15-06-2023, 12:15 PM
అనిష్ లేచేసరికి ఆలస్యామయింది. అప్పటికి రమ్య ఇంట్లో లేదు. అలక వల్ల త్వరగా వెళ్ళిపొయిందేమొనని అనుకున్నాడు అనిష్. మళ్ళి కాల్ చేస్తే అనవసరంగా గొడవ అవుతుందేమోనని భయపడి కాల్ చేయలేదు అతను.
అలాగే ఆఫీసుకి వెళ్ళిపోయాడు. లంచ్లో కాల్ చేద్దమనుకున్న అతను పని హడావిడిలో పడి చేయలేదు. సాయంత్రము రమ్య ఆఫీస్ ముందు కారు అపి ఆమెకు కాల్ చేశాడు, కానీ రమ్య ఎత్తలేదు. అక్కడ ఉన్న వాచ్ మెన్ ని అడిగితే, లోపల డెస్క్ నెంబర్ డయిల్ చేశాడు. ఎవరు ఎత్తలేదు. ఇంటికెళ్ళుంటుందని అనుకున్న అనీష్, ఇంటికి వెళ్ళాడు. కానీ తాళం వేసిన ఇల్లు అతన్ని ఆహ్వానం పలికింది. రాత్రి నిద్ర సరిగ్గా లేనందువల్ల సొఫాలొ కుర్చొని ఆలొచిస్తూ, అలానే నిద్రలోకి జారుకున్నాడు అనీష్. అతని మొబైల్ రింగుకి లేచిన అతను, ఫొన్ వెతికి లిఫ్ట్ చేశాడు. అది నెట్వార్క్ కాల్ అవడంతో కట్ చేసి టైం చుసాడు పదకొండు కావొస్తుంది.
"రమ్య" అని అరుస్తూ ఇల్లాంత వెదికాడు. ఎక్కడ రమ్య కనబడలేదు. తన నెంబర్ కి కాల్ చేసాడు, ఇంట్లోనే మొగుతున్న శబ్ధమయింది. ఫొన్ కూడా తిసుకేళ్ళాకుండా ఎక్కడకి వెళ్ళిందొనని కంగారుపడ్దాడు అతను. వెంటనే రమ్య నాన్నగారికి కాల్ కలిపాడు, అయనే "రమ్య బాగుందా" అని అడిగెసరికి మరి మాట్లాడకుండా కాల్ కట్ చేసాడు
కాళ్ళు చేతులు అడట్లేదు అనిషుకి, ఏంచెయ్యాలో పాలుపొక స్వాతికి ఫొన్ కలిపాడు, తనది కూడా కనెక్ట్ కలేదు. ఇక ఆలస్యాం చేయకుండా రమ్య ఆఫిసుకి పరిగెత్తడు. ఆమె అస్సలు ఆఫిసుకే రాలేదన్నాడు వాచ్ మెన్. వాళ్ళా టీం లీడుకి కాల్ కలిపి ఇవ్వమన్నడు వాడికి "తెలిదని" అన్నాడు. అక్కడ నుండి తనకి తెలిసిన వాళ్ళాందరికి కాల్స్ చేస్తూ పిచ్చి వాడిల సిటీ అంత తిరిగాడు. కానీ ఎక్కడ తన జాడ కనపడలేదు. ఇంతలో ఎదో తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసాడు, అవతల వైపు నుండి ఒక మగ గొంతు "హెల్లొ, అనీష్ గారు" అని అన్నాడు. "అవును ఎవరు మాట్లాడుతోంది??" అని కంగారుగా అన్నాడు అనిష్.
"నేను రమ్య టీఎల్ మాట్లాడుతున్నాను, మీరు ఒకసారి అపోలో ఆసుపత్రికి రాగలరా ??" అని గబగబ అన్నాడు అతను.
"ఏ..... ఏమైంది ఎందుకు?, నా రమ్యకి ఏమవలేదు కద??" ప్రశ్నలు గుప్పించాడు గొంతు పెగుల్చుకున్న అనీష్
"లేదు... లేదు... మీరు కంగారు పడాల్సిందేమి లేదు, సికింద్రాబాద్ బ్రాంచికి మీరు త్వరగా రండి" అని అంటుండగానే కాల్ కటయ్యింది
15 నిముషలల్లో హాస్పిటలుకి చేరుకున్నాడు అనిష్. రెసెప్షనులో రమ్య పేరుతొ వాకాబ్ చేశాడు. కానీ ఆ పేరుగల వారు ఎవరు లేరా’ని అన్నారు అక్కడి సిబ్బంది. తనకు కాల్ వచ్చిన నెంబరుకి తిరిగి కాల్ చేసాడు అనీష్. ఎవరో తిసి, నాలుగో ఫ్లొరుకి ,మూడో నెంబరు వార్డుకి రమ్మన్నారు. కంగారుగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా ఆగిపొయాడు అనీష్.
మూడో నెంబర్ వార్డుకి దారి చుపిస్తున్నా బోర్డు పైన ఐ.సి.యు అని రాసి ఉంది. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అతని నరాలు ఎవరో బయటకి లాగేస్తున్నట్టు, కాళ్ళు కూడా కదపలేని స్థితిలో ఉన్నట్టూ అడుగు అడుగుకి తుళుతూ ఆ రూంలోకి అడుగుపెట్టాడు. వెంటిలెటర్ మీద ఉన్న ప్రాణాలను చుస్తూన్న అతని కళ్ళలో నీటి పొర ఏది కనపడనివ్వ లేదు.
"నా రమ్యకి ఏమి కాదు" అదో జపంల మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు అనిష్.
ఎవరో అతన్ని పరిగెట్టూకుంటూ వచ్చి అనిష్ ని చుట్టేసారు. ఆ స్పర్శ అతని సుపరిచయమే .
“రమ్య" అని గట్టిగా పొదివి పట్టుకున్నాడు అతడు. రమ్య ఎక్కిళ్ళు పెట్టి ఎడుస్తూంది. ఇదేమి పట్టించుకునే లోకంలో లేడు అతను, రమ్య తలని గట్టిగా అతని గుండెలకి హత్తుకున్నాడు. రమ్య కొలీగ్ ఒకతను “నిన్న రాత్రి ఇంటికి కాస్త లేటుగా వెళ్ళినందుకు స్వాతిని, ఆమె హస్బెండ్ బెల్టుతో కొట్టి, తగిన మత్తులో ఏంచేస్తున్నాడో తెలియని స్థితిలో ఆమెను బాల్కనీ నుండి తోసేసాడు, కనిసం పట్టించుకొకుండా లోపలికి వెళ్ళిపోయాడటా, రోడ్డు మీద పడి ఉన్నా ఆమెను ఎవరో అంబులెన్స్ కి కాల్ చెస్తే, వాళ్ళు ఇక్కడ చేర్పించారట.
రమ్య ఓక్కతే తెలవరుజాము నుండి ఇక్కడ ఫార్మాలిటిస్ పూర్తి చేసి ఆపరేషనుకి సిద్దం చేయించింది. స్వాతి భర్త మీద పోలిస్ కేసు కూడా పెట్టి అతన్ని అరెస్ట్ చేయించింది." అని ముగించాడు.
వింటున్నా అనిష్ కి అదేమి ఎక్కట్లేదు. రమ్యని అలాగే హత్తుకుని నడిపించి కింద లాబిలోకి తీసుకొనివచ్చాడు. నీళ్ళు తెచ్చి మొహం తుడిచి కొన్ని ఆమెకు తాగించాడు. రమ్య కొద్దిగా కుదుటపడింది. మెల్లిగా అనిషుని చుసి "సారి, నిన్ను లేపాను కాని నువ్వు లేవనేలేదు, హడావిడిలో ఫొన్ కూడా మార్చిపొయా. నేనొచ్చేసరికి స్వాతి పరిస్ధితి దారుణంగా ఉంది. నిముషం కూడా ఆలస్యం చేయ్యకుండా ఆపరేషన్ చేయించా. దాని భర్త ఇంత దుర్మర్గుడని అది నాకెప్పుడూ చెప్పాలేదు. నా వల్లె ఇలా జరిగింది, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తావు, అయిన నీతో గొడవ రోజు పడుతున్న. నేనెంత బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నానో స్వాతి నాకు చాలా సార్లు చెప్పింది కానీ నేనే అర్థంచేసుకోలేదు. చిన్న చిన్న విషయాలని పెద్దవి చేసి అటు నిన్ను బాధ పెడ్తూ నేను బాధ పడేదాన్ని. సారి నన్ను క్షమిస్తావా... " అని అంటూ అనీష్ గుండెలపై పడి ఏడ్చేసింది.
ఆమె చుబుకాన్ని పైకి ఎత్తి, ఆమె కళ్ళలోకి చూస్తూ "రమ్య, ముందు నువ్వు నన్ను క్షమించు, గొడవపాడేది నువ్వైనా దానికి కారణం మాత్రం నేనే. ప్రతిసారి ఎదో ఒకటి నీకు నచ్చని పని చెయ్యడం, దాన్ని కవర్ చేయ్యాడానికి అబద్దాలు ఆడడం, అది నీకు తెలిసిపోయి గొడవ జరగడం. ఇప్పుడు నువ్వెంతో నాకు అర్థమైంది. నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమో అర్థమైంది. పెళ్ళికి ముందు నీ ప్రేమ కోసం నీ వెంటపడ్డప్పుడు అదే ప్రేమనుకున్నాను కానీ...... ఇప్పుడు నువ్వు కనబడని ఈ 4 గంటలు నేను చుసిన నరకం చెప్పింది ఇది ప్రేమని" అని గట్టిగా తన చేతిని నొక్కాడు.
అతని మాటలు వింటూ అతని చేతుల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయింది రమ్య
"ఇప్పుడు ఎలా ఉంది స్వాతికి?" అని అడిగాడు అనిష్.
"పర్వలేదు, బాగుంది" అని చెంపల పైనుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది.
"ఔనే, కనీసం కాల్ కూడా చేయ్యలేవా??, పెద్ద పుడింగిలాగా అలా గొడవలకి వెళ్ళిపొతావా?" అని రమ్య తల మీద మొట్టికాయ వేసాడు అనీష్
"నాకు నీ నెంబర్ గుర్తులేదు. వాచ్ మెన్ కి ఇచ్చావంటా కద, అతను మా కొలీగ్స్ కి కాల్ చేసినప్పుడు చెప్పాడు" అని నవ్వింది. ఆమె నవ్వు చుసాక, అనిష్ గుండె మళ్ళి మాములుగా కొట్టూకుంది.
"ప్రేమ అంటే మాటల్లో వర్ణించలేనిది, చేతల్లో మాత్రమే చుపించేది. కొన్నిసార్లు మనం ప్రేమించేవారికి వేల పదాలలో కూడా చెప్పలేని భావాలూ ఒక్క స్పర్శతో చెప్పొచ్చు" అని అనుకున్నాడు మనసులో.
*************************************************** సమాప్తం

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ