13-07-2023, 01:17 AM
అమ్మ నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉంది , అమ్మతో కలిసి బొంచేసి పడుకున్నాను. మరుసటి రోజు మద్యానం వరకు అంతా రొటీన్ గానే జరిగింది , 2 గంటలకి హమీద్ వచ్చాడు.
“సారూ మీకు ఇమ్మని ఈ ఫైల్ ఇచ్చాడు” అంటూ ఓ పెద్ద ఫైల్ నా చేతిలో పెట్టాడు.
“ఏంటి హమీదు ఎలా ఉన్నావు , నీ జాబ్ ఎలా ఉంది”
“మీ దయ వల్ల అంతా బాగుంది సారూ , భార్యా పిల్లలు నూర్ వాళ్లతో బాగా కలిసి పోయారు , సార్ కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు”
“నూర్ ఎలా ఉంది ఈ మద్య కనబడ్డం లేదు”
“తను ఇప్పుడు చాల బిజీ సర్ , అదేదో స్పెషల్ వింగ్ కి లీడర్ గా వేశారు , ఆ షీ టీం లీడర్ అంట , టౌన్ లో ఎక్కడా ఈవ్ టీజింగ్ అనేది లేకుండా చేయడం తన డ్యూటీ, దాంట్లో మేడం చాలా బిజీ”
“ఓ అలాగా , గుడ్ , చాయ్ తాగి వెళ్ళు , మీ సర్ ని ఈవినింగ్ కలుస్తాను అని చెప్పు”
“సర్ , ఎదో పెద్ద పని మీకు అప్పగించినట్లు ఉన్నారు , మీకు సహాయం చేయడానికి అవసరం అయితే నన్ను పిలవండి నేను వస్తాను”
“తప్పకుండా హమీద్ , నీ సహాయం అవసరం , నేను మీ సర్ తో మాట్లాడతాను.
“మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సర్ ” అంటూ వెళ్ళిపోయాడు.
నన్ను ఎవ్వరు disturb చేయకుండా చూసుకో అని షాహిన్ కు చెప్పి ఆ ఫైల్ మీద పడ్డాను.
దాదాపు రెండు గంటలు టైం పట్టింది ఆ ఫైల్ మొత్తం చదివి అందులోని సారాంశం అర్థం చేసుకోవడానికి. టూకీగా అర్థం అయ్యింది ఏంటి అంటే.
గుంటూరుకు 50 కి.మీ దూరం లో బాబా భగవానంద ఆశ్రమం ఉంది దాదాపు ౩౦ ఎకరాల్లో ఆ ఆశ్రమం నిర్మించారు. 10 సంవత్సరాల క్రితం అక్కడ ఓ అడివి ఉండేది , కానీ ఇప్పుడు అక్కడ ఓ పెద్ద టౌన్ షిప్ వెలిసింది. అందులో 80% అంతా బాబా ట్రస్ట్ కింద నడుస్తుంది , వచ్చిన ఆదాయం అంతా బాబాకే చెందుతుంది.
అంతకు ముందు బాబా ఎక్కడ నుంచి వచ్చా డో ఎవ్వరికీ తెలియదు , ఒకటో రెండో కేసులు మాత్రం నమోదు అయ్యాయి బాబా పేరు మీద , అవి కుడా సరియైన ఆధారాలు లేక మూసేయాల్సి వచ్చింది. ఆ కేసుల లో కుడా ఒకటి ఓ రైతు కేసు పెట్టాడు. తన ల్యాండ్ బాబా ఆక్రమించు కొన్నాడు అని. రెండో కేసు ఓ కాలేజ్ టీచర్ తన కూతురు మీద రేప్ టెంప్ట్ చేసాడు అని. ఆ తరువాత ఆ రైతు, టీచర్ ఎక్కడికి వెళ్ళా రో ఎవ్వరికీ తెలియదు , వాళ్ళ ఆచూకీ దొరకలేదు.
మండల లీడర్స్ మొదలుకొని జాతీయ స్థాయి లోని లీడర్స్ వరకు వాడి పరపతి చెల్లుతుంది , సెక్యూరిటీ అధికారి డిపార్టుమెంటు లోని పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాడి భక్తులు, కావల్సినంత డొనేషన్స్ ఇస్తూ ఉంటాడు. సాధారణ ప్రజలు వాడికి దాసోహం అంటూ ఉంటారు.
విదేశీయులు కుడా బాగానే వస్తు ఉంటారు , ఒక సారి వచ్చిన వారు దాదాపు అయిదు లేదా ఆరు నెలలు ఉంటారు. ఎక్కువుగా తన భక్తులు అంతా లేడీస్. పిల్లలు పుట్టని వాళ్ళు తన దగ్గరికి వస్తే పిల్లలు పుడతారని అక్కడి ప్రజల నమ్మకం. కాకపోతే అక్కడ వాళ్ళు మూడు నిద్రలు చేయాలి భర్తలతో వచ్చి. అక్కడ ఉండడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. సాధారణ ప్రజానీకానికి ప్రీ గా , డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వారికి ప్రత్యేకంగా 5 స్టార్ సదుపాయాలు అందుతాయి. దాని ద్వారా వచ్చిన ఆదాయం అంతా స్వామీ జీ ట్రస్ట్ కే చెందుతుంది.
స్వామీజీ కి ఓ 55 సంవత్సరాలు వయస్సు ఉంటుంది 6 అడుగుల భారీ దేహం , తను చుట్టూ ఎప్పుడు ప్రత్యెక భక్త బృందం ఉంటుంది , కానీ వారు అంతా అయన భక్తుల రూపం లో ఉన్న బాడీ గార్డులు. ఆయనికి ఇద్దరు అంతరంగిక సేవకులు ఉన్నారు వారే జీవన్ బాబా , సాత్విక మాతా జీ. జీవన్ కి 45 సంవత్సరాలు ఉంటాయి వాడు ఎక్కడ నుంచి వచ్చాడో కుడా ఎవ్వరికీ తెలియదు , కానీ వాడిని చూడగానే అనిపిస్తుంది వాడు ఎంతకైనా తెగించే రకం అని. సాత్వికా మాతాజీ గురించి కొంత సమాచారం సేకరించ బడింది. తను ఇంతకూ మునుపు రికార్డు డాన్స్ చేసేది గుంటూరు చుట్టూ పక్కల ప్రాంతాలలో అది తను పదహారు ఎల్ల వయసులో ఉన్నప్పుడు. తను 20 లో పడుతూ ఉండగా అక్కడ బాబా వేలిసాడు అప్పటి నుంచి తన జీవితం బాబాకు అంకితం చేసింది. అందుకే తనకు అతి సన్నిహితమైన శిష్యురాలు అయ్యింది. తనకు ఏదైనా పనులు జరగాలి అంటే శిష్యురాలి ద్వారా కబురు పంపుతాడు. అదే శిష్యుడినుంచి కబురు పంపితే ఆ వ్యక్తీ ఆ తరువాత కొన్ని రోజుల కు కనపడ లేదు అని కేసు ముగిసి పోతుంది ఆ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో.