Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : ఏం లేదు సార్….చిన్న గేమ్ ఆడుతున్నాడుపిట్టకధలు చెబుతున్నాడు….అంతే….కంగారు పడాల్సిన అవసరం లేదు….

కమీషనర్ : పని పూర్తి చేసుకుని ఎంతసేపట్లో వస్తావు…..
రాము : ఐదు నిముషాల్లో పని పూర్తయిపోయిద్ది సార్….అయిన తరువాత నేనే ఫోన్ చేస్తాను….(అంటూ తన వాచీకి సెట్ చేసిన బాంబ్ టైమర్ని ఆన్ చేసాడు.)
అది విన్న క్రిస్టఫర్ నవ్వుతూ, “వావ్….నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది రామూ….” అంటూ టేబుల్ మీద ఉన్న గన్ తీసుకుని, “రేపు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది….అదేంటంటే….DCP రామ్ ప్రసాద్ నిన్న రాత్రి తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడుకాదుకాదు….కాల్పుల వల్ల చనిపోలేదు….అతన్ని ఉరి తీసి చంపేసారు….అతన్ని ఉరి తీసి చంపడానికి ముందు రాముని పదునైన ఆయుధాలతో చిత్రహింసలు పెట్టి దారుణంగా హింసించి చంపారని తెలుస్తుంది,” అంటూ అక్కడ ఉన్న సర్జికల్ కిట్లో నుండి ఒక బ్లేడ్ లాంటిది తీసుకుని రాము దగ్గరకు వస్తూ, “ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా….ఒకడు అరుస్తున్నాడు….ఇంకొకరు శాపనార్ధాలు పెట్టారు…. లేడీ డాక్టర్ అయితేదయచేసి నా ఫ్యామిలీ గురించి ఆలోచించండి….నాకు ఒక చిన్న బాబు ఉన్నాడుఅని ఏడ్చిందిఅది చూసిన నాకు భలే ఆనందం వేసింది,” అంటూ తన చేతిలో ఉన్న సర్జికల్ బ్లేడ్తో రాము ఛాతీ మీద కోసాడు.
దాంతో రాము బాధతో ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
అది చూసిన ప్రసాద్ కోపంతో అరుస్తున్నాడు.
క్రిస్టఫర్ వెనక్కు తిరిగి ప్రసాద్ వైపు చూస్తూ, “ఏయ్….మెదలకుండా ఉండు….మీ బాసే సైలెంట్గా ఉన్నాడు కదా…” అంటూ మళ్ళీ రాము వైపు తిరిగి తన చేతిలో ఉన్న సర్జికల్ బ్లేడ్తో రాము చాతీ మీద గుచ్చుతూ, “నీకో విషయం తెలుసానాకు ఇలా చిత్రహింసలు పెట్టి చంపడం అంటే చాలా ఇష్టంకాని ముందు నేను చంపిన ముగ్గురిలా అంత తేలిగ్గా నిన్ను చంపనునీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను….” అంటూ నవ్వుతున్నాడు.
రాము చేతికి ఉన్న వాచీలో టైమర్ రన్ అవుతూఉన్నది.
క్రిస్టఫర్ నవ్వుతూ రాము ఫోన్లో నుండి వినయ్కి ఫోన్ చేసాడు.
వినయ్ ఫోన్ లిఫ్ట్ చెసి, “హలో….అన్నయ్యా….” అన్నాడు.
క్రిస్టఫర్ : నేను నీ అన్నయ్యని కాదునీ ప్రియమైన అన్నయ్య ఇంకా ఎందుకు చావలేదో తెలుసానా ఫ్యామిలీ మ్యాటర్ అందరి నోళ్ళల్లో నానినట్టుగా మీ అన్నయ్య చనిపోయింది కూడా అందరి నోళ్ళల్లో నానాలి….(అంటూ రాము వైపు చూస్తూ) అందుకే నిన్ను రోజే చంపకుండా వదిలేసాను…(మళ్ళీ ఫోన్లో వినయ్తో) వినయ్నీకో ఫోటో పంపిస్తానునువ్వు దాన్ని తొందరగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్….అన్నింట్లో లోడ్ చేసెయ్…..
వినయ్ : నువ్వు చెప్పినట్టు ఎలా చేస్తాననుకున్నావురా…..
క్రిస్టఫర్ : అబ్బాబ్బా…. కోపానికే తక్కువ లేదు….రాము ఫ్యామిలీలో అందరికీ పౌరుషం చాలా ఎక్కువ
వందన : నువ్వు పిక్ని అప్లోడ్ చెయ్యి వినయ్ఇంకొద్దిసేపటిలో వీడు చస్తాడు….
క్రిస్టఫర్ : ఓహ్నీకు చాలా ధైర్యం ఉన్నదే….
వినయ్ : ఏయ్….వాళ్ళనేం చెయ్యొద్దు….
క్రిస్టఫర్ : (వందన వైపు తిరిగి తన చేతిలో ఉన్న గన్తో వందన చేతి మీద కాల్చివినయ్తో ఫోన్లో) ఇప్పుడన్నా ఫోటో షేర్ చేస్తావా….
వినయ్ : సరెసరె….నేను షేర్ చేస్తానువాళ్ళను ఏం చేయకు….
క్రిస్టఫర్ : గుడ్….ఇలా నేను చెప్పినట్టు చెయ్యి….(అంటూ రాముకి ఉరితాడు బిగించిన ఫోటో పంపించాడు.)
వినయ్ ఫోటో చూడగానే ఏం చెయ్యాలో తెలియక పక్కనే కూర్చున్న తన ఫ్యామిలి వైపు చూసాడు.
ఫోటో చూసి వాళ్ళు కూడా కంగారు పడిపోతున్నారు.
వినయ్ ఇక చేసేదేం లేక వెంటనే ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు.
ఫోటో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్ అయిపోయి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) కి చెందిన ముగ్గురు సెక్యూరిటీ అధికారి ఆఫీసర్లు కిడ్నాప్ అయినట్టుగా టీవిలో న్యూస్ రావడం మొదలయింది.
రాము : నువ్వు చాలా తప్పు చేస్తున్నావు క్రిస్టఫర్….
క్రిస్టఫర్ : ముందు మీ ముగ్గురిలో ఎవరిని చంపుదాం….(అంటూ రాము వైపు చూసి) రామూ….ముందు ప్రసాద్ని చంపుదామా….(అంటూ నవ్వుతూ మెల్లగా తన చేతిలో ఉన్న గన్ని ప్రసాద్ వైపు ఎత్తాడు.)
అప్పుడే రాము వాచీలో ఉన్న టైమర్ జీరోకి రావడంతో ఫ్యూజ్ బాక్స్ దగ్గర రాము సెట్ చేసిన బాంబ్ పేలడంతో ఒక్కసారిగా కరెంట్ పోయి అంతా చీకటి అయిపోయింది.
ఇక రాము ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ఒంటి మీద ఉన్న జాకెట్ హ్యాండ్లో నుండి చిన్న సైజు కత్తి లాంటిది తీసితన చేతులకు ఉన్న కట్లను తెంపేసుకుని తన మెడకు ఉన్న తాడుని తీసేసాడు.
పది నిముషాలకు జనరేటర్ ఆన్ చేయడంతో మళ్ళీ కరెంట్ వచ్చింది.
క్రిస్టఫర్ వెనక్కి తిరిగి చూసేసరికి రాము కనిపించకపోవడంతో కంగారుగా చుట్టూ చూసాడు.
ఇందాక తాను సర్జికల్ కిట్ ఉంచిన టేబుల్ దగ్గర రాము కూర్చుని ఉండటం చూసి క్రిస్టఫర్ కళ్ళల్లో ఒక్కసారి భయం కనిపించింది.
దాంతో క్రిస్టఫర్ తన చేతిలో ఉన్న గన్ని రాము వైపు పెట్టి కాల్చబోయాడు.
రాము కిట్లో నుండి రెండు బ్లెడ్స్ తీసుకుని చేత్తో పట్టుకుని అతని మీదకు విసిరేసే సరికి అది క్రిస్టఫర్ చేతికి గుచ్చుకోవడంతో అతని చేతిలో ఉన్న గన్ కింద పడిపోయింది.
రాము వెంటనే వందన దగ్గరకు వచ్చి కట్లు విప్పబోతుండగా క్రిస్టఫర్ తన కోట్లో ఉన్న చిన్న కత్తిని తీసుకుని రాము మీద దాడి చేసాదు.
రాము వెంటనే క్రిస్టఫర్ చేతిని బ్లాక్ చేస్తూ అతని తలను టేబుల్ కేసి కొట్టి దూరంగా తోసేసి వందన కట్లు విప్పడానికి ట్రై చేస్తున్నాడు.
కింద పడిన క్రిస్టఫర్ పైకి లేచి మళ్ళీ రాము దగ్గరకు రాబోతుండగా ప్రసాద్ తన కాలితో వాడిని తన్నాడు.
దాంతో క్రిస్టఫర్ కోపంతో ప్రసాద్ కాలిని పట్టుకుని తన చేతిలో ఉన్న కత్తితో ప్రసాద్ తొడ మీద పొడిచాడు
అది చూసి రాము వెంటనే క్రిస్టఫర్ని తోసేసి కొట్టడం మొదలుపెట్టాడు.
కమెండో ట్రైనింగ్ తీసుకున్న రాము ముందు క్రిస్టఫర్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు.
రాము ఇక టేబుల్ మీద ఉన్న సర్జికల్ బ్లేడ్ తీసుకుని క్రిస్టఫర్ చేతులు, కాళ్ళు పనిచేయకుండా నరాలను కోసేసాడు.
దాంతో క్రిస్టఫర్ గట్టిగా అరుస్తూ కింద పడిపోయి పైకి లేవడానికి ట్రై చేస్తున్నాడు.
వాడిని అలాగే చూస్తూ రాము మెల్లగా ప్రసాద్ దగ్గరకు వెళ్ళి కట్లు విప్పేసి అక్కడే కూర్చున్నాడు.
ఇంతలో ప్రసాద్ కూడా వందన కట్లు విప్పేసాడు.
రాము మెల్లగా ఇంతకు ముందు క్రిస్టఫర్ వేసుకున్న తేలు బొమ్మ మాస్క్ని తీసుకొచ్చి క్రిస్టఫర్మొహానికి వేసి అక్కడా ఉన్న తాడుని క్రిస్టఫర్ మెడకు తగిలించి తాడుని పైకి లాగాడు.
దాంతో క్రిస్టఫర్ తాడుని వేలాడుతూ గిలగిల కొట్టుకుంటుంటే రాము అక్కడే ఉన్న గన్ తీసుకుని అందులో ఉన్న బుల్లెట్లు మొత్తం క్రిస్టఫర్ బాడీలో దింపేసే సరికి వాడు అచేతనంగా తాడుకి వేలాడుతున్నాడు.
ఇక వాడు చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తరువాత ముగ్గురూ బయటకు వచ్చేసారు.
అంతలో మీడియా వాళ్ళు, సెక్యూరిటీ ఆఫీసర్లు అక్కడకు రావడంతో….రాము, వందన, ప్రసాద్లను టీవిల్లో చూసిన రేణుక వాళ్ళందరూ హ్యాపీగా ఫీలయ్యారు.
మీడియా : సార్….అసలు లోపల ఏం జరిగింది సార్…..
రాము : ఇన్నాళ్ళు వరసగా హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ చనిపోయాడు….ఇక భయం లేదు….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 15-05-2023, 11:19 PM



Users browsing this thread: Sam shaik, 9 Guest(s)