05-06-2023, 01:06 PM
ముడి- మొదటి భాగం
- Santosh Narva
సౌష్ఠవమైన శరీరంతో నిండుగా కనిపించే అమృత , పాలిపోయి ,శుష్కించి వెంటిలేటర్ సహాయంతో తన 'మరణ శయ్య’ పై పడి వుంది .నల్లటి మెరుపుతో జలపాతాన్ని ప్రతిబింబించే ఆమె కురులేవీ లేవిప్పుడామెకు.ఈశ్వర్ రాక కై శక్తినంతా కూడగట్టుకుని,తాను ఉన్న ఐ.సి.యు డోర్ వైపే దృష్టి పెట్టింది అమృత. ఇక తన 'సమయం' ఐపొవొచ్చిందని అర్థమౌతోందామెకు. ఒక్క సారి 'చివరగా' ఈశ్వర్ ని చూడాలనిపించింది ఆమెకు. ఆమె కళ్ళ ముందు మొత్తం ఈశ్వర్ తో గడిపిన క్షణాలే తిరుగుతున్నాయి. ఈశ్వర్ తో ఇంకొన్ని అందమైన క్షణాలను పంచుకోవటం కోసం ఇంకొన్ని రోజులు తనకు మిగిలి ఉండింటే బాగుండు అనిపించిందామెకు. నాస్తికురాలైన ఆమె తన ఊహ తెలిసాక మొట్టమొదటి సారిగా దేవుడిని ప్రార్థించింది ఈశ్వర్ తన కళ్ళముందుండగా తనను 'చంపమని '! అమృత తనను కోరిన మొదటి, చివరి కోరికని దేవుడు మన్నించాడు!
పౌర్ణమి నాటి నిండు చంద్రుడి లా ఉండే 'తన ' అమృత గత ఆరు నెలలుగా ఒక్కొక్కటిగా తన 'కళలను ' కోల్పోతూ వస్తున్న వైనం అతని గుండెకు భరించలేనంత నొప్పిని కలిగిస్తూ వుంది. రోజు రోజుకీ ఆమెను చూడటానికి సైతం ధైర్యం చాలట్లేదతడికి! కానీ ఆ క్షణం అమృతని చూసిన అతడికి అర్థమయ్యింది ,తన జీవితం లో ఇకపై మిగిలేది నిరవధికమైన 'అమావాస్యే ' నని!
ఈశ్వర్ తన ఒక్కో అడుగు అమృత వైపు వేస్తున్నా, అతనికి మాత్రం అమృత కు తాను దూరంగా వెళుతున్న భావన కలుగుతోంది. తన కళ్ళల్లోని కన్నీటి యవనికలు తన కంటిపాప లో కొలువై ఉన్న అమృత ప్రతిబింబాన్ని మసకగా మారుస్తున్నాయి.
ఒంటిలోని శక్తినంతా కూడగట్టుకుని మోము పై కష్టంగా ఒక చిరునవ్వు ఉంచే ప్రయత్నాన్ని చేస్తూ వుంది అమృత.'నేనిక వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త.' అని ఆమె కళ్ళు చెబుతున్నాయి, అతని మనస్సు వింటూ వుంది.
***************************************
పెళ్ళింట్లో అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు....
కొందరి మనస్సుల్లో సంతోషం, కొందరి మనస్సుల్లో అసంతృప్తి, కొందరిలో ఆత్రుత, ఇంకొందరిలో అసూయ.... అందరి ఉల్లములల్లోనూ ఏదో ఒక భావోద్వేగం, ఒక్క పెళ్ళికొడుకైన ఈశ్వర్ మనస్సులో తప్ప!
అతడి అణువణువునా నిర్లిప్తత ఆవహించింది.
పెళ్ళిలో అతనికి వినిపిస్తున్న నాదస్వరం అతని చెవుల్లో పదునైన సూదులతో ఎవరో పొడుస్తున్నట్టుగా భావన కలిగించింది.
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. అన్న మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తున్నంత సేపూ అతను తన యొక్క సొంత స్వరాన్నే అసహ్యించుకోసాగాడు.
తన కాళ్ళు కడగబడుతున్నప్పుడు ఆమ్లం తో దహించివేయబడుతున్నట్టుగా తోచింది అతడికి
పాణి గ్రహణ సమయం లో పెళ్ళికూతురైన చిత్ర చేతిని అతని చేతిలో పెట్టినప్పుడు, ఆమె స్పర్శ అతని అణువణూవునూ జలదరింపజేయసాగింది.
అతని తలపై చిత్ర జీలకర్ర-బెల్లం ఉంచినప్పుడు , ఆమె చేయి భస్మాసుర హస్తంగా తోచింది అతడికి.
సుమంగళి పూజ సమయం లో అతని పై వెదజల్లబడ్డ అక్షతలు అతనికి శరాల వలె గుచ్చుకుంటున్నాయి.
చిత్రకు, తనకు మధ్య ఉన్న తెర తొలగించివేయబడ్డప్పుడు , ఆమె కళ్ళల్లో కనిపించిన అతని ప్రతిబింబాన్ని చూసి తనపై తనకే జాలితో కూడిన అసహ్యం కలిగిందతడికి.
చిత్ర మెడలో మంగళ సూత్రం కడుతున్నప్పుడు , అది తన మెడకు బిగుసుకుంటున్న ఉరి తాడు వలె తోచింది ఈశ్వర్ కి.
హోమాగ్ని చుట్టూ చేస్తున్న ప్రదక్షిణలు అగమ్యమైన నిశీధిలోనికి తను చేస్తున్న ప్రయాణం లా అనిపిస్తోందతడికి. అతనికి 'ముడి పడి ' ఉన్న చిత్ర అతనికి అడుగు వేయలేనంత 'బరువు’ గా తోస్తోంది.
----------------సశేషం..------------------

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ