Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నాగ సాధువులు
#2
చిత్ర ఇంటికెళ్ళాను
నాకు సంబంధం లేని విషయాల గురించి తెలుసుకోవడం నాకు పెద్ద risk అనిపించలేదు చిత్రకి ఎమైందో తెలుసుకోవడం ఉపయోగం లేని పని అనిపించలేదు ఆ ధైర్యం తోనే చిత్ర వాళ్ళ ఇంటి తలుపు తట్టాను.
చిత్ర గురించి వచ్చాను అని చెప్పి నెమ్మదిగా చిత్ర చనిపోవడం గురంచి అడిగాను చిత్ర బాబాయ్ అనుకుంటా సరిగ్గా స్పందిచలేదు... కానీ ఆయనకి కూడా ఆ photo చూపించక తప్పలేదు ఆయన లోపలకి రమ్మని పిలిచి తన గదికి తీసుకెళ్ళారు ఒకవైపు గోడ మీద disny painting ఉంది అలంకరణ కోసం వాడే వస్తువులేమీ ఎక్కువగా లేవు bedకి ఎదురుగా తను డాన్స్ చేస్తున్నపుడు తీయించుకున్న photo పెద్ద hording size లో ఉంది దానిపక్కన అద్దం దానికెదురుగా ధ్యానం చేస్తున్న మనిషి సప్త చక్రాలు, నాడి మండలాలు గీసిన బొమ్మ
. చిత్ర మొదటినుండి చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలది దేన్నైనా తొందరగా నేర్చుకోగలదు తన i. q. లెవెల్స్ చాలాఎక్కువ 16 ఏళ్ళకే సంపాదించడం మొదలుపెట్టింది
18 ఏళ్ళకి bio-scienceలో పరిశోధన పూర్తి చేసి విదేశాలలో ఉద్యోగం సంపాదించుకుంది. చిన్నప్పటినుంచే భరతనాట్యం నేర్చుకుని చాలా stage shows ఇచ్చింది
డాన్స్ అంటే తనకెంత డెడికేషన్ అంటే holiday- trip నుండి వచ్చి ఇంకా వారంరోజుల్లో తన ప్రోగ్రాం ఉందని అర్ధరాత్రైనా సరే సాధన చేసేది
భారతీయ సంస్కృతి, వివిధ రకాల నృత్యాల మీద పరిశోధన చేయాలనీ తన job వదిలేసుకునొచ్చింది. తన research-thesis చూశాను భారతీయ సంస్కృతీ ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు ప్రాచీన మైనది అని ఆధారాలతో సహా రాసింది తను చుట్టుపక్కల వాళ్లతో చాల తక్కువ మాట్లాడుతుంది చాలా సూటిగా మాట్లాడుతుంది
ఆమె అలవాట్లగురించి తెలుసుకున్నాను, తన పుస్తకాలుఅన్ని పరిశీలించాను............ తన పుస్తకాల్లో ఎక్కువగా అతీంద్రియశక్తులకు సంబందించి తాంత్రిక విద్యలకు సంబంధించి అఘోరాలకి నాగ సాధువులకి సంబందించిన పుస్తకాలున్నాయి తన అలవాట్లు అభిరుచులు చాలా వేరుగా ఉన్నాయ్ తన laptop లో కొన్ని తనే స్వయం గా తీసిన documentaries కూడా ఉన్నాయి
చిత్ర ధ్యానం చేసేటప్పుడు ఎదురుగా తారాదేవి photo ఉండేది దాన్ని చుపిస్తూ చెప్తున్నారు ఆయన చివరిగా తనకి cervical cancer ఆ విషయం మాకు చాల ఆలస్యం గా తెల్సింది మా దగ్గరే ఉండి చనిపోతే మేం తట్టుకోలేమని తను మా నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఏవరికీ ఈ విషయం చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు అంతకు మించి ఇంకేమి లేదనే అనుకుంటున్నా అని చిత్రబాబాయ్ అన్నారు
కానీ నాకు ఒక నిర్ణయానికి రావాలనిపించలేదు చిత్ర బాబాయి చెప్పింది నిజమే అయ్యి ఉంటే చిత్ర నిజంగా రోగం వల్ల చనిపోతే తన room mates ఎందుకు?దేనికి? భయపడుతున్నారు
చిత్రది హత్య లేదా ఆత్మహత్య లేదా అంతకు మించి ఇంకేమై ఉంటుదని ఆలోచిస్తూ కూర్చున్నాను దగ్గరగా ఉన్న park లో సమయం ఎంతయిందో కూడా తెలియదు ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాను ఈpark కి ఉన్న సౌకర్యం ఏంటంటే ఇక్కడనుంచి అడివికి దారి ఉండటం ఆలోచనల్లో పడి దారితప్పి ఆ దారిలో చాలా దూరం నడుస్తూ వెళ్లి పోయాను ఎక్కడో కట్టెలు కాలుతుంటే వచ్చే చిన్న చిన్న శబ్దాలు వినబడుతున్నాయ్ తేరుకుని చుస్తే చాలాదూరం అడవిలోకి వచ్చానని అర్ధమయ్యింది అటువైపు వెళ్లి చూస్తే అక్కడో శవం ఉంది దాని తలనరికి దానికెదురుగా ఉన్న హోమంలో కాలుస్తున్నారు దిగంబరంగా ఉన్నారు నాగ సాధువులు చేతుల్ని విచిత్రంగా తిప్పుతూ ఎదో వింత హావభావాలతో దేనినో ఆవాహన చేస్తున్నారు హోమంలో సగం కాలిన తలనుండి మెదడు బయటకోచ్చింది దాన్ని తీసి ఏవో పూజలు చేసిన తరాత దాన్ని తినడం మెదలుపెట్టారు కాసేపటికి ఒకరు ఆ శవం మీద కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు జాగ్రత్తగా గమనిస్తున్న అచ్చం కలలో వచ్చినట్టుంది అక్కడ జరిగింది వాళ్ళు నన్ను గుర్తుపడితే ప్రమాదమని నెమ్మదిగా నిశ్శబ్దంగా వెనుదిరిగాను వెనక ఎవరో వస్తున్నట్లు అనిపించింది ఏదో అడుగుల శబ్దం దేనిదో చిన్న మూలుగు ఎవరో ఆయాస పడుతున్నట్టుఏడుస్తున్నట్ట్టు వినబడింది అది చాలాదూరం వెంబడించింది కొంత దూరంలో నాకు చదునుగా ఉన్న రాయి కనబడింది అక్కడ ప్రశాంతతకోసం ధ్యానంలో కూర్చున్నాను ఎవరో మొహం దగ్గరకొచ్చి వాసనచుస్తున్నట్లు అనిపించింది గొంతు దగ్గర ఎవరిదోచిన్న శ్వాస కూడా కూడా తగిలింది అయినా కూడా నేను ధ్యానంలోనే ఉన్నాను కొంత సేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు లేరు నేనొచ్చిన దారినే వెనక్కోచేసాను అప్పటికి సమయం మూడైయింది అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అనుకున్నాను కానీ స్నేహితులందరూ నా గురించి కంగారుపడుతున్నారని గమనించాను లతిక అయితే ఏడవడం మొదలుపెట్టింది ఇంతలో వాళ్ళకెదురుగా వెళ్ళాను
 
చిత్ర roommates రెండు,మూడు సార్లు నాగసాధువులను చూసినపుడు భయపడటం గమనించాను
 
ఈ విషయాన్నే dairy లో రాస్తున్న నాకు ఒక ప్రశ్నతలెత్తింది ఒక అనుమానం కూడా చిత్ర చావుకి, నాగసాధువులకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళెందుకు చిత్రని చంపాలి ?
గర్ల్స్ హాస్టల్ చుట్టూ ఉన్న గోడమీద electrical fencing ఉంది దాన్ని దాటి ఎవరు లోపలకి వెళ్ళలేరు ఒక వేళ వెళ్ళినా చిత్ర roommates కి తెలుస్తుంది కదా ?
ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి ……………………
 తరవాతి రోజు 
 
స్వాతి ద్వారా చిత్ర roommates ని counselling చేయించాను అయినా వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు
నేను : వదిలేసేయి స్వాతి వాళ్ళని వెళ్ళమను
వాళ్ళని పంపించేసిన తరవాత
స్వాతి : వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు?
నేను : వాళ్ళని నాగసాధువులు కోపం గా చూడటం గమనించాను నేననుకోవడం చిత్ర చావుకి నాగసాధువులకి ఎదో సంబధం ఉంది
స్వాతి : వాళ్ళకేంటి సంబంధం ?
స్వాతి అడిగిన ఈ చివరి ప్రశ్నే నా mind లో రోజు తిరుగుతోంది దాదాపుగా కొన్ని నెలలు గడచిపోయాయి నేనన్ని నెమ్మదిగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను ”
 
ఒక వర్షాకాలం సాయంత్రం 
 
వాన తగ్గి సూర్యాస్తమయం స్పష్టంగా కనబడుతోంది నెమ్మదిగా ground వైపు నడుస్తున్నాను ఎదురుగా ఓక పావురం అనుకుంటా దెబ్బ తగిలి చెత్తకుప్పలో పడిపోయింది పక్కనే ఉన్న వీథి కుక్కలు పావురాన్ని పట్టుకోడానికి లోపలకి దుకాయి వెంటనే వాటిని తరిమేసి దాన్ని బయటకి తీసాను అప్రయత్నంగా చెత్తకుప్పలో చూస్తే ఒక డైరీ ఉంది ఎవరిదా అని చూస్తే మొదటి పేజిలో పేరు చిత్రబొమ్మ గీసి ఉంది కొన్ని పేజీలు సరిగ్గా లేవు అక్కడక్క ఉన్న వాటిని చదవడం మొదలుపెట్టాను
................................dairy కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికి మర్చిపోలేము కొన్ని మరచిపోకూడదు అందుకే ఈ dairy లో నా జీవితాన్ని దాచుకుంటున్నాను
14th birthday
అమ్మ : సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది డబ్బు విలువ
నాన్న నాకు నచ్చిందని b. m. w. కొన్నప్పుడు అమ్మంది
నాన్న నాకు నచ్చినవి ఏమైనా అమ్మతో చెప్పకుండా కొంటే అమ్మ ఇలాగే చాలాసార్లు అంటుంది
అందుకే నా14 పుట్టిన రోజునుండి నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను
16
రవి (నాకు బాగా దగ్గరైన స్నేహితుడు): ఈ ప్రపంచాన్ని మొత్తం నేను తిరగాలనుకుంటున్నాను అని ఓసారి రవి నాతో అన్నాడు
రవి: ఈ సముద్రం చూడు ఎంత పెద్దగా ఉందొ అంటే ఈ ప్రపచం కూడా అంతే పెద్దగా ఉంటుది
సముద్రమంతా చుట్టి రాలేమేమో గాని ప్రపంచాన్నిమొత్తం తిరిగి రావచ్చు నాతో పాటు నువ్వు వస్తావా............
20
నాలుగు సంవత్సరాలుగా ఈ dairy ని రాయలేనంత busy అయిపోయాను నాజీవితంతొ
కొత్త వాతావరణం లోకి అడుగు పెట్టాను ఇంటికి దూరం గా కొన్ని వేల మైళ్ళు ఇక్కడ నా మాటలను అర్ధం చేసుకోనేవాళ్ళు తక్కువ కాని మనసుని అర్ధం చేసుకొనే స్నేహితులు పెరిగారు
23
చాలా పెద్ద job చేస్తున్నాను నాకిది సంతృప్తి నివ్వడం లేదు ఇంకా జీవితంలో ఏదోటి చేయాలి.............
ఎదో చేయాల్సింది మిగిలిపోయింది అనిపిస్తోంది మొదట్లో చాల work stress ఉన్న చోటు ఇది కానీ తొందర్లోనే నాకు తక్కువ పని ఉండేటట్లు చేసాను ..............
24
సరిగ్గా ఈరోజు మేమందరం మడ అడవుల్లో ఉన్నాం ఇదే చివరి halt ఇక్కడితో నా world tour ముగిసింది తరవాత రవి నీ కలిసాను
25
*సమయం 3:30 కి మెలకువచ్చింది
రాత్రి నిద్రలో ఎందుకో బాగా కడుపు నొప్పి వచ్చింది కొంచం తగ్గిందనుకున్నాను కానీ bleeding అయ్యింది వారం రోజులు ఇదే సమస్య
కొంత వరకు recover అయ్యాను
భారత్ లోనే university లో join అయ్యాను భారతీయ సంస్కృతీ మరియి భరత నాట్యం లో phd చేస్తున్నాను.
ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు అన్ని వెళ్ళిపోతాయి అందురు పోతారు కాని అందరికన్నా నేను కొంచం ముందు వెళ్ళిపోతున్నాను
నిన్న డాక్టర్ : ఈ ప్రపంచం లో ఉండటానికి 365 రోజులు మాత్రమే ఉన్నాయన్నాడు
నా లైఫ్ ఇంత తొందరగా ముగిసిపోతున్నందుకు బాధ లేదు
ఎందుకంటే ఇప్పటిదాక నేను సంతోషం గానే ఉన్నాను కానీ ఒక చిన్న కోరిక అమ్మ నాన్న ల తరవాత చివరిదాకా మనని ప్రేమించే ఒక తోడూ కావాలని ఉంది కాని ఇప్పుడు అవసరం లేదు......... ఇదొక చిన్న తేడా అందుకే దిన్ని మరచిపోవాలని నా dairy లోంచి తీసేద్దామనుకున్నాను కానీ నాకు మిగిలిన జీవితం కొన్ని రోజులే అని అప్పుడప్పుడు ఇది గుర్తుచేస్తుంది
ఆదివారం ఉదయం 26” రవి నాకో పుస్తకం పంపాడు birthday gift గా
మరణాన్ని జయించిన వ్యక్తులు ” అందులో ఒకే ఒక పేజీ దగ్గర ఆగిపోయాను కుండలిని యోగ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక రోగాలని తగ్గించవచ్చు ప్రాణాంత రోగాలకు కుండలిని యోగ ఉపకరిస్తుంది ఆ పుస్తకంలో ఆ విషయాన్ని చాల సార్లు గుర్తుచేసుకున్నాను యోగ ద్వారా రోగాలని నయం చేయచ్చని తెలుసుకాని కుండలిని యోగా అనే పదం మొదటి సారి చూశాను ఈ పుస్తకం రాసిన వ్యక్తిని నేరుగా కలిసాను అతను నన్నొక ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు కానీ ఆరోజు ఎంతోమంది వ్యాధులని నయం చేసిన అతని అనంత స్వామిజి చనిపోయారు తరవాత కొన్ని రోజులకి అయన శిష్యుల్ని కలిసాను శ్రీ వివేక : నిజానికి గురువుగారు దాదాపు 20 ఏళ్ళ క్రితం నుంచి కుండలిని యోగ చేయడం మానేసారు అప్పట్లో అయన దగ్గరకు వచ్చినా ఓ వ్యక్తి తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్నాడు గురువుగారి దగ్గర చికిత్స తీసుకుంటూ చనిపోయాడు అందువల్ల గురువుగారికి కుండలిని యోగ మీద కాస్త నమ్మకం తగ్గింది ఎవరికీ నేర్పడం మానేసారు
మీకొచ్చిన వ్యాధిని నయం చేసుకోవాడానికి కుండలిని యోగ అనేది సరైనదే కానీ ఇప్పుడు దాన్ని నేర్పేవాళ్ళు లేరు అన్నాడు తరవాత కుండలిని యోగ తెలిసిన ఇంకో వ్యక్తీ ని కలిసాను కాని ఆయనకూడా నాకు పూర్తిగా నయం చేయలేకపోయాడు
దాదాపు ఒక సంవత్సరం నుండి కుండలి యోగ సాధన చేస్తున్నాను శరీరం పూర్తిగా సహకరించడం మానేసింది శరీరం లో విపరితమైన అలజడి, వణుకు ఎందుకో తెలియడం లేదు, ఇక్కడ నాకో ప్రాణం దొరికింది తను మధు ఎన్నో విషయాలు తనతో పంచుకున్నాను కొన్ని సార్లు బాధతో తనని గట్టి గా పట్టుకొని ఏడ్చేదాన్ని
సమయం 2:35 university కి వచ్చేసాను నాలో శక్తి పూర్తిగాతగ్గిపోతోంది ఒక్కో సారి ఈ విషయాన్నీ కూడా రాయలేక పోతున్నాను కానీ ఈరోజు ఉదయం ఇద్దరు విచిత్రమైన వ్యక్తులని కలిసాను నాగ సాధువులు వాళ్ళు నన్ను చూడగానే నా వ్యాధిని గుర్తుపట్టారు నాకు నయం చేస్తామన్నారు……………….
ఇదే చిత్ర dairy లోని చివరి పేజీ
 
అంటే చిత్ర తన వ్యాధిని నయం చేసుకోవాడానికి నాగ సాధువుల దగ్గరకి వెళ్ళింది కాని ఎందుకు చనిపోయింది?
చిత్ర కలలోకి వచ్చింది నవ్వుతూ కనబడింది తన చుట్టుపక్కలంతా తెల్లగా ఉంది చాల సేపు తను నన్ను నవ్వుతూ చూసింది తర్వాత మాయం అయిపొయింది ఎప్పటిలాగే ౩గంటలకి మేల్కొని ధ్యానం యోగాసనాలు ముగించుకుని సూర్యోదయం అవుతుండగా పార్క్ లోకి వచ్చి కుర్చున్నాను స్వాతి కూడా వచ్చింది చిత్ర dairy ఇచ్చాను
నేను : నిన్న చెత్తకుండి లో దొరికింది ............ చిత్ర వాళ్ళని కలిసింది
స్వాతి: ఎవరిని?
నేను : నాగ సాధువులు
స్వాతి: అంటే వాళ్ళే.....
నేను : ముందు నువ్వు dairy పూర్తిగా చదువు....................
సాయంత్రం మనం మధు నీ కలవాలి తను చిత్ర దగ్గరగా ఉన్న ఒకేఒక వ్యక్తీ
దానికంటే ముందు చిత్ర room mates ని కలిసాను వాళ్ళెందుకు భయపడుతున్నారో చెప్పమని గట్టిగా అడిగాను
ఇంతలో మధువచ్చింది : వాళ్ళు చెప్పారు కృష్ణ నేను చెప్తా తను నాగసాధువులను కలిసింది
నేను : మధు.............. కొంచం వివరం గా చెప్తావా?
మధు : చిత్ర ఎవ్వరితోను దగ్గరగా ఉండలేక పోయింది కాని నాతొ చాలా విషయాలు పంచుకుంది తను చనిపోక ముందు రోజు నాగసాధువులని కలిసింది ఆరోజు రాత్రి నిద్రపట్టక బయట కూర్చున్నాను ఉదయం 1గంట అయింది తను ఒంటరిగా ఎక్కడికో వెళ్తుంటే గమనించాను పిలిచినా పలకకుండా వెళ్తోంది వెనకే వెళ్ళాను పార్క్ వైపు వెళ్తోంది తను మధ్యలో ఏమైందో తెలియదుsudden గా తను కనిపించలేదు చాల సేపు చూసి తన roomకి వెళ్లి పడుకున్నాను దాహం వేసి నిద్రలో మెలకువ వచ్చి చూస్తే తను నా పక్కనే పడుకొనుంది రోజూ 5 గంటలకి లేస్తుంది తను 8 ఆయినా లేవకపోవడంతో తనని లేపడానికి ముట్టుకున్నాను శరీరం చాల చల్లగా ఉంది శ్వాస కూడా ఆడటంలేదనీ గమనించి వెంటనే 108 కి phone చేసాను
ఇంతలో నాగసాధువులు
మిత్రమా ఆ తరవాత సంగతి మేం చెప్తాం రా
మేం అందరం మైదానం లో ఉన్నాం నేను, లతిక, ప్రసాద్, అఖిల్,స్వాతి,మధు
నాగసాధువులు: ఎదో శక్తి నిన్ను రక్షిస్తోంది మిత్రమా.................
మేం క్రతువు చేసేచోట ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి ఆ దరిదాపులకి ఎవ్వరూ రాకుండా చేయడానికి కానీ నువ్వు దారి తప్పి వచ్చావ్ ఆ రోజు చాలా సేపు ధ్యానం లో కూర్చున్నావ్ నీ దగ్గరకి వచ్చాం కాని ఎదో శక్తి మమల్ని ఆపింది చిత్ర చావు కారణం కోసం నువ్వు శోధిస్తున్నపుడు కూడా మాకు చాల క్రుద్ధమై చంపుదామని యత్నించాం కుదరలేదు...............
మిత్రమా ఆమెని మేము చంపలేదు తన రోగాన్ని నివారణ చేయాలనుకున్నాం కుదరలేదు ఆమె శరీరం సహకరించలేదు తన ఆయుష్షు రక్షణ చేయాలని ఆమె కుండలిని యోగం తప్పుగా సాధన చేసింది దాని వల్ల చెడు ఫలితాలని అనుభవించింది ఆమెని చూడగానే గ్రహించి చికిత్స చేయాలని ప్రయత్నించా కాని మిత్రమా మేం ఇచ్చే చికిత్స తీసుకోవాలంటే ఆమెకు కొంతైన శక్తి ఉండాలి
చివరిగా మాలో ఉన్న ప్రాణశక్తితొ చేయాలనుకున్నాం కానీ అప్పటికే ఆమె శరీరానికి ఆత్మతో ఉన్న సంబంధం తెగిపోయింది .........................
సమయం 7 గంటలు భోజన సమయం అవడం వల్ల
నేను : మిత్రమా రేపు రాత్రిమనం camp fire లో కలుద్దాం
మీరు రావాలని అనుకుంటున్నాను ఇప్పడు మాకు సమయం లేదు
సమయం : శనివారం రాత్రి 9 గంటలు (camp fire)
నాగసాధువులు: యోగసాధన అనేది సరైన గురువులేకుండా సాధ్యం కాదు అలా చేయడం వల్లే చిత్ర చనిపోయింది
అఖిల్: కానీ ప్రతిరోజు యోగ చేయడంవల్ల ఆరోగ్యం అని విన్నాను
నాగ సాధువులు : సాధారణయోగ సాధన మంచిదే మిత్రమా కానీ ఆశాస్త్రంలో నైపుణ్యం గల వ్యక్తిదగ్గర నేర్చుకోవాలి యోగ శాస్త్రంలో కుండలి యోగం సప్తచక్రాలలో శక్తి ప్రవాహం గురించి చెప్తుంది సాధన సిద్ధి పొందిన వ్యక్తులు మానవ సమాజంలో అసలు లేరు కొండకొనల్లోనో, హిమాలయాలలలోనో ఉన్నారు ఆమెకు వచ్చిన రోగం మేం నయంచేయగలం కాని ఆమె చివరిదశలో కనబడింది
స్వాతి : మీరు ఆ చికిత్సలు ఏవో బయట ప్రపంచం లో చేయచ్చు కదా
నాగ సాధువులు : మా ఆకారం చూస్తేనే భయపడతారు ఎవరు దగ్గరకు రానివ్వరు, చికిత్సలు చేయడానికి యోగ్యతా పత్రాలు అడుగుతారు
మనోజ్ : పోనీ పుస్తకాలలో రాయండి
నాగసాధువులు : కుదరదు మిత్రమా అవి గురుశిక్షణ ద్వారా పొందేవి
రాయడంవల్ల పూర్తిగా ఎరుక పడదు అంటే తెలియదు అంతేకాక కేవలం మాలాంటి జీవన విధానాలలో ఉన్న వాళ్ళకే అవి నేర్పించాలి
అఖిల్: ఇంకో చిన్న డౌట్ నాగసాధువులు: అడగండి మిత్రమా
అఖిల్: మంత్రాలకి చింతకాయలూ రాలుతాయాట నిజమేనా ?
వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి వాళ్ళు కొంచం ఇబ్బంది పడ్డారు
దీని గురించి నేను కొంత పరిశోధన చేసాను ప్రతి sound కి ఒక vibration ఉంటుంది అంతా నిశ్శబ్దంగా ఉన్నపుడు ఏదైనా పెద్ద సౌండ్ వింటే sudden గా ఉలిక్కిపడతారు ఎవరైనా,
అలాగే బాగా stress గా ఉన్నప్పడు ఏదైనా music వింటే mental-stress కి దూరం అవ్వచ్చు.
అంటే ప్రతి శబ్దానికి ఎంతోకొంత ప్రభావం ఉంది , అలాగే మంత్రాలనీ చదవినప్పుడు వచ్చే శబ్దం ద్వారా కూడా ప్రభావం ఉంటుంది
ఈ విశ్వం కూడా ఒక శబ్దం యొక్క ప్రతిధ్వని అని ( this universe is the vibration of a big sound )
ఇటీవల శాస్త్రజ్ఞులుకూడా కనుగొన్నారు.....................................
ఆ తరవాత లతికని పెళ్ళిచేసుకున్నాను, లతిక చెల్లెల్ని ఈశా యోగ ఆశ్రమానికి(కోయంబత్తూర్) తీసుకెళ్ళాం మూడు నెలల తరవాత తను మాట్లాడగలుగుతోంది నడవగలుగుతోంది
తిరిగి వచ్చే రోజు :అక్కడ అస్మిత అని ఒకావిడని కలిసాను లతికచెల్లికి వచ్చిన రోగం ఏంటని తెలుసుకోవడానికి
అప్పుడావిడ చెప్పిన మాట అప్పుడే నాకు నాగసాధువులు ఫోన్ చేసారు వాళ్ళు అన్న మాట కూడా ఒకటే
తనకి ఎవరో చేతబడి చేసారు ” ..................
నేనక్కడితో ఆగిపోలేదు నా పరిశోధన ఇంకా కొనసాగించాను
లతిక వాళ్ళ కుటుంబం అలా కావడానికి కారణం ఎవరిదో పగ అని, వాళ్ళ కర్మ, విధి లిఖితం ఎవరో జాతకం చెప్పేవాడు అంటున్నాడు
మనషికి అలోచించి నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం ఉన్నప్పుడు ఈతల రాతలు ఎక్కడివి ఏదో గ్రహం బాగాలేదని రాళ్లు పెట్టుకోవడం లేదా పేరు మార్చుకోవడం ఇవన్నీ ఏంటి స్వామి వివేకానంద నీ విధికి నీవే కర్తవి అని గొంతు నరాలు పగిలిపోయేలా ఎన్ని చోట్ల చెప్పాడు అలాంటప్పుడు వీటిని నమ్మాల్సిన పనేముంది ఎవరో పెద్ద వాళ్ళు చెప్పారని మనమెందుకు పాటిస్తున్నాం వాళ్ళు చెప్పినవన్నీ ఎంత వరకు నిరూపితమయ్యాయి.
ఒక వేళ గ్రహాల ప్రభావం ఉన్నాకూడా అమావాస్యకి పౌర్ణమికి సముద్రం ఎగిరి పడుతుంది కాని మానసికంగా మనం మన అదుపులో ఉన్నప్పుడు ఎగిరి పడుతున్నామా? ఏకాగ్రత, నిశ్చలత, స్థిత ప్రజ్ఞత ఇవి ఉన్న మనిషి జీవితం ఎప్పడూ అతని అదుపులోనే ఉంటుంది లేనప్పుడు వాటిని సాధించాలి ఎప్పుడైతే మన ఆలోచనలని,అలవాట్లని మనకి అనుగుణంగా మార్చుకోగాలుగుతామో అప్పుడే మనం మనిషిగా బ్రతకగలుగుతాం
ఇది నా స్నేహితుని జీవితం లో జరిగిన కథ అతని dairy లో రాసుకున్నాడు దాన్ని నాతొ పంచుకున్నాడు దానికి కొన్ని మార్పులు చేసి రాసాను వాడి అనుమతితో
-రచయిత

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
నాగ సాధువులు - by k3vv3 - 11-07-2023, 09:56 AM
RE: నాగ సాధువులు - by k3vv3 - 11-07-2023, 09:57 AM
RE: నాగ సాధువులు - by k3vv3 - 14-07-2023, 11:52 AM
RE: నాగ సాధువులు - by k3vv3 - 17-07-2023, 10:03 PM



Users browsing this thread: 1 Guest(s)