21-06-2023, 09:35 AM
ముడి 5వ భాగం
సూపర్ మార్కెట్ నుండి తమ తిరుగు ప్రయాణం లో ఈశ్వర్ చాలా భావుకమై ఉండటం
గమనించింది చిత్ర.ఆమె మనస్సు చివుక్కుమనింది ఈశ్వర్ ని అలా చూసి. విషయమేంటో కనుక్కుందామనిపించింది ఆమెకు. కాస్త సంశయం మనస్సులో మొలిచివున్నా, "ఏంది అట్లున్నవ్? ఏమన్న గుర్తొచ్చిందా?" అడిగింది చిత్ర.
చిత్ర అలా అడగటం ఈశ్వర్ కి బొత్తిగా నచ్చలేదు. అమృత విషయం లో చిత్ర కు సమాధానం చెప్పాల్సి రావటం అన్న ఊహే అతనికి అమితమైన చిరాకును కలిగిస్తోంది. చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "నాకు ఏమీ కాలేదు. అర్థం అయ్యిందా?" అన్నాడు ఈశ్వర్ తన స్వరాన్ని అత్యంత శాంతంగా ఉంచుతూ. ఈశ్వర్ మనస్సులోని భావాలకీ , అతను ఆ మాటలను వ్యక్తీకరించే విధానానికీ అస్సలు పొంతన లేదని గ్రహించింది చిత్ర!
'ఏందో ఏమో, ఈ మనిషి కళ్ళతోనే కాల్చెటట్టున్నడు!" అనుకుంది చిత్ర మనస్సులో.
వాళ్ళు నడుస్తున్న దారిలో కొన్ని జంటలు వెళ్ళడం గమనించింది చిత్ర. వాళ్ళు అందరూ తమ తమ భాగస్వామి చేతిని పట్టుకుని నడూస్తూ ఉన్నారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్కుంటూ, నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఉన్న మగవారి కళ్ళల్లో వారి వారి భాగస్వాముల పట్ల ఆప్యాయత కనపడసాగింది చిత్రకు. తొలిసారిగా తన భర్తకు తాను నచ్చలేదేమోనన్న అభద్రతా భావం ఆమెకు కలిగింది. ఒక వేళ తను నిజంగా తన భర్త కు నచ్చనట్టైతే కారణాలేమై ఉంటాయని ఆమె ఆలోచించసాగింది. తన శరీర రంగు అతనికి నచ్చలేదా? తను పల్లెటూరిది కావటం అతనికి నచ్చలేదా? లేదా అంతగా చదువుకోనందుకు తను అతనికి నచ్చలేదా? అన్న ప్రశ్నలు ఆమెను తొలచసాగాయి. రోజు లో ఒక్క సారైనా తన భర్త తనతో ఆప్యాయంగా మాట్లాడితే చాలనుకుంది చిత్ర. కానీ ఈశ్వర్ ప్రవర్తన ఆమెకు అస్సలు మింగుడు పడట్లేదు. తనను తాను సమీక్షించుకొని, తన భర్త కు నచ్చినట్టుగా మారాలని నిర్ణయించుకుంది.
ఇంతలో ఆమె అక్కడ రోడ్ పై ఉన్న ఒక జంట లో అమ్మాయి తన భాగస్వామి తో ఇంగ్లీష్ లో మాట్లాడటం గమనించింది చిత్ర. ఈశ్వర్ తో " మస్తు బిగ్గ్ సూపర్ మార్కెట్ గద అది. ఆల్ ఐటంస్ దొర్కుతున్నయ్ ఆడ." అంది చిత్ర, సాధ్యమైనన్ని ఇంగ్లీష్ పదాలు వాక్యం లో పెడుతూ.ఈశ్వర్ నిలువుగా తలూపాడు కనీసం చిత్ర వైపు తల కూడా తిప్పకుండా.
దారిలో ఆమె ' రాధా సమేత కృష్ణుడి దేవాలయం' కి దారి అన్న బోర్డ్ చూసింది. తన ఊరైన పెంట్లవెల్లి లో రోజూ గుడికి వెళ్ళే అలవాటున్న చిత్ర ఆ బోర్డ్ ని చూసిన వెంటనే ఈశ్వర్ తో అప్రయంతంగా
" ఈడ కృష్ణుని గుడి ఉన్నట్టుంది గా. పొయ్యొద్దమా ఓసారి?" అడిగింది ఉత్సాహంగా.
"నేను దేవుణ్ణి నమ్మను. కావాలంటే నువ్వు వెళ్ళిరా. నేను ఇక్కడే wait చేస్తా." అన్నాడు ఈశ్వర్ ఎప్పటిలాగే స్వరం లో హెచ్చుతగ్గులు లేకుండా.
" అయితే ఇంగో సారి పోతగానిలే. ఏడుందో అర్తమయ్యింది గద ఇంగ." అంది చిత్ర.
"హం."అన్నాడు ఈశ్వర్.
'ఏందో ఏమో ఈ మనిషి! గా మహేష్ బాబు నేనొక్కడినే సిన్మా లాగ నే ఉన్నడు , అర్తం గాకుండ ఒకసారికి.' అంటూ నిట్టూర్చింది చిత్ర, కానీ మనసులో ఒక మూల ఈశ్వర్ ని ఏదో తొలుస్తూ ఉందన్న విషయాన్ని గుర్తించిందామె. ఏది ఏమైనా అలా తన భర్త మనస్సులో నిత్యం ఏదో తిరుగుతూ ఉండటం నచ్చట్లేదామెకు అస్సలు. అతని మనస్సుని నిత్యం తొలిచే విషయమేంటో తెలుసుకోవాలనిపిస్తోందామెకు. నిజానికి అది కుతూహలం కాదు, ఈశ్వర్ పై చిత్ర చూపిస్తున్న శ్రద్ద!
"ఏం అయ్యిందో చెప్పరాదు? ఎందుకట్లున్నవ్ అసలు?" అడిగింది చిత్ర, అప్రయత్నగా వచ్చిన చనువుతో.
అమృత విషయమై పదే పదే చిత్ర వాకబు చేస్తూ ఉండటం ఈశ్వర్ సహించలేక పోతున్నాడు.
" నేను ఎప్పుడూ అలాగే ఉంటా . గత మూడేళ్ళుగా అలాగే ఉంటున్నా. అమృత cancer తో చనిపోయినప్పటి నుంచి నేనిలాగే ఉంటున్నా. ఇలా కాక మరోలా ఉండటం నాకు చేత కాదు. మా అమ్మ నన్ను emotional blackmail చేస్తే నిన్ను పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. చాలా ఇంకేమైనా చెప్పాలా?!" అని ఒక్కసారి గట్టిగా చిత్ర పై అరవాలనిపించింది ఈశ్వర్ కి!
తన సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్ర వైపు తిరిగి,
" నా మొహమే అంత. అందుకే అలా కనిపిస్తున్నా నీకు. నీకు నా మొహం నచ్చకపోయినట్టైతే నేను చేయగలిగింది ఏమీ లేదు అనే అనుకుంటున్నా."అన్నాడు అతి శాంతంగా.
చిత్రకు ఇంకేమీ మాట్లాడాలనిపించ లేదు. అలా అంత 'మృదువు ' గా మాట్లాడే బదులు తను ఏదైనా తప్పు చేసుంటే ఈశ్వర్ కి తన కోపం తగ్గే దాకా తనని తిట్టుంటే బావుండునని అనిపించింది చిత్రకి. తన మనస్సు కల్లుక్కుమన్నది. తనలో ఏం లోపం ఉందో తనకు అస్సలు అర్థం కావట్లేదు.
మౌనంగా తమ అపార్ట్మెంట్ వైపు గా ఈశ్వర్ ని అనుసరించింది. ఈశ్వర్ మనస్సులో మాత్రం అమృత తో తాను గడిపిన క్షణాల తాలూకు గ్న్యాపకాలు కదలాడసాగాయి.
వాళ్ళు తిరిగి తమ పది అంతస్థులున్న అపార్ట్మెంట్ సముదాయానికి వెళ్ళేసరికి, గ్రౌండ్ ఫ్లోర్ లో వాచ్ మెన్ ఓంకార్ భార్య జ్యోతి తన ఇద్దరు పిల్లలకీ అన్నం తినిపిస్తూ ఉంది. చిత్రని రాజేష్ గమనించి హాయ్ చెప్పాడు. చిత్ర తిరిగి హాయ్ చెప్పింది అతడికి. అక్కడ రాజేష్ పోలికనున్న అమ్మాయిని చూసి, జ్యోతి వైపు తిరిగి" ఇద్దరు అమడాల పిల్లలా?" అడిగింది చిత్ర.
" హా అవ్ను మేడం. " నవ్వుతూ బదులిచ్చింది జ్యోతి.
" వాట్ ఈజ్ యువర్ నేం?" అడిగింది చిత్ర ఆ అమ్మాయిని.
" రేణుక " బదులిచ్చిందా అమ్మాయి.
"ఓ.. గుడ్. యూ బిగ్ ఆర్ యువర్ బ్రదర్ బిగ్?" అడిగింది.
చిత్ర అడిగిన ప్రశ్నేంటో అర్థం చేస్కోడానికి ఈశ్వర్ కి, రేణుకకి, రాజేష్ కి 5 సెకెండ్ల సమయం పట్టింది.
"he is five minutes elder to me." బదులిచ్చింది రేణుక.
" మా పిల్లలిద్దరూ పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ చదువుతున్నరు. పైసలెక్కువైనా గూడా ఇంగ్లీష్ ఒస్తదని పెద్ద కాలేజ్ల చదువిస్తున్నం." అంది జ్యోతి , తన కూతురి ఇంగ్లీష్ ప్రావీణ్యత కి మురిసిపోతూ.
" హా మస్తు సద్వెటట్టున్నరు మీ పిల్లలిద్దరు." అంది చిత్ర, పదవ తరగతి లో ఆఖరి పరీక్ష రాసిన తరువాత, ఇక చదవాల్సిన అవసరం ఉండదని ఆమె సంతోషపడిన విషయం గుర్తుకు వచ్చి, మనస్సులో నవ్వుకుంటూ.
జ్యోతికి చాలా ఆనందమేసింది. వాళ్ళ సంపాదన లో సింహ భాగం తమ పిల్లల చదువు కోసం ఖర్చుపెడుతున్న వారి కృషి కి కాస్త సమర్థన దొరికినట్టుగా తోచిందామెకు.
" సార్ కి పెళ్ళయిందని ఈన చెప్తే తెలిసింది. ఎన్ని రోజులయ్యింది మేడం మీరు వచ్చి?" అడిగింది జ్యోతి కలుపుగోలుగా, చిత్ర తమను తనతో సమానంగా చూస్తూ మాట్లాడుతున్న విధానానికి లోలోన ఆనందపడుతూ.
" గిది ఆరో రోజనుకుంట... సరె ఉంట మళ్ళ. ఈనకి పనుంటది మళ్ళ." అంది చిత్ర, తన పక్కన అప్పటి నుండి ఈశ్వర్ వేచి ఉన్నాడని గుర్తుకు వచ్చి.
"మంచిది మేడం." బదులిచ్చింది జ్యోతి.
లిఫ్ట్ వైపు నడిచి వెళ్తున్న ఈశ్వర్, చిత్రలు ఉత్తర, దక్షిణ దృవాల్లా కనిపించారు జ్యోతికి. తాముంటున్న రెండేళ్ళల్లో ఈశ్వర్ తన తో మాట్లాడిన దానికన్నా రెండు నిమిషాల్లో చిత్ర ఎక్కువ మాట్లాడినట్టు తోచిందామెకు.
తమ ఫ్లాట్ కి చేరుకున్నాక, ఈశ్వర్ తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. తన లాప్టాప్ ని ముందు పెట్టుకుని ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు , కానీ అతని మస్తిష్కం లో మొత్తం చిత్ర తిరగాడసాగింది, ఆమె పట్ల ఒక రకమైన అక్కసు కలగసాగింది అతడికి. ఇంతలో పట్టీల శబ్దం వినిపించి తల పైకి ఎత్తి చూశాడు ఈశ్వర్.
" రాత్రికి ఏం ఒండుదును? ఆల్గడ్డ ఉంది, టమాటుంది, బెండ కాయుంది, ఒంకాయుంది.?" అడిగింది చిత్ర, ముఖం పై చిరునవ్వుతో.
"నీ ఇష్టం."
"అట్ల గాదు, నీకు ఏది నచ్చుతదో చెప్తె, అది ఒండుత."
ఈశ్వర్ అణువణువునా చిత్ర పై వికర్షణా భావం తాండవించసాగింది, ఒక గఢమైన నిట్టూర్పు విడిచి, ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
"చూడు చిత్రా, నీకు ఇష్టమైనదేదో వండు.నువ్వు ఏది వండుతే అది నీకోసం తిని పెడతా నేను. ఇప్పుడు నన్ను నా పనిని చేస్కోనిస్తే నేను చాలా సంతోషిస్తా.... ప్లీజ్." అంటూ తన రెండు చేతులూ జోడించి చిత్ర వైపు చూశాడు ఈశ్వర్.
ఒక్కసారిగా చిత్ర చూపుకు ఈశ్వర్ చాలా మసకగా కనిపించసాగాడు. ఆమె కళ్ళల్లో నీటి తెరలు అలముకున్నాయి. పొంగుకొస్తున్న దుఃఖాన్ని తన పెదవి కింద అదిమి పెట్టింది. తన శక్తినంతా కూడగట్టుకుని, "మంచిది." అని మాత్రం చెప్పి వంట గదిలోకి వెళ్ళిపోయింది చిత్ర.
ఈశ్వర్ కి క్షణక్షణానికి చిత్ర పట్ల వికర్షణా భావం పెరగసాగింది. ఇందాక తనతో నవ్వుతూ మాట్లాడుతున్న చిత్ర ముఖం అతని కళ్ళ ముందు మెదులుతూ వుంది. ఆమె నవ్వు , అమృత కోసం తన మనస్సులో కట్టుకున్న కోవెల ను కూలదోసేదిగా తోస్తోందతడికి! చిత్ర నుంచి తన మనస్సుకు స్వాంతన చేకూర్చటానికి తనకు బాగా ఇష్టమైన చార్లీ చాప్లిన్ సన్నివేశాలని చూడనారంభించాడు ఈశ్వర్.
ఇంతలో అతడికి వంట గదిలోనుంచి కెవ్వున ఒక కేక వినబడింది. పరిగెత్తుకు వెళ్ళి చూశాడు. అక్కడ చిత్ర తన చేతిని ఉఫ్,ఉఫ్ మంటూ ఊదుతూ ఉంది. వేడి నూనె ఆమె చేతిపై పడ్డట్టుగా గమనించాడు ఈశ్వర్. వెంటనే సింక్ లో నల్లా ని ఆన్ చేసి, చిత్రని నీటి ధార కింద కాలిన భాగాన్ని ఉంచమన్నాడు.ఆమె పాటించింది.
చిత్రని హాల్లోకి వెళ్ళమని చెప్పి తను గదిలోకి వెళ్ళాడు. రెండు నిమిషాల తరువాత చేతిలో బర్నాల్ ఆయింట్మెంట్ తో వచ్చాడు ఈశ్వర్.
" గిప్పుడవన్ని ఏం అవసరమ్లే. సల్లగయింది నీళ్ళు పడ్డాంక."
"oil వల్ల వచ్చిన burn అది.ointment లో Aminacrine HCl 0.1% ఇంకా cetrimide 0.5% ఉంటాయ్. అవి anti-septic and anti-microbial agents గా work చేస్తాయి."
పుసుక్కున నవ్వింది చిత్ర.
అంత నొప్పిని మరచిపోయి చిత్ర నవ్వగలిగినంత హాస్యం తన మాటలో ఏముందో అర్థం కాలేదు ఈశ్వర్ కి.
చిత్ర చేతికి మూత తీసిన ointment tube అందించాడు ఈశ్వర్. ఎడం చేతితో ointment రాసుకోవటంలో ఆమె ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించి , ఆమె చేతిని చాచమని చెప్పి, కాలిన భాగం లో ointment పూయసాగాడు ఈశ్వర్.
" ఇదో... నాకు సక్కగ మాట్లాడనీకె రాదు.ఎప్పుడు ఏం మాట్లాడాల్నో అస్సలు తెల్వదు నాకు. ఏదోటి వాగుతుంట.. కోపం గాకు నా మీద. సరేనా? నీకు నా వల్ల ఏమన్న ఇబ్బంది ఐతె చెప్పు నాకు. నేను మారుత .సరేనా?నువ్వు అట్ల నా వల్ల ఇబ్బంది పడ్తుంటె నాకు అస్సల్ నచ్చుతలె." అంది చిత్ర తన మనస్సులో ఉన్న భావం మొత్తాన్నీ ఈశ్వర్ ముందు వ్యక్తపరుస్తూ.
ఈ మాటలు విన్న ఈశ్వర్ కి చిత్ర కళ్ళల్లోకి చూసేందుకు ధైర్యం చాల లేదు!!
చిత్ర చేతికి బర్నాల్ రాయటం ఐపోయాక, ఆమె వైపు చూడకుండా"నేను మనిద్దరికీ ఇప్పుడు ఫుడ్ order చేస్తాను. ఒక half an hour లో వస్తుంది... రేపు పొద్దటి వరకు దెబ్బ తగ్గకపోతే డాక్టర్ దెగ్గరికి వెళ్దాం." అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
-------------------సశేషం.---------------------------

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ