04-07-2023, 09:06 AM
ముడి 9వ భాగం
"గియన్ని పండ్లు నాకోసమేనా ?" ఆపుకోలేక అడిగింది చిత్ర.
"హం."
"గియన్ని నేనొక్కదాన్ని ఎట్ల తింట?"
ఈశ్వర్ మౌనంగా కార్ నడపసాగాడు.
"అంటే మరీ గిన్ని వెరైటీలు తెస్తివి."
"నీకు ఏవి ఇష్టమో నాకు తెలీదు కదా. ఇంక అందుకే."
'నన్ను అడిగింటె చెప్తుంటి గద మరి.' అని అనబోయి ఊరుకుంది చిత్ర.
కార్ కిలోమీటర్ ప్రయాణించిన తరవాత ఈశ్వర్ " సారీ." అన్నాడు, చిత్ర ని గద్దించిన విషయం గుర్తుకు వచ్చి.
" నాకు చెప్తున్నవా?" అడిగింది చిత్ర.
"ఇక్కడ మనిద్దరం కాకుండా ఇంకెవరు ఉన్నారు?" అడిగాడు ఈశ్వర్.
"అయ్య సారి ఎందుకు? అయినా గట్ల సారి జెప్తరా గలీజ్ గ?"
"హం." అన్నాడు ఈశ్వర్ , చిత్ర ఇంకేమైనా సన్నిహితంగా వ్యాఖ్య చేస్తుందేమో నని భయపడి.
ఒక రెండు నిమిషాలు గడిచాక ,
"ఇదో... ఒక్క మాట జెప్త కోపం తెచ్కోకు." అంది చిత్ర కాస్త బెరుకు కలిగిన స్వరం తో.
"ఏంటి?"
"ఇంగో, నాకింగా జెరమే రాలే. నువ్వప్పుడే గిన్ని పైసల్ పెడ్తున్నవ్. నువ్వు అనోసరంగ ఆగం ఆగం అవ్తున్నవ్ ఏం గాక ముందే."
చిత్ర మాటలు విన్న ఈశ్వర్ మౌనంగా కార్ నడపసాగాడు.
వారు తమ ఫ్లాట్ చేరుకున్నారు.
"చిత్రా..."
ఈశ్వర్ ఏం చెబుతాడోనని ఆసక్తిగా ఎదురుచూడ సాగింది చిత్ర.
"health అన్నది life లో చాలా important.చాలా చాలా important.... నీకు విసుగు తెప్పించటం నా ఉద్దేశం కాదు." అన్నాడు ఈశ్వర్, తన గుండె పొరల్లో ఉన్న అమృత అతనికి గుర్తుకు వస్తుండగా.
ఈశ్వర్ మాటల్లో చాలా తడి కనిపించింది చిత్ర కు.
" అయ్య! నువ్వు ఇట్ల ఆలోచిస్తుంటె మస్తు సంతోషమైతది నాకు." అని అనబోయి, వ్యవహారం చెడుతుందేమోనని, స్పందనను మార్చుకుంది చిత్ర.
"అవ్ను! వకీల్ శ్రీనివాస రావు గూడ మామ కు ఊకె ఇదే చెప్తడు." అంది చిత్ర.
"హం." అన్నాడు ఈశ్వర్.
తన భర్త ఇంకేమైనా చెబుతాడేమోనని ఎదురు చూస్తున్న చిత్ర తో,
"వెళ్ళి rest తీస్కో. ఒక వేళ body pains కానీ, feverish గా కానీ ఎక్కువగా అనిపిస్తే మనం doctor కి call చేద్దాం ." అన్నాడు ఈశ్వర్.
సరేనని తలూపుతూ గది వైపు నాలుగడుగులు వేసిన చిత్ర, ఈశ్వర్ వైపు తిరిగింది.
" ఇదో.... నాకు ఆకలవ్తుంది. మధ్యానం నువ్వు తినొద్దన్నవ్ గా. ఇంగా తిన్లే నేను."
"oh... sorry sorry sorry. fruits cut చేసి తీసుకొస్తా. తిందువు గాని." అన్నాడు ఈశ్వర్.
"అవ్సరమ్లే తరగడం...... అంటే ముక్కల్ తరిగితె, తిననీకె ఇంగా బావుంటది." అంది చిత్ర, తన భర్త తన కోసం పండ్లు ముక్కలు ముక్కలు గా కోస్తే తిందామని సంబరపడుతూ.
"fine. five minutes " అంటూ కిచెన్ లోకి వడివడిగా నడుస్తూ వెళ్ళాడు ఈశ్వర్.
'జెరం రాకముందే ఇంత జేస్తున్నడు. జెరమొస్తే ఇంగెన్ని సేవల్ జేస్తడో ఏమో.' అని నవ్వుకుంది చిత్ర.
ఎనిమిది నిమిషాల తరువాత ఒక tray లో తినుభండారాలని చక్కగా కుదుర్చి తెచ్చాడు ఈశ్వర్. అంతకు ముందు హోటల్లో వారు దోశలు తిన్నప్పటి వెయిటర్ గుర్తొచ్చి, లోలోన నవ్వుకుంది చిత్ర.
" డబుల్ రొట్టె ఎర్రగుంది ఏంది ?!" అడిగింది చిత్ర.
చిత్ర కంటి చూపుని బట్టి, ఆమె brown bread ని ఉద్దేశించి మాట్లాడుతోందని గ్రహించాడు ఈశ్వర్.
"ఇది brown bread. it is a different kind of bread అంతే. health కి మంచిది." బదులిచ్చాడు ఈశ్వర్.
"ఓ..." అంది చిత్ర , ఆ bread వంక కాస్త ఆబగా చూస్తూ.
"apples ని pieces చేసి తెచ్చా. mousambi juice. brown bread. సరిపోతాయా? ...అయినా మరీ ఎక్కువ food intake మంచిది కాదు fever ఉన్నప్పుడు.digestion కి ఇబ్బంది అవ్తుంది."
"అయ్య, మస్తయితయ్ గివన్ని." అంది చిత్ర, tray ని ఈశ్వర్ చేతి లో నుంచి అందుకుంటూ.
" బత్తాయి రసం నాకు మస్తు ఇష్టం. కొల్లాపూర్ బస్టాండ్ కాడికి పొయినప్పుడల్ల మామ తాపుతడు నాకు." అంటూ ఒక గుటక లో రసాన్ని కాస్త తాగింది చిత్ర.
" ఇందుల శక్కెర మర్చిపొయినట్టున్నవ్ జూడు." అంది చిత్ర.
"actually sucrose immune system ని weak చేస్తుంది. so it is not advisable to take sugar during fever " అన్నాడు ఈశ్వర్.
గ్లాసు లో మిగిలిన రసాన్ని చూసి భయపడుతూ, brown bread ని తీసుకుని నోట్లో పెట్టుకుంది చిత్ర.
'ఏందో ఏమో, దీని కన్న గోధం పిండి నోట్లేస్కోని సప్పరియ్యడం నయం గద." అనుకుంది చిత్ర మనస్సులో.
"if you don't mind ,కాస్త work balance ఉంది నువ్వు తిన్నాక tablets వేసుకో. okay నా?" అన్నాడు ఈశ్వర్, మందులని చిత్ర పక్కన ఉంచుతూ.
" అయ్యో ! పో, పో. నేను గోలీలేస్కోని రెస్టు తీస్కుంట గాని." అంది చిత్ర.
ఈశ్వర్ తన గదిలోనికి వెళ్ళాడని నిర్ధారించుకున్న మరుక్షణమే ఆ రసాన్ని సింకు లో పార బోసి, ఆ brown bread ని చెత్త బుట్టలో వేద్దామన్న ఆలోచన కలిగింది చిత్రకు ఒక్క క్షణం.
కానీ కడుపులో ఆకలీ, వాటిని కొనడానికి అయిన ఖర్చూ, అన్నం దైవం తో సమానమని తాను విన్న సూక్తులూ గుర్తొచ్చి, కష్టంగా వాటిని 'అయిపోగొట్ట ' సాగింది చిత్ర. తిన్నాక గోలీలను మింగింది.
'రెస్ట్ ' తీస్కుందామని ప్రయత్నించి, కుదరక, మంచం పై అటూ, ఇటూ నుసల సాగింది చిత్ర.
'ఎందో ఏమో, జెర శరీరానికి పనుంటే గద నిద్ర రానీకె.' అనుకుంది మనస్సులో.
టి.వి పెట్టుకుని చూద్దామని ఉన్నా, ఈశ్వర్ అంత 'ప్రీతి ' తో తనను 'రెస్ట్ ' తీస్కోమ్మన్న విషయం గుర్తొచ్చి ఊరుకుంది చిత్ర.
కళ్ళు మూసుకుని నిద్ర కోసం ఎదురు చూస్తున్న ఆమె ముందు తన మేనమామ కదలాడసాగాడు.
'ఏందో ఏమో, మామ ఒక్క ఫోను గూడ చేస్తలేడింగా.' అనుకుంది చిత్ర లోలోన. తన ఊరిలో జరిగిన ఎన్నో సరదా సంఘటనలు చిత్ర కు గుర్తు రాసాగాయి. ఆమె మోము పై అప్రయత్నపూర్వకమైన దరహాసమొకటి చిగురించింది.తన భర్త తో కలిసి తన ఊరికి వెళితే , ఎవరెవరు ఎలా స్పందిస్తారోనని ఊహించుకోసాగింది.
నోరు తెరిస్తే ఆరోగ్యాన్ని గూర్చి తనకు లేశమైనా అర్థం కాని విషయాలు చెప్పే ఈశ్వర్, తన ఊరికి వస్తే ఏమేం మాట్లాడతాడో నని ఊహిస్తూ నవ్వుకుంది చిత్ర.
'తిన్నాక నడవనీకి గూడ బూట్లేస్క పోతడు, ఊర్ల సొప్ప చేలల్ల ఏం నడుస్తడో ఈ మనిషి!' అనుకుంది చిత్ర.
తనను గద్దించడం, డాక్టర్ దెగ్గరికి తీస్కెళ్ళడం, తన కోసం పళ్ళు తరగడం ఇవన్నీ చిత్ర మళ్ళీ మళ్ళీ తలుచుకోసాగింది. తన జ్వరం బాగా ఖర్చుతో కూడిన వ్యవహారం లా మారినా పర్లేదనుకుని, ఇంకొన్ని రోజులు తనకు జ్వరంగా ఉండింటే బాగుండనుకుంది ఒక్క క్షణం!
'అసలు గీ మనిషి కి నా మీద గింత ప్రేమెందుకు అయింది?' అని నవ్వుతూ తనను తాను ప్రశ్న వేసుకుంది.
'ఆరోగ్యమే మహా భాగ్యం' అని వర్షాకాలం పొటుకు పెట్టే సర్కార్ బడిలో తాను చదువుకున్న వాఖ్యాన్ని తన భర్త తు.చ తప్పకుండా పాటించే విషయాన్ని గుర్తు తెచ్చుకుంది చిత్ర.
'గీ మనిషి డాక్టర్ సదివింటే ఇంగా కష్టమే ఉండు.' అనుకుని నవ్వుకుంది మనస్సులో.
ఒక్కసారి చిత్రకు మెరుపులా అమృత గుర్తుకు వచ్చింది.
'ఒక వేళ గా అమృత కాంసర్ తోని సచ్చిపోయింది గాబట్టి ఈయ్నకి ఆరోగ్యం అంటే ఇంత బుగులా ?' అన్న ప్రశ్న కలిగింది చిత్ర మనస్సులో.
అంత దాకా ఆమె మనస్సులో ఉప్పొంగుతున్న సంతోషమంతా ఒక్క క్షణం లో ఆవిరైపోయింది.
అమృత గూర్చి తనకు తెలియక పోయుంటే బాగుండు అన్న భావన కలిగిందామెకు. జీవితాంతం అమృత ని తలుచుకుంటూ తన భర్త తనని దూరంగా పెడతాడా అన్న భయం కలిగిందామెకు.
***
వాళ్ళింటి గోడ గడియారం 7 సార్లు గంట కొట్టింది. ఈశ్వర్ తన ఆఫీస్ లో పని చేసే విశ్వనాథ్ తో ఫోన్లో మాట్లాడుతూ చిత్ర గదికి వచ్చాడు.
"right విశ్వనాథ్, మీ family ని తీసుకుని రేపు వచ్చేసేయ్ ఇంక.pent house clean చేయమని కింద watchman వాళ్ళకు చెప్తాలే నేను...... లేదు, money నేను ఇస్తాలే. నువ్వు తర్వాత ఇద్దువు నాకు. right విశ్వనాథ్, take care." అంటూ ఫోన్ కట్ చేశాడు ఈశ్వర్.
"ఎవరూ?" అడిగింది చిత్ర, ప్రశ్న పూర్తయ్యాక అనవసరంగా అడిగానేమో నన్న సంశయానికి గురౌతూ.
" నా collegue విశ్వనాథ్ అని. రేపు మన apartment pent house లోకి shift కాబోతున్నారు." అన్నాడు ఈశ్వర్.
"అంటే పై అంతస్తా?"
"హం."
"ఓ."
"fever ఎలా ఉంది?" అంటూ చిత్ర చేయి పట్టుకుని ఆమె శరీరం యొక్క ఉష్ణాన్ని పరిశీలించాడు ఈశ్వర్.
"జెరమేమి అనిపిస్తలే అసలు." అంది చిత్ర.
చిత్రను పరిశీలించిన ఈశ్వర్ కి కూడా అదే అనిపించింది.
"okay but doctor ఇచ్చిన dosage పూర్తిగా వాడదాం .తరువాత ఆయన్ని consult చేసి, next step తీస్కుందాం." అన్నాడు ఈశ్వర్.
'ఏందో ఏమో, మళ్ళ ఇంగో ఐదు నూర్లు పెట్టేటట్టున్నడు మనిషి గా డాక్టర్ చేతిల." అనుకుంది చిత్ర.
"okay మరి. నువ్వు rest తీస్కో.watchman కి penthouse clean చేయమని చెప్పొస్తాను." అంటూ వెళ్ళిపోతున్న ఈశ్వర్ ని పిలిచింది చిత్ర.
"ఇదో.... కోపం తెచ్కోకు." అంది చిత్ర కాస్త బెరుకుగా.
చిత్ర తనతో అలా బెరుకుగా మాట్లాడటం కాస్త ఇబ్బందిగా అనిపించింది ఈశ్వర్ కి. కానీ నిన్న, మొన్నటి లా చిత్ర తనతో నవ్వుతూ మాట్లాడటం కన్నా ఇలా దూరంగా ఉన్నట్టు మాట్లాడటమే నయం అనిపించింది ఈశ్వర్ కి.
"ఏంటి?" అడిగాడు ఈశ్వర్.
"ఏమ్లే... నాకు ఈడ ఒక్కదాన్నే అప్పటి కెళ్ళి ఉండి పిచ్చి లేస్తుంది. నేను గూడ నీతోని కొందికి ఒస్త. జెర కింద గా జోతి తోని జోలి పెడ్త." అంది చిత్ర.
ఈశ్వర్ తిరిగి సమాధానం ఇచ్చేలోపే
"ఇగో జెరం ఎక్కువేం లేదని నువ్వే సూశ్నవ్ ఇందాక....ప్లీజ్ ." అంది చిత్ర.
చిత్ర తన దెగ్గర ఒంటరితనాన్ని అనుభవిస్తోందేమోనన్న అపరాధభావం కలిగింది ఈశ్వర్ కి ఒక్క క్షణం.
"ఓకే." అన్నాడు ఈశ్వర్, చిత్ర వైపు చూడకుండానే.
తన ఒంటి పై చుట్టుకున్న దుప్పటిని ఒక్క తోపున విసిరేసి, దాన్ని మడత పెట్టసాగింది చిత్ర.
" పడక బట్టలు మడ్త పెట్టకుంటే , శని కూసుంటదంట ఇంట్ల." అంది చిత్ర తను అంత తక్షణంగా మడత పెట్టడం వెనక సంజాయిషీ ఇస్తూ. తన భర్త దేవుడిని నమ్మడని గుర్తొచ్చింది చిత్రకు వాక్యం పూర్తి చేసిన తరువాత.
ఇద్దరూ లిఫ్ట్ లో కిందికి బయలుదేరారు.
లిఫ్ట్ లో ప్రయాణిస్తున్నంత సేపూ ' వకీల్ శ్రీనివాస రావు ' ప్రస్తావన ని చిత్ర తీస్కురానందుకు ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్.
ఓంకార్ వాళ్ళు ఉండే గదిలోనికి వెళ్ళే సరికి లోపలి నుండి ఓంకార్ గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్న శబ్దాలు వినబడ్డాయి ఈశ్వర్ , చిత్ర లకి.
------------------------------సశేషం. ---------------------

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ