15-05-2023, 10:55 PM
హెడ్లైట్లు వెలగడం చూసిన ప్రసాద్ వెనక్కి తిరగి చూసి రాబోయే ప్రమాదాన్ని ఊహించి రియాక్ట్ అయ్యే లోపు వాళ్ళను స్కార్పియో గుద్దేయడంతో వందన, ప్రసాద్ ఇద్దరూ రోడ్డు మీద గాయాలతో పడిపోయారు.
వాళ్ళిద్దరినీ తన స్కార్పియోలో ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
******
ఇక్కడ రాము హాస్పిటల్లో వందన, ప్రసాద్‌ల గురించి ఏమీ తెలియకపోవడంతో గదిలో అటూఇటూ కంగారుగా తిరుగుతున్నాడు.
రాము కంగారు పడటం చూసి రేణుక, “రాము….ఒక్కసారి కమీషనర్కి ఫోన్ చెయ్యి….మన శివరామ్ కూడా అక్కడే ఉన్నాడు,” అన్నది.
రాము : రేణూ…నువ్వు కంగారుపడి..నన్ను కంగారుపెట్టకు…ఏం చేయాలో నాకు తెలుసు….
అంతలో ఒకతను వచ్చి రాముకి సెల్యూట్ చేసి, “సార్….” అన్నాడు.
రాము : ఏంటి….
అతను : బ్యాకప్ టీమ్ వచ్చేసింది సార్….
రాము : గుడ్…..వందనకి ఒకసారి ఫోన్ చెయ్….
అతను సరె అని ఫోన్ తీసుకుంటుంటే అక్కడ టీపాయ్ మీద ఉన్న రాము ఫోన్ మోగుతుండటంతో రేణుక ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేయబోయింది.
రాము వెంటనే, “రేణు….ఒక్క నిముషం….(అంటూ ఫోన్ తీసుకుని నెంబర్ చూసి ఆ హంతకుడు ఫోన్ చేస్తున్నాడని అర్ధం అయ్యి లిఫ్ట్ చేసి) రామ్ ప్రసాద్…..
హంతకుడు : నువ్వు చాలా తెలివైన వాడివి రాము…
రాము : రేయ్….ఇది నీకూ…నాకు ఉన్న గొడవ….మధ్యలో వీళ్ళందరూ ఏం చేసారు…..
హంతకుడు : కూల్ DCP….బాగా కోపంగా ఉన్నట్టున్నావు….వెధననుకున్నావా నన్ను….నేను చాలా చెడ్డవాడిని…నీ ప్రియమైన ఫ్యామిలి….అదే నీ సెక్యూరిటీ అధికారి ఫ్యామిలి…ఇప్పుడు నా దగ్గర ఉన్నారు….
రాము : వాళ్ళకు జరక్కూడనిది ఏమైనా జరిగిందో….
హంతకుడు : అంత ఫైర్ అవకు రామూ….చెప్పే స్టేజిలో నేనున్నాను…వినేస్టేజిలో నువ్వు ఉన్నావు…నీ కోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేసాను…
రాము : ఏంటో చెప్పు….
హంతకుడు : చెప్తాను…ఫోన్ చేసినప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాను…నువ్వు నా దగ్గరకు వచ్చేప్పుడు షూస్లో, సాక్స్లో గన్స్ పెట్టుకు రాకు…(ఫోన్ కట్ చేసాడు.)
రాము : ఏయ్….ఏం మాట్లాడుతున్నావు….(అంటూ ఫోన్ కట్ చేయడంతో రాము కోపంగా లోపలికి వెళ్ళి డ్రస్ మార్చుకుని వచ్చాడు.)
రేణుక : ఏంటి….ఎక్కడకు వెళ్తున్నావు….
వినయ్ : అన్నయ్యా….నువ్వు వెళ్ళొద్దు…చిన్నన్నయ్య శివరామ్ కమీషనర్ దగ్గరే ఉన్నాడు….వాళ్లతో మాట్లాడి టీమ్ని పంపిద్దాం….చెప్పింది విను….నీ ప్రాణాలకు చాలా ప్రమాదం ఉన్నది…
రాము : చూడండి….వాళ్ళిద్దరూ నన్ను కాపాడటానికి వెళ్ళి….రిస్క్లో ఉన్నారు…నేను వెళ్ళాలి….నేను వెళ్ళి తీరాలి… నేను తొందరగానే సేఫ్గా వచ్చేస్తాను….సరేనా….
దాంతో అందరూ ఏంచెప్పాలో తెలియక రాముని గట్టిగా కౌగిలించుకుని అలాగే ఉండిపోయారు.
రాము వాళ్ళందరిని విడిపించుకుని వినయ్ వైపు చూస్తూ, “జాగ్రత్తగా చూసుకో….శివరామ్ని తొందరపడి ఏ స్టెప్ తీసుకోవద్దని చెప్పు…” అంటూ అక్కడ నుండి బయలుదేరాడు.
రాము కిందకు వచ్చి బైక్ తీసుకుని స్టార్ట్ చేస్తూ బ్యాకప్ టీమ్తో, “ఏమైనా న్యూస్ ఉన్నదా,” అనడిగాడు.
“సార్….వందన గారి ఫోన్ చివరిసారిగా xxxx ఏరియాలో ఉన్నట్టు తెలిసింది….కాని ఇప్పుడు ఆమె ఫోన్ స్విచ్ఆఫ్ అయింది,” అన్నాడతను.
“సరె….నేను వెళ్తున్నట్టు కమీషనర్కి చెప్పకండి,” అంటూ రాము బైక్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు.
“అలాగే సార్….” అని సెల్యూట్ చేసాడతను.
రాము ఇందాక అతను చెప్పిన లొకేషన్కి వచ్చి చూసేసరికి రోడ్ మీద ప్రసాద్ వేసుకొచ్చిన బైక్ పడి ఉండటంతో రాము అక్కడ తన బైక్ ఆపి ఎటు వెళ్ళారా అని ఆలోచిస్తున్నాడు.
అంతలో రాము ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసాడు.
అవతల నుండి హంతకుడు, “రామూ…నీకు ఒక ఫోటో క్లూగా పంపిస్తున్నా….చెక్ చేసుకో…” అని ఫోన్ కట్ చేసాడు.
రాము కూడా ఫోన్లో తరువాత క్షణంలో what’s upలో మెసేజ్ వచ్చినట్టు బీప్ సౌండ్ రావడంతో what’s up ఓపెన్ చేసాడు.
ఆ ఫోటోలో ప్రసాద్, వందన మెడలకు తాడు బిగించి ఉండటం….వాళ్ళ వెనకాల గోడ మీద ఒక పెయింటింగ్ ఉండటం చూసి రాముకి వాళ్ళు తాము ఎప్పుడూ జిమ్ చేసే చోట ఉన్నారని అర్ధం అయ్యి ఫోన్ పాకెట్లో పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుండి బయలుదేరాడు.
రాము మెల్లగా జిమ్ ఉన్న బిల్డింగ్లోకి వచ్చి జిమ్కి కరెంట్ సప్లై మీటర్ బోర్డ్ దగ్గరకు వచ్చి తన పాకెట్లో ఉన్న చిన్న బాంబుకి తన చేతికి ఉన్న టైమర్ సెట్ చేసి మెల్లగా డోర్ దగ్గరకు వచ్చి అక్కడ గ్లాస్లో నుండి లోపలికి చూసాడు.
లోపల వందన, ప్రసాద్‌ల మెడలకు తాళ్ళు తగిలించి ఉంచాడు.
రాము మెల్లగా డోర్ తీసుకుని చుట్టూ చూస్తూ లోపలికి వచ్చాడు.
లోపల వీళ్ళిద్దరు తప్ప ఎవరూ కనిపించకపోయే సరికి వాళ్ళ కట్లు విప్పడానికి దగ్గరకు రాబోయాడు.
కాని అంతలోనే వెనకనుండి మొహానికి తేలు మాస్క్ పెట్టుకున్న ఒకతను పైనుండి రాము మీదకు దూకి తన చేతిలో ఉన్న సిరెంజ్తో రాము మెడ మీద ఇంజెక్ట్ చేసాడు.
తన మీద అతను పడిన వెంటనే రాము అతని మీద తన మోచేత్తో గట్టిగా రెండు దెబ్బలు వేసి కింద పడేసాడు.
అతనితో పాటు అతని చేతిలో ఉన్న సిరెంజ్ కూడా కింద పడింది.
అది చూసిన రాము తనకు మత్తుమందు ఇంజెక్ట్ చేసాడని అర్ధం అయింది.
కింద పడిన హంతకుడు వెంటనే లేచి రాము మీద దాడి చేసాడు.
కాని రాము వెంటనే అతని దాడిని ఎదుర్కుంటూ అతని ఛాతీ మీద గుద్దుతూ వెనక్కు తోసాడు.
దాంతో అతను మళ్ళి వెనక్కు నేల మీద పడిపోయాడు.
రాము కోపంతో అతని దగ్గరకు వచ్చి కాలితో కడుపు మీద కొట్టాడు.
మళ్ళీ రెండోసారి కొట్టబోతుండగా మత్తుమందు పని చెయడంతో రాము తూలుతూ కింద పడిపోయి సృహ కోల్పోయాడు.
అతను మెల్లగా పైకి లేచి రాము దగ్గరకు వచ్చి తన మొహానికి ఉన్న తేలు మాస్క్ని మెల్లగా తీసేసాడు.
దాంతో అతను తాము అనుమానించినట్టుగానే ఇమాన్యుయేల్ అన్న కొడుకు క్రిస్టోఫర్ అని వాళ్లకు అర్ధమయింది.
క్రిస్టోఫర్ కింద పడిన రాముని పైకి లేపి ఒక స్టూల్ మీద నిల్చోబెట్టి ఇంతకు ముందే వేలాడదీసి ఉన్న తాడుని రాము మెడకు తగిలించాడు.
కొద్దిసేపటికి రాముకి మెలుకువ రావడంతో మెడకు తాడు తగిలించి ఉండటంతో చిన్నగా దగ్గుతూ కళ్ళు తెరిచాడు.
అది గమనించిన క్రిస్టఫర్, “మెలుకువ రావడానికి ఎంతసేపు రామూ…..” అంటూ రాము దగ్గరకు వచ్చి, “రామ్ ప్రసాద్…DCP…అతి తక్కువ కాలంలోనే డిపార్ట్మెంట్లో చాలా పేరు సంపాదించుకున్నావు….చాలా తెలివైన వాడివి… ఎటువంటి కేసునైనా చాలా తేలిగ్గా సాల్వ్ చేసేవాడివి….” అంటూ రాము కళ్ళల్లోకి చూస్తూ, “కాని ఇప్పుడు ఆ తెలివి అంతా ఏమయింది…ఒక గోడౌన్ నుండి ఇంకో గోడౌన్కి నిన్ను తిప్పించాను…చూసావా,” అంటూ వెటకారంగా నవ్వాడు.
రాము చిన్నగా దగ్గుతూ, “నీకు ఏం కావాలి….” అనడిగాడు.