10-06-2023, 08:23 PM
(15-05-2023, 11:24 PM)prasad_rao16 Wrote: శివరామ్ : మామ్మకి కూడా చెప్పాను….ఇంట్లో అందరు సంతోషంగా ఒప్పుకున్నారు…..
రాము : అయితే అందరూ అమ్మాయిని చూసారన్న మాట…..ఇంతకు అమ్మాయి వివరాలు చెప్పలేదు….
శివరామ్ : లేదు…ఇంట్లో ఎవరు ఆ అమ్మాయిని చూడలేదు…కేవలం నేను చెప్పానన్న నమ్మకంతోనే ఒప్పుకున్నారు…
రాము : అరేయ్….కనీసం నాకు అయినా చెప్పరా….
శివరామ్ : ఎందుకు….వివరాలు తెలుసుకున్న తరువాత మీరు ఆవిడని కలిసి సంబంధం చెడగొట్టడానికా…..
రాము : అంటే….నువ్వు చెప్పలేకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా…..
శివరామ్ : మీరు అంత తెలివిగల వారని నాకు బాగా తెలుసు….అందుకే….నా జాగ్రత్తలో నేను ఉన్నాను….(అంటూ కమీషనర్ వైపు తిరిగి) మీరు ఏం చేస్తారో తెలియదు….మా రాము అన్నయ్యకు బాగయ్యే దాకా హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళకూడదు….
కమీషనర్ : (చిన్నగా నవ్వుతూ) అలాగే…శివరామ్ గారు…ఈ మధ్య రాముకి కూడా దూకుడు ఎక్కువ అయింది… దాన్ని కంట్రోల్ చేయాలంటే అతనికి పెళ్ళి చేయడమే కరెక్ట్…ఆ సంగతి నేను చూసుకుంటాను….ఇక ఉంటాను…. (అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు)
శివరామ్ : చాలా థాంక్స్ కమీషర్ గారు…..(కమీషనర్ వెళ్ళిపోయిన తరువాత వందన, ప్రసాద్ వైపు చూసి) మీక్కూడా ఇదే చెబుతున్నా…..మా అన్నయ్యకి పెళ్ళి అయ్యే దాకా నేను చెప్పినట్టు వింటే….మీ ఇద్దరికీ ఊహించని బహుమతి ఇస్తాను…..
వందన : మీరు ఇచ్చే బహుమతుల కోసం కాదు….మా రాము సార్ ఆనందం కోసం మీరు ఏం చెబితే అది చేయడానికి రెడీగా ఉన్నాం…..
ప్రసాద్ : అవును….శివరామ్ గారు…..ఇప్పటి నుండి రాము సార్ లాగే…మీరు కూడా మా బాస్….మీరు ఎలా చెబితే అలా చేస్తాం….
శివరామ్ : చాలా థాంక్స్….ఇక రెస్ట్ తీసుకోండి….(అంటూ రాము వైపు చూస్తూ) ఇక వెళ్ళొస్తాను….ఆఫీస్ లో చాలా పని ఉన్నది….(అని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు)
రాము : ఒకే….బై….(అని కళ్ళు మూసుకుని పడుకుండి పోయాడు.)
ఒక అరగంట తరువాత ప్రసాద్ ఒక్కసారి రాము వైపు చూసి ఆయన నిద్ర పోయాడని నిర్ధారించుకున్న తరువాత వందన వైపు చూసాడు.
వందన కూడా కళ్ళు మూసుకుని ఉండటం చూసి ప్రసాద్, “వందనా…నిద్ర పోయావా….” అనడిగాడు.
వందన : లేదురా….ఊరికే కళ్ళు మూసుకుని పడుకున్నా….
ప్రసాద్ : నాకో చిన్న డౌట్…..
వందన : ఏంటిరా….అడుగు…..
ప్రసాద్ : రాము సార్, శివరామ్ గారు….ఇద్దరూ ట్విన్స్ కాదు….కాని వాళ్ళిద్దరికీ ఒకే పోలికలు ఎలా వచ్చాయి…..
వందన : (కళ్ళు తెరిచి ప్రసాద్ వైపు చూస్తూ) అదేరా…నాక్కూడా అర్ధం కావడం లేదు…అయినా ఇక నుండి వీళ్ళిద్దరితో పాటే ఉంటాం కదా….వివరాలు చిన్నగా తెలుస్తాయిలే…..
ప్రసాద్ : సరె….ఇంకో డౌట్…..
వందన : ఇంకానా….ఏంటో…అడుగు….
ప్రసాద్ : రాము సార్ కి….నీకు పరిచయం ఎలా కలిగింది…..
వందన : ఇప్పుడు అవన్నీ ఎందుకు…..
ప్రసాద్ : ఇంతకు ముందు అడిగితే….తరువాత అన్నావు…..ఇప్పుడు మనం ఖాళీ కదా….చెప్పవే….టైం పాస్ అవుతుంది….
వందన : సరె….చెబుతా….విను….
ప్రసాద్ : ఇంతకు నీ కధలో రొమాన్స్ కాకుండా….అడ్వంచర్ ఏమైనా ఉన్నదా…..
వందన : రొమాన్స్ తో పాటు….చెప్పలేని బాధ….కొంచెం థ్రిల్లింగ్ కూడా ఉన్నది….
ప్రసాద్ : సరె….చెప్పు….
వందన : నేను ముంబైలో ధారావి ఏరియా SI గా చేస్తున్నప్పుడు…..
(ఫ్లాష్ బ్యాక్ మొదలు)
(THE END)
రచయితగారికి నమస్కారములునిజంగా మీరు ఈ పెద్ద స్టోరీని అద్భుతంగా రచించారు.ఎక్కడ కూడా పాఠకులు ఉత్సాహాన్ని నిరుత్సాహపరచకుండా కథని నడిపారు.అయినా కూడా మీనుంచి ఇంకాఇంకా ఆశిస్తున్నాము.