30-04-2023, 05:57 PM
వందన : (రాము ఏం చెబుతున్నాడో…ఎందుకు చెబుతున్నాడో అర్ధంకాక….) లాయర్ పవన్….ఎలా….(అంటూ ప్రసాద్ వైపు చూస్తూ) సడన్గా ఏంటిది…..
ప్రసాద్ : నాక్కూడా అర్ధం కావడం లేదు….(అంటూ ఫోన్ కట్ చేసి రాము చెప్పిన పని చేస్తున్నాడు.)
రాము కారు నడుపుతూ హత్య జరగడానికి పాజిబులిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఆలోచిస్తున్నాడు.
అలా రాము కారు నడుపుతుండగా తన పక్కనే ఉన్న వైర్లెస్లో ఇంతకు ముందు తాను చెప్పినట్టు స్కార్పియోని వెదకమన్ను పెట్రోలింగ్, సెక్యూరిటీ ఆఫీసర్లకు అందరికీ మెసేజ్ వెళ్ళింది.
రాము కారుని ఫ్లైఓవర్ రోడ్ మీద ఒక పక్కగా ఆపి టైం చూసుకుంటున్నాడు.
అలా రాము కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండగా ఫోన్ మోగిన సౌండ్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పక్క సీట్లో ఉన్న ఫోన్లో కొత్త నెంబర్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, “హలో…” అన్నాడు.
అవతల వైపు నుండి ఎవరూ మాట్లాడకపోవడంతో తనకు ఫోన్ చేసింది హంతకుడే అని అర్ధమయింది.
దాంతో రాము, “రేయ్…ఫోన్ చేసి మాట్లాడవేందిరా….పిరికోడా,” అన్నాడు.
దానికి హంతకుడు, “రిలాక్స్ బాస్…లాయర్ పవన్ ని లేపేసాను….వెళ్ళి వాడి శవాన్ని కూడా మోసుకెళ్ళు…” అని ఫోన్ కట్ చేసాడు.
ఆ మాట వినగానే రాము కోపంగా, “హలో…ఏయ్…” అంటూ ఫోన్ కట్ చేసాడని అర్ధం అయ్యి వెంటనే కాల్ రికార్డింగ్ ఓపెన్ చేసి వాడు మాట్లాడిన మాటలు వింటున్న రాముకి హంతకుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అయ్యప్ప స్వామి భజన జరుగుతున్న సౌండ్ వినిపించింది.
దాంతో రాము వెంటనే వైర్లెస్ తీసుకుని కంట్రోల్ రూమ్ వాళ్ళతో, “హలో…కంట్రోల్ రూమ్…” అన్నాడు.
వైర్లెస్ : సార్….
రాము : నేను DCP రామ్ని మాట్లాడుతున్నాను….నా ఫోన్కి వచ్చిన లాస్ట్ కాల్ని ట్రేస్ చేయండి…కాల్ వచ్చిన చోటు దగ్గర్లో ఏమైనా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నదేమో చూడండి….తొందరగా కాల్ ట్రేస్ చేయండి….(అంటూ కారులో నుండి ఫ్లై ఓవర్ కింద రోడ్ వైపు చూస్తున్నాడు.)
వైర్లెస్ : అలాగే సార్….ఇపుడే చెక్ చేస్తాను….
అప్పటికే టైం అర్ధరాత్రి అవుతుండటంతో రోడ్లు అంతా నిర్మానుష్యంగా ఉన్నాయి.
రాము అసహనంగా కారు మళ్ళీ స్టార్ట్ చేసిన పోనిస్తున్నాడు.
వైర్లెస్ : సార్….కాల్ ట్రేస్ చేసాం సార్….xxxx ఏరియా నుండి వచ్చింది సార్….పక్కనే అయ్యప్ప టెంపుల్ కూడా ఉన్నది సార్….
రాము : యస్….(అంటూ కార్ గేర్ మార్చి వైర్లెస్లో చెప్పిన అడ్రస్ వైపు స్పీడుగా పోనిచ్చాడు.) నేను సస్పెక్ట్ని వెతుక్కుంటూ xxxx ఏరియాకు వెళ్తున్నాను….నా సెల్ ఫోన్ ట్రాక్ చేసి….దాన్ని బ్యాకప్ టీమ్కి పంపించండి…ఆ ఏరియాలో పెట్రోలింగ్ అలెర్ట్ చేయండి….మనం వెదుకుతున్నది ఒక బ్లాక్ స్కార్పియో….తొందరగా అందరికీ ఈ మెసేజ్ పాస్ చేయ్….
వైర్లెస్లో మెసేజ్ విన్న వెంటనే ప్రసాద్, వందన జీపులో రాము చెప్పిన ఏరియాకి బయలుదేరారు.
రాము కారు డ్రైవ్ చేసుకుంటూ అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో జరుగుతున్న భజనను చూస్తూ అక్కడ ఒక పాత భవనం ముందు కారు ఆపాడు.
అప్పటికే బాగా వర్షం పడుతుండటంతో ముందు ఏమీ కనిపించకపోవడంతో కార్ వైపర్స్ ఆన్ చేసాడు.
ఆ పాత బిల్డింగ్ లోపల ఒక బ్లాక్ స్కార్పియో ఆగి ఉండటంతో రాము కారు డోర్ తీసుకుని కిందకు దిగాడు.
బాగా వర్షం పడుతుండటంతో రాము తన గన్ తీసుకుని పొజిషన్లో పట్టుకుని అక్కడ ఉన్న చెట్టు కిందకు వెళ్ళి దాక్కున్నాడు.
అంతలో ఎదురుగా ఉన్న బిల్డింగ్లో నుండి ఒకతను చేతిలో బ్యాగ్ పట్టుకుని వర్షంలో తడుచుకుంటూ స్కార్పియో దగ్గరకు వస్తున్నాడు.
రాము చెట్టు చాటు నుండి అతన్నే పరీక్షగా చూస్తున్నాడు.
అతను క్యాప్ అటాచ్ చేసి ఉన్న షర్ట్ వేసుకుని ఉండటం….దానికి తోడు రాత్రి బాగా వర్షం పడుతుండటంతో చీకట్లో అతని మొహం సరిగా కనిపించడం లేదు.
అతను స్కార్పియో దగ్గరకు వచ్చి కారు డోర్ తీయబోతుండగా ఏదో అనుమానం వచ్చిన వాడిలా రాము దాక్కున్న చెట్టు వైపు చూసాడు.
దాంతో రాముకి తనను అతను చూసేసాడని అర్ధం అవడంతో షూట్ చేయడానికి ట్రిగ్గర్ నొక్కాడు.
కాని గన్ జామ్ అవడంతో రాము అసహనంతో గన్ని తన కార్ లోకి విసిరేసి కోపంతో వాడి మీదకు వెళ్లాడు.
అతను కూడా రాము దగ్గరకు వచ్చి కొట్టబోగా రాము అతని చేతులను బ్లాక్ చేస్తూ అతనిని రెండు దెబ్బలు కొట్టాడు.
దాంతో అతను తన కోట్లో నుండి చిన్న సర్జికల్ నైఫ్ తీసుకుని తన మీదకు వస్తున్న రాము దెబ్బను తప్పించుకుని తన చేతిలో ఉన్న చిన్న సర్జికల్ నైఫ్తో రాము పొట్ట మీద కోసాడు.
రాము షర్ట్ చినిగి సన్నగా పొట్ట మీద కోసుకుపోవడంతో….రక్తం కారుతుండటంతో చేతిని అడ్డు పెట్టుకుని అతని చేతిలో సర్జికల్ నైఫ్ ఉండటం గమనించాడు.
రాము తన చేత్తో పొట్ట మీద గాయం నుండి రక్తం పోకుండా ఆపుతూ అతని మీదకు వచ్చాడు.
కాని అతను రాము కంటే స్పీడ్గా కింద ఉన్న రాయి తీసుకుని రాము తల మీద గట్టిగా కొట్టాడు.
దాంతో రాము కళ్ళు తిరుగుతుండగా అలాగే రోడ్ మీద సృహ తప్పి పడిపోయాడు.
అతను చిన్నగా పక్కనే పడి ఉన్న తన బ్యాగ్ తీసుకుని అక్కడ నుండి తన స్కార్పియోలో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఐదు నిముషాలకు పెట్రోలింగ్ జీప్, ప్రసాద్, వందన అక్కడకు వచ్చి కింద పడి ఉన్న రాముని పైకి లేపి అక్కడ ప్లాట్ఫాం మీద కూర్చోబెట్టారు.
ప్రసాద్ తన నడుముకి ఉన్న పౌచ్లో నుండి గన్ తీసుకుని వందన వైపు చూస్తూ, “వందన…సార్ దగ్గరే ఉండు… (అంటూ పక్కనే సెక్యూరిటీ ఆఫీసర్ల వైపు చూస్తూ) మీలో ఇద్దరు నాతో రండి….(అంటూ ఆ బిల్డింగ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.)
వందన తన చేత్తో రాముని సరిగ్గా కూర్చోబెడుతూ, “సార్….ఎలా ఉన్నది….ఏమీ కాలేదు కదా,” అంటూ కంగారు పడుతున్నది.
రాము పరవాలేదు అన్నట్టు సైగ చేస్తూ, “ఛ….చేతి దాకా వచ్చిన వాడిని మిస్ చేసాను…దొంగదెబ్బ తీసి తప్పించుకున్నాడు,” అంటూ వాటర్బాటిల్ తీసుకుని వాటర్ తాగుతున్నాడు.
వందన : ఇంత దూరం వచ్చాము….ఇంకెంత సేపు సార్….తొందర్లోనే పట్టుకుంటాం….
ఇంతలో ప్రసాద్ ఆ బిల్డింగ్లోకి వెళ్ళీన అతనికి అది కోర్ట్ లైబ్రరీ అని అర్ధమయింది.
ఆ పెద్ద రూమ్లో పుస్తకాలు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
అలాగే లోపలికి వెళ్ళిన ప్రసాద్కి రూఫ్కి వేలాడుతున్న లాయర్ పవన్ శవాన్ని చూసి ఆశ్చర్యంతో చూస్తున్నాడు.
ఆ శవాన్ని చూసిన తరువాత ప్రసాద్కి ఏం చేయాలో తెలియక బయటకు వచ్చి రాము కూర్చున్న చోటకు వచ్చి, “సార్….మీరు ఒక్కసారి లోపలికి వచ్చి చూడండి…” అన్నాడు.
దాని రాము తల అడ్డంగా ఊపుతూ, “అక్కర్లేదు ప్రసాద్….నేను లోపలికి రావక్కర్లేదు…లోపల ఎవరున్నారో నాకు తెలుసు…లాయర్ పవన్,” అంటూ ప్రసాద్ వైపు చూసాడు.
ప్రసాద్కి జరుగుతున్నదేంటో అర్ధం కాక రాము వైపు అయోమయంగా చూస్తున్నాడు.
వందన కూడా రాము చెప్పింది విని ఆశ్చర్యంతో రాము వైపు చూస్తున్నది.