Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
FINAL UPDATE

"స్వీటీ  ..... స్వీటీ ...... "


"హా ...... వస్తున్నాను ...... సంజు ....... వెయిట్ చేయి ...... "

"తొందరగా రా ....... వెళ్ళాలి ....... "

"ఆగు ....... అంత తొందరెందుకు ...... "

"తొందర కాదు ...... బస్సు వచ్చేస్తుందంట ........"

"సరే ....... రెండు నిమిషాలు ...... "

ఐదు నిమిషాల తర్వాత:

"సంజు ....... "

స్వీటీ చీరలో ఉంది. 

"ఏంటి అమ్మ నాన్న వస్తున్నారని చీర కట్టావా ??"

"యా ....... "

"సరే ...... పాద వెళ్దాము ......"

"ఎలా తీసుకొని రావాలి ??"

"ఇద్దరం  వెళదాము ....... అక్కడ క్యాబ్ బుక్ చేస్తాను ....... నువ్వు అమ్మ నాన్న ముగ్గురు క్యాబ్ లో రండి ...... నేను ఒంటరిగా వస్తాను ...... "

"వొద్దు ....... "

"ఎం ??"

"నువ్వు లేకుండా క్యాబ్ లో అంటే నన్ను ఎం అడుగుతారో ....... ఆంటీ అంకుల్ ....... "

"ఎం అడుగుతారు ?? బాగున్నావా బాలేదా అని ...... లైఫ్ ఎలా ఉంది అని ....... "

"ఏమో ...... సంజు ....... ఏవేవో అడగొచ్చు ........  పిల్లల గురించి ...... "

"ఎం కాదు లే ....... పద వెళ్దాము ...... "

స్వీటీ నేను రేపు హనీ మూన్ కి వెళ్తున్నాము ...... అమ్మ నాన్న మాకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వస్తున్నారు. స్వీటీ వాళ్ళ అమ్మ ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళింది అనుకోకుండా, వాళ్ళ నాన్న గారు మాత్రం రేపు మార్నింగ్ వస్తున్నారు బస్సు కి ..... నా చెల్లి మెడిసిన్ కాబట్టి ఎప్పుడు బిజీ..... 

ఇద్దరం అమ్మ నాన్నని రిసీవ్ చేసుకోవటానికి బైక్ లో వెళ్ళాము. అక్కడ ఇద్దరినీ రిసీవ్ చేసుకొని క్యాబ్ బుక్ చేసి మొత్తానికి ఇంటికి వచ్చాము. అమ్మ నాన్న వచ్చేసరికి ఇల్లు కొంచెం హడావిడిగా మారింది. 

ఇంటికి వచ్చాక లంచ్ చేసాము. లంచ్ అయ్యాక నాన్న గారు పడుకున్నారు. స్వీటీ ఏదో బిజీ గా రూమ్ లో సద్దుకుంటుంది. 

"రేయ్ ........ "

"అమ్మ ...... "

"ఏంటి ఎలా ఉంది జీవితం ??"

"బానే ఉంది ...... "

"పిల్ల బానే పనులు చేస్తుందా ...... ?? ని మాట వింటుందా ??"

"హా ....... "

"అవును ..... కార్ ఎప్పుడు కొంటున్నావ్ ??"

"అప్పుడే కాదమ్మా ...... హనీ మూన్ నుంచి వచ్చాక ...... "

"సరే ........ ఇంతకీ పిల్లల గురించి ఏమైనా అనుకున్నారా ??"

"అమ్మ ....... ఇప్పుడా ??"

"ఏదో...... ఆశతో అడిగాను ....... "

"నువ్వలా మొహం పెట్టకు ...... నీకు అలాంటి వార్తుంటే చెప్తాను లే ....... "

"అవును ....... పిల్లకి వంట పెద్దగా రానట్లుంది ........ "

"హా ..... కొత్త కదా నేర్చుకుంటుంది ...... "

"నేను ఆ వయసులో ఉన్నప్పుడు నాకు రాణి వంట లేదు తెలుసా ??"

"అమ్మ ....... తను నా లాగే చదువుకున్న అమ్మాయి ........ మీ కాలంలో అంటే ఇంట్లోనే అందరూ ఆడవాళ్లు ఉండేవారు ...... ఇప్పుడు అలా కాదు ..... బిజీ బిజీ ....... "

"ఏం బిజీ యో కానీ ........ కావాలంటే హనీ మూన్ తర్వాత నన్ను పిలువు ..... రెండు వారాలుండి పిల్లకి అన్ని నేర్పిస్తాను ...... "

"అమ్మ ! అలా ఉండదు ....... రోజు ఆఫీస్ కి వెళ్ళాలి తాను ...... నా లాగే ....... "

"ఏమో రా ...... ఏంటో మీ జీవితాలు ........ "

"అమ్మ ప్లీస్ ..... చాలే ...... ఈ రోజుకి ఈ క్లాస్ చాలు నాకు ........ "

"నా చేతుల్లో మానవుడ్ని పడేస్తే ....... నీతో నాకేం పని లేదు ....... "

"ఆ ?? అంటే ఏంటి నీ ఉద్దేశం ??"

"ఏంటా ?? నువ్వు ఎప్పుడు బిజీ ....... కనీసం మానవుడా మానవరాలో ఉంటె హాయిగా గోరు ముద్దలు తినిపిస్త ...... బాగా ఆడుకుంటా ......  ........"

"మళ్ళి ఏత్తావ ??"

"ఏంటి ??"

"పిల్లల విషయం ...... "

"ఈ వయసుల మాకేం ఆలోచనలుంటాయి చెప్పు ??"

"ఎందుకుండవ్ ?? ముందు చెల్లి గురించి ఆలోచించండి ...... ....... "

"దానికేం బంగారం ....... డాక్టర్ ...... నీ లాగా ఏదో ఆఫీస్ లో కూర్చొని ఎవ్వరికి తెలియని పనులు చేయదు ....... నేను గర్వాంగా అందరికి చెప్పుకుంటాను ...... మా అమ్మాయి డాక్టర్ అని ..... "

"సరే చెప్పుకో ....... అది డాక్టర్ పేరుతో చదివి చదివి ముసలిది అయిపోద్ది............ "

నన్ను కొట్టి "ఏంట్రా ఆ మాటలు ??"

నేను నవ్వి "నిజమే చెప్తున్నాను ....... ఆ వయసులో ...... ఎన్ని వంటలొచ్చు ...... నీకు ....... దానికి ??"

"ఓహో ...... నీ భార్యకి బానే సపోర్ట్ వస్తున్నావ్ రా నువ్వు ........ "

"అమ్మ సపోర్ట్ కాదు ........ ఈ కాలం లైఫ్ గురించి చెప్తున్నాను ........ "

"సర్లే కానీ నీ దగ్గర బీపీ టాబ్లెట్ ఉందా ??"

"బీపీ టాబ్లెట్ నా దగ్గరెందుకుంటుంది ??"

"మీ నాన్న గారు హడావిడిలో మరచిపోయారు ...... "

"సర్లే ఎం పర్లేదు ....... దగ్గర్లో మెడికల్ షాప్ ఉంది ..... తెస్తానులే ....... "


ఆ రోజు రాత్రి:

స్వీటీ నేను మంచంలో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నాం. 

"సంజు ....... "

"ఏంటే ??"

"ఆంటీ కి వంటంటే పిచ్చ ??"

"ఏంటి ??"

"అదే ..... అంటి వంటంటే ఇష్టమా ??"

"లేదు ...... "

"కారులో చాల సేపు వంట అది ఎలా చేస్తారు ఇదెలా చేస్తారు అని చాల సేపు చెప్పారు ...... "

"ఆదా ........మొన్నటిదాకా నా పెళ్లి గురించే మాట్లాడేవాళ్ళు ........ ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి ......  ఇంకేం ఎం మాట్లాడుతుంది ......... అందుకే ........... "

"హా ..... అదేలే ....... hmmmmm ...... "

"ప్రస్తుతం వంటకన్నా మానవుడు మనవరాలి పై ఇంటరెస్ట్ ఉంది ...... వాళ్లకి ..... "

"hmmmmm ....... "

"సర్లే కానీ ....... రేపు హనీ మూన్ ...... అంత బిజీ బిజీ గా...... ఈ టైం కి మేఘాల్లో విహరిస్తూ ....... ఫ్లైట్ జర్నీ లో ఉంటాం ....... "

"హా ........ అవును సంజు ....... "

"ఒక రెండు వారాలు మనల్ని డిస్టర్బ్ చేసేవాలెవ్వరు ఉండరు ...... కంపెనీ కాల్స్ ఉండవు ......... హ్యాపీ గా ఎంజాయ్ చేయొచ్చు ...... "

"hmmmmmm ....... అవును ....... "

"ఇంకేంటి ??"

స్వీటీ నేను కబుర్లు చెప్పుంటు పడుకుండిపోయాము. 

మరుసటి రోజు :

పొద్దునే స్వీటీ వాళ్ళ నాన్నని రిసీవ్ చేసుకోవటానికి బైక్ లో వెళ్లాను. అక్కడ బస్సు దిగగానే రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాను. 

ఇంట్లో స్వీటీని చూసి చాల హ్యాపీ గా ఫీల్ అయ్యారు అంకుల్.  స్వీటీ కూడా చాల హ్యాపీ గా ఫీల్ అయ్యింది.  

అందరం రెడీ అయ్యి టిఫిన్ చేసి ఎయిర్ పోర్ట్ కి రెండు క్యాబ్స్ లో వెళ్ళాము. 

ఫ్లైట్ కి ఇంకా రెండు గంటల టైం ఉంది. ఎయిర్పోర్ట్ లోకి వెళ్లి లాబీ లో కూర్చొని కొంచెం సేపు అందరం చాలా మాట్లాడుకున్నాం. 

"నాన్న ..... మీరెలా వెళ్తారు మరి ??"

"ఏమో రా కనుక్కుంటాం ..... " అన్నాడు నాన్ను. 

"బావ గారు ...... ఎం అక్కర్లేదు....... నేను కూడా బస్సుకె........ నాతో వచ్చేయండి ...... నాకు తెలుసు ఎలా వెళ్ళాలో ...... అక్కడ నుంచి సులువుగా  వెళ్లొచ్చు "

"ఎంత టైం పడుతుంది .......అంకుల్ ??"

"చెప్పాలంటే ...... సాయంత్రం ఉంది బస్సు ...... మళ్ళి రాత్రికే ....... ఇప్పుడు వెళ్తే కానీ అక్కడికి చేరుకోలేం ........ లేదంటే మళ్ళి రాత్రి వరకు ఇంకో బస్సు కోసం ఎదురు చూడాలి ...... "

"అలా అయితే వెళ్దాము ...... మనం ....... "

అమ్మ "సరేరా ....... అయితే ....... హ్యాపీ జర్నీ ....... బాగా వెళ్ళిరండి ........ "

అంకుల్ మా నాన్న కూడా మాకు హ్యాపీ జర్నీ చెప్పి టాటా చెప్పి వెళ్లిపోయారు. 

స్వీటీ నేను బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకొని, లగేజ్ తీసుకొని లోపలికి సెక్యూరిటీ చెక్ కోసం వెళ్ళాము. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక టికెట్ పై ఉన్న గేట్ నెంబర్ దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చున్నాము. అక్కడ ఒక గంట కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపాము. అప్పటికే సాయంత్రం అయ్యింది. 

చిన్నగా ఫ్లైట్ రానే వచ్చింది. బోర్డింగ్ పాస్ తో క్యూ లో నిల్చొని నెమ్మదిగా ఫ్లైట్ ఎక్కి మా సీట్స్ లో కూర్చున్నాం. 

ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి బాగా పెద్దగా ఉంది ఫ్లైట్. చాలా మంది వచ్చి ఎక్కారు. 

"సంజు ....... " అంది

"ఎం కాదులే ...... నా చేయి గట్టిగ పట్టుకో ...... "

"hmmmm ...... "

"ఐన నువ్వు ఫ్లైట్ ఇదే ఎక్కటం ఫస్ట్ టైం అంటే నమ్మలేక పోతున్న ...... "

"నీకంటే ఏదో కంపెనీ మీటింగ్ వాల్ల ఫ్రీ గా వచ్చిందని ఫ్లైట్ ఎక్కావు ...... నాకు అలంటి ఛాన్స్ రాలేదు ...... "

"నేను ఎక్కింది మాములు ఫ్లైట్ ...... ఇంటర్నేషనల్ ఫ్లైట్ నేను కూడా ఎక్కలేదు ...... "

"హా ........ "

నెమ్మదిగా ఫ్లైట్ నిండి, అనౌన్స్మెంట్ ఇచ్చారు. మా సీట్ బెల్ట్ వేసుకొని, ఫోన్స్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నాం. 

ఫ్లైట్ లో కేబిన్ క్రూ ఫ్లైట్ అనౌన్స్మెంట్ లో చెప్పే విషయాలని డెమోగా అందరికి చెప్పారు. 

కొన్ని నిమిషాలలో ఫ్లైట్ కదలటం స్టార్ట్ అయ్యింది. స్వీటీ కళ్ళలో మంచి excitement కనిపించింది. నా చేయి గట్టిగ పట్టుకుంది. 

నెమ్మదిగా ఫ్లైట్ ని రన్ వే పైకి తీసుకొని వెళ్లి అక్కడ వెయిట్ చేసాడు. 

స్వీటీ బయటకు చూస్తుంది. అందరూ ఆతృతగా టేక్ ఆఫ్ కోసం వెయిట్ చేశారు. 

"హె............ ఏంటి ఏదో కొంచెం భయంలో ఉన్నట్లున్నావ్ ...... రిలాక్స్ ....... "

"సంజు .....నీకలాగే ఉంటుంది ....."

"రిలాక్స్ అండ్ ఎంజాయ్.......నా చేయి ఇంకా గట్టిగ పట్టుకో....  "

గట్టిగ పట్టుకున్న చేయిని ఇంకా గట్టిగ పట్టుకుంది 

"ఏంటే అలా పట్టేసుకున్నావ్ ??"

"నువ్వేగా ఇంకా గట్టిగ పట్టుకో మంది ......"

"పట్టుకోమన్న ...... విరిచేయమనలేదు ..... "

ఎవ్వరు చూడకుండా తన కాలితో నా కాలు కొట్టింది. 

నేను లైట్ గా స్వీటీని చూసి నవ్వాను. 

తను కూడా నవ్వింది. 

చిన్నగా ఫ్లైట్ ముందుకి స్టార్ట్ అయ్యింది. టేక్ ఆఫ్ కాబట్టి ఫుల్ స్పీడ్ లో రన్ వే పైన స్టార్ట్ అయ్యింది. స్వీటీ నా చేయి అస్సలు వదలేదు. 

ఫ్లైట్ ఫాస్ట్ గా ముందుకి వెళ్లి నెమ్మదిగా టేక్ ఆఫ్ చేసుకుంది. నెమ్మది నెమ్మదిగా గా పై పై కి వెళ్ళింది. చిన్నగా భూమి మాయమయిపోయి కిటికీలో మేఘాలు కనిపించటం మొదలయ్యాయి. 

స్వీటీకి ఇదే మొదటి ఎక్స్పీరియన్స్ కావటం వల్ల చాల హ్యాపీ గా ఆతృతగా ఉంది. విండో నుంచి ఆశ్చర్యంతో చూస్తూ అలాగే ఉండిపోయింది. టేక్ ఆఫ్ అయ్యి మాములు పోసిషన్ కి వచ్చేవరకు అలాగే బయటకు చూస్తూ గడిపింది. చాల క్యూట్ గా అనిపించింది నాకు. 

నెమ్మదిగా బయట చీకటి పడింది. ఫ్లైట్ లో ఏవో స్నాక్స్ ఇచ్చారు. అవి తింటూ మాట్లాడుకుంటూ టైం గడిచిపోయింది. టీం చిన్నగా రాత్రి 11 అయ్యింది. 

చిన్నగా స్వీటీ నా భుజం పై తల వాల్చి నిద్రలోకి జారుకుంది. 

నాకు మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. 

ఫోన్ తీసి తను నాకు పంపిన వాట్సాప్ మెసేజెస్, మేము దిగిన ఫొటోస్, వీడియోస్ అన్ని చూస్తూ కూర్చున్నాను. 

స్వీటీ నేను రోజు కలిసే ఉన్న సరే, ప్రతి వీకెండ్ బాగా సెక్స్ చేసిన సరే ........ ఇలా హనీ మూన్ తనతో కలిసి వెళ్తుంటే ఏదో కొత్తగా అనిపించింది. ఏదో తెలియని ఒక బలమైన మాటలలో చెప్పలేని ఫీలింగ్. 

తనతో ఎంత టైం స్పెండ్ చేసిన ........... తన గురించి నాకు ఒకటే ఆలోచనలు ....... తనతో ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చిలిపి పనులు చేసిన, ఎంత సెక్స్ చేసిన సరే, తన చేయి పట్టుకొని  తనతో కబుర్లు చెప్పాలని, తనని గట్టిగ కౌగిలించుకోవాలి, తనకి ముద్దులు పెట్టాలని, తనని నవ్వించాలని, తనతో అలిసిపోయేవరకు సెక్స్ చేయాలని, తనతో బాగా చిలిపి పనులు చేయాలని...... ఇలా ఒకటే ఆలోచనలు నాలో. 

అలా మా ఇద్దరి తీయటి జ్ఞాపకాలని చూస్తూ నాలో నేను నవ్వుకుంటూ ....... ఉండిపోయాను. 

లవ్ అంటే ఇదే ఏమో....... అనిపించింది. 

-------------------------------------------------------

అదండీ ....... మొత్తానికి పెళ్లి చూపులతో స్టార్ట్ అయినా మా లవ్ స్టోరీ  ....... తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చింది..... 

ఒక అరేంజ్డ్ మ్యారేజ్ ప్రపోసల్ తో స్టార్ట్ అయిన మా పరిచయం....  ఒక అందమైన అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ గా మారింది. 

సైనింగ్ ఆఫ్ 
సంజయ్

-------------------------------------------------------
THE END
-------------------------------------------------------


మీ అందరి రివ్యూస్ అండ్ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ 

మీ 
పాస్ట్ ఇస్ ప్రెసెంట్ 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 4 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 08-06-2019, 09:52 PM



Users browsing this thread: 7 Guest(s)