Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
మీడియా : అతను ఎవరు సార్….

రాము : క్రిస్టఫర్ అనే మానసికరోగి….అమెరికా నుండి వచ్చాడు…(అంటూ పూర్తి వివరాలు మీడియాకు చెప్పేసి అక్కడ నుండి బయలుదేరారు.)
అక్కడ ప్రెస్ మీట్ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు.
ప్రసాద్ కాలికి కత్తిపోటు తగలడంతో రాము అతన్ని పట్టుకుని కారు దాకా తీసుకొచ్చాడు….వందన చేతికి రక్తం ఎక్కువ కారకుండా ఒక క్లాత్ కట్టి….ఇద్దరిని కారులో కూర్చోబెట్టి రాము కారు డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ కి వచ్చాడు.
హాస్పిటల్ కి వచ్చేసరికి రాము ఫ్యామిలి మొత్తం, ప్రసాద్ కోసం తులసి, రాశి, సంగీత ముగ్గురూ వచ్చి వాళ్ళ ముగ్గురి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
వాళ్ళ ముగ్గురికి బాగా దెబ్బలు తగిలిన సంగతి అందరికి తెలిసిఉండటంతో మానస వాళ్ళు వచ్చే లోపే వందన చేతికి తగిలిన బుల్లెట్ తీయడానికి ఆపరేషన్ ధియేటర్ రెడీ చేసింది.
కారు ఆగగానే మానస వెంటనే స్ట్రెక్చర్స్ తీసుకొచ్చి ఒకదాని మీద ప్రసాద్ ని పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్ళారు.

వందనకు అప్పటికే బాగా బ్లడ్ లాస్ అవడంతో వెంటనే ఆమె స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకెళ్ళి ఒక డాక్టర్ ఆమె చేతికి ఉన్న బుల్లెట్ తీసేసి కుట్లు వేసి….ICU లో ఉంచి బ్లడ్ ఎక్కిస్తున్నారు.
ప్రసాద్ ని కూడా ఎమర్జెన్సీ వార్డ్ లోకి తీసుకెళ్ళి కాలుకి కత్తిపోటు తగిలిన చోట గాయాన్ని క్లీన్ చేసి….కుట్లు వేసారు.
ఇక రాము ఛాతీ మీద సర్జికల్ బ్లేడ్ కోసుకుపోవడంతో అతనికి కూడా కుట్లు వేసిముగ్గురిని ఒకే రూమ్ లో ఉంచారు.
దాంతో రూమ్ మొత్తం వాళ్ళ ముగ్గురి ఫ్యామిలి మెంబర్స్ తో నిండిపోయింది.
తరువాత వందనకు కూడా గంట తరువాత సృహ రావడంతో కళ్ళు తెరిచి ఒక్కసారి తను హాస్పిటల్ లో ఉన్నట్టు తెలుసుకుని కంగారుగా చుట్టూ చూసింది.
రూమ్ లో రాము, ప్రసాద్ ఇద్దరూ సేఫ్ గా ఉండి అందరితో మాట్లాడటం….తన తల్లి, తమ్ముడు కూడా తన పక్కనే ఉండటం చూసి ప్రశాంతంగా తన అమ్మ వైపు చూసి నవ్వింది.
వందన వాళ్ళ అమ్మ ప్రేమగా ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ, “ఇప్పుడు….ఎలా ఉందమ్మా….” అనడిగింది.
వందన : ఇప్పుడు బాగానే ఉన్నదమ్మా….
అమ్మ : చాలా పెద్ద గండం గడిచిందమ్మా….మీ ముగ్గురిని అలా ఉరితాడుతో చూసేసరికి మేమంతా చాలా భయపడిపోయాము…..
అందరు అక్కడే ఉండటంతో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలు అందరు వింటున్నారు.
ప్రసాద్ : మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా…..
వందన అమ్మ : అదేంటి బాబు….అలా అంటావు….మీరు ముగ్గురు చావు దగ్గర దాకా వెళ్ళారు….
రేణుక : (రాము వైపు చూస్తూ) అవును రాము….నిన్ను ఫోటోలో అలా చూసేసరికి నాకు చాలా భయమేసింది….
ప్రసాద్ : మా పక్కన రాము సార్ ఉంటేమాకు భయం ఎందుకు….
రేణుక : హా….నీకు రాము మీద అంత నమ్మకం ఉన్నదా….
వందన : అవును మేడమ్….రాము సార్ తో ఉంటే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది….అందుకే మమ్మల్ని వాడు బంధించినా కూడా….మమ్మల్ని రక్షించడానికి రాము సార్ వస్తారని మా ఇద్దరికి బాగా తెలుసుఅందుకే మేమిద్దరం భయపడలేదు….
రేణుక : కాని….రాము కూడా మీతో పాటు వాడికి చిక్కాడు కదా….
ప్రసాద్ : చిక్కాడు….మాకోసమే చిక్కాడు….కాని అక్కడ కరెంట్ మెయిన్ దగ్గర బాంబ్ కి టైమర్ పెట్టిమమ్మల్ని తప్పించివాడిని చంపేసాడు కదా….
రేణుక : మీ ఇద్దరికి రాము మీద చాలా నమ్మకం ఉన్నట్టున్నదే…..
వందన : అవును….చాలా….
ప్రసాద్ : ఆయన ఉన్నాడనే….నేను కూడా ATS లోకి వచ్చాను….
మానస : సరె….సరె….ఇక మాట్లాడటం ఆపేసి….ముగ్గురు రెస్ట్ తీసుకోండి….(అంటూ ఫ్యామిలి మెంబర్స్ వైపు చూసి) ఇప్పుడు వాళ్ళ హెల్త్ బాగానే ఉన్నది….మీరందరు ఇళ్ళకు వెళ్ళండి….ఇక్కడ ఎక్కువ మంది ఉండకూడదు…..
దాంతో వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి శివరామ్, కమీషనర్ హాస్పిటల్ కి వచ్చారు.
కమీషనర్ ని చూడగానే ముగ్గురూ విష్ చేసారు.
కమీషనర్ : (విష్ చేసి) ఇప్పుడు ఎలా ఉన్నది…..
ప్రసాద్ : బాగానే ఉన్నది సార్…..
కమీషనర్ : సరె….మీ ముగ్గురికి ఆరు నెలలు సెలవు ఇస్తున్నా….
రాము : అదేంటి సార్….ఇవేమీ పెద్ద దెబ్బలు కావు….ఇలాంటివి మనకు మామూలే కదా….నెల రోజుల్లో డ్యూటిలో జాయిన్ అవుతాము….
శివరామ్ : అదెంటి అన్నయ్యా….మీకు మామూలే కావచ్చు….మాకు మాత్రం పెద్దవే….మీరు కమీషనర్ గారు చెప్పినట్టు వినండి…..ఆరు నెలల వరకు మీరు డ్యూటిలో జాయిన్ అవడానికి వీల్లేదు….
రాము : అది కాదురా…..(అంటూ శివరామ్ కి సర్ధి చెప్పబోయాడు.)
శివరామ్ : (రాము మాట్లాడకుండా ఆపుతూ) ఇక మీరేమీ మాట్లాడొద్దు….ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు విన్నాము.... ఇక నుండి నేను చెప్పినట్టు వినాల్సిందే….
శివరామ్ అంత గట్టిగా అనే సరికి రాము కూడా ఏమీ మాట్లాడలేదు.
అప్పటి దాకా శివరామ్ గురించి తమకు రాము సార్ చెబుతుంటే వినడమే కానిఅప్పటి దాకా చూసి ఉండకపోవడంతో ప్రసాద్, వందన కళ్ళు పెద్దవి చేసుకుని రాము వైపు, శివరామ్ వైపు మార్చి మార్చి చూస్తున్నారు.
వాళ్ళ అవస్థ గమనించిన రాము తనలో తాను నవ్వుకుంటున్నాడు.
శివరామ్ : (తమని కళ్ళార్పకుండా చూస్తున్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ) మీ ఇద్దరు ఏంటిఅలా చూస్తున్నారు….
వందన : అదేం లేదు శివరామ్ గారు….మా రాము సార్ ని, మిమ్మల్ని ఇలా చూస్తుంటే….మాకు హలో బ్రదర్ సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తున్నది….
ప్రసాద్ : అవును శివరామ్ గారు….మీ ఇద్దరికి ఒకే డ్రస్ వేసి పక్కపక్కనే నిలబెడితే….మీ ఇద్దరిలో ఎవరు రాము సార్ ….ఎవరు శివరామ్ సార్….అని మీ ఇంట్లో వాళ్ళు కూడా కనుక్కోలేరు….
శివరామ్ : (చిన్నగా నవ్వుతూ) అవును…..ఒక్కోసారి మా ఇంట్లో వాళ్ళు కూడా తడబడుతుంటారు….కాని మా ఇద్దరి బిహేరివియర్ లో చాలా తేడాలు ఉన్నాయి….వాటిని బట్టి వెంటనే కనుక్కుంటారు…..
ప్రసాద్ : కాని మీరు అచ్చు గుద్దినట్టు అలా ఎలా ఉన్నారు సార్…..మీ ఇద్దరూ కవల పిల్లలా…..
శివరామ్ : కాదు…..
వందన : మరి….ఒకే పోలికల్లో ఎలా పుట్టారు….
శివరామ్ : ఇక నుండి మాతో కలిసే ఉంటారు కదా…..మెల్లిగా మీకే అర్ధమవుతుందిలే….(అంటూ రాము వైపు చూస్తూ) అన్నయ్యా….మీకు మంచి సంబంధం చూసాను….మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నా….అక్కడ మీరు అమ్మాయిని చూడొచ్చు…..
రాము : అదేంటిరా….అంత సడన్ గా….
శివరామ్ : చెప్పానుగా….ఇక నుండి నేను చెప్పినట్టు వినాలని…..అమ్మాయి చాలా మంచిది, అందంగా ఉంటుంది….
రాము : ఇంతకు ఎవరు అమ్మాయి….. విషయం రేణుకకి చెప్పావా…..
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 15-05-2023, 11:22 PM



Users browsing this thread: 2 Guest(s)