07-07-2023, 07:58 AM
(This post was last modified: 07-07-2023, 08:01 AM by k3vv3. Edited 3 times in total. Edited 3 times in total.)
ముడి పార్ట్ -10
ఓంకార్ తన ఊర్లో తనకున్న పొలం విషయమై ఎవరితోనో తీక్షణంగా వాదిస్తూ ఉన్నాడు ఫోన్ లో. ఈశ్వర్ కి ఆ సంభాషణ పై పెద్దగా దృష్టి సారించాలి అనిపించలేదు. చిత్ర మాత్రం ఒక్క క్షణం పాటు విని, విషయమేంటో సంగ్రహంగా అర్థం చేసుకుంది. ఇప్పటిలో ఆ సంభాషణ ముగిసేలా లేదని గ్రహించారు చిత్ర,ఈశ్వర్ లు.
"మళ్ళీ ఒద్దామా?" అడిగాడు ఈశ్వర్.
సరేనని తలూపింది చిత్ర.
లిఫ్ట్ వైపుగా వాళ్ళు బయలుదేరారు. ఇంతలో చిత్ర ఈశ్వర్ తో కాస్త మొహమాటంగా "ఇదో....కోపం తెచ్కోకు."అంది.
చిత్ర ప్రతీమాట ముందు 'కోపం తెచ్కోకు.' అన్న వచనాన్ని అంటించడం కాస్త విసుగ్గా తోచింది ఈశ్వర్ కి.
"ఏంటి?" అడిగాడు ఈశ్వర్.
".....ఇయాల ఏకాదశి. ఇది ఏందో ఇంకో రకం ఏకాదశి అంట.నిన్న టి.వి ల జెప్పిండే.... జెర ఆడ గుడి కాడికి పొయ్యొద్దమా?.... నువ్వేం లోపటికి రాకు. దబ్బున ఇట్ల మొక్కి, అట్ల ఒస్త నేను. ప్లీజ్." అంది చిత్ర.
"జెర సైకిల్ మోటర్లు ఫాస్ట్ గ ఒస్తయ్ పెద్ద రోడ్డు కాడ. మొన్న గుడికి పొయినప్పుడు జెర బయమయ్యిండె. గందుకె." అంది చిత్ర, ఈశ్వర్ ని తోడుగా రమ్మనడానికి వెనక వివరణ ఇస్తూ.
చిత్ర తనని తోడుగా రమ్మనడానికి అంత వివరణ ఇస్తూ ఉండటం కాస్త జాలి కలిగించింది ఈశ్వర్ కి.
"హం.ఓకే." అన్నాడు ఈశ్వర్.
ఇద్దరూ నడవడం ప్రారంభించాడు.మెయిన్ రోడ్ కి చేరే లోపు ఏదో ఒక విషయాన్ని గూర్చి తన భర్తతో మాట్లాడాలి అనుకుంది చిత్ర.
వారికి ఒక జంట ఎదురయ్యింది.అందులో అబ్బాయి చేతి చుట్టూ తన చేతిని అల్లుకుంటూ నడుస్తోంది అమ్మాయి.
'ఏందో ఏమో, నేనెప్పుడు ఇట్ల నడుస్తనో!' అనుకుంది చిత్ర మనస్సులో.
ఒక్కసారి తన భర్త వైపు చూసింది. ఈశ్వర్ తన వత్తైన జుట్టుని అప్రయత్నంగా చెరుపుకుని, తిరిగి సరిచేసుకుంటూ ఉన్నాడు. తన భర్త వల్ల తనలో పెరిగే తాపాన్ని అణుచుకోవడం బాగా కష్టంగా తోచింది చిత్రకు. తనకు జ్వరం తగ్గిందో లేదోనని తన భర్త తనను పరీక్షించినప్పుడు అతని చేతి స్పర్శ చిత్ర తనువులో, మనసులో ఎంతో అలజడిని రేపింది.
'ఏందో ఏమో, గీ మనిషికి నేను ఆడదాని లాగ కనిపిస్తున్ననా అసలు?!' అనుకుంది మనసులో.
తాను గుడికి పోతున్నదన్న విషయాన్ని గుర్తుతెచ్చుకుని, మనస్సులోనే చెంపలు వేసుకుంది చిత్ర.
"ఏందో ఏమో ఈడ మస్తు ఫాస్టు గ పోతరు జెనాలు." అంది చిత్ర ఈశ్వర్ తో, ట్రాఫిక్ ని ఉద్దేశించి.
"హం... సిటీ అన్నాక తప్పదుగా." బదులిచ్చాడు ఈశ్వర్.
"కొల్లాపూర్ ల గూడ కొన్ని కార్లు ఉన్నయ్ గాని మరీ గింత దబ్బ దబ్బ బోవు."
"ఓ."
"నాకైతె మస్తు బయమైతది గీ రోడ్ల పక్కన నడ్వాలంటె."
"ఓ.... నువ్వు ఇంతక ముందు సిటీ కి రాలేదా?"
ఒక 5 క్షణాల మౌనం తరువాత చిత్ర మాట్లాడసాగింది.
"ఒచ్చిన....అమ్మకి బాలేకుంటె. ఉస్మనియ దావకాన్ ల తీస్కపోయింటిమి. తర్వాత ఎప్పుడు రాలె."
"ఓ... ఏమైంది మరి? మీ అమ్మగారి కి తగ్గిందా?"
చిత్ర మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళు కాస్త తడిసాయి. అర్థం అయ్యింది ఈశ్వర్ కి. చిత్ర మనస్సు ని అనవసరంగా బాధ పెట్టాను అనిపించింది అతనికి. విషయాన్ని మార్చుదామని ప్రయతించినా ఆమెతో మాట్లాడటానికి అతనికి ఏ విషయమూ దొరకకపోయే సరికి ఊరుకున్నాడు. మూడు, నాలుగు నిమిషాల పాటు వారి మధ్య మౌనం ఆవహించింది. మెల్లిగా అతనికి ఆసుపత్రిలో మరణశయ్య పై పడి ఉన్న అమృత యొక్క చివరి క్షణాలు గుర్తుకు రాసాగాయి. అతని కళ్ళల్లో సన్నటి నీటి సుడులు తిరగసాగాయి.అప్రయత్నంగా తన భర్త వైపు చూసిన చిత్రకు కళ్ళల్లో నీటి తెరలు కలిగి ఉన్న ఈశ్వర్ కనిపించాడు. తన భర్తకు అతను ప్రేమించిన అమ్మాయి గుర్తొచ్చిందని గుర్తించింది చిత్ర.
ఎర్రబడ్డ కళ్ళు కలిగిన చిత్రకు, ఎర్రబడ్డ కళ్ళు కలిగిన తన భర్తకు స్వాంతన కలిగించాలి అనిపించింది!
"నువ్వు అస్సలు గుళ్ళకే పోవా?" అడిగింది చిత్ర, ఆ ప్రశ్నలో ఏలాంటి 'ప్రమాదం ' లేదని రూఢీ చేస్కుంటూ.
"హం." అనబోయి, ఇందాక చిత్రకు వాళ్ళ అమ్మ గుర్తొచ్చి కాస్త కలత చెందిన వైనం గుర్తుకు వచ్చి,
"recent గా మా team తో కలిసి office పని మీద చెన్నై వెళ్ళాం.అక్కడి నుంచి కంచికి వెళ్ళాం . అక్కడ temples చూశా.నాకు old temples చాలా ఇష్టం.వాటి architecture చాలా బావుంటుంది." అన్నాడు ఈశ్వర్.
"అంటే?" అడిగింది చిత్ర.
ఒక ఐదు క్షణాల పాటు ఆలోచించి,
"శిల్ప కళ." అని బదులిచ్చాడు ఈశ్వర్.
"ఓ." అంది చిత్ర, అర్థం అయినట్టుగా తలూపుతూ.
"ఇదో.... గుడొచ్చింది. నేను పొయ్యొస్త ఇగ. దబ్బున్నే ఒస్త. సరేనా?" అంది చిత్ర.
" పర్లేదు.take your own time.తొందర ఏమీ లేదు. నాకు పనేం లేదు." అన్నాడు ఈశ్వర్.
నిండుగా చిరునవ్వొకటి విసిరింది చిత్ర. ఆమె స్వచ్ఛమైన నవ్వుని చూసి మనస్సులో ఒకింత అపరాధభావం కలిగింది ఈశ్వర్ కి. నిజానికి అతనికి ఆ క్షణం అమృత గుర్తొస్తూ ఉంది. చిత్ర పక్కనుంటే అతను మనస్పూర్తిగా అమృత ని తలుచుకోలేకపోతున్నాడు. తనకూ, 'తన ' అమృతకూ నడుమ చిత్ర పెద్ద ప్రతిబంధకంగా తోచింది ఈశ్వర్ కి.
"నేనిక్కడ పార్క్ లో ఉంటాను. నీ పని చూసుకుని వచ్చేయ్. ఓకే నా?" అన్నాడు ఈశ్వర్.
తన భర్త తనతో అంత 'తియ్యగా' మాట్లాడుతుంటే పొంగిపోతూ ఇంకోసారి నిండుగా దరహాసం చేసింది చిత్ర.
చిత్ర మోము పై ఉన్న చిరునవ్వు ఒక్క క్షణం ఆకర్షణీయంగా తోచింది ఈశ్వర్ కి. అమృత బ్రతికున్నప్పుడు , తనను అమృత చూసినప్పుడు ఆమె కళ్ళల్లో అతనికి కనిపించిన మెరుపు చిత్ర కళ్ళల్లో కనిపించింది ఈశ్వర్ కి!
ఇంకో క్షణం కూడా చిత్ర కళ్ళను చూడకూడదని నిశ్చయించుకున్నాడు ఈశ్వర్.
అతని మస్తిష్కం లో మెరుపు లాంటి ఆలోచన కలిగింది. తన సెల్ ఫోన్ ని తీసి, ఫోన్ స్క్రీన్ ని చూస్తూ,
"okay then. నేను park లో కూర్చుంటా. okay నా?"
"మంచిది."అంటూ నవ్వుతూ వడి వడిగా గుడి ఉన్న సందులోకి నడక ప్రారంభించింది చిత్ర.
ఈశ్వర్ కాస్త ఊపిరి పీల్చుకుని, పార్క్ వైపు నడిచాడు. తన పక్కన చిత్ర లేకపోవడం తో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది ఈశ్వర్ కి. ఆ పార్క్ లో తను ఎక్కువగా కూర్చునే బెంచ్ పై కూర్చున్నాడు ఈశ్వర్.
గుడి వైపు నడుస్తున్న చిత్ర పక్కగా గుడి పూజారైన రామాచార్యులు నడవసాగాడు.
"స్వామికి దీపాలకు నూనె అయిపోయింది. నేను చూస్కోలేదు." అన్నాడు రామాచార్యులు తన చేతిలో నున్న నువ్వుల నూనె బాటిల్ ని ఉద్దేశించి.
"ఓ... ఇరోజు ఏదో మస్తు మంచి దినమంట గద అయ్గారూ. అందుకే ఒస్తి నేను."
"హా.... కానీ మేము వైష్ణవులం. స్మార్థులకీ మాకూ వేరే ఉంటాయి పండగలు."
"ఓ." అంది చిత్ర, ఆయన ఉద్దేశం ఏంటో పూర్తిగా అర్థం కాకున్నా.
"ఇందాక మీతో పాటు వచ్చిన ఆయన మీ వారా?" అడిగాడు రామాచార్యులు.
"హా అవ్ను. పేరు ఈశ్వర్. సాఫ్ట్ వేర్ల పనిజేస్తడు." అంది చిత్ర తన ముఖాన్ని సంతోషం తో వెలిగించుకుంటూ.
"ఓ... మరి గుడికి రాలేదేమి ?"
".....అంటే గాయ్న గుళ్ళకి ఎక్కువ పోడు." అంది చిత్ర.
"హ్మ్మ్ం. అలాంటి వాళ్ళనే స్వామి బాగా చూస్తాడు. పూజ చేసే మనమంటే కాస్త లోకువ ఆయనకు."అన్నాడు రామాచార్యులు ఎన్నో రోజులుగా తాను కోరుతున్న కోర్కెలను తీర్చని రాముడి పై కాస్త కోపం తెచ్చుకుంటూ.
దరహాసం చేసింది చిత్ర. దేవుడిని నమ్మని విషయం లో తన భర్త పట్ల కాస్త ఆందోళన గా ఉండే చిత్ర కు మాటవరసగా రామాచార్యులు అన్నమాట చాలా ఉపశమనాన్ని ఇచ్చింది.
"కానీ చానా మంచోడు. మస్తు మంచిగ చూస్కుంటడు నన్ను." అంది చిత్ర, అసందర్భంగా.
"హ్మ్మ్ం. మీ పేరేమిటి" అడిగాడు రామాచార్యులు, చిత్ర మాటతీరుకి కాస్త ముచ్చటపడుతూ.
అక్కడి నుంచి వారి సంభాషణ చిత్ర ఊరి వివరాలూ, ఆమె తల్లిదండృల మరణం, భాగవతం లొ శ్రీకృష్ణుడి లీలలు, స్మార్థూలకూ, వైష్ణవులకూ మధ్య ఉన్న వ్యత్యాసం.... ఇలా అనర్గళంగా సాగిపోసాగింది.
****
పార్క్ లో కూర్చున్న ఈశ్వర్ కి మాత్రం అమృత కన్నా చిత్ర గురించి ఆలోచన ఎక్కువగా రాసాగింది. తన వైపు చూసినప్పుడు చిత్ర కళ్ళల్లో కనిపించిన మెరుపు అతడికి చాలా ఆశ్చర్యాన్నీ, భయాన్నీ కలిగించింది. ఆమెను దూరం గా పెడదామని నిర్ణయించుకున్నాడు. కానీ అంతక ముందు చిత్ర గాయానికి మందు రాసేటప్పుడు చిత్ర అతనితో అన్న మాటలు అతనికి గుర్తుకు రాసాగాయి. చిత్ర పట్ల వికర్షణాభావం, అపరాధభావం రెండూ అతన్ని ఏకకాలం లో దాడి చేయసాగాయి. అమృత ని తలచుకోవడానికి కూర్చున్న ఈశ్వర్, తన ఉద్దేశాన్ని మర్చిపోయాడు!
ఇంతలో అతని కాలికి ఒక బంతి వచ్చి తాకింది. అతనికి నాలుగడుగుల దూరం లో మూడేళ్ళ పిల్ల అతన్ని ఆ బంతిని అందివ్వవలసిందిగా ఆగ్న్యాపించసాగింది. దాన్ని చూసి , చిన్న పిల్లలంటే చాలా ఇష్టపడే అమృత అతనికి గుర్తొచ్చింది. ఆ పిల్లని చూసి నవ్వుతూ ఆ బంతిని తన దెగ్గరే పెట్టుకున్నాడు ఈశ్వర్.
"ఓయ్! నాది. అది నాది." అంటూ ఉంది ఆ పిల్ల ఈశ్వర్ ని బెదిరిస్తూ.
"హేయ్ విన్నూ అలా అనొద్దు elders ని " అంటూ ఉంది ఆ పిల్ల వాళ్ళ అమ్మ.
పర్లేదు అన్నట్టుగా సైగ చేసాడు ఈశ్వర్ ఆమె వైపు చూస్తూ. బంతిని తీసుకుని ఆ చిన్నపిల్లతో ఆటలాడసాగాడు ఈశ్వర్.
***
పూజారితో జోలి లో మునిగిపోయిన చిత్రకు తన భర్త పార్క్ లో ఎదురుచూస్తున్నాడన్న విషయం గుర్తుకు వచ్చింది.
"అయ్గారూ. నేను ఇగ పొయ్యిస్త. ఈన ఆడ పార్కు ల నా కోసం ఎదురు చూస్తుంటడు." అంది చిత్ర కాస్త హడావిడిగా.
"మంచిది తల్లి. వస్తూ ఉండు. అయినా ఆయనకి నువ్వు నచ్చితే ఎలాగోలా నిన్ను మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటాడు లే." అన్నాడు రామచంద్రయ్య కృష్ణుడిని ఉద్దేశించి.
చిరునవ్వొకటి నవ్వి, పార్క్ వైపుగా బయలుదేరింది చిత్ర.
తన భర్త తన కోసం విసుగ్గా వేచి ఉంటాడేమోనని అనుకున్న చిత్రకు వొళ్ళో చిన్న పిల్లని కూర్చోబెట్టుకున్న ఈశ్వర్ కనిపించాడు.దానితో ముచ్చట్లు పెడుతూ ఉన్నాడు. అంత వరకూ ఎప్పుడూ చూడని పార్శ్వం కనబడించి ఈశ్వర్ లో చిత్ర కు. ఆ క్షణం ఒళ్ళో చిన్నపిల్లని కూర్చోబెట్టుకున్న ఈశ్వర్ చాలా చాలా ఆకర్షణీయంగా కనిపించాడు చిత్రకి. ఒక రెండు నిమిషాల పాటు ఈశ్వర్ ని చూస్తూ నిలబడిపోయింది చిత్ర.
'గీ మనిషి బంగారమసలు. ఇసొంటి మనిషికి గంత బాధ ఎందుకు పెడ్తుండో దేవుడసలు. ' చిత్ర అనుకుంది మనస్సులో .
అప్రయత్నంగా చిత్రను చూశాడు ఈశ్వర్. పాపని కిందకు దింపి, వాళ్ళ అమ్మ దెగ్గరికి తీసుకుపోయి వదిలాడు.
"జెర లేటయ్యింది... సారి." అంది చిత్ర.
"పర్లేదు." అన్నాడు ఈశ్వర్.
" ఈ గుడిల గూడ శిల్పాలుంటయ్. క్రిష్ణుడు తెల్లగుంటడు మస్తు కళ మీద." అంది చిత్ర, మరల ఇంకెప్పుడైనా తాను గుడికి వచ్చినప్పుడు ఈశ్వర్ కూడా తనతో పాటు లోపలికి వస్తాడని ఆశపడుతూ.
"హం." అన్నాడు ఈశ్వర్, చిత్ర పరిగ్న్యానానికి నిట్టూరుస్తూ.
***
ఓంకార్ , జ్యోతులు దీర్ఘాలోచనలో నిమగ్నమయ్యున్నారు. ఇంతలో చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ వచ్చారక్కడికి.
ఓంకార్ వైపు చూస్తూ" అది... మా colleague shift అవ్తాడని చెప్పాను గా. అతను family తో పాటు వస్తున్నాడు రేపు. so penthouse ని కొంచం neat గా clean చేయండి. ఓకేనా?" అన్నాడు ఈశ్వర్.
సరేనంటూ తలూపాడు ఓంకార్.
"ఇది తీస్కోండి." అంటూ ఓంకార్ చేతిలో 500 నోటు పెట్టాడు ఈశ్వర్.
"రేపు మార్నింగ్ కల్లా చేయండి . ఓకేనా?" అన్నాడు ఈశ్వర్.
సరేనన్నాడు ఓంకార్.
తన ఫ్లాట్ కి బయలుదేరే సమయానికి , చిత్ర ఓంకార్ తో " ఊర్ల ఏమన్న పొలం పంచాయితీ అయ్తుందా?" అడిగింది చిత్ర.
వాళ్ళు ఆశ్చర్యంగా ముఖం పెట్టేసరికి, "ఇందాకనే ఒచ్చింటిమి మీకోసం. ఫోన్ ల మాట్లాడుతుండే సరికి బయటికి పోయింటిమి.... గిట్ల మీ విషయమ్ల ఏలు పెడ్తున్ననని ఏమనుకోకండి." అంది చిత్ర.
"అయ్యో, అదేం లేదు మేడం.మాకు నాలుగు ఎకరాలు భూమి ఉంది ఊర్లో... మా పక్క పొలం వాళ్ళు మా పొలం లోకి వచ్చేస్తున్నారు.అదే గొడవ." అన్నాడు ఓంకార్.
"ఆ పొలం ఉందన్న ధైర్యం తోటే మేమున్నాము. పిల్లల చదువులూ, దీని పెళ్ళి, ఇవన్నింటికీ ఆ పొలం ఉందన్న ధైర్యం తోటే ఉన్నాము. " అంది జ్యోతి, ఆందోళనగా.
"ఓ పని జేయండి.ఎమ్మార్వో ఆఫీసుల అర్జీ పెట్టండి. మండల్ సర్వెయర్ అని ఉంటడు. గాయ్నొచ్చి మీ పొలాన్ని కొలుస్తడు.నక్ష ప్రకారం ఉందో లేదో గాయ్ననే చెప్తడు.... తర్వాత గూడ ఆళ్ళు మీ పొలం ల ఒస్తే, అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ కేసు పెట్టొచ్చు.సర్కార్ సర్వేయరే హద్దుల్ పెట్టిండు గాబట్టి, కేసు కోర్టుకి పొయినా గూడ మీకే లాభంగ ఒస్తది.అర్థమయిందా?" అంది చిత్ర.
"హా ... సరే మేడం. కానీ వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. బాగ పట్టుంది వాళ్ళకి మా ఊరిలో .మేమేమో ఊరు వదిలి వచ్చి చాలా రోజులైంది." అన్నాడు ఓంకార్.
"నాకర్తమైంది.గానీ గట్టిగుండాలె మనం ఈ పంచాయితీల విషయం ల. అవతలోళ్ళు ఇజ్జేయనీకె ట్రై జేస్తుంటరు. మనం బయపడ్తున్నట్టు అస్సల్ కనిపియ్యొద్దు" అంది చిత్ర.
"ప్చ్...కానీ ఇలా అవ్తుందని అనుకోలేదు మేడం . భయమేస్తోందసలు రేపటి నాడు పిల్లల పరిస్థితి ఏమవుతుందో నని." అంది జ్యోతి.
"నేనదే జెప్తున్న! మీరు గట్టిగుండాలె ఇసొంటప్పుడు . ఊర్లల్ల నే ఓర్వలేనోళ్ళు ఎక్కువగ ఉంటరు. ఏం జేద్దమనుకున్నా జాగ్రత్తగ, ఎవ్వరికి తెల్వకుండ ఉండాలె. ఊకె చెప్ప్కోగూడదు ఏం జెయ్య బోతున్నమని. అర్తమైందా?" అంది చిత్ర.
"హా సరే మేడం." అన్నారు వాచ్ మెన్ దంపతులు కలసికట్టుగా.
"పొయ్యొస్త ఇగ నేను. మీరైతె జెర ధైర్యంగ ఉండండి. ఊకె టెంషను పడ్డ్నట్టు కనిపిస్తె, అవ్తలోళ్ళు బనాయిస్తుంటరు." అంది చిత్ర.
"అలాగే మేడం." అంది జ్యోతి.
**
"నీకు land dealings గురించి చాలా తెలిసనుకుంటా." అన్నాడు ఈశ్వర్, ఎంత ఆపుకుందామనుకున్నా ఉండలేక.
"హా.... ఊర్ల ఊకె యివే ఇంటుంట గద." అంది చిత్ర, పెళ్ళయ్యాక తొలిసారిగా వంట విషయం లో కాక తన పరిగ్న్యానం విషయం లో తన భర్త నుంచి అభినందన అందే సరికి లోలోన మురిసిపోతూ.
"ఓ... మీకు ఎన్ని acres ఉంది పొలం?" అడిగాడు ఈశ్వర్.
"మామ ఓళ్ళకి అంటున్నవా?" అడిగింది చిత్ర, ఈశ్వర్ ప్రశ్న అర్థమైనా కావాలనే, ఇకపై తన ఇల్లు తన మెట్టినిల్లేనని ప్రస్పుటమయ్యేలా!
ఈశ్వర్ కి చిత్ర యొక్క తర్కం అర్థం కాలేదు.
"హా అవ్ను. "అన్నాడు.
ఈశ్వర్ యొక్క 'అమాయకత్వానికి ' లోలోన నిట్టూర్చి,
" నాల్గు ఎకరాలుంది." అంది చిత్ర.
"ఓ." అన్నాడు ఈశ్వర్.
"ఎక్కువ బుడ్డలేస్తరు మామ ఓళ్ళు. వర్షాలు ఎక్కువ పడవ్ ఆడ అందుకే అట్ల. సింగోటం అనే ఊరుందోటి.ఆడ పెద్ద చెరువుంటది ఆడి కెళ్ళి ఒస్తయ్ నీళ్ళు వర్షాకాలం ల. ఇంగ ఎండ కాలం బోర్ నీళ్ళే వాడ్తం. దేవుని దయవల్ల మంచిగ నీళ్ళు పడ్డయ్ మామ ఏశిన బోర్ల."
" బుడ్డలు అంటే వేరుశెనగలా?" అడిగాడు ఈశ్వర్, చిత్ర మాండలీకాలని ని అర్థం చేస్కోడానికి కష్టపడుతూ.
"హా అవ్నవ్ను. పాల బుడ్దలు పండిస్తం. మస్తుంటయ్ తియ్యగ. ఉడక వెట్కోని తింటే ఇంగా మస్తుంటయ్. ఈసారి ఊరికొచ్చినప్పుడు తిందువు గాని." అంది చిత్ర, తన ఊరిని గుర్తు చేసుకుంటూ.
"హం." అన్నాడు ఈశ్వర్, చిత్ర మరీ 'దెగ్గరయినట్టు ' మాట్లాడుతుందేమో నన్న భావన కలిగిన వాడై.
'ఏందో ఏమో, ఈ మనిషి మళ్ళ మొదటికొస్తడు!' అనుకుంది చిత్ర మనస్సులో.
"బాగ పొలం ల పని జేస్తుంటి నేను మామోళ్ళ ఇంట్ల ఉన్నప్పుడు. గీడికొచ్చినాక ఏం పనుంటలే అస్సలు." అంది చిత్ర, ఈశ్వర్ తో సంభాషణని కొనసాగించాలన్న కోరికను అదిమిపెట్టలేక. కానీ తాను అనవసరంగా మాట్లాడినట్టే అనిపించింది చిత్రకు.
"హం." అన్నాడు ఈశ్వర్ ఇంకోసారి.
సంభాషణని ఇంకా కొనసాగిస్తే వ్యవహారం చెడేటట్టు ఉందనుకుని ఊరుకుంది చిత్ర.
****
"ఇదో.... కోపం తెచ్కోకూ.నాకు గా తిండి పోతలే అస్సలు. చెపాతీలు జేస్త. అసల్ నూనె లేకుండనే జేస్త. కూర ఎప్పటి తీర్ననే కారం లేకుండ జేస్త. ఏమంటవ్ ?" అంది చిత్ర.
"ఓ పని చేయి. సలాడ్ చేసుకుని వస్తా. ఓకేనా?"
సరేనంది చిత్ర.
పది నిమిషాల పాటు ఎదురు చూడసాగింది చిత్ర, సోఫా మీద కూర్చుని టి.వి చూస్కుంటూ.
ఈశ్వర్ సలాడ్ తో వచ్చాడు.
"తిను." అని చిత్ర చేతికి అందించాడు ఈశ్వర్.
"ఏందో సలాడు అంటివి గద?!"
"సలాడ్ ఏ కదా నీకు ఇచ్చింది."
సలాడ్ అంటే పచ్చి కూరగాయల ముక్కలని అస్సలు ఊహించలేదు చిత్ర. దానికన్నా మధ్యహ్నం బ్రౌన్ బ్రెడ్ ఏ నయం అనిపించిందామెకు.
'ఏందో ఏమో , ఈ మనిషి నన్ను మేక లాగ జేస్తుండు." అనుకుంది చిత్ర మనస్సులో.
"ఇంగో, మరీ గివే తింటే రాత్రి ఆకలవ్తది నాకు."
"ఆకలేస్తే మంచిదే. it shows that your appetite hasn't died." అన్నాడు ఈశ్వర్.
'వామ్మో ఇప్పుడివి తినకపోతే నేను సచ్చిపోతా అని జెప్తుండా?!' అనుకుంది చిత్ర, ఈశ్వర్ చెప్పిన వాక్యం అర్థం కాక.
***********
చాలా చాలా కష్టపడి తనకు జ్వరం లేదని ఈశ్వర్ ని ఒప్పించింది చిత్ర. నూనె లేని తిండి మాత్రమే వండుకుందామని మాటిచ్చింది చిత్ర. ఇష్టం లేకున్నా, చిత్ర తో వాదనను పొడిగించడానికి సిద్ధంగా లేక ఒప్పుకున్నాడు ఈశ్వర్.
రోజు కన్నా తక్కువ మిరపకాయలతో తాను చేసిన పాలకూర పప్పు తినడానికి చాలా అవస్థ పడింది చిత్ర. తన కంచాన్ని సింక్ దెగ్గరకి తీసుకువెళ్తుంటే కాలింగ్ బెల్ చప్పుడు వినబడిందామెకు.
వెళ్ళి తలుపు తీసింది ఈశ్వర్ వచ్చేలోపే. అక్కడ ఒక జంట ఒక పిల్లాడితో కలిసి నిలబడి ఉన్నారు.
"అదీ ఈశ్వర్ సార్ ఉన్నారా మేడం?"
"హా ఉన్నడు." అంటూ చిత్ర తన భర్త ని పిలిచేలోపే వచ్చాడు ఈశ్వర్.
"హా విశ్వనాథ్, రండి లోపలికి." అన్నాడు ఈశ్వర్.
చిత్రకి వారితో వచ్చిన బాబు చాలా ఆకర్షణీయంగా కనిపించాడు. సుమారు నాలుగేళ్ళ వయసుండి, కళ్ళనిండా అల్లరిని నింపుకుని, చిత్ర వంక చూస్తూ ఉన్నాడు. వాడిని తన దెగ్గరకు పిలిచి
"వాట్ ఈజ్ యువర్ నేం?" అని అడిగింది చిత్ర. వాడు నవ్వుతూ ఉన్నాడు సమాధానం చెప్పకుండా.
"టెల్ మి. వాట్ ఈజ్ యువర్ నేం?" మళ్ళీ అడిగింది చిత్ర, వాడి నవ్వుకి ప్రతిగా నవ్వి.
"మేడం .... వాడు మాట్లాడలేడు." అన్నాడు విశ్వనాథ్.
------------------------------------సశేషం --------------------------

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ