Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అర్ధరాత్రి ఆక్రందన
#3
మరుసటి ఉదయం శ్రీకాంత్ అన్నయ్య కు పోన్ చేసి ఊరు వస్తున్నామని నాతో పాటు భాషా,తేజ ఊరు చూద్దాం అంటే ముగ్గురం వస్తున్నాం అని చెప్పి బయలు దేరారు,బస్సు దిగి ముగ్గురు రవ్వల గూడెం కి ఆటోలో బయలు దేరారు.ఆటో ఊరి మధ్య దాకానే వస్తుంది కాబట్టి దిగి నడవసాగారు,కొద్ది దూరం నడవగానే పెద్ద గుంపు కనిపించగా అక్కడికి వెళ్లి చూడగా ఒక మహిళ వింతగా మాట్లాడుతూ పిచ్చి,పిచ్చిగా ప్రవర్తిస్తుంది,ఏమంది అని అడగ్గా,ఊరి చివర గంగారాం కోడలు ఈమె ను ఆవహించిదని ,పొద్దుపోయి పొలాన్ని నుండి ఆ ఇంటి మీదుగా వచ్చిందని అందుకే ఇలా జరిగింది అనగా గంగారాం ఇళ్లు ఎక్కడరా రవి అని భాషా అడగ్గా మనం ఇప్పుడు వెళ్ళే ఇళ్లు అనగా ఆశ్చర్యం గా చూస్తున్న తేజ తో ఈ గ్రామంలో ఇవన్నీ మాములే,ఆమె ను ఇప్పుడు ఒక భూత వైద్యుడు దగ్గరకి తీసుకెళ్ళి బాగు నయం చేయిస్తారని చెప్తున్న రవి సమాదానం ఇలాంటివి ఇంకా ఉన్నాయా?అనుకుంటూ ఆలోచిస్తూ నడుస్తున్నారు మిత్రులు. ముగ్గురు ఇంటికి చేరుకున్నారు,ఒకే ఊరు కావటం తో అందరు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు,రాత్రి 9 తర్వాత శ్రీకాంత్,రమేష్ లు ఆఫీసు కి వెళ్లారు,భాషాకు తేజ కు జరిగినది పూర్తి గా చెప్పటం వలన వారు అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా అని చూడసాగారు,పిట్ట గోడ పైనే కూర్చుని ముగ్గురు ఉన్నాం కదా ఈ రోజు నిజంగా ఆ ఆత్మ వస్తుందా? అని అనుకొంటుండగా సమయం రాత్రి 11 గంటలు అయ్యింది, హఠాత్తుగా భాషా అరేయి కింద ఇంటి తాళాలు తీసి చూద్దామా?అన్న ప్రశ్నకు రవి ఉలిక్కి పడ్డాడు,వద్దులే ఓనర్ సామానులు ఉన్నాయట కదా అన్నయ్య వాళ్లకు మాట వస్తుంది అనగా ,సామానులు కాదు పాడు కాదు ,గంగారాం భయపడి అలా చెప్పాడు,అతనూ పిసినారి నువ్వేచెప్పావు కదా ఏ సామాను ఉంచి ఉండడు,తాళాలు పగలగొట్టి చూద్దాం ఎవరికి తెలియకుండా అన్నయ్య లు వచ్చేసరికి మరలా తాళాలు అలాగే పెడదాం అనగా కింద ఇంటికి కరెంట్ కూడా లేదు అని రవి అనగా మన సెల్ వెలుగు చాలు అని తేజ పలికాడు. సమయం రాత్రి 11.30 ముగ్గురు మెట్లు దిగి ఒక రాయి తీసుకుని కింద ఇంటి మెదటి ద్వారం వద్ద వేసిన తాళం వద్దకు వచ్చారు,బాగా గట్టి తాళం అది ఒక రాయి తో పగలకొట్టాలని చూడగా అది రాలేదు. భాషా తాళం రాయితో పగలకొడుతూనే అరేయి పైన సుత్తి లాంటి ది ఏమన్నా ఉందేమో చూడండి అనగా రవి,తేజ పైకి వెళ్లారు,వారు పైకి వెళ్లి సుత్తి కోసం వెతుకుతున్నారు,ఇంతలో కింద నుంచి అతి భయంకరమైన కేక వినిపించింది ,అది భాషా దే అని గ్రహించి పరిగెత్తుకుంటూ వచ్చి మెట్లు దగ్గరకు వచ్చారు, రవి,తేజలు మెట్ల పై నుండి చూస్తున్న వారికి ప్రాణం పోయినంత పని అయింది అక్కడే నిల్చుని కదలకుండా బిగుసుకుపోయారు, PART-5తాళం తీద్దామని ప్రయతిస్తున్న భాషా కు గేట్ చప్పుడు విని వెనుక్కి తిరిగి చూసాడు,గేట్ ఎదురు గా తెల్లని ఆకారం చూసి కెవ్వున కేక పెట్టాడు,ఆ కేక విని పై నుండి పరిగెత్తు కుని వచ్చిన రవి మరియుతేజ లు పై న మెట్ల పై అక్కడే నిల్చుని భయంతో చూస్తున్నారు,ఆ ఆకారం చీకట్లో నుండి భాషా ను తీక్షణం గా చూస్తూ నెమ్మది గా కొండల వైపు నడవసాగింది,తేరుకున్న రవి,తేజ లు దిగి వచ్చి భాషా దగ్గర కు రాగా అతను అదే భయంలో ఉన్నాడు,పైకి వెళ్లి రవి మంచి నీరు తెచ్చి ఇచ్చాక కాస్త తేరుకుని భాషా అంత దగ్గర నుండి ఆత్మ ని చూసే సరికి తనకుగుండె ఆగినంత పని అయ్యిందని అంటూ ఆ ఆకారం ఎటు పోయింది చూద్దాం అన్నాడు,దానికి తేజ నిన్ను ప్రాణాలతో వదిలింది సంతోషించు ఎక్కడికి వెళ్లేది ఊరుకో అనగా, దానికి భాషా మనం వచ్చిందే అసలు ఆ ఆత్మ ఏంటో తేల్చుకోవటానికి నా భయం పక్కన పెట్టండి ముగ్గురు ఉన్నాం పైకి వెళ్ళి టార్చిలైట్ ఒకటి తీసుకురా రవి చూద్దాం అనగా రవి కూడా ముగ్గురుఉన్నాం కదా తేజ ప్రయత్నిద్దాం ఏది అయితే అది అవుతుంది,అంటూ పైకి వెళ్లి టార్చ్తెచ్చి గేట్ తాళం తీసి ముగ్గురు కొండవైపు నడవసాగారు,రవి చేతిలో టార్చ్,తేజ,భాషా లు తమ సెల్ టార్చి వెలుతురులోనడవసాగారు,అరేయి మనం ఆ ఇంటి తాళం తీద్దామని అనుకోగానే మనల్ని భయపెట్టింది,ఊర్లో వారు చెప్పినట్లు గంగారాం కోడలికి ఈ ఇళ్లు అంటే ప్రాణం అనుకుంటా కదా అని తేజ అనగా ,ఆత్మ అయితేమనల్ని ఎందుకు వదిలివేసింది? అని భాషా సందేహం వ్యక్తంచేయగా, మనమేమి ఆమె కు హాని చెయ్యలేదు కాబట్టి మనల్ని వదలి వేసి ఉండవచ్చు,తన ఇంటి తాళం తీస్తున్నామని కేవలం భయపెట్టి వదిలింది ఈ సారి ప్రయత్నిస్తే మ న కు హాని చెయ్యవచ్చు అని తేజ బదులిచ్చాడు, ఇలా మాట్లాడుతూ నడుస్తున్నారు ఒకేదారి వేరే ఏదారి లేదు ఖచ్చితంగా ఇక్కడే ఇక్కడో వుండవచ్చు అని రవి అంటుండగా కొద్ది దూరం నుండి ఒక స్త్రీ ఏడుపు వినిపించసాగింది,ముగ్గురు ఆ శబ్దం విని ఉలిక్కిపడి మాట్లాడకుండా నడుస్తున్నారు,ఏడుపు శబ్దం బాగా వినిపిస్తుంది,తాము ఏ సాహాసం చేస్తున్నారో ముగ్గురు మిత్రులకు తెలుసు కాని ఎక్కడో ఏదో దైర్యం వారిని ముందుకు నడిపిస్తుంది.
 కొంత దూరం రాగానే ఏడుపు శబ్దం ఆగిపోయింది,ఖచ్చితంగా ఇక్కడే ఉండొచ్చు అని టార్చ్,సెల్ వెలుగు తో చుట్టు చూడసాగారు,ఏమి కనపడటంలేదు,అన్ని పొలాలు,గుబురు చెట్లు నెమ్మది గా నడుస్తూగంగారాం కోడలు దూకి ఆత్మహత్య చేసుకున్న కాలువ దగ్గరకు చేరారు,అక్కడ నుండి ముందుకు దారి లేదు,కాలవ ప్రవాహాం తగ్గలేదు,రవి ఇద్దరు మిత్రులతో ఈ కాలువ లోనే ఆమె ఆత్మహత్య చేసుకుందిఅని చెప్తుండగా,అది వింటూనే తేజ వారికి కాలువ అవతలి వైపు చేయి పెట్టి చూపించాడు,ముగ్గురికి గుండె జారిపోయి రోమాలు నిక్కబొడుచుకున్నాయి భయంతో,కారణం ఆ కాలువ అవతల తెల్లని ఆకారంనడుస్తూ అటు వైపు లోపలికి వెల్తుంది,ఖచ్చితంగా ఇది ఆత్మనే వెనుక్కి తిరగండి అంటూ రవి మిత్రులిద్దరిని హెచ్చరిస్తూ వడివడిగా వెనుక్కి పరుగు అందుకున్నారు,సగం దూరం వచ్చాక ఆగి ఆ కాలువమొన్న కురిసిన వాన కు బాగా ఉదృతంగా ప్రవహిస్తుంది,అటు వైపు పొలాలు ఉన్న వారు కూడా అవి తగ్గేదాకా వెళ్లలేరట అలాంటిది మనకు అటువైపు ఆ తెల్లని ఆకారం కనిపించింది అంటే ఖచ్చితంగా అదిగంగారాం కోడలి ఆత్మనే ఇక ఆలోచించటం అనవసరం త్వరగా పదండి అంటూ మిత్రులను హెచ్చరించాడు,ముగ్గురు చాలా వేగంగా నడుస్తున్నారు, ఇంతలో వారికి ఒక వింత శబ్దం వినపడగా ఒక్కసారిగా ఆగారు,ఏంటా శబ్దం?అని పరిశీలించసాగారు,పొలాల్లో నుండి అతి భయంకరంగా వస్తుంది,మన కన్నా ఆ ఆకారం మనం వెళ్లే దారిలో కి వచ్చిమనల్ని భయపెడుతుంది,పరుగెత్తండి అని తేజ హెచ్చరించగా ముగ్గురు పరుగు తీయటం మెదలు పెట్టి మరలా వారి రూం దగ్గర దాకా ఆపలేదు,ముగ్గురు ఇంటి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ముఖ,ముఖాలుచూసుకున్నారు,కారణం గేట్ పూర్తి గా తెరిచి ఉంది,ఎవరు తీసి ఉంటారు అని అనుమానంగా లోపలికి వెళ్లి లోపల గేట్ తాళం వేసారు,మెట్లు ఎక్కి పైకి ఎక్కి రూంలో కి వెళ్లారు,
సమయం దాదాపు రాత్రి 1.30కావస్తుంది,రవి చెప్పేది నిజమేనని మిత్రులు కి అర్ధమయింది,తాము నివశించేది ఒక మండల స్తాయి కావటం అక్కడ జన సంఖ్య,మరియు ఇళ్లు పక్క,పక్కనే ఉండటం వీధి నిండా రాత్రి మున్సిపల్ లైట్లు వెలిగే ఉండటం వలన వారికి ఎప్పుడు ఇలాంటి అనుభవాలు లేవు,సినిమాల్లో,కధల్లో లాగా ఇక్కడ జరిగిన సంఘటనలు వారిని కలవర పెడుతున్నాయి,ముగ్గురు మౌనంగా ఆలోచిస్తు ఉన్నారు, ఇంతలో తేజ నువ్వు చెప్పింది నిజమే రవి ఖచ్చితంగా ఈ ఇంటి లో ఆత్మ ఉంది,రేపు ఈ విషయం అన్నయ్య లకు చెప్పి మనం ఇక్కడ నుండి వెళ్లిపోవటం తో పాటు అన్నయ్య లను ఈ ఇళ్లు మారమని చెప్పాలి అనగా భాషా కల్పించుకుని వద్దు అన్నయ్య లకు చెప్పవద్దు రేపు ఒక్క రోజు ఆగండి ఇంకోసారి ప్రయత్నిద్దాం రవి అనగా,ప్రాణాలు పోయాక ఇక ఏం ఆలోచిస్తావు అన్నాడు తేజ,దానికి రవి భాషా నువ్వు చెప్పినట్లు రేపు ఒక్కరోజు చూద్దాం అని అంటూ మాట్ల్లాడుతూ సమయం చూసాడు రాత్రి 2.30 కావస్తుంది,ఇక పడుకొదాం అనగా ఈ టెన్షన్ తో నిద్ర రాదు గాని ఒక పని చేద్దాం రేపు ఉదయం ఆ ఇంటి తలుపులు తీద్దాము అని భాషా అంటుండగా కింద నుండి పెద్ద గా గేట్ కొడుతున్నట్లు శబ్దం అది విని ఒక్క క్షణం ఆగి రవి తలుపు తీయబోగా తేజ అడ్డుకుని చూసారా ఇంతకు ముందు ఆ ఇంటి తాళం తీద్దామన గానే గేట్ వద్ద ఆత్మ ప్రత్యక్షం అయ్యింది,మరలా ఇప్పుడు ఆ టాపిక్ తెచ్చామో లేదో వెంటేనే గేట్ శబ్దం నా మాట విని తలుపు తియ్యద్దు అని బతిమాలగా ఆ ప్రయత్నం విరమించుకుని రవి ఆలోచనలో పడ్డాడు ఏంటి భలే ఆశ్చర్యంగా ఉన్నాయి ఈ వరుస సంఘటనలు,ఆ ఆకారం కాలువ అవతల కనిపించింది అంటే ఖచ్చితంగా ఆత్మనేనా?తిరిగి వచ్చే దారిలో వింతశబ్దాలు,ఇప్పుడు ఆ ఇంటి గురించి ఎత్తగానే మరలా గేట్ శబ్దం అనుకుంటుండగా,రేపు పగలు అన్నయ్యలు ఇంటిలో ఉంటారు కాబట్టి ఆ ఇంటి తాళాలు తీయలేం ఎలాగయినా రేపు రాత్రి కి ఆ తాళాలు పగలకొడదాం అని అంటుండగా తేజ భాషా నోరు గట్టి గా మూసి దయచేసి ఆ విషయం ఇప్పుడు మాట్లాడకండి అంటుండగానే ఇంతకు ముందు కన్నా ఎక్కువ శబ్దం వినిపించసాగింది 2 నిమిషాలు అందరు మౌనంగా ఉండి ఒక్కసారి చూద్దాం ఒక వేళ కింద నిజంగా మరలా ఆ ఆకారం కనిపిస్తుందేమో పై నుండే చూద్దాం అని భాషా అనగా రవి సరే అన్నాడు,తేజ బతిమాలినా వినక నువ్వు గది లోనే ఉండు అంటూ గది తలుపులు తీసి పిట్ట గోడ దగ్గరికి చేరుకున్నారు,ఆశ్చర్యం అప్పటి దాకా శబ్దం అయిన గేట్ దగ్గర ఎవరు కనబడటం లేదు,ఒక వేళ కింద ఇంటిలోకి వెళ్లి వుంటుందా?అని భాషా అనగా కింద గేట్ కి తాళం వేసాను అని సమాధానం ఇచ్చిన రవి తో నిజంగా ఆత్మ అయితే దానికి తాళం ఒక లెక్కా?ప్రవహించే కాలువనే దాటలేనిది తాళం ఒక లెక్కా దానికి అని సందేహం గా పలికాడు భాషా,సరేలే అంటూ ఇద్దరు లోపలికి వెళ్లారు ఏమన్నా కనిపించిందా అని ప్రశ్నించి న తేజ కు లేదు అని సమాధాన మిచ్చి మంచంపై కూర్చుని ఆలోచించసాగిరి,అంతలో ఒక పెద్దగా ఒక స్రీ పొలికేక పెట్టినట్లు శబ్దం పైకి వినిపించింది,ముగ్గురు కి ఒక్కసారిగా గుండె ఆగినట్లు అయ్యింది,కింద పెట్టిన అరుపు పై దాకా వినిపించింది అంటే ఇంత భయంకర అరుపు విన్న వారు ఏమి చెయ్యాలో అర్ధంకాక భయపడుతూ బిగుసుకుపోయారు.
PART-5 కొంచెం సేపటికి తేరుకున్న మిత్రులు కింద కెళ్ళి చూద్దాం పదండి అని రవి అంగా తేజ వద్దులేరా అనగా ఏమి కాదు దాదాపు 3 గం;లు కావస్తుంది,పర్వాలేదు పదండి అనగా భాషా సరే అని తలుపులు తీసి పిట్టగోడ దగ్గరకు వచ్చి కిందకు చూడసాగారు,ఎవరు లేరు అంతలో భాషా భయంతో వేలు చూపించిన వైపు చూడగా దూరంగా తెల్లటి ఆకారం గ్రామం వైపు పోతున్నట్లు కనిపిస్తుంది, ఒక్క సారి కంగారు పడ్డా రవి ఆ ఆకారాన్ని వెంబడిద్దాం పదండి అనగా మిత్రులు సరే అని మెట్లు దిగి ఆ ఆకారాన్ని వెంబడించ సాగారు వారికి చాలా దూరంలో ఉండటం వలన అ ఆకారం ఇప్పుడు కనిపించటం లేదు,నెమ్మదిగా దారిలో చెట్ల వైపు చూస్తు నడవసాగిరి,కొద్ది దూరంలో కుక్కలు భయకరంగా అరవసాగాయి,ఒక్క నిమిషం ఆగారు,ఖచ్చితంగా ఆకుక్కలు అరిచే ప్రదేశంలో ఉండొచ్చు అయినా ఆ ఆత్మఊరి వైపు ఎందుకు వెల్తుంది అని అనుకుంటూ నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉన్నారు,కుక్కలు అరుపులు ఆగి పోయాయి, రవి హఠాత్తుగా ఆగండి అని అరిచాడు,నడిచే భాషా,తేజ లు ఒక్కసారి ఆగారు అక్కడకుకొద్ది దూరంలో ఉన్న ఒక ఇంటి తలుపులు కొట్ట సాగాడు,తలుపులు తెరుచుకున్నాయి,ఎవరు మీరు అని ఒక స్త్రీ బయటకు రాగా సుఖ్ రాం తాత ఉన్నాడా అని రవి అడగ్గా ఇంట్లో నిద్ర పోతున్నారు అని ఏదన్నా ఉంటే రేపు రండి,ఇంత రాత్రి వేళ ఏంటి అని తలుపులు మూస్తున్న ఆ స్రీతో రవి వచ్చాను అని చెప్పండి అనగా ఎవరైనా రేపు రండి అంటు విసుక్కుంటూ ఆమె వారి ముఖాల పైనేతలుపులు వేసిందిముగ్గురు వెనుక్కి తిరిగి నువ్వు రవి నువ్వు చెప్పిన తాత వాళ్ల ఇళ్లు ఇదేనా అనగా అవును అని సమాధానం ఇచ్చి ముందుకు నడవసాగాడు,వారి ముగ్గురిని అక్కడ కి దగ్గర్లో నుండి రెండు కళ్లు తీక్షణంగాపరిశీలించసాగాయి, పరిశీలించసాగాయి.
ముగ్గురు నడుస్తూ ఇంటికి చేరుకున్నారు,సమయం దాదాపు రాత్రి 3.30 గంటలు కావస్తుంది,ముగ్గురు నడుస్తు ఉన్నారు వారికి ఎదురుగా కొచెం దూరంలో రెండు ఆకారాలు ఎదురు వస్తున్నట్టుఅనిపించి ఒక్క క్షణం ఆగారు,వీరిని చూడగానే ఆ ఆకారాలు చెట్ల మధ్యలోకి వెళ్లాయి,నెమ్మదిగా నడుస్తూ సెల్ వెలుగు లో చూస్తు ఉన్నారు,ఏమి కనబడలేదు,అంతలో తేజ ఈ ఊరు అంతా దారుణం గా ఉందిఅనగా ఏం కాదు ఇది మామూలు గ్రామమే రేపటితో మన కు ఆ ఆత్మ సంగతి తేలుతుంది అని రవి అనగా ఎలా అని భాషా అనగా చెప్తా పదండి అంటూ ఇంటికి నడిచారు, ఇంటికి చేరుకున్న వారికి గేట్ తెరిచి ఉండటం చూసి మరలా ఆశ్చర్యపోయారు,వెళ్లెటప్పుడు తాళం గేట్ వేసాం కదా అని భాషా అడగ్గారవి అవును అంటూ సమాధాన మిచ్చి లోపలికి నడిచాడు,కింద ఇంటి తలుపులు దగ్గర కి వెళ్లి ఒక్క సారి చూసి భాషా,తేజ మీరు ఇక్కడే ఉండండి అంటూ పైకి వెళ్లి సుత్తి తీసుకు వచ్చాడు,తేజ కు గుండెల్లో వణుకు మొదలైంది రవి ప్రయత్నం చూసి ఆ ఇంటి తాళం పగలకొడుతున్నాడు రవి,తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి,చాలా కాలంగా ఖాళీ కావటం చేత కరెంట్ కూడా లేదు ,టార్చి లైట్,సెల్ వెలుగు తో ముందుకు వెళ్తున్న భాషా,రవి ని వద్దురా అని తేజ హెచ్చరిస్తున్న వినక నోరు మూసుకుని రమ్మని గద్దించారు,చేసేది లేక నెమ్మదిగా వారిని అనుసరిస్తున్నాడు తేజ ,లోపల ఇళ్లు చాలా ఆధునాతనంగా సిటీ లో లాగా నే బాగానే ఉంది,సామాను ఏమి లేవుచాలా కాలం నుండి తలుపులు తీయక పోవటం వలన బూజు భయకరంగా ఉంది,నెమ్మదిగా శబ్దాలు వినిపించే వంట గది తలుపులు తీసారు,అతి భయంకరంగా ఉంది ఆ వాతావరణం, వెంటేనే పెద్ద శబ్దం వినిపించింది,ఎలుకలు అటు ,ఇటు పరిగెత్తుతున్నాయి,చుట్టు చూసారు,ఏమి కనిపించలేదు,నెమ్మదిగా ఇళ్లు అన్ని గదులు పరిశీలించసాగారు, ఏని కనిపించటం లేదు,బయటకు వచ్చి తలుపుకి తాళం అలా పెట్టారు,రేపు ఇలాంటి తాళమే తెచ్చి వేద్దాము,అన్నయ్యలు ఎలాగు అంత పరీక్ష గా ఈ తాళం చూడరు అంటూ రవి అన్నాడు,ముగ్గురు మెట్లు ఎక్కి పైకివెళ్ళారు,సమయం దాదాపు తెల్లవారు జాము 4.30 అవుతుంది,ముగ్గురు పడుకున్నారు,ఉదయం 7 గంటలకు అన్నయ్య లు వచ్చారు,ముగ్గురు మిత్రులు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. ముగ్గురు మిత్రులు రాత్రి ఆగిన సుఖ్ రాం ఇంటి కి వెళ్లారు,రంగా అని పిలవగా మరలా రాత్రి బయటకు వచ్చిన స్త్రీ బయటకు వచ్చి ఇంకా నిద్రలేవలేదు అనగా అదేమిటి సమయం దాదాపు 8 కావస్తుంది, అత్యవసరపని ఉంది కొంచెం నిద్ర లేపండి అని రవి అడుగుతుండగా ఎవరు అంటూ సుఖ్ రాం బయటకు వచ్చాడు,తాతా నేను రవి ని అనగా రా బిడ్డా ఏంటి ఇలా వచ్చావు అని లోపలికి పిలిచాడురాత్రి ఆ ఆకారం మరలా కనిపిస్తే వెంటాడుతూ వచ్చాం దాదాపు ఈ పరిసరాల్లో మాయమయింది,కంగారుగా వచ్చి రాత్రి మిమ్మల్ని పిలిస్తే నిద్రలో ఉన్నారు అనగా వెనక్కి వెళ్లాం అనగాపొలం నుండి అలసి పోయి వచ్చి పడుకున్నాం కదా అందుకే మా ఇంటావిడ అలా చెప్పింది అయినా మీరు ఆ ఇంట్లో ఉండటం క్షేమం కాదు,మీ అన్నయ్య లకు చెప్పి అలాగే ఇంటి యజమానికి ఇలా మీ ఇంట్లో జరుగుతుందనిచెప్పి,ఇళ్లు వదలి వెళ్లండి అని చెప్పాడు,అంతలో రంగా అక్కడికి వచ్చి అవును రవి ఆ ఇంట్లో ఉండి అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు,మా మాట విని ఆ ఇళ్లు ఖాళీ చేయండి అనగా సరెలే అన్నయ్య లుకు ఈ విషయం చెప్తాం అయినా ముగ్గురు ఉన్నాం కదా రెండ్రోజులు చూద్దాం అవే సంఘటనలు జరిగితే మీరు చెప్పినట్లే చేస్తాం అని పలికి మా కు ఏదయినా భయం కల్గితే మీ సహాయం కోరతాం అని పలికిసెలవు తీసుకున్నారు ,రవి మిత్ర బృందం.
ఆ రోజు రాత్రి సమయం 11 గం;లు కింద గేట్ భయంకరంగా శబ్దం అవుతుంది,బయటకు వచ్చి చూసాడు తేజ అదే తెల్లని ఆకారం ,జుట్టు విరబోసుకుని వుంది,భయపడి లోపలికి వెళ్లాడు,మరలా బయటకు వచ్చి టార్చ్ లైట్ వేసాడు,నెమ్మది గా ఆకారం కొండ వైపు నడవసాగింది,అలా నడుస్తునే ఉంది,హఠాత్తుగా కొద్ది దూరంలో ఆ ఆకారం ఎదురుగా ఇద్దరు యువకులు దారికి అడ్దగించారు,ఒక్క సారి గా వెనుక్కిపోదామని ప్రయత్నం చేస్తున్న ఆ ఆ ఆకారాన్ని ఆ యువకులు ఇద్దరు చేతులు పట్టుకున్నారు,వదలండి,వదలండి అనగా పద మర్యాదగా అంటూ ఆమెను నడిపించసాగారు. ఆ యువకులు ఎవరో కాదు భాషా,రవిలు.ఆ ఆకారం ని నడిపించుకుంటూ రవి గది కి తీసుకు వెళ్లారు,గది వెలుతురులో ఆమెనుచూడగా 45సం;ల పై బడి వయస్సు ఉన్న స్ర్తీ ఆమె, జుట్టు విరబోసుకునిచూడ్డానికి భయంకరంగా ఉంది,రవి ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని బెదిరించగా,నాకు తెలియదు అని బుకాయిస్తుంది,మర్యాదగా చెప్పు లేదా రేపు సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పచెపుతాం అనగా దయచేసిఅలా చేయకండి, నిజం చెప్తాను,నన్ను ఇలా ఈ ఇంటి దగ్గర ఇలా చేయమని సుఖ్ రాం మరియు అతని కుమారుడు రంగా చెప్పారు,నాకు ఇలా చేసినందుకు కొంత డబ్బు ఇస్తుంటారు అని తెలిపింది, తాను ఒంటరి స్ర్తీ ని అని సుఖ్ రాం పొలంలో పని చేస్తు వారి ఇంటి వద్ద నే ఎదురు గా ఉన్న ఇంట్లో ఉంటుంటానని తెలిపింది,మధ్యలో ఆమె వద్ద ఉన్న సెల్ కి పోన్ వచ్చించి అది సైలెంట్ లో ఉన్న వైబ్రేషన్శబ్దం విని రవి ఆ పోన్ తీసుకుని చూసాడు, రంగా పోన్ చేస్తున్నాడు,రవి దానిని లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంచాడు,ఆమెను తెల్లవారే దాకా గది లోనే ఉంచారు,అంతలో అన్నయ్య లు వచ్చి ఆ స్ర్తీ ని చూసి ఆమె రూపం చూసి అడగ్గా గత నాలుగు రోజులుగా జరుగుతున్న విషయాలు చెప్పగా వారు ఆశ్చర్యపోయారు,ఆమె ను నడిపించుకుంటూ సుఖ్ రాం ఇంటికి వెళ్ళారు,వీరందరి ఆమెని చూసి కంగారు పడ్డారు తండ్రి,కొడుకులు రవి,భాషా,తేజ,శ్రీకాంత్,రమేష్ లు ను గట్టి గా నిలదీయగా గంగారం తనకు దగ్గర బంధువని,అతని కోడలు ఆత్మహత్య చేసుకోగా అది ఆసరా చేసుకుని మా వద్దపని చేసే స్ర్తీని ఆ ఇంటి దగ్గర ఇలా తెల్ల చీరె తో గేట్ శబ్దం చేయించి వారిని భయపెట్టి ఇళ్లు వదలి పట్టణం వెళ్లేలా చేసానని,బాగా ఖరీదు ఉన్న ఆ ఇంటిని తాను తక్కువ రేట్ కి కొందామని అడగ్గా గంగారాం నిరాకరించగా ఇలా దుర్బిద్ది తో ఇలా ఉపాయం పన్నామని ,ఇంతలో ఆ ఇంటిలో మీరిద్దరు దిగటంవలన గంగారాం కి కొంత ధైర్యం వచ్చి,తన ఇళ్లు బేరానికి పెట్టగా వచ్చే వారు రాకుండా రాత్రి వేళలో ఇలా ఈ మె తోరాత్రి వేళలో మీరు ఉండరు కాబట్టి అప్పుడప్పుడు ఆ ప్రాంతం లో నడిచే వారిని ఇలా భయపెట్టామని ,ఎప్పుడు రాత్రి వేళలో పై ఇంటి లైట్లు వెలగని ఆ ఇంట్లో రవి వచ్చినప్పుదు వెలగటం చూసి మరింత భయపెట్టాలని ఈ నాలుగు రోజులు వరుసగా భయపెడితే మీరు ఖాళీ చేస్తేఅప్పుడు గంగారాం నాకు గత్యంతరం లేక తక్కువ రేటు కి ఇళ్లు అమ్ముతాడని ఇలా చేసాం , ఈమె కి రక్షణ గా మీము దూరంలో ఉండే వాళ్లమని ఎవరన్నా వస్తే పోన్ ద్వారా విషయం అందించేవారమని తెలిపారు,ఇలా చెప్తుండగా ఆ చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకుని ఇన్నాళ్లు ఇలా చేసిన సుఖ్ రాం ని రంగా ని ఆ స్ర్తీ ని నిందించసాగారు,అంతకు ముందు రవి చూసిన గంగారాం ఆత్మ పట్తిన ఒక స్రీని పిలిపించమనగా ఆ మె ను అక్కడికితెచ్చారు,రవి బృందం నిజంగా నీకు ఆమె ఆవహించిందా అని బెదిరించగా లేదు మా ఆయన రోజు నన్ను తాగి వచ్చి కొడుతున్నాదు,ఇలా ఆత్మ పట్టిందానిలా నటిస్తుంటే నన్ను చూసి భయపడుతున్నాడు,అందుకేఅవసరం వచ్చినప్పుడల్లా ఇలా చేస్తున్నానని తెలపగా అక్కడే ఉన్న ఆమె భర్త సిగ్గు పడి ఇక నేను తాగను అని అందరి ముందు పలికి తన భార్య కు క్షమాపణ తెలిపాడు.
ఇదంతా చూసున్న భూతవైద్యుడు తనకు ఏ మహిమలు లేవని నిరక్షరాస్యుల నమ్మకంతో ఏమో పూజలు చేస్తానని బతుకుతున్నాను,అసలు ఆత్మలు,భూతాలు అబద్ద మని పలికాడు,అందరు ఇన్నాళ్లు ఆ ఊరి ని కలవర పెట్టినఆత్మ రహస్యం బయట పెట్టినందుకు రవి బృందాన్ని అభినందించారు,సుఖ్ రాం ను గట్టి గా మందలించి బుద్ది గా ఉండమని హెచ్చరించి ఎవరి దారిన వారు వెళ్ళి పోయారు. దార్లో వెళ్తూ రవి ని మిత్రులు సుఖ్ రాం పై ఎలా అనుమానం వచ్చిందని అడగ్గా నేను రాత్రి వేళ మొదటి రోజు ఆ ఆకారాన్ని వెంబడిస్తున్నప్పుడు అతడు,అతని కొడుకు పొలం లో ఆ సమయంలో ఉండటం, మనం ముగ్గురం రాత్రి వేళ వారి ఇంటికి వెళ్లినప్పుడు వారు భయటకు రాకపోవటం,కారణం ఆ రాత్రి వారు ఇంటి లో లేరు,మనం తిరిగి వెళ్లెటప్పుడు ఎదురయిన రెండు ఆకారాలు వారివే అని గ్రహించానుఆ ఆకారం రోజు కొండ వైపె వెల్తుంది అది ఒకే దారి అక్కడ కాపు కాస్తే అసలు విషయం బయట పడుద్ది కాబట్టి తేజ ను ఒక్కన్నే ఇంట్లో ఉంచి భాషా,నేను ఆ పొదల్లో ఉండి పట్టు కున్నాము. మొన్న మనం వెనుక వెళ్లినప్పుడు అక్కడే ఉన్న సుఖ్ రాం,రంగా లు ఆమె ను పొదల్లో దాచేస్తున్నారు,ఈ ప్రాంతం వారి కి బాగా తెలుసు కాబట్టి మనం ఆమెను ఎక్కడ దాచేది కనుక్కోలేము ,అలాగే నేనురెండు సార్లు చూసిన గ్రామంలో కి వెళ్లె ఆకారం సుఖ్ రాం ఇంటి వద్దే మాయం అయ్యింది,అందులో నన్ను పదే పదే ఈ ఇంటి విషయం అన్నయ్య లకు యజమాని గంగారాం కి చెప్పివెళ్లిపొండి అంటూ అనేక సార్లు వాళ్లు చెప్పటం కూడా నాకు అనుమానం పెంచింది,అందుకే ఇలా పట్తుకున్నాం అనగా అందరు రవి సమయ సూర్తి కి మెచ్చుకున్నారు, కధలో ట్విస్ట్ లు: వంట గదిలో ఎలుక లు చేసే శబ్దం విని రవి ఏదో శబ్దం అనుకున్నాడు 2.కంగారు లో గేట్ వేయకుండా వెళ్ళిన రవి బృందం ను చూసిన సుఖ్ రాం డాబా ఎక్కి తిరగమని స్త్రీకి పోన్ ద్వారాసమాచారమిచ్చాడు,3.కాలువ ప్రవాహాం తగ్గటం వలన ఆ స్రీని సుక్ రాం ,రంగా ఆమె ను కాలువ దాటించి రవి ని బృందాన్ని బయపెట్టారు.4.రవి వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లిన మరో గంట కు తిరిగి గ్రామానికివెళ్తూ గేట్ శబ్దం చేయించారు,5పొలం పొదల్లో నుండి ఆ స్ర్తీ ని ఏడుపు శబ్దం చేయమని ఆమె తో అలా చేయించి భయపెట్టారు.కధ సమాప్తం.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అర్ధరాత్రి ఆక్రందన - by k3vv3 - 18-07-2023, 05:26 PM



Users browsing this thread: 1 Guest(s)