Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అర్ధరాత్రి ఆక్రందన
#2
ఆమె భర్తకు చెప్పుకుంటే తల్లి,తండ్రికే సపోర్ట్ వస్తాడేమో అనుకుని అటు తండ్రి కి చెప్పుకోలేక ఇంకా తన తండ్రి తన ఇద్దరు చెల్లెలకి పెళ్ళి చేయాలి,ఉన్నదంతా తనకే ఇస్తే వారి గతి ఏమిటంటూ పెద్దగా చదువు కోని ఆమె పోయినవర్షాకాలం లో ఒక రోజు ఆమె భర్త వేరే ఊరికి ఆఫీసు పని మీద వెళ్లి ఉన్న ఒక రోజు వర్షం బాగా పడి దారి చివర నువ్వు చూసిన వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది,గంగారాం కోడలు రాత్రి 9 గం;ల ప్రాంతంలో ఇంటి నుండి వచ్చి వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది,ఆమె శవం ఈ వాగు ఆగిపోయే పక్క గ్రామంలో తేలింది,రాధిక తండ్రి అల్లాడి పోయాడు ,ఆమె ఎప్పుడు తన భర్త,అత్త గారి మీద తప్పు గా చెప్పకపోవటం వలన ఆయన కేసు పెట్టకుండా మిన్నకుండి పోయాడు,జయరాం కూడా తీవ్రంగా కుంగి పోయాడు అతను కూడా ఆమె ను బాగానే చూసుకునేవాడు,ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అతనికి అంతుబట్టలేదు,ఊర్లో అందరు మాత్రం గంగారాం మరియు ఆయన భార్య సంగతి తెలియటం వలన అందరు వారి పెట్టే భాధలు భరించలేల ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు.అలా ఆమె చనిపోయాక అదే ఇంటిలో ఉన్న గంగారాం కు రాత్రి వేళ నీకు కనిపించినట్లే అలా గేట్ కొడుతూ గంగారాం భార్య కు వంట గదిలో తిరుగుతూ శబ్దం చేస్తున్నట్లు అనిపించి ఒక రెండు నెలలకు ఇళ్లు ఖాళీ చేసి పట్టణానికి వెళ్లారు ,కొడుకు జయరాం తో ఇక్కడ కోడలు గుర్తులు మరవలేక పోతున్నాం అని కొన్నాళ్లు ఈ ఇంటి ని వదిలితే నీకు ,మాకు ఆమె గుర్తులు మరచి పోతామని చెప్పి పట్నం లో అద్దె కు తీసుకుని ఇక్కడ పొలం కూడా అమ్మేసి వెళ్లిపోయాడు గంగారం,ఆ తరువాత సం;దాకా ఆ ఇంటిలోకి ఎవరు రాలేదు, ఆ దార్లో పొలానికి వెళ్లె వచ్చే వారికి అప్పుడప్పుడు ఆ ఇంట్లో గేటు లోపల ఎవరో కనిపిస్తున్నట్లు ,ఆ ఇంటి నుండి శబ్దాలు వస్తున్నట్టు అనిపించి ఆ ప్రాంతం లో తిరగటం మానేసారు. తరువాత మీ ఆన్నయ్య లు ఈ విషయం తెలియదు అందులో ఇళ్లు బాగాపెద్దది కాబట్టి తక్కువ అద్దె కావటం తో ఆ ఇంట్లో దిగారు,వారిది రాత్రి వేళ డ్యూటీ కాబట్టి వారికి ఏ అనుభవాలు జరగలేదేమో అంటూ ముగించాడు,ఇదంతా విన్న రవి నిర్గాంతపోయాడు,తనకి కూడా వంట గదిలో నుండి శబ్దాలు రావటం,గేట్ ఊపూతూ ఒక స్ర్తీ కనపడటం తను వెంటాడితే ఖచ్చితంగా ఈ వాగు దగ్గర దాకా కనిపించి మాయ మవటం తలుచుకుని నిజంగా ఆత్మలు ఉన్నాయా? అని అడిగాడు రంగాని,లేకుంటే గంగారాం ఎందుకు ఇళ్ళు వదలి,పొలాలు అమ్ముకుని ఊరు వదలి వెళ్తాడు?ఆయన కోడలికి ఆ ఇంటి పై మమకారం అలాగే పై ప్రేమ,అత్త,మామలపై పగ ఉండబట్టే ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది అని సమాదానం పలికిన రంగా కెళ్లి భయంతో చూడసాగాడు రవి. ఇలా మాట్లాడుకుంటుండగానే సమయం సాయంత్రం 5 అయ్యింది,ఇక వెళ్దాం పద అని రంగా కూడా రవి తో కలసి బయలు దేరి ఊరి వైపు నడవసాగారు సరిగ్గా రవి వాళ్ల ఇళ్లు రాగానే రవి లోపలికి రా అని రంగా అని అడగ్గా వద్దులే నేను వస్తా అంటూ ముందుకు వేళ్తూ జాగ్రత్త రవి నువ్వు మీ అన్నయ్య లు ఎంత త్వరగా ఆ ఇళ్ళు ఖాళీ చేసి ఇంకొంకటి చూసుకుంటె మంచిది అని చెప్పి ముందుకు వెళ్ళి పోయాడు.
రవి రూం లో కి వెళ్లి చూడగా అన్నయ్య లు ఇద్దరు నిద్రపోతూనే ఉన్నారు,బయట వరండాలో కూర్చుని రవి ఆలోచనలో పడి పోయాడు,అన్నయ్య లకు ఈ విషయం చెపుదామా వద్దా? అని ఆలోచిస్తున్నాడు,అంతలో వెనుక నుంచి రవి అనగా ఉలిక్కి పడ్డాడు.అన్నయ్య లు వచ్చి రవి తో పాటు కూర్చున్నారు,అపుడు రవి అన్నయ్యా ఈ ఇంట్ళో మీ రు వచ్చేటప్పుడు ఎవరు లేరా?అనగా దానికి మీము వచ్చే ముందు ఒక 5 నెలలు క్రితందాకా ఓనరే ఉండే వాడు,వారి కొడుక్కి జాబ్ రావటాంతో పట్టణంలోనే ఇళ్లు తీసుకున్నారు,అద్దె కూడా మీము అక్కడే ఇస్తాం,మీము వచ్చాక ఒకేసారి ఈ ఇంటికి వచ్చాడు అది బయటనుండే చూసి వెళ్లి పోయాడు,వారి సామాను లు కొన్ని కింద ఇంట్లో ఉన్నాయని అంధుకే కింద పోర్షన్ అద్దె కు ఇవ్వలేదని,ఇవ్వాలన్నా ఈ గ్రామంలో అంత మంచి వారుండరు అని మీరే మీ సొంత ఇంటి లా చూసుకోవాలని మాకు చెప్పాడని,ఓనర్ చాలా మంచి వాడని అన్నయ్య చెప్తుంటే విన్న రవి అసలు విషయం వారికేం తెలుసు అంటూ వారి కేసి చూడసాగాడు,ఇంతలో డ్యూటీ కి రెడీ అయ్యి భోజనం చేసి అన్నయ్య లు బయలు దేరారు,సమయం రాత్రి 9 గం;లు అంతకు ముందు ఏమో గాని ,నిజం తెలిసిన రవి ఈ రోజు ఈ ఇంట్ళో ఒంటరి గా ఎలా ఈ రాత్రి వేళ అని ఆలోచిస్తూ ఆందోళన పడసాగాడు,వరండాలోనే పిట్ట గోడ చివర కూర్చున్నాడు పైన వెలిగే లైట్ కాంతి కొంత గేట్ పై పడుతుంది ,గేట్ వైపేచూడసాగాడు,ఈ రాత్రి ఏం జరుగుతుందో అని ఆందోళన లో ఉన్నాడు. బయట చలిగాఉంది,లోపలికి వెళ్లి తలుపు వేసుకుని పడుకున్నాడు,గదిలో లైట్ వెలుగుతూనే ఉంది .నిద్ర పట్టటం లేదు సమయం చూసుకున్నాడు రాత్రి 11.15 నిమిషాలు .హఠాత్తు గా లేచి రవి చొక్కా వేసుకుని,గది తలుపులు వేసి సెల్ తోసుకుని మెట్లు దిగసాగాడు,నెమ్మదిగా గేట్ దగ్గరకి వచ్చి గేట్ తీసి గ్రామంలోకి నడవసాగాడు, ఒక్క మనిషి లేడు,కటిక చీకటి మధ్యలో ఎక్కడో ఇళ్లు ,గుబురు చెట్లు రవి నడుస్తున్నాడు కాని ఎక్కడికి వెళ్లాలో అతనికి అర్ధంకావట్లేదు,అలా నడుస్తు ఉండగా కొద్ది దూరంలో పెద్దగా కుక్కల అరుపులు ఒక వేళ తనని చూసి అరుస్తున్నాయా? అనుకుంటే అవి తనకు కనపడే దూరంలో లేవు,ఆలోచిస్తూ నడుస్తున్న రవి ఠక్కున ఆగి ఒక ఇంటి పక్కనేకొద్ది దూరంలో ఉన్న చెట్ల దగ్గర ఏదో ఉన్నట్లు అతని మనసు కి తోస్తుంది.సెల్ వెలుతురు అటు వేసాడు,రవి ఒక్కసారిగా ఉలిక్కి పడి పరిగెత్తసాగాడు,అలా పరిగెత్తి ఒక ఇంటి తలుపు బిగ్గరగా కొట్టసాగాడు,అయినా ఆ ఇంటి తలుపులు ఎవరు తీయటం లేదు,ఒక వేళ తను చూసిన ఆకారం తన వెంబటి రాలేదు కదా అని భయంతో ఒక్కసారి చీకట్లో వెనక్కి తిరగాడు.
PART-4. అతనికి కొద్ది దూరంలో ఒక తెల్లని ఆకారం కదులుతుంది,రవి తలుపులు కొడుతునే ఉన్నాడు,తలుపులు తెరుచుకుని ఈ సమయంలో ఎవరు అనుకుంటు బయటకి వచ్చాడు ఒక వ్యక్తి,రవి ఆ వ్యక్తి తో రంగా నేను రవి ని అనగా,ఈ సమయంలో ఏమయింది రవి ఏమన్నా సంఘటన జరిగిందా?రాలోపలికి రా అంటూ లోపలికి పిలిచి తలుపు వేసి నెమ్మదిగా ఏమంది అనగా నాకు ఆ ఇంటిలో కింద ఏదో శబ్దం అవుతున్న ట్లు వినిపించి, కంగారు పడి బయటకు వచ్చాను,కాని దారిలో ఒక చోట తెల్లని ఆకారం కనిపించింది,అది నన్ను వెంబడిస్తూ వచ్చింది,నువ్వు మొన్న మీ ఇంటి అడ్రస్స్ చెప్పావు కదా నాకు దిక్కు తోచక మీ ఇంటికి వచ్చాను,ఈ ఊర్లో నువ్వు తప్ప నాకెవరు తెలీదు అనగా,పర్వాలేదు రవి వచ్చి మంచి పనే చేసావు అలా భయంతో ఒంటరిగా ఉండకూడదు అన్నాడు,ఈ సంభాషణ వింటు లేచిన రంగా వాళ్ల నాన్న బిడ్డా రవి నీకు ఏమి భయం లేదు ఈ రాత్రికి ఇక్కడే ఉండు,రేపు మీ అన్నయ్య లకు జరిగినది చెప్పు,నా మాట విని ఆ ఇళ్లు ఖాళీ చేసి మరో చోటకి వెళ్ల్లండి అంటుండగా,తాతా మరి ఆ ఇంటి ప్రాంతంలో నే తిరుగుతుంది గంగారాం కోడలి ఆత్మ అన్నారు,మరి నాకు ఈ గ్రామ మధ్యలో కూడా కనిపించింది కదా అని రవి అడగ్గా,అర్ధరాత్రి ఆత్మలు ఏ ప్రాంతంలో తిరుగుతాయో మనం ఎలా చెప్పగలం అన్నాడు తాత, ఈ రాత్రి ఇక్కడే పడుకో అనగా లేదు తాతా మీరు నాకు సహాయం చేస్తే ఆ ఆత్మ సంగతి నేను తేల్చుతా , నాకు ఒక్కరు తోడు ఉన్నా ఆ ఆకారం అసలు ఆత్మనా?మనిషా నా? తేల్చుతాను, అని రంగా దయచేసి ఒక్కసారి నాతో బయటకు రా అసలు ఆ రూపం ఏమిటో తేల్చు తాను అని బతిమాలసాగాడు రవి. దానికి రంగా ఊరికి కొత్తగా వచ్చావు ఈ ఊరి సంగతి తెలీదు వద్దులే రవి అని రంగా నచ్చ చెప్తున్నా విన క బతిమాలసాగాడు. రవి మొండి పట్టు చూసి సరే నీ తృప్తి కోసం చూద్దాం పద నీను వస్తా,కుర్రాళ్ళు మీకు ఏమయినా ప్రమాదం కావచ్చు అంటూ చేతిలో లాంతర్ తో బయటకు వచ్చాడు రంగా వాళ్ల నాన్న సుఖ్ రాం.ముగ్గురు కలసి బయటకు వచ్చారు సమయం రాత్రి 1 గంట కావస్తుంది.
నెమ్మది గా నడుస్తూ రవి వాళ్ళు ఉండే ఇంటి వైపు నడవసాగారు,మార్గ మధ్యలో చెట్లలో ఏదో అలికిడి ,అటు వైపు సెల్ లైట్ వేసాడు రవి,బాగా గుబురు చెట్లు మొత్తానికి చెట్ల అవతల ఎవరో ఉన్నట్లు అర్దం అవుతుంది,ముగ్గురు కంగారు పడ్డారు,రంగా అది ఏమిటో ఎలాగైనా మనం చూద్దామని అని అటు పోదాం పద అని సుఖ్ రాం చేతిలో లాంతర్,రవి చేతిలో సెల్ లైట్ తోముందుకు వెళ్లసాగారు నెమ్మదిగా ఆ చెట్ల దగ్గరికి చేరుకుని ఆ ప్ర్రాంతం అంతా చూసారు ,అక్కడ ఏమి లేదు,ఇదేంటి తాతా మనకు ఇక్కడ ఖచ్చితంగా ఒక ఆకారం కనిపించింది,ఇప్పుడు లేదు ఏంటి అనగా దానికి సుఖ్ రాం సరేలే ముందుకు నడవండి అనగా సరే అని రవి వాళ్ళ ఇంటి వైపు నడవసాగారు,ఈ మధ్య కాలంలో 9 తర్వాత ఎప్పుడు ఆ ఇంటి చాయలకు రాని రంగా,సుఖ్ రాం రవి కోసం మరలా ఆ ఇంటి వైపు నడవసాగిరి,రవి ఇళ్లు కనుచూపు మేరలో కనిపిస్తుంది,ముగ్గురు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు,గుండె ఆగినంత పని అయ్యింది కారణం రవి వాళ్ల పై పోర్షన్ పిట్ట గోడ దగ్గర ఒక స్ర్తీ నిల్చొని ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది,ముగ్గురు నడక ఆపి అంతే నిల్చొని చూడసాగిరి , వెంటెనే సుఖ్ రాం లాంతర్ ఆపి వేసాడు,రవి ని కూడా సెల్ ఆపమన్నాడు,రోడ్డు కి కొంచెం పక్కగా నిల్చొని చూడసాగారు. బాగా చీకటి అయినప్పటికి ఆ ఆకారం తెల్లని దుస్తుల్లో ఉంటటం వలన కదలికలు కనిపిస్తున్నాయి,డాబా అంతా చుట్టు తిరుగుతూ నడుస్తుంది,ముగ్గురు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు, వెళ్లి చూద్దామా తాతా అన్న రవి నోరు ని మూసిన సుఖ్ రాం అనవసరంగా నీతో పాటు మీము చస్తాం,ఊరుకో అంటూ గద్దించాడు,దానికి రంగా కూడా అవును రవి మనకు అంతా క్లియర్ గా ఆత్మ తిరుగుతూ కనిపిస్తుంటే ముందుకు వెళ్దాం అంటావు,వద్దు మెదలకుండా ఉండు అని రంగా హెచ్చరించాడు.ముగ్గురు డాబావైపె చూస్తు వున్నారు,డాబా పై చుట్టు కాసేపు తిరిగి నెమ్మదిగా మెట్లు దిగుతుంది ఆ ఆకారం,ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ముగ్గురు ,కిందకి దిగిన ఆ ఆకారం కాసేపు కనిపించలేదు,ఇంతలో ఏమయింది అనుకుంటూ చూస్తు ఉన్నారు,అంతలో నెమ్మది గా ఇంటి నుండి బయటకు వచ్చి కొండ వైపు నడవసాగింది,ముగ్గురు కి చెమటలు పడుతున్నాయి,అప్పుడు రవి అనుకున్నాడు తాత,రంగా చెప్పింది నిజమే ఆ ఇంటి పై ప్రేమ చావక గంగారాం కోడలు ఆత్మ ఇక్కడేంతిరుగుతుంది ఆ స్ర్త్తీ రూపం అటు వెళ్లగానే సుఖ్ రాం పద రవి ఈ రోజు మా ఇంట్లో నే ఉందువు గాని నువ్వు ఒంటరిగా ఈ ఇంట్లో ఉండటం క్షేమం కాదు అని వారి ఇంటి వైపు కి నడవసాగారు.
రంగా వాళ్ల ఇంటికి చేరుకుని ఆ రాత్రి అక్కడే ఉన్న రవి కి అసలు నిద్రపట్టలేదు,సుఖ్ రాం,రంగా కూడా నిద్రపోలేదు,వారు కూడా ఆత్మల గురించి వినటమే కాని ఎప్పుడు చూడలేదు,ఈ రోజు ఆ అనుభవం తో వారికి ఆ రాత్రి కాళరాత్రి అయ్యింది,సమయం తెల్లవారు ఝాము 5 గంటలు కావటం చూసి రవి రంగా నేను వెళ్తాను,అన్నయ్య లు వచ్చే సమయం అయ్యింది అనగా,అలాగే జాగ్రత్త అన్నయ్య కు రాగానే జరిగినది చెప్పు,నేను తోడు రానా అని రంగా అనగా వద్దులే తెల్లవారింది ఇక ఏ భయం లేదు అని బయలు దేరాడు,ఇంటి బయట గేట్ వేసే వుంది ,తీసి నెమ్మది గా రూంలో కి వెళ్లాడు. మంచంపై పడుకొని ఎట్టి పరిస్తితుల్లో అన్నయ్య కి ఈ విషయం చెప్పకూడదు,ఇప్పుడిప్పుడు ఇళ్లు దొరకదు,రాత్రి వేళ వారుండరు కాబట్టి ప్రస్తుతం వారికి ఇబ్బంది లేదు,గత 7 నెలలు గా ఉంటున్నారు,వారి ని ఆత్మ ఏమి చేయలేదు,అనుకుంటూ అసలు నిజంగా ఆత్మలు ఉన్నాయా?మరోసారి ఆ ఆత్మ సంగతి చూద్దాం ,అన్నయ్య లు ఈ 7 నెలలలో ఒక్క రాత్రి కూడా ఈ ఇంట్ల్లో లేరు ఎప్పుడయినా సెలవు దొరికితే మా సొంత ఊరు వస్తుండటంతో వీరికి ఈ సంగతులు తెలియకపోవచ్చు,అని ఆలోచిస్తున్న క్రమంలో అన్నయ్య లు వచ్చారు. శ్రీకాంత్ అన్నయ్యా నేను మన ఊరు వెళ్లొస్తాను అని రవి అనగా అదేంటి రా మూడు రోజుల్లో నీకు మా కంపెనీ లో ఇంటర్యూ రావచ్చు అని మా సార్ చెప్పారు అనగా లేదన్నయ్యా నేను వెళ్లి రెండు రోజుల్లో వస్తా అనగా సరే నీ ఇష్టం అన్నాడు శ్రీకాంత్,ముగ్గురు టిఫిన్ చేసాక రమేష్ అన్నయ్య తో బైక్ పై పట్టణానికి బయలు దేరాడు రవి,అక్కడి నుంచి బస్సులో 150 కి.మీ దాకా ఉంటుంది రవి స్వగ్రామం. దారిలో ఏరా రవి ఒంటరి గా రాత్రి వేళ చివర ఇంట్లో ఉండటం వలన ఊరు వెళ్తానంటున్నావా అనగా అదేమి కాదు అన్నయ్యా,చిన్నపని ఉంది చూసుకుని వస్తాను అని సమాదానమిచ్చాడు రవి.
అన్నయ్యా ఈ ఊరి వారు ఎవరు మీకు పరిచయం లేదా అని రవి అడిగిన ప్రశ్నకు ఎవరి తోలేదు మాకు అవసరమయిన సరుకులు కూడా పట్నం నుండే తెచ్చుకుంటాం అని సమాధాన మిస్తూ రెండు సార్లు ఊరి లో హోటల్ దగ్గరకు వెళ్లాం,అతను ఎందుకు అంత చివర ఇంట్లో ఉంటున్నారు వేరే ఎక్కడయినా చూడవచ్చుగా అని సలహా ఇచ్చాడు,ఇప్పుడు మనం ఉన్న ఇళ్లంతా సౌకర్యం గా ఈ గ్రామంలో ఎక్కడ ఇళ్లు లేవు అందులో అద్దె కూడా తక్కువే అని సమాదానమిచ్చానని చెప్తున్న రమేష్ అన్నయ్య మాటలు వింటు ఇంకా ఆలోచిస్తునే ఉన్నాడు,ఇంతలో బస్ స్టాండ్ వచ్చింది బస్సు ఎక్కించి రమేష్ వెళ్లిపోయాడు. స్వగ్రామం చేరుకున్న రవిని అక్కడ అంతా బావుందా నీకు ఉద్యోగం వస్తుందా?అని అడిగిన తల్లి,తండ్రుల కు బాగానేవుంది,త్వరలోనే నాకు ఉద్యోగం వస్తుంచి అని సమాధానమిచ్చాడు.సమయం సాయంత్రం 6 గం;లు అయ్యింది,రవి తన మిత్రుడు భాషా ఇంటికి చేరుకుని ఇద్దరు వారి డాబా పైకి చేరుకుని మరో మిత్రుడు తేజ కి పోన్ చేసి అర్జెంట్ గా రమ్మాన్నాడు,తేజ కూడా వచ్చాక వారు జాబ్ సంగతి ఏంటిరా అని దాని కన్నా ముఖ్యమయిన విషయం మాట్లాడాలి అందుకే అర్జెం ట్ గా వచ్చాను అని జరిగినదంతా వారికి వివరించాడు,ఒక్కసారి గా ఆశ్చర్యపోయారు ఇద్దరు మిత్రులు.ముగ్గురు కలసి బి.టెక్ పూర్తి చేసారు ఉధ్యోగ ప్రయత్నంలో ఉన్నారు,ఏ విషయమైనా షేర్ చేసుకుంటారు కనుక తల్లితండ్రులతో చెప్పని ఈ విషయం తన మిత్రులతో పంచుకున్నాడురవి.పూర్తి గా విన్న భాషా మరియు తేజ లు అరేయ్ రవి సినిమాల్లో,కధల్లో మాత్రమే ఉండే ఇటువంటి సంఘటన నువ్వు చూడటం,అనుభవించటం ఆశ్చర్యం ,అయినా మాకు ఇప్పటికి నమ్మబుద్ది కావటంలేదు,అయినా మనం ముగ్గురు ఉన్నాం కదా ఆ ఆత్మ నిజమో కాదో రవ్వలగూడెం వెళ్దాం అనగా సరేఅన్నాడు రవి.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అర్ధరాత్రి ఆక్రందన - by k3vv3 - 18-07-2023, 05:25 PM



Users browsing this thread: 1 Guest(s)