వర్.
బట్టలు మార్చుకున్నంత సేపూ అమృత నవ్వును గుర్తుకు తెచ్చుకుని, చిత్ర కన్నా అమృత బాగా నవ్వుంతుందని నిర్ధారిచుకున్నాడు ఈశ్వర్.
చిత్ర చేసిన దోశలు చాలా రుచిగా అనిపించాయి ఈశ్వర్ కి. వారానికి కనీసం రెండు సార్లైనా చిత్ర దోశలు చేసింటే బావుండుననిపించింది అతనికి.
"నచ్చినయా నీకు?" అడిగింది చిత్ర.
"చాలా బాగున్నాయ్ ." తన మనసులోని మాటను చెప్పాడు ఈశ్వర్, దోశలను తరచుగా చేయమని చిత్రతో చెబుదామనుకుని, ఊరుకున్నాడు ఈశ్వర్.
"ఇంగొంచం చెట్నీ యేస్కో. చానా ఉందింగా." అంటూ ఈశ్వర్ సుముఖత కోసం ఎదురు చూడకుండా పచ్చడిని వడ్డించింది చిత్ర. ఈశ్వర్ తను చేసిన దోశలను తింటూ ఉంటే చాలా ఆనందమేసిందామెకు. ఇంకో దోశ అతని ప్లేట్ లో వడ్డిద్దామనుకుని, పొద్దు పొద్దునే అతని మూడ్ ని చెడగొట్టడం ఇష్టం లేక ఊరుకుంది చిత్ర.
'చిత్ర తనతో ఉన్నప్పుడు మాత్రమే అలా నగుముఖం తో ఉంటుందా లేక ఆమె ముఖమే అంతా ?'అన్న సందేహం కలిగింది ఈశ్వర్ కి.
తను తినడం ముగించాక, తన ఎంగిలి కంచాన్ని కడగటానికి సింక్ వైపు వెళ్తున్న ఈశ్వర్ తో
"ఇదో.... నీకు చెప్పడం మర్చిపొయిన.. మనకు పాలేశే పిలగాడు నిన్న జెప్పిండె మూడు దినాలు రానని." అంది చిత్ర.
"ఓ...మరి ఇప్పుడు తేయాలా పాలు?"
"లే.. ఇప్పుడేమొద్దు గాన్లె. సాయింత్రం తెచ్చ్కుందం ." అంది చిత్ర , తన ముఖం పై నున్న చిరునవ్వుని చెదరనీయకుండా.
"లేదు, కాసేపట్లో విశ్వనాథ్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి టీ ఆఫర్ చేయాలి కదా." అన్నాడు ఈశ్వర్.
"ఓ... సరె సరె. మళ్ళిప్పుడు గా సూపర్ మార్కెట్ దాంక నడ్చుకుంట పోతవా?" అడిగింది చిత్ర.
"లేదు పాలు పక్క గల్లీ లోని షాప్ లో దొరుకుతాయి."
"ఓ... ఇప్పుడు వోతున్నవా?"
"హం."
"దా నేంగూడ ఒస్త."
"నువ్వెందుకు?" అడిగాడు ఈశ్వర్, చిత్ర తాను ఎప్పుడు సరుకులు కొనడానికి వెళ్ళినా తోడుగా రావాలనుకుంటుందేమో నని ఖంగారు పడి.
"అయ్య, రేపటికెళ్ళి నేను తీస్కరానీకె. రోజు నీకు వోనీకె వీలు కావద్దు?!" అంది చిత్ర.
చిత్ర మాటలు నిజమేనని తోచాయతడికి, కానీ ఎందుకో ఆమె ముఖం లోని చిరునవ్వు కాస్త అనుమానాస్పదంగా తోచిందతడికి! ఏది ఏమైనా చిత్ర తో అనవసరమైన మాటలు మాట్లాడకూడదని భీష్మించుకున్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ , చిత్ర లు లిఫ్ట్ లో దిగి , గేటు వరకు నడవసాగారు.
"చదువుకోమంటే టి.వి టి.వి టి.వి!రూపాయ్, రూపాయ్ పెట్టి వేలకు వేల ఫీజులు పెట్టి చదువిస్తుంటే తెలుస్తలేదసలు. నాలుగు తగిలిస్తే ఇద్దరు చదువుతరు అప్పుడు! అయినా మీ అమ్మని అనాలి, ప్రతీ దానికి గారాబం చేసి ఇట్ల చెడగొడుతుంది మిమ్మల్ని! సాయంత్రం ఇంటికి వస్తరు కదా, అప్పుడు చెప్త ఇద్దరి పని." అంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ల పై సంతకాలు పెడుతున్నాడు ఓంకార్.
సరిగ్గా కాలేజ్ బస్ వచ్చే సమయానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ల పై తమ తండ్రిని సంతకాలు పెట్టమని చెప్పిన ఆ పిల్లల తెలివితేటలు చూసి నవ్వొచ్చింది ఈశ్వర్ కి. తన భర్త ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు చిత్రకి.
వాళ్ళిద్దరూ షాప్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళారు. రెండు పాకెట్ల toned milk కొన్నాడు ఈశ్వర్.
'ఏందో ఏమో, ఈడ ప్రతీదానికి పైసల్ పెట్టాల్సొస్తుంది.' అనుకుంది చిత్ర మనస్సులో.
ఈశ్వర్ 50 రూపాయల నోటుని షాపామె చేతిలో పెట్టాడు.
"సార్ 4 రూపీస్ చేంజ్ ఉందా?." అందామె.
"లేదు."
"చిల్లర లేదు సార్." అందామె.
"పర్లేదు లెండి." అన్నాడు ఈశ్వర్.
"నేను రేపు పాలు కొననీకె ఒస్త. అప్పుడిద్దువు గాన్లె.నువ్వు ఆరు రూపాయలియ్యలె గద?" అంది చిత్ర వెనక నుంచి.
"హా అవునండి."
"రేపు నేనొస్త జూడు. ఈన రాడు. గుర్తుగ ఇయ్యి సరేనా?" అంది చిత్ర, కృత్రిమమైన నవ్వుని ముఖానికి తగిలించుకుని.
వాళ్ళిద్దరిలో చాలా తేడా కనిపించింది షాపామె కి. చిత్ర శ్రీనగర్ కాలనీ లో నివసించాల్సిన వ్యక్తిగా తోచలేదామెకి.
"సరే, అలాగే, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇస్తా." అందామె.
ఒక్క క్షణం ఈశ్వర్ కి తల తీసేసినట్టయింది. వారిద్దరూ తిరిగి తమ ఫ్లాట్ కి పయనమయ్యారు.
"6 రూపీస్ దెగ్గరేముంది చెప్పు? పాపం అలా అన్నావు ఆమెను." అనే మాటలు నోటి వరకు వచ్చాయి ఈశ్వర్ కి కానీ చిత్రతో ఏలాంటి సంభాషణను పెట్టకూడదనుకున్న అతని ప్రతిగ్న్య గుర్తుకువచ్చి ఊరుకున్నాడు.
వారింటికి చేరుకున్నాక, చిత్ర పాల ప్యాకెట్లని తీసుకుని కాచడానికి వెళ్ళింది. తాను అనుకున్నట్టుగానే చిత్ర తో ఎటువంటి సంభాషణ చేయనందుకు గర్వంగా తన రూం వైపు అడుగులేశాడు ఈశ్వర్.
వారి ఇంటిలో ఉండే గోడ గడియారం 11 సార్లు కొట్టిన పది నిమిషాలకి వాళ్ళింటి కాలింగ్ బెల్ మోగింది.
"హా..... బావున్నరా? రండి లోపటికి." అంది చిత్ర, శ్రీజ, విశ్వనాథ్ దంపతులని చూస్తూ.
లోపలికి వస్తూ,
"మేడం , సార్ ఉన్నా...?" విశ్వనాథ్ మాటని పూర్తి చేయకముందే రూం లో నుండి వచ్చాడు ఈశ్వర్.
"హాయ్ విశ్వనాథ్."
"హలో సార్, .... కింద సామాన్లు ఉన్నాయ్.షిఫ్ట్ చేసేటప్పుడు కొంచం మీరు కూడా పక్కనుంటే బావుంటుందని.." అన్నాడు విశ్వనాథ్ కాస్త మొహమాటం తోనే.
"అయ్యో , దానిదేముంది. వెళ్దాం పద." అన్నాడు ఈశ్వర్.
"మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాము."అన్నాడు విశ్వనాథ్ , చిత్ర వైపు చూస్తూ.
"అయ్య, అట్లేమ్లే." అంది చిత్ర నవ్వుతూ.
తనను చూసి చిత్ర నవ్వే రీతిలో, మిగిలిన వారిని చిత్ర చూసి నవ్వే రీతిలో తేడా ప్రస్పుటంగా కనిపించింది ఈశ్వర్ కి.
"వెళ్దామా? " మళ్ళీ అన్నాడు ఈశ్వర్ విశ్వనాథ్ తో, చిత్ర ని ఇంకాస్త ఎక్కువ సేపు చూడొద్దని నిర్ణయించుకున్నవాడై.
ఈశ్వర్ కి తమ వల్ల విసుగు కలిగిందేమో నని పొరబడ్డాడు విశ్వనాథ్. తన భార్య తో
" శ్రీజా, త్వరగా రా." అన్నాడు.
"అయ్య, వీళ్ళీడనే ఉంటరు గానిలే. మీరు పొయిరండి. " అంది చిత్ర.
తనకు తన భార్య అవసరం ఉన్నా, ఈశ్వర్ కి మరింత విసుగు తెప్పించినట్టవుతుందేమో నని చిత్ర యొక్క ప్రతిపాదనకు అంగీకరించాడు విశ్వనాథ్.
"అర్థం చేస్కో" అని తన కళ్ళతోటే తన భార్య కి చెప్పాడు విశ్వనాథ్.
విశ్వనాథ్ పరిస్థితిని అర్థం చేసుకుని,
"సరే, సార్ తో పాటు మీరు వెళ్ళండి. నేను, వీడు ఇక్కడ ఉంటాం అప్పటిదాకా." అంది శ్రీజ.
అభిరాం చాక్లెట్ అడిగితే కొనివ్వడం మర్చిపోయానని గుర్తొచ్చింది విశ్వనాథ్ కి. చిత్ర దెగ్గర తన సుపుత్రుడు చాక్లెట్ కోసం తన ప్రతాపాన్ని చూపించకూడదని కోరుకున్నాడు విశ్వనాథ్.
ఈశ్వర్, విశ్వనాథ్ లు లిఫ్ట్ లో కిందికి దిగుతున్నారు.
ఈశ్వర్ ఏదో ముభావంగా ఉన్నట్టు తోచింది విశ్వనాథ్ కి.అనవసరంగా తాను ఈశ్వర్ కి భంగం కలిగించాననిపించింది అతనికి.
ఈశ్వర్ మాత్రం అమృత, చిత్ర ల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. చిత్ర తనను చూసినప్పుడు ఆమె కళ్ళల్లోని మెరుపు నచ్చట్లేదతడికి అస్సలు. ఒక పసుపు రంగు తాడుని ఆమె మెడ చుట్టూ మూడు ముళ్ళుగా కట్టినందుకే అంత మెరుపు చూపిస్తుందా చిత్ర తన చూపుల్లో అన్న సందేహం కలిగిందతడికి. చిత్ర కి దూరంగా ఒక రెండు రోజులు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలనిపించింది ఈశ్వర్ కి.
ఈశ్వర్ నుండి సామాన్ల షిఫ్టింగ్ విషయం లో ఎన్నో సలహాలు తీస్కుందామనుకున్న విశ్వనాథ్ , ఈశ్వర్ ప్రవర్తనను చూసి తన ఆలోచనను విరమించుకున్నాడు. అసలు అతనికి ఒక సబార్డినేట్ తన తో కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉండటం ఇష్టం లేదేమోనన్న అనుమానం కూడా కలిగింది.
సామన్లని ఒక్కొక్కటిగా హమాలీలు లిఫ్ట్ ద్వారా తరలిస్తూ ఉన్నారు. ఈశ్వర్ కి తన మస్తిష్కం నిండా చిత్ర, అమృతలు నాట్యం చేస్తూ ఉండటం తో మానసికంగా అలసిపోయి, తన ఫోన్ లో ఫేస్ బుక్ ని స్క్రోల్ చేసుకోసాగాడు ఈశ్వర్. అతనికి 5 years ago memories అని ఆమృతతో కలిసి గోవా బీచ్ లో దిగిన ఫోటోలు కనిపించాయి. అప్రయత్నంగా అతని వేలు అమృత ప్రొఫైల్ పైకి వెళ్ళింది. ఆమె ఫోటోలు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. అందులోని ప్రతీ ఫోటోలో ఈశ్వర్ ఉన్నాడు. అమృత తో పక్కన నిలబడ్డ ప్రతీ ఫోటో లో అతని ముఖం పై ఒక మెరుపు కనిపించింది అతడికి. ఒక్క క్షణం ఈశ్వర్ కి గతం లోని తనపై అసూయ కలిగింది. అప్రయత్నంగా అమృత ఫోటోని ఫుల్ సైజ్ లో పెట్టి తన చూపుడు వేలుతో ఆమె ఛాయా చిత్రం పై నిమరసాగాడు ఈశ్వర్.
ఇంతలో దడాల్న శబ్దం కావడంతో తన గత స్మృతుల నుండి బయటకు వచ్చాడు ఈశ్వర్. బాసాన్లు పెట్టే స్టీల్ స్టాండ్ హమాలీ చేతుల నుండి జారిపోయి, కింద పడింది.
"జాగ్రత్త గా చేయి, డబ్బులు పెట్టే కొన్నవి అవి." అని అనబోయి, ఈశ్వర్ ఉన్నాడని నిభాయించుకున్నాడు విశ్వనాథ్.
"విశ్వనాథ్ , నేను కాసేపు బయట ఉంటాను. ఏమైనా అవసరం ఉంటే పిలువు నన్ను .ఓకేనా?"అన్నాడు ఈశ్వర్.
సరేనన్నాడు విశ్వనాథ్, ఈశ్వర్ వల్ల ఏం పని లేదని గ్రహించి.
చలికాలపు సూర్యుని వేడిమి ఈశ్వర్ మేని ని వెచ్చగా తాకసాగింది. తనను నిత్యం వెంటాడేది అమృతే అనుకుంటే, ఇప్పుడు కొత్తగా చిత్ర ఒకత్తి వచ్చిందనుకున్నాడు ఈశ్వర్.
***
ఈశ్వర్, విశ్వనాథ్ లు రావడానికి ఆలస్యమౌతుందని గ్రహించారు శ్రీజ, చిత్ర లు.
"వాళ్ళొచ్చే వరకు ఛాయ్ పెట్ట్కొస్త." అంది చిత్ర.
"అయ్యో, ఉండన్లెండి. మీకెందుకు శ్రమ?" అంది శ్రీజ,నాలుక ఛాయ్ కోసం లాగుతున్నా, మొహమాటపడి.
"అయ్య, అందుల ఏముంది? ఛాయ్ మంచిగ చేస్త నేను. ఒక్కసారి తాగితివంటె మళ్ళ మళ్ళ అడుగుతవ్ రోజు." అంది చిత్ర నవ్వుతూ.
సరేనంటూ తలూపింది శ్రీజ, చిత్ర తో వాదనను కొనసాగించడానికి ఇష్టపడక. చిత్ర ఛాయ్ మరిగిస్తుంటే ఛాయ్ కి అలవరచబడ్డ శ్రీజ నాలుక తహతహలాడసాగింది. నిశ్శబ్దంగా, బుద్ధిమంతుడిలా కూర్చున్న అభిరాం వైపు చూసి, కాస్త ఉపశమనంగా నిట్టూర్చింది శ్రీజ, వాడు అల్లరి చేసే కార్యక్రమానికి చిత్ర వాళ్ళింట్లో విరామాన్ని ఇచ్చినందుకు.
వారం క్రితం తన భర్త తో కలిసి సూపర్ మార్కెట్ కి తొలిసారి వెళ్ళినప్పుడు కొనుక్కున్న గ్లాసుల్లో ఛాయ్ తెచ్చింది చిత్ర. ఒక్క గుటక తాగాక, శ్రీజ కు చాలా రుచిగా తోచింది ఛాయ్, ఏదో ఒక సాకు తో తరుచుగా వచ్చి, చిత్ర చేసే ఛాయ్ తాగాలనిపించిందామెకి ఒక్క క్షణం.
ఇద్దరూ తమ సంభాషణని కొనసాగించారు. అభిరాం కి మాటలు రాని విషయాన్ని గూర్చి తన మాటల్లో ప్రసక్తి తీసుకురాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడసాగింది చిత్ర. ఇంతలో చిత్ర, తన తల్లి చేతుల్లోని ఛాయ్ ని చూసి, తానేదో మర్చిపోతున్ననని ఆలోచించడం ఆరంభించాడు అభిరాం.
చిత్ర, శ్రీజ లు తమ చేతుల్లోని కాఫీల్లో ఛాయ్ ని పూర్తిచేసుకున్నారు.ఇంతలో అభిరాం నోటి నుండి ఒక వింత శబ్దం వినిపించసాగింది. చిత్రకు తన కర్ణభేరిని ఎవరో పదునైన పుల్లతో కుచ్చినట్టుగా అనిపించింది. శ్రీజ కి అర్థమైంది వాడు అడుగుతుంది చాక్లెట్ నని.
"అభీ చాక్లెట్ కొందాం. కిందికి వెళ్ళాక. డాడీ నిన్న మనం చూసిన న్యూ హౌస్ కి అన్నీ షిఫ్ట్ చేస్తున్నాడు నాన్నా." అంది శ్రీజ.
"చాక్లెట్లు నాట్ గుడ్, యువర్ .... టీత్ గో." అంది చిత్ర.
ఒక్క క్షణం చిత్ర ను చూసి, వెక్కిరింపుగా నవ్వి, తిరిగి కర్ణ కఠోరమైన శబ్దాన్ని కొనసాగించాడు అభిరాం.
'ఏందో ఏమో, గీ పిలగాడు నన్ను జూశి నవ్వుతుండా, నా ఇంగ్లీషు జూశి నవ్వుతుండా?' అని లోలోన అనుమానపడింది చిత్ర.
ఇంకాసేపు అభిరాం చేసే శబ్దాన్ని వింటే తన చెవులు పనిచేయవని భావించింది చిత్ర. కాస్త ఆలోచించాక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది చిత్ర కి.
"యూ ఈట్ సలాడా?" అడిగింది చిత్ర.
హఠాత్తుగా తన అరుపుని ఆపకుండా కాస్త నెమ్మిదిగా స్వరాన్ని తగ్గించాడు అభిరాం.
"కోకోనట్ సలాడ్? యూ ఈటా?"
నిలువునా తలూపాడు అభిరాం.
చిత్ర ఉదయం పల్లీల చెట్నీ చేసినప్పుడు మిగిలిపోయిన కొబ్బరి ని తురుమి, అందులో చక్కెర కలుపుకుని తీసుకొచ్చింది.
అభిరాం మెల్లిగా స్పూన్ నిండా ఆ మిశ్రమాన్ని పెట్టుకున్నాడు. చిత్ర ని తన కొడుకు వల్ల ఇబ్బందికి గురి చేస్తున్నానేమో నన్న అపరాధభావం తో శ్రీజ , కర్ణకఠోరమైన కేకలు వినే బాధ తప్పుతుందేమో నన్న ఆశతో చిత్ర , ఉత్కంఠ తో చూడసాగారు అభిరాం వైపు. అభిరాం ఒక చిరునవ్వు చేశాడు. చిత్ర కు వాడి నవ్వు బాగా ఆకర్షణీయంగా తోచింది. చాలా తక్కువ పరిచయం లోనే అభిరాం పై చాలా పాశం ఏర్పడిందామెకు.
"పిలగాడు మస్తు ముద్దుగున్నడు. తీస్కొసుండు శ్రీజా అప్పుడప్పుడు. " అభిరాం బుగ్గల్ని నిమురుతూ చెప్పింది చిత్ర.చిత్ర ని పట్టించుకోకుండా వాడు ఆ 'కోకోనట్ సలాడ్ ' ని తింటూ ఉన్నాడు.
చిత్ర తనతో 'ఫార్మాలిటీ' గా ఆ మాట అనట్లేదని గ్రహించింది శ్రీజ. తమ కొడుకు యొక్క లోపాన్ని గురించి గుచ్చి గుచ్చి అడగే వాళ్ళనీ, వాడి అల్లరి ని చూసి కాస్త విసుగు ప్రదర్శించే వాళ్ళనే చూసిన శ్రీజకు, చిత్ర అన్న ఆ మాటలు చాలా ఆనందం కలిగించాయి.
***
సామాన్లంతా షిఫ్ట్ చేశాక, హమాలీలకు డబ్బులు పంచే పని చేస్తున్నాడు విశ్వనాథ్. ముందు మాట్లాడుకున్న దానికన్నా' ఛాయ్ పైసల ' పేరుతో 100 ఎక్కువ వసూలు చేస్తున్న హమాలీలపై విసుక్కుందామని ఉన్నా, ఈశ్వర్ పక్కన ఉన్నాడన్న మొహమాటం తో ఊరుకున్నాడు విశ్వనాథ్.
ఈశ్వర్ మాత్రం వారం క్రితం తాను చూస్తున్నప్పుడు చిత్ర భంగం కలిగించిన 'సిటీ లైట్స్ ' చిత్రం యొక్క కొనసాగింపు భాగాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంతక ముందు కన్నా ఈశ్వర్ యొక్క మూడ్ కాస్త మెరుగైనట్టు గమనించాడు విశ్వనాథ్.
లిఫ్ట్ లో 5వ అంతస్థుకు దిగ సాగారు ఇద్దరూ.
"సార్, చాలా థాంక్స్.... ఆండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం ." అన్నాడు విశ్వనాథ్, నిజాయితీ, మొహమాటం కలగలిసిన స్వరం తో.
"అయ్యో, అలా ఏం లేదు విశ్వనాథ్. చిత్ర కి అయినా మీ వైఫ్ ఉంటే కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది." అన్నాడు ఈశ్వర్ అసంకల్పితంగా. తాను అంత ఉపచేతనంగా చిత్ర ప్రస్తావన ఎలా తేగలిగాడో ఈశ్వర్ కి అర్థం కాలేదు.
ఈశ్వర్ మాటలు కాస్త ఊరట ని ఇచ్చాయి విశ్వనాథ్ కి.ఈశ్వర్ పై ఒక్క విస్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోతున్నాడు విశ్వనాథ్.ఈశ్వర్ తన మనస్సులో ఎప్పుడూ ఏదో ఆలోచన కలిగి ఉంటాడనిపించింది విశ్వనాథ్ కు.ఈశ్వర్ ని ఏం ఆలోచిస్తున్నాడో కనుక్కుందామనుకుని, పైన పని చేసే వారు, చనువిచ్చినంత మాత్రాన, హద్దులు దాటి వెళ్ళకూడదనుకుని, ఊరుకున్నాడు విశ్వనాథ్. కానీ ఈశ్వర్ పై ఆఫీస్ లో ఉన్న అభిప్రాయం మాత్రం తప్పేమో నన్న భావన కలిగింది అతడికి.
ఈశ్వర్, విశ్వనాథ్ లు చివరికి, ఏలాంటి బరువులు ఎత్తకున్నా, అలసిపోయిన దేహాలతో కింద ఫ్లాట్ కి చేరుకున్నారు.చిత్ర ముందు విశ్వనాథ్ ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది, తిరిగి తన వైపు సునిశితంగా చూస్తున్న తన వైపు చూసి మళ్ళీ నవ్వింది. ఈశ్వర్ మళ్ళీ గుర్తించాడు ఆ నవ్వులో తేడాని.
*****
చిత్ర వాళ్ళింటి గోడ గడియారం 6 సార్లు మోగి అరగంట కావొస్తుంది. మధ్యాహ్నం చిత్ర చేసిన నూనె లేని బెండకాయ కూర విశ్వనాథ్, శ్రీజ లతో కలిసి తిన్నాక,ఈశ్వర్ కదలకుందా గత 5 గంటలుగా తన పనిలో నిమగ్నమయి ఉన్నాడు. ఆఖరుగా అతను పడ్డ కష్టానికి తగిన ఫలితం వచ్చినందుకు కాస్త ఆనందమేసింది ఈశ్వర్ కి. ఒక్కసారి లాప్టాప్ పక్కకు పెట్టి, మంచం పై వాలిపోయాడు.ఒక ఐదు నిమిషాల తరువాత అతడికి విసుగు రావడం ఆరంభమైంది.అతడు భరించలేనంత విసుగు కలిగిందతడికి. యూట్యూబ్ లో చార్లీ చాప్లిన్ సినిమాలని పెట్టుకున్నాడు కానీ అతడి విసుగు ని అది పోగొట్టలేకపోయింది. తన ఫోన్ తీసుకుని తన స్నేహితుడైన ఆదర్శ్ కి ఫోన్ కలిపాడు,కానీ స్విచ్చాఫ్ వచ్చింది. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదసలు.మూడు సార్లు సంకోచించి, తరువాత ఉదయం తాను పాలప్యాకెట్లు కొన్నప్పుడు చిత్ర తో మాట్లాడకూడదని పెట్టుకున్న సంకల్పానికి భంగం కలగించుకోని విషయం గుర్తుకు తెచ్చుకుని , టి.వి చూస్తున్న చిత్ర దెగ్గరికి మెల్లిగా నడుస్తూ వెళ్ళాడు ఈశ్వర్.
"మూవీ చూస్తున్నావా?" సమాధానం తెలిసే అడిగాడు ఈశ్వర్.
నవ్వుతూ తలూపింది చిత్ర, ఆమె కళ్ళతో సాధ్యమైనంత వరకూ తక్కువగా తన చూపు కలిసేలా చూసుకున్నాడు ఈశ్వర్.
"నచ్చిందా మూవీ?" తను అడగవలసిన ప్రశ్న ని జాగ్రత్తగా ఎంచుకున్నాడు ఈశ్వర్.
"బాగుంది.... కానీ ఇందుల మహేషుబాబు చేశింటే ఇంగా మస్తుగుండు." బదులిచ్చింది చిత్ర.
ఈశ్వర్ కి ఆమె సమాధానం కాస్త వింతగా తోచింది.
"డిస్టర్బ్ చేసానా?" అడిగాడు ఈశ్వర్.సాఫ్ట్ వేర్ ప్రపంచం లో పనిచేయటం వల్ల అతనికి బాగా అలవాటైన దౌత్యపరమైన ప్రశ్న అది.
"అయ్య! డిస్టర్బు గానీకి నేనేం పనిజెస్తున్న అసలు?" అంది చిత్ర తన భర్త అడిగిన ప్రశ్నలోని అసహజతకు కాస్త నవ్వుతూ.
" నాకు చాలా బోర్ కొడుతోంది. నీకు ఇబ్బందేం లేకుంటే అలా fresh air కి తిరుగుదామా? "
--------------------సశేషం[b]--------------------[/b]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
ముడి - by k3vv3 - 01-06-2023, 02:58 PM
RE: ముడి - by ANUMAY112911 - 01-06-2023, 05:12 PM
RE: ముడి - by sri7869 - 01-06-2023, 05:54 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:06 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:11 PM
RE: ముడి - by Uday - 05-06-2023, 01:53 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:00 PM
RE: ముడి - by K.R.kishore - 05-06-2023, 03:30 PM
RE: ముడి - by sravan35 - 07-06-2023, 08:21 PM
RE: ముడి - by utkrusta - 08-06-2023, 03:50 PM
RE: ముడి - by appalapradeep - 09-06-2023, 04:58 AM
RE: ముడి - by ramd420 - 09-06-2023, 05:30 AM
RE: ముడి - by taru - 09-06-2023, 10:22 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:01 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:04 PM
RE: ముడి - by sri7869 - 10-06-2023, 07:15 PM
RE: ముడి - by k3vv3 - 16-06-2023, 08:33 AM
RE: ముడి - by Roberto - 04-02-2024, 04:20 AM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 12:58 PM
RE: ముడి - by K.R.kishore - 16-06-2023, 11:39 AM
RE: ముడి - by taru - 16-06-2023, 05:12 PM
RE: ముడి - by Uday - 16-06-2023, 06:42 PM
RE: ముడి - by ramd420 - 17-06-2023, 04:56 AM
RE: ముడి - by sri7869 - 17-06-2023, 11:35 AM
RE: ముడి - by k3vv3 - 18-06-2023, 01:31 PM
RE: ముడి - by cherry8g - 18-06-2023, 03:09 PM
RE: ముడి - by sri7869 - 18-06-2023, 08:26 PM
RE: ముడి - by ramd420 - 18-06-2023, 10:22 PM
RE: ముడి - by K.R.kishore - 18-06-2023, 10:40 PM
RE: ముడి - by appalapradeep - 18-06-2023, 10:56 PM
RE: ముడి - by k3vv3 - 21-06-2023, 09:35 AM
RE: ముడి - by K.R.kishore - 21-06-2023, 09:50 AM
RE: ముడి - by sri7869 - 21-06-2023, 03:12 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:52 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:55 PM
RE: ముడి - by TheCaptain1983 - 25-06-2023, 06:15 AM
RE: ముడి - by taru - 25-06-2023, 06:41 AM
RE: ముడి - by Shabjaila 123 - 24-06-2023, 09:06 PM
RE: ముడి - by adultindia - 24-06-2023, 11:00 PM
RE: ముడి - by K.R.kishore - 24-06-2023, 11:22 PM
RE: ముడి - by the_kamma232 - 25-06-2023, 06:18 AM
RE: ముడి - by cherry8g - 25-06-2023, 12:57 PM
RE: ముడి - by Aavii - 26-06-2023, 01:03 AM
RE: ముడి - by Uday - 26-06-2023, 01:50 PM
RE: ముడి - by AnandKumarpy - 26-06-2023, 02:34 PM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 11:58 AM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 12:00 PM
RE: ముడి - by Rohit009 - 27-06-2023, 12:37 PM
RE: ముడి - by K.R.kishore - 27-06-2023, 04:47 PM
RE: ముడి - by ramd420 - 27-06-2023, 11:02 PM
RE: ముడి - by sri7869 - 28-06-2023, 12:08 PM
RE: ముడి - by Mohana69 - 28-06-2023, 02:24 PM
RE: ముడి - by Uday - 28-06-2023, 03:07 PM
RE: ముడి - by utkrusta - 28-06-2023, 03:10 PM
RE: ముడి - by Vvrao19761976 - 28-06-2023, 08:57 PM
RE: ముడి - by smartrahul123 - 29-06-2023, 01:04 AM
RE: ముడి - by phanic - 29-06-2023, 07:02 AM
RE: ముడి - by itskris - 29-06-2023, 11:30 AM
RE: ముడి - by k3vv3 - 29-06-2023, 10:26 PM
RE: ముడి - by Uday - 29-06-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 01-07-2023, 10:32 AM
RE: ముడి - by sri7869 - 01-07-2023, 11:13 AM
RE: ముడి - by utkrusta - 01-07-2023, 01:00 PM
RE: ముడి - by K.R.kishore - 01-07-2023, 01:14 PM
RE: ముడి - by Arjun0410 - 01-07-2023, 03:25 PM
RE: ముడి - by MKrishna - 02-07-2023, 11:28 AM
RE: ముడి - by taru - 02-07-2023, 10:23 PM
RE: ముడి - by k3vv3 - 03-07-2023, 07:00 PM
RE: ముడి - by k3vv3 - 04-07-2023, 09:06 AM
RE: ముడి - by TheCaptain1983 - 04-07-2023, 09:31 AM
RE: ముడి - by utkrusta - 04-07-2023, 12:58 PM
RE: ముడి - by ramd420 - 05-07-2023, 07:11 AM
RE: ముడి - by K.R.kishore - 05-07-2023, 10:53 AM
RE: ముడి - by sri7869 - 05-07-2023, 11:09 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:55 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:58 AM
RE: ముడి - by sri7869 - 07-07-2023, 08:26 AM
RE: ముడి - by cherry8g - 07-07-2023, 05:52 PM
RE: ముడి - by utkrusta - 07-07-2023, 06:21 PM
RE: ముడి - by K.R.kishore - 07-07-2023, 07:34 PM
RE: ముడి - by k3vv3 - 10-07-2023, 09:24 AM
RE: ముడి - by K.R.kishore - 10-07-2023, 09:47 AM
RE: ముడి - by Arjun0410 - 10-07-2023, 10:42 AM
RE: ముడి - by utkrusta - 10-07-2023, 05:00 PM
RE: ముడి - by k3vv3 - 13-07-2023, 02:26 PM
RE: ముడి - by TheCaptain1983 - 14-07-2023, 07:45 AM
RE: ముడి - by sri7869 - 18-07-2023, 11:23 PM
RE: ముడి - by k3vv3 - 29-07-2023, 10:43 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-07-2023, 03:16 AM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:28 PM
RE: ముడి - by Vyas Kumar - 30-07-2023, 06:37 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:26 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:24 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-08-2023, 08:09 AM
RE: ముడి - by Shabjaila 123 - 08-08-2023, 12:37 PM
RE: ముడి - by k3vv3 - 09-08-2023, 08:46 AM
RE: ముడి - by TheCaptain1983 - 10-08-2023, 07:12 AM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:58 PM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:59 PM
RE: ముడి - by k3vv3 - 19-08-2023, 05:00 PM
RE: ముడి - by TheCaptain1983 - 19-08-2023, 09:02 PM
RE: ముడి - by sri7869 - 19-08-2023, 10:16 PM
RE: ముడి - by k3vv3 - 30-08-2023, 06:39 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-09-2023, 11:46 PM
RE: ముడి - by sri7869 - 31-08-2023, 02:34 PM
RE: ముడి - by sri7869 - 08-09-2023, 03:51 PM
RE: ముడి - by k3vv3 - 08-09-2023, 10:13 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:14 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:16 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:19 PM
RE: ముడి - by sri7869 - 09-09-2023, 02:10 PM
RE: ముడి - by Uday - 09-09-2023, 03:08 PM
RE: ముడి - by Vvrao19761976 - 14-09-2023, 08:37 PM
RE: ముడి - by nalininaidu - 15-09-2023, 12:05 PM
RE: ముడి - by Vishnupuku - 16-09-2023, 11:38 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:03 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:04 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:18 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:19 PM
RE: ముడి - by sri7869 - 19-09-2023, 07:11 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 09:54 PM
RE: ముడి - by Uday - 20-09-2023, 05:41 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:12 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:14 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:15 PM
RE: ముడి - by sri7869 - 27-09-2023, 08:17 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:02 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:05 PM
RE: ముడి - by TheCaptain1983 - 09-10-2023, 06:27 AM
RE: ముడి - by sri7869 - 08-10-2023, 11:29 PM
RE: ముడి - by Uday - 16-10-2023, 08:05 PM
RE: ముడి - by k3vv3 - 23-10-2023, 04:23 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:04 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:08 PM
RE: ముడి - by TheCaptain1983 - 27-10-2023, 04:53 AM
RE: ముడి - by sri7869 - 24-10-2023, 10:06 PM
RE: ముడి - by Uday - 01-11-2023, 02:36 PM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:35 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:36 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:38 AM
RE: ముడి - by TheCaptain1983 - 19-11-2023, 09:26 PM
RE: ముడి - by sri7869 - 24-11-2023, 10:38 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:14 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:52 AM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:15 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:18 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:55 AM
RE: ముడి - by Uday - 13-12-2023, 02:29 PM
RE: ముడి - by sri7869 - 15-12-2023, 02:01 PM
RE: ముడి - by BR0304 - 21-12-2023, 07:46 PM
RE: ముడి - by BR0304 - 23-12-2023, 04:43 AM
RE: ముడి - by k3vv3 - 23-12-2023, 07:17 PM
RE: ముడి - by BR0304 - 29-12-2023, 04:15 AM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:00 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:01 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:03 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-12-2023, 12:32 AM
RE: ముడి - by sri7869 - 30-12-2023, 02:16 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by sri7869 - 01-01-2024, 09:47 AM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 02:43 PM
RE: ముడి - by k3vv3 - 03-01-2024, 05:56 PM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 10:47 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:29 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:32 PM
RE: ముడి - by TheCaptain1983 - 08-01-2024, 05:04 AM
RE: ముడి - by BR0304 - 07-01-2024, 11:04 PM
RE: ముడి - by sri7869 - 08-01-2024, 08:13 PM
RE: ముడి - by BR0304 - 11-01-2024, 08:15 AM
RE: ముడి - by shoanj - 12-01-2024, 09:36 AM
RE: ముడి - by Uday - 13-01-2024, 02:22 PM
RE: ముడి - by BR0304 - 16-01-2024, 07:52 PM
RE: ముడి - by siva_reddy32 - 17-01-2024, 03:08 AM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:09 PM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:12 PM
RE: ముడి - by TheCaptain1983 - 20-01-2024, 05:52 AM
RE: ముడి - by sri7869 - 19-01-2024, 02:42 PM
RE: ముడి - by BR0304 - 19-01-2024, 04:15 PM
RE: ముడి - by Uday - 22-01-2024, 06:43 PM
RE: ముడి - by k3vv3 - 30-01-2024, 04:33 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:38 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by sri7869 - 31-01-2024, 12:53 PM
RE: ముడి - by Uday - 31-01-2024, 02:53 PM
RE: ముడి - by BR0304 - 31-01-2024, 10:09 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:07 PM
RE: ముడి - by 9652138080 - 05-02-2024, 11:08 AM
RE: ముడి - by Roberto - 06-02-2024, 10:29 AM
RE: ముడి - by e.sai - 13-02-2024, 08:51 AM
RE: ముడి - by TheCaptain1983 - 09-03-2024, 11:11 PM
RE: ముడి - by sri7869 - 04-02-2024, 01:31 PM
RE: ముడి - by BR0304 - 04-02-2024, 07:04 PM
RE: ముడి - by Uday - 05-02-2024, 06:37 PM



Users browsing this thread: 11 Guest(s)