Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#46
అనిరుద్ర H/o అనిమిష - 16వ భాగం

“మరెవ్వరితో వెళ్లే వస్తుందో...” కోపంగా అనిరుద్రవైపు చూస్తూ అంది అనిమిష.

“అబ్బ... మీ గొడవ ఆపండే...” అంటూ అనిరుద్రవైపు చూసి, “చూడండి అనిరుద్రా... దీంట్లో మీక్కూడా లాభం ఉంది” అంది ద్విముఖ.

“అవును... దీంట్లో గెలిస్తే.. ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తా” అంది అనిమిష.

“ఏంటీ... లక్ష రూపాయలు గెలిస్తే... ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తావా? థాంక్స్ ఓ పని చెయ్... షోకి నా ఫొటో తీసుకొని వెళ్లు. నేను రాను”

“నువ్వు రాకుండా వాడెలా ఇస్తాడు లక్ష?”

“మరదే... నీకు లక్షిస్తే... నాకు నెల బోనస్సేమిటి? నాదే మేజర్ పార్ట్... నాకు సిక్స్టి నీకు ఫార్టీ...”

“అక్కర్లేదు” అంది ఉక్రోషంగా అనిమిష.

వెంటనే ద్విముఖ అనిమిషను మోచేత్తో పొడిచి, “తొందరపడకు. అతణ్ణి జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. అవసరం మనది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చినా యాభై వేలు వస్తుంది కదా” అంది.

అనిరుద్ర ఓ చెవి అటువేశాడు.

అనిమిష అనిరుద్రవైపు చూసి, “సరే సరే... ఫిఫ్టీ ఫిఫ్టీ... కానీ ఓ షరతు”

“షరతు కాదు. రిక్వెస్ట్ అనాలి. చెప్పు”

“సరే రిక్వెస్ట్... మిగతా నీ వంతు యాభై వేలు... నాకు అప్పుగా ఇవ్వాలి. నెలనెలా కొంత పే చేస్తాను”

“నాకు డౌట్ గా ఉంది. ఈ డబ్బంతా ఏం చేస్తున్నావు? ఏ స్విస్ బ్యాంక్ కో తరలించడం లేదు కదా... నన్నేమీ ఇరికించవు కదా” అన్నాడు అనిరుద్ర అనుమానంగా.

“నేను జెన్యూన్” అంది ఉక్రోషపడిపోతూ అనిమిష.

“థాంక్స్... సరే... ఏం చేస్తాం... బట్ వన్ కండీషన్... ఆ యాభై వేలకు ఇంట్రెస్ట్ పే చెయ్యాలి. లేకపోతే నీకు డబ్బివ్వడానికి నాకు ‘ఇంట్రెస్ట్’ ఉండదు”

“సరే...” అంది అనిమిష.

“పద... చెక్ తెచ్చేసుకుందాం” అన్నాడు అనిరుద్ర.

“ఏంటీ తెచ్చుకునేది... పోటీలో పాల్గొని బెస్ట్ కపుల్ గా ప్రైజ్ కొట్టేయాలి. ఈలోగా బాగా ప్రిపేర్ అవ్వండి” ద్విముఖ చెప్పింది..

“నేను బాగానే ప్రిపేర్ అవుతాను. వన్ మోర్ కండీషన్. పోటీలో నేను జీవించేస్తాను. ఆఫర్స్ ప్రైజ్ కోసమే... అందులో భాగంగా నేను తన నడుం మీదో, ఇంకెక్కడో చెయ్యి " దగ్గరకు లాక్కున్నా “ఇది’ పెట్టుకున్నా అభ్యంతరం పెట్టకూడదు”

“నేనొప్పుకోను” అంది అనిమిష.

“అయితే నేనూ ఒప్పుకోను” అన్నాడు అనిరుద్ర.

“అనిమిషా పోనీలేవే... ఎంత కాదన్నా నీ మొగుడే కదా. పైగా వోన్లీ ఎక్స్టర్నల్ యూజే కదా? అవసరం మనది కదా”

“ఇది అంటున్నాడు. 'ఇది' అంటే ఏమిటో కనుక్కో” అంది కాస్త మెత్తబడిపోతూ.

“మిష్టర్ అనిరుద్రగారూ... 'ఇది' అంటే ఏమిటో... అని అడుగుతోంది మా అనీమిష.

“అబ్బ... మీకేదీ అర్ధంకాదు... ఈ గవర్నమెంట్ బడిపిల్లలకు కండోమ్స్ ఇస్తుందిగానీ “ఇది' అంటే ఏమిటో చెప్పదు. ఇది అంటే... ఉమ్మా... ముద్దు” అన్నాడు నవ్వుతూ. ఈసారి అనిమిష ముఖం ఎర్రబడింది.

“వోన్లీ... ఒకే ఒక 'ఇది’. అంతకుమించి ఒప్పుకోను” అంది అనిమిష.

“రొంబ థాంక్స్...” అంటూ అల్లరిగా నవ్వి అక్కడ్నుంచి కిచెన్ లోకి వెళ్లాడు అనిరుద్ర.

“హమ్మయ్య... ఓ ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది. నువ్విక బెస్ట్ కపుల్ గా గెలవడానికి సిద్ధంగా ఉండు. ఎన్ని తెలుగు సినిమాలలో చూడలేదు ఇలాంటి సీన్లు... రెచ్చిపో... ఆల్ ద బెస్ట్... అన్నట్టు ఎల్లుండే పోటీ... ఈలోగా ప్రిపేర్ అవ్వండి. నేనొస్తాను” అంటూ బయల్దేరింది ద్విముఖ.

“ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. ఛాన్స్ దొరికింది కదానని ఎక్కడిపడితే అక్కడ చెయ్యేస్తే ఊర్కోను” సీరియస్గా అంది అనిమిష.

“నేనూ ఇప్పుడే చెప్తున్నాను. ఛాన్స్ దొరికింది కదానని... నన్ను విదిలిస్తే ఊర్కోను. మూడ్ ని బట్టి, టైంని బట్టి, సిట్యుయేషన్ ని బట్టి నేను రియాక్టవుతూ ఉంటాను” అన్నాడు అనిరుద్ర.

“ఏదో ఒకటి చెయ్... ఊర్కోక చస్తానా... అవసరం నాది కదా”

“ఆ విషయం అండర్లైన్ చేస్కో..” అన్నాడు అనిరుద్ర. అనిమిష అద్దంలో తనను తాను చూసుకుంది. సింపుల్ గా ఉంది. ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయల్దేరారు.

బెస్ట్ కపుల్ పోటీ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా జంటలే. ఫార్టీ ప్లస్ జంటలు కూడా ఉన్నాయ్. ప్రపంచంలోని ప్రేమనంతా ఒలకబోస్తున్నాయి. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం... నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకోవడం, అన్నం తినిపించుకోవడం, వాటేసుకోవడం, నడుం చుట్టూ చేతులు వేసుకోవడం... లాంటి యాక్షన్ పార్ట్స్ యాక్షన్ కట్లు లేకుండానే మొదలయ్యాయి.

డ్రీమ్ టీవీ ఛైర్మన్, అతని భార్య, శోభరాజ్, ఓ టేబుల్ ముందు కూర్చున్నారు. వాళ్ల ముందు టీవీ ఉంది. ఆ ప్రిమిసెస్ అంతా క్లోజ్ సర్క్యూట్ టీవీ కెమెరాలు ఉన్నాయి. కొన్ని కెమెరాలు నిరంతరం ఆ దంపతుల చుట్టూ తిరుగుతున్నాయి.

టీవీ ఛానెల్స్, మీడియా వచ్చేసింది. ద్విముఖ, కార్తీక్లు ఓ వైపు నుండి ఆసక్తిగా గమనిస్తున్నారు. కెమెరా అనిరుద్ర, అనిమిషల మీద ఫోకస్ అయ్యింది. ఈలోగా మైక్లో జడ్జేస్

ఓ ప్రశ్న అడిగారు.

“ప్రేమంటే ఏమిటి?”

జంటలు తమ తమ నిర్వచనాలు చెప్పడం మొదలు పెట్టారు. చచ్చే వరకూ కలిసివుండేది. ప్రే అంటే ప్రేమించు. మ... అంటే మరచిపో... అజరామరం... అదో మైకం.. ఇలా ఎవరికి తోచిన సమాధానాలు వాళ్లు చెప్పారు. మైక్ అనిరుద్ర ముందుకొచ్చింది.

“ప్రేమంటే... అదో కెమికల్ రియాక్షన్. రసాయనిక చర్య. ప్రేమంటే మనకు తెలియనిది... మనసుకు మాత్రమే తెలిసింది. మన చేతల్లో చూపించలేనిది. ఎదుటి మనిషి మనసు పొరల్లోకి దూసుకువెళ్లేది” అని చెప్పాడు.

క్లాప్స్... క్లాప్స్... క్లాప్స్.... అనిరుద్ర మెల్లిగా అనిమిష చెవిలో గొణిగాడు.

“ఏమిటా గొణుగుడు... విషయమేమిటో?” అడిగింది లోగొంతుకతో అనిమిష.

మెల్లగా కిందికి వంగి ఎవ్వరూ చూడకుండా (కెమెరా తమవైపు వుందని గమనించి) అనిమిష నడుము మీద ముద్దు పెట్టుకున్నాడు. అనిమిష మొహం సిగ్గుతో గులాబీ తోటగా మారింది.

ఆ దృశ్యం చూసిన జడ్జెస్ నవ్వుకున్నారు ముసిముసిగా. ఈలోగా అనిరుద్ర ఆపిల్ కట్ చేస్తూ ఎవ్వరూ చూడకుండా అనిమిష చెవిలో 'సారీ' అని ఓసారి చెప్పేసి చాకుతో ఆమె చేతి వేలి మీద చిన్న గాటు పెట్టాడు. అనిమిష కెవ్వుమంది.

వెంటనే అనిరుద్ర కంగారు నటిస్తూ, “ఏమైంది అనూ...” అంటూ ఆమె తర్జని రక్తసిక్తం అవ్వడం గమనించి ఆమె చేతి వేలిని తన నోట్లోకి లాక్కున్నాడు.

జడ్జెస్ ఆ దృశ్యాన్ని అలానే చూస్తుండిపోయారు. అనిరుద్ర కర్ఛీఫ్తో ఆ వేలికి కట్టుకట్టాడు.

****

“డియర్ పార్టిసిపెంట్స్... బెస్ట్ కపుల్ పోటీ ముగిసింది. దంపతులు తమ దాంపత్య మధురిమలను మా ముందు ప్రదర్శించారు. ప్రేమంటే ఏమిటో సరైన నిర్వచనం చెప్పడమే కాదు తన భార్య చేతికి అయిన చిన్న గాయానికే తల్లడిల్లిపోయిన అనిరుద్ర ప్రేమను ప్రత్యక్షంగా చూసాం. “బెస్ట్ కపుల్గా ఎంపిక చేసి లక్ష రూపాయల బహుమతి అందిస్తున్నాం” జడ్జెస్ అనౌన్స్ చేసారు. శోభరాజ్ అనిరుద్ర దంపతులను మనస్పూర్తిగా అభినందించాడు.

*****

“మీకసలు... కాదు... కాదు... నీకసలు బుద్ధి ఉందా? ఎంత శాడిస్ట్ వి కాకపోతే చాకుతో వేలి మీద గాయం చేస్తావా? ఏం నువ్వే కోసుకోవచ్చుగా. పైగా నా వేలేమైనా ఐస్ ఫ్రూట్ అనుకున్నావా? ఛాన్స్ దొరికింది కదా అని అదే పనిగా అరిగిపోయేంతవరకూ చప్పరిస్తావా? ఛ..ఛ... పది సబ్బులు అరగదీసి ఆ వేలిని కడుక్కోవాలి. అరడజను డెట్టాల్ బాటిల్స్తో క్లీన్ చేసుకోవాలి” ఇంటికి వచ్చాక అప్పటివరకూ వున్న ఉక్రోషాన్ని తిట్ల రూపంలో వెళ్లగక్కింది అనిమిష.
అనిరుద్ర ఆ తిట్లను కామ్ గా విన్నాడు.

“ఏంటీ... నేను నోరు నొప్పి పుట్టేలా తిడ్తుంటే... మిడ్ నైట్ మసాలా చూసినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి? అక్కడే పీక పిసికేయాలనుకున్నాను” మరింత ఇరిటేటింగ్గా అంది.

“హలో... ఏంటీ తెగ రెచ్చిపోతున్నావ్... ఏదో నీకు బహుమతి తెచ్చిపెడదామని.. కాస్త ఓవరాక్షన్ చేశాను. అసలు నా నోటిని యమునా నదిలో కడుక్కోవాలి. కృష్ణా నదిలో స్నానం చేయాలి” అన్నాడు అనిరుద్ర.

“బహుమతి కోసం అంతసేపు వేలు చప్పరించాలా? అయినా ఆ కోసుకునే వేలేదో నువ్వు కోసుకోవచ్చుగా” అంది ముక్కుపుటాలెగరేస్తూ అనిమిష.

అనిరుద్ర అటూ ఇటూ చూసి కిచెన్ లో నుండి చాకు తీసుకొచ్చి, “అయితే నా వేలు కోసుకుంటాను. నువ్వొచ్చి చప్పరించు” అన్నాడు ఆమెను రెచ్చగొడ్తూ.

“ఛీ.. ఛీ... నోరు విప్పితే సెన్సారే..”

“థాంక్స్... భళారే...” అన్నాడు అనిరుద్ర.

“నీ మొహం చూడాలంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. నాక్కనిపించకు... నిన్నీ క్షణమే మొగుడి పోస్టు నుండి పీకేస్తున్నాను” అంది అనిమిష.

“రొంబ థాంక్స్... నా లెక్క సెటిల్ చెయ్... అమౌంట్ క్లియర్ చెయ్యి. రేపే ఇంటర్నెట్లో యాడ్ ఇస్తాను. హాయిగా ఏ చైనా అమ్మాయినో చేసుకొని మొగుడి జాబ్ చేసి పెడతా...”

“మీ ఫేస్ కు కరెక్ట్ సూటబుల్” అంది అనిమిష.

"వన్స్ ఎగైన్ రొంబ థాంక్స్” అంటూ బయటకు నడిచాడు అనిరుద్ర.

****

అనిరుద్ర బయటకెళ్లి రాత్రి పదకొండు అయినా రాలేదు. ఒక్కదానికి అన్నం తినబుద్దికాలేదు. వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి చెయ్యి కడుక్కోబోయి ఆగింది. కుడి చెయ్యి చూపుడు వేలు... అనిరుద్ర నోట్లో పెట్టుకున్న వేలు... ఆ వేలిని కడుక్కోవాలనిపించలేదు. తన పెదవులకు ఆన్చుకుంది. అర్ధరాత్రి పదకొండు అవుతుండగా అనిరుద్ర నుండి ఫోన్.

“హలో... నేను అనిరుద్రను”
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:42 PM



Users browsing this thread: 1 Guest(s)