15-05-2023, 10:26 PM
వినయ్ : ఏంటన్నయ్యా….పెళ్ళి అనగానే అలా దిగాలుగా అయిపోయావు…నాకు చూడు…నేను పెళ్ళి చేసుకుంటాను అంటే ఎవరూ పట్టించుకోవడం లేదు….
రాము : ఏమోరా….నాకు ఇప్పుడు మాత్రం పెళ్ళి చేసుకోవాలని లేదు….
శివరామ్ : లేదన్నయ్యా…ఒప్పుకో…ఇంతకు ముందు నీ పెళ్ళి మేము ఎలాగూ చూడలేం కదా…ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉన్నది….
రాము : ఏరా…మీ అందరూ చూడాలని నన్ను మళ్ళీ ఊబి లోకి దింపుతున్నారా….
శివరామ్ : అలాంటిదేం లేన్నయ్యా….పెళ్ళి గురించి నీకు చెప్పేదేమున్నది…ఆల్రెడీ ఎంజాయ్ చేసిన వాడివి…ఇంకోసారి పెళ్ళి చేసుకో…..
రాము : సరెరా…నువ్వింతగా చెబుతున్నావు కాబట్టి మీ ఇష్టం….కాని ఒక్క షరతు….
శివరామ్ : ఏంటి….
రాము : ఆ వచ్చే అమ్మాయికి నాతో ఈ కుటుంబానికి ఉన్న రిలేషన్ ఏంటో మొత్తం నిజం చెప్పాలి….
వినయ్ : దాని బదులు…నీకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా….అన్నయ్యా….
రాము : అదేంటిరా….అలా అన్నావు….
వినయ్ : లేకపోతే ఏంటన్నయ్యా…మన ఫ్యామిలీతో నీకున్న రిలేషన్ ఎవరికైనా చెబితే నమ్ముతారా….పైగా నీకు ఏమైనా లూజా అన్నట్టు చూస్తున్నారు…ఒకవేళ పెళ్ళి అయిన తరువాత అయినా ఈ విషయం చెప్పావనుకో….నీకు ఇంక మందు కొట్టడానికి మా కంపెనీ అక్కర్లేదు…
రాము : అదేంటిరా….
వినయ్ : నువ్వు చెప్పిన విషయాలకు నీ భార్య…అదే మా వదిన…మైండ్ హీటెక్కి పోయి నీకంటే ఎక్కువ తాగేస్తాది…
రాము : అలా ఏం జరగదు లేరా…..
వినయ్ : సరె అన్నయ్యా….(అంటూ శివరామ్ వైపు చూసి) చిన్నన్నా…నువ్వు చెప్పు…పాతికేళ్ళ వయసుకే తాను నాయనమ్మ అయిపోయానని తెలిస్తే ఎవరైనా ఎలా ఫీలవుతారు….చెప్పు….
అప్పటికి వినయ్ చెప్పిన మాటలు అర్ధం కాకపోయినా చివరలో అన్న మాటలు వినే సరికి రాము, శివరామ్ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.
తరువాత ముగ్గురూ కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత అక్కడే రాము బెడ్రూమ్ లోనే పడుకుండి పోయారు.
********
ప్రసాద్ కూడా జరిగింది అంతా విని భారంగా ఇంటికి వచ్చాడు.
ఎప్పుడూ ఇంటికి హుషారుగా వచ్చే తన భర్త ఇప్పుడు దిగాలుగా ఇంటికి రావడం చూసి తులసి మనసులో, “స్టేషన్ లో ఏమైనా గొడవ జరిగిందా,” అని అనుకుంటూ ప్రసాద్ కి ఎదురువచ్చి అతని చేతిలో క్యాప్, లాఠీ తీసుకుంటూ, “ఏమైంది ప్రసాద్….అలా ఉన్నావు….స్టేషన్ లో ఏమైనా గొడవ జరిగిందా….” అని అడుగుతూ కిచెన్ లోకి వెళ్ళి గ్లాసులో వాటర్ తీసుకుని వచ్చి ప్రసాద్ కి ఇచ్చి పక్కనే కూర్చున్నది.
అంతలో రాశి కూడా తన బెడ్ రూమ్ లోనుండి వచ్చి వాళ్ళిద్దరి ఎదురుగా కూర్చుని ప్రసాద్ ఏం చెబుతాడా అని ఆత్రంగా చూస్తున్నది.
ప్రసాద్ గ్లాసులో వాటర్ తాగి గ్లాసుని పక్కన ఉన్న టీపాయ్ మీద పెడుతూ, “ఒక కేసు…బాగా ఇబ్బంది పెడుతున్నది,” అన్నాడు.
తులసి : నిన్ను అంత ఇబ్బంది పెడుతున్న కేసు ఏంటి….ఇప్పటి దాకా నువ్వు ఇంతలా ఆలోచించడం….బాధ పడటం చూడలేదు….
రాశి : అదేంటి….రాము ఊర్లో లేడా…అంతగా ఆలోచించేబదులు రాముకి ఫోన్ చేసి విషయం చెబితే ఆయనే సొల్యూషన్ చెబుతాడు కదా….
ప్రసాద్ : (ఒక్కసారి తన వదిన రాశి వైపు చూసి) అసలు ప్రాబ్లమ్ రాము సార్ కే…..
ఆ మాట వినగానే రాశి, తులసి ఇద్దరూ ఒక్కసారిగా, “ఏంటి….రాము సార్ కి ప్రాబ్లమా….ఏమయింది….వివరంగా చెప్పు,” అనడిగారు.
వాళ్ళిద్దరూ అడిగారు అనే కన్నా….కొంచెం గట్టిగా అరిచారు అని అంటే బాగుంటుంది.
దాంతో ప్రసాద్ కేసు గురించి వాళ్ళిద్దరికీ వివరంగా చెప్పి, “ఇప్పుడు ఆ హంతకుడు ఎవరో తెలియడం లేదు…వాడిని ఎలా పట్టుకోవాలి…రాము సార్ ని ఎలా రక్షించాలో నాకు, వందనకి అర్ధం కావడం లేదు….” అన్నాడు.
తులసి : (చేత్తో ప్రసాద్ భుజాన్ని పట్టుకుని) బాధపడకు ప్రసాద్….సరె….ఒక్క విషయం అడుగుతాను చెప్పు….
ప్రసాద్ : ఏంటి…అడుగు…..
తులసి : జరిగింది మొత్తం రాము సార్ చెపారన్నావు కదా….ఇదంతా చెప్పిన తరువాత రాము సార్ ఎలాగున్నారు….
ప్రసాద్ : అంటే….నువ్వు ఏం అడుగుతున్నావో అర్ధం కావడం లేదు….
తులసి : ఏం లేదు ప్రసాద్…ఇప్పటి వరకు జరిగిన హత్యల ప్రకారం తరువాత టార్గెట్ రాము సార్ అని చెబుతున్నావు ….ఆ విషయం మీకు ఎలా తెలిసింది…..
ప్రసాద్ : ఎందుకంటే….చనిపోయిన వాళ్ళు, రాము సార్….కలిసి పని చేసిన కామన్ కేస్ ఒకటే కాబట్టి….
తులసి : సరె….ఇప్పటి వరకు మీరు ముగ్గురూ (రాము, ప్రసాద్, వందన) చేసిన అనాలసిస్ ప్రకారం ఆ నిర్ణయానికి వచ్చారు….అంతే కాని పూర్తిగా నిజం కాదు….అంతేనా….
ప్రసాద్ : అవును….నువ్వు చెప్పింది నిజమే…..
తులసి : ఇప్పుడు రాము సార్ చెప్పినట్టు ఆయన చెప్పింది నిజమే అని కొద్దిసేపు అనుకుందాం…ఎందుకంటే మీ సెక్యూరిటీ ఆఫీసర్లు నాలుగు వైపులా ఆలోచించి ఫైనల్ డేసిషన్ కి వస్తారు…అందుకని 90% రాము సార్ చెప్పింది నిజమే అనుకుందాం….ఇప్పుడు మొత్తం చెప్పిన తరువాత….తరువాత టార్గెట్ తనే అని తెలిసిన తరువాత రాము సార్ మనస్థితి ఏంటి….
ప్రసాద్ : బాగా డిస్ట్రబ్ గా ఉన్నాడు…..
తులసి : నాకు తెలిసి ఆయన అంతలా డిస్ట్రబ్ అయ్యే మనిషి కాదు….ఎందుకంటే చాలా బేలన్స్ డ్ గా ఉంటాడు…. అంతే కాక ఏ ప్రాబ్లమ్ అయినా ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి…సాల్వ్ చేస్తాడు….అందుకు ఇంతకు ముందు మానస ఇన్ వాల్వ్ అయిన కేసు….దాని గురించి మీరంతా తల బద్దలు కొట్టుకుంటుంటే…రాము సార్ చాలా ఓపిగ్గా….తెలివిగా ఆ కేస్ సాల్వ్ చేసారు….నాకు తెలిసి….ఆయన్ను ఈ కేసు నుండి తప్పించినందుకు డిస్ట్రబ్ అయ్యి ఉంటారు….
తులసి అంత వివరంగా చెప్పేసరికి ప్రసాద్, రాశి ఇద్దరూ ఆమె వైపు మెచ్చుకుంటున్నట్టుగా చూసారు.
ప్రసాద్ : ఉదయం నుండి ఆయనతో నేను కలిసి పనిచేస్తున్నా…..నేను కూడా ఇంతలా రాము సార్ ని అర్ధం చేసుకోలా…ఎప్పుడో ఒకసారి కలిసిన నువ్వు తొందరగా అర్ధం చేసుకున్నావు….
తులసి : (ఆనందంగా ప్రసాద్ వైపు చూస్తూ) నువ్వు చూస్తూ ఉండు….ఈ కేసు కూడా తొందరలోనే సాల్వ్ చేస్తాడు….
రాశి : సరె….ప్రసాద్….అవన్నీ నువ్వు ఆలోచించకుండా….పడుకో….ఇప్పటికే చాలా లేటయింది….
తులసి అలా చెప్పగానే ప్రసాద్ కి మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయి ప్రశాంతంగా అయిపోయింది.
వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా కాలింగ్ బెల్ మోగడంతో తులసి వెళ్ళి తలుపు తీసింది.
అలా తలుపు తీసిన తులసికి ఎదురుగా నిల్చున్న ఆమెను చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది.
ఎదురుగా తన వదిన సంగీత నుల్చుని ఉండటం చూసి తులసి ఆనందంతో ఆమె చేతిలో సూట్ కేస్ తీసుకుని, “లోపలికి రా వదినా….ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి….సడన్ గా….ఏంటి…ఇలా వచ్చావు….” అనడుగుతూ హాల్లోకి తీసుకువచ్చింది.