Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆత్మఘోష
#2
మౌనిక:- (నార్మల్ రూపం) బాలు!!... శక్తి వుండి కూడా ఆశక్తురాలను అయ్యాను... యశస్వి ఇంటి చుట్టూ ఒక రక్షా యంత్రం వున్నది... అందువల్ల నేను ఆ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నా ... ఇప్పుడు నేను ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళలేను... ఇంటి లోపలకి నేను రాలేను...ఒకవేళ వస్తే తిరిగి మళ్లీ బయటకు వెళ్ళలేను...అందుకే నాకు నీ సహాయం అవసరం అయింది... బాలూ!!.
బాలు:- కానీ నేనే ఎందుకు??...నీ పని కోసం నన్నే ఎందుకు వెతికావు??
మౌనిక:- బాలూ!! నీకు గతం గుర్తు లేదు.. సరిగ్గా ఒక ఏడాది క్రితం నువ్వు ఒక అగ్ని ప్రమాదంలో ఒక అమ్మాయిని రక్షించటం కోసం ఎగసి పడుతున్న మంటల మధ్యకి వెళ్లి మరీ ఆమెను కాపాడాలని ట్రై చేశావు.... కానీ విధి ఇలా రాసి వుంటే మనం మాత్రం ఏం చేయగలం... అప్పటికే ఆ అమ్మాయి కాలిపోయి చావుకి దగ్గరలో వుంది.. అతను ఆమెను బయటకు తీసుకు వస్తూ వుంటే ఒక దూలం పడి...నువ్వు కింద మంటలో పడిపోయావు... నీ మొహం మొత్తం కాలిపోయింది.. నిన్ను ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు... ఆ అమ్మాయి చనిపోయింది... నువ్వు కాలిపోయిన మొహంతో అలా వున్నావు.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే బాలూ!!...(తన కంటి నుండి తన ప్రమేయం లేకుండా కన్నీరు బయటకు వస్తుంది)
మౌనిక :- అప్పుడే సమాధిలో వున్న నాకు మా పనివాడు,, కాదు కాదు నన్ను పెంచిన నా తండ్రి మాటలు వల్ల జరిగిన విషయం తెలుసుకున్నా... అంతే నాలో అప్పటి వరకు వున్న యశస్వి మీద ప్రేమ పోయి అసహ్యం వేసింది... అమ్మ కోరిక ఎలాగైనా తీర్చాలి అని అనుకున్నా... ఎందుకంటే అమ్మకి నా కంటే యశస్వి అంటేనే ప్రాణం.
బాలు :- కానీ ఆ యశస్వి మీ అమ్మ ప్రాణం తీశాడు అని తెలిసి కూడా ఎందుకని నువ్వు అతని మీద పగ తీర్చుకోవడం లేదు...
మౌనిక :- అమ్మ, నా చిన్నతనంలో, ఏ కారణం చేత కూడా నువ్వు గాని యశస్వి గాని గొడవ పడకూడదు..... నేను బ్రతికి వున్నంత వరకు అంది.... అమ్మ కి ఇచ్చిన మాట వల్ల యశస్వికి ఎటువంటి హానీ తల పెట్టలేదు... అంతే
బాలు:- కానీ, మీ అమ్మగారు నీతో పాటు, ఆ మంటల్లో చనిపోయారు కదా..?
మౌనికా:- లేదు బాలు!! ఆవిడ ఇంకా బ్రతికే వున్నారు... ఆ ట్రస్ట్ వాళ్ళు చావు బ్రతుకుల మధ్య వున్న కొంతమందిని తీసుకు వెళ్లి వైద్యం చేస్తున్నారు... అప్పుడు అమ్మ వున్న గది పూర్తిగా దగ్ధం అవ్వడం వల్ల అమ్మ చనిపోయింది అనుకున్నారు... కానీ ఆమె అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేదు... వేరే చోట వుంది. అమ్మ మొహం కాలిపోవడం, అలాగే అమ్మ ఒక్కసారిగా అంత పెద్ద అగ్ని ప్రమాదం, అందులో మేము అందరం మరణించటం చూసి షాక్ కి గురి అయ్యి ఒక స్టేట్ లోకి వెళ్లి పోయింది... అందువల్ల అమ్మని ఎవరూ అక్కడ గుర్తు పట్టలేక పోయారు... కానీ ఆ ట్రస్ట్ లో వున్న రాధిక అనే ఒక అమ్మాయి ఆమెను గుర్తు పట్టి చాలా చక్కగా వైద్యం చేస్తూ వుంది"
"నేను నీకు ఎలా కనిపించి సహాయం అడిగానో అలాగే ఆమెకు కనపడి అమ్మ విషయం బయట ఎవరికీ చెప్పవద్దు అన్నాను... అలాగే అమ్మ ఎప్పుడూ కూడా "యశస్వీ!! యశస్వీ!! అని ఆ దుష్ట దుర్మార్గపు చక్రవర్తి ని తలుస్తుంది... కాబట్టి నాకు ఈ ఆస్తి తో పాటు యశస్వి మొహం కూడా నాకు అవసరం అయింది అమ్మ ఆరోగ్యం కోసం""అందుకే నీకు ఆపరేషన్ చేసే డాక్టర్ శరీరంలో ప్రవేశించి నేను నీకు యశస్వి మొహం వచ్చే విధంగా ఆపరేషన్ చేశాను... అందుకే నువ్వు చూడడానికి యశస్వి లా వుంటావు"
"బాలూ!! నువ్వు నాకు దేవుడు పంపిన ఏంజెల్,,, అగ్ని ప్రమాదంలో నాకు సహాయం చేయడంలో విఫలం అయ్యి, ఇప్పుడు ఇక్కడ ఇలా హెల్ప్ చేశావు,. ఇదంతా విధి!!.... దైవ నిర్ణయం అందుకే నువ్వు నా గతం చెప్పకపోయినా.... నేను మాట్లాడిన మొదటి క్షణాలలోనే నువ్వు ఆ పని చెయ్యడం కోసం ఒప్పుకున్నావు.""ఇక నేను నిన్ను అమ్మతో చూస్తే..చాలు నా ఆత్మ కి శాంతి కలుగుతుంది...బాలూ!! ""
బాలు, మౌనిక చెప్పిన మాటలకు తన హృదయం నుండి ఉబికి వస్తున్న కన్నీటి ఆపుకుని.... అక్కడ నుండి మరో సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు"
@ కొన్ని రోజుల తర్వాత బాలు, ఆ ట్రస్ట్ కి చైర్మెన్ అయ్యాడు... బాలు తో పాటు మౌనిక వాళ్ల అమ్మ కూడా ఆ ట్రస్ట్ లోనే వుంటున్నారు... తాను అనుకున్న పనులలో ఒక పని జరిగింది... నా దగ్గర నా కూతురు లేకపోతేనేం నా కొడుకు వున్నాడు అని ధైర్యం గా బ్రతకటానికి మహాలక్ష్మి గారికి ఒక ఆసరా దొరికింది... రోజులు వేగంగా పరుగులు తీశాయి,మెల్లగా బాలు తన పేరు మర్చిపోయాడు.... అలాగే మౌనిక ఆత్మ కూడా ఇంక బాలు కి, రాధిక కి కనిపించటం మానేసింది"

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
ఆత్మఘోష - by k3vv3 - 05-07-2023, 06:53 PM
RE: ఆత్మఘోష - by k3vv3 - 05-07-2023, 06:56 PM
RE: ఆత్మఘోష - by sri7869 - 18-07-2023, 11:57 PM



Users browsing this thread: 1 Guest(s)