Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భార్య భర్తల కిల్లికజ్జాలు (సమాప్తం)
#23
గౌతమ్ వాళ్లది గుంటూరు....గౌతమ్ బీటెక్ చేసి క్యాంపస్ సెలక్షన్స్ లోనే ఇన్ఫోసిస్ లో జాబ్ కొట్టి ఇప్పటికీ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు.... ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినా రెండు సంవత్సరాలు తర్వాత తన అమ్మానాన్నలు గౌతమ్ కి పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తూ ఉండగా గౌతమ్ నాన్నగారి ఫ్రెండ్ దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒక బంధువుల పెళ్ళిలో కలిసి ఇద్దరూ మాట్లాడుకుని తన కూతురు నందు కి కూడా సంబంధాలు చూస్తున్నాము ఆమె కూడా డిగ్రీ చదివిందని పై చదువులు చదివించ లేక పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నామని అంటారు....
 
గౌతమ్ నాన్నగారు కూడా గౌతమ్ కి సంబంధాలు చూస్తున్నామని నందు నాన్నగారికి ఇష్టమైతే గౌతమ్ కి నందుని ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతారు....
 
గౌతమ్ నాన్నగారు కూడా ప్రైవేట్ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నంతలో హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు.....
 
నందు నాన్నగారు కూడా అలాగే ప్రైవేట్ ఆఫీసులో గుమస్తాగా వర్క్ చేస్తూ ఉంటారు..... ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు మొదటి అమ్మాయి మన హీరోయిన్ నందిక రెండవ అమ్మాయి మౌనిక.... నందు నాన్నగారు ఉన్నంతలోనే బ్రతుకుతూ మౌనిక ఇంటర్ చదువుతుంటే నందుని డిగ్రీ వరకు చదివించి పై చదువులు చదివించే స్తోమత లేక అక్కడితో ఆపేసి నందుకి పెళ్లి చేయాలని అనుకుంటారు..... గౌతమ్ నాన్నగారి గురించి నందు నాన్నగారికి తెలిసి ఉండటం వలన ఆయన ఇబ్బందిగా "మేము కట్నం మీరు అడిగినంత ఇచ్చుకోలేము...." అని అంటారు
 
గౌతమ్ నాన్నగారు "అసలు మాకు కట్నమే వద్దు గౌతమ్ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు రెండు సంవత్సరాలుగా.... మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మన స్నేహాన్ని బంధుత్వం గా మార్చుకుందాం.... నా మాట మా అబ్బాయి తప్పకుండా వింటాడు...." అని నవ్వుతూ అడుగుతారు
 
నందు నాన్నగారికి కూడా ఇక ఏ ఇబ్బంది లేక అలాగే అని ఒప్పుకొని అడ్రెస్ ఫోన్ నెంబర్ చెప్పి పెళ్ళిచూపులకి రమ్మంటారు.....
 
గౌతమ్ నాన్నగారు నందు నాన్నగారు ఉండేది ఓకే ఊరిలోనే కాబట్టి గౌతమ్ నాన్నగారు ఇక ఆలస్యం చేయకుండా పంతులు గారికి ఫోన్ చేసి నందు నాన్నగారి ఎదురుగానే పెళ్ళిచూపులకి ఈ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తెలుసుకొని ఆ రోజే వస్తామని చెప్తారు....
 
నందు నాన్నగారు కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళాక గౌతమ్ నాన్నగారు కూడా ఇంటికి వెళ్లి తన భార్యామణితో అంతా చెప్పి ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోగానే గౌతమ్ కి ఫోన్ చేసి "నా ఫ్రెండ్ కూతురితో నీకు ఒక వారంలో పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను.... నువ్వు కచ్చితంగా రావాలి ఈ సంబంధం ఎలాగైనా ఫిక్స్ అవ్వాలి.... నేను వాళ్లకు ఈ పెళ్లి జరుగుతుందని మాట ఇచ్చేశాను...." అని చెప్తారు
 
గౌతమ్"నాకు అమ్మాయి ఎలా ఉంటుందో?? కనీసం తెలియకుండా ఎలా నాన్న పెళ్లి చేసుకోవటం???కనీసం అమ్మాయి ఫోటో అయినా పంపండి..." అని అసహనంగా అడుగుతాడు
 
" నేను నా ఫ్రెండ్ ఫోన్ లో అమ్మాయి ఫోటో చూశాను.... తను కచ్చితంగా నీకు నచ్చుతుంది నువ్వు డైరెక్టుగా ఇక్కడికి వచ్చి చూద్దువు.... అన్ని మూసుకొని వారం రోజుల్లో ఇక్కడ ఉండాలి...." అని సీరియస్ గా చెప్తారు
 
గౌతమ్ ఇక ఏమనలేక అమ్మాయి నచ్చకపోతే అక్కడే డైరెక్ట్ గా అందరి ముందే నచ్చలేదు అని చెప్దాము అనుకుని సరే అని ఆ వారం రోజుల్లో తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాడు....
 
ఇంటికి వెళ్లగానే గౌతమ్ అమ్మగారు "ఏంటి నాన్న ఇలా చిక్కి పోయావు???? అందుకే ఇలా దూరంగా ఉండే ఉద్యోగాలు చెయ్యద్దు అని చెప్పాను.... ఇప్పటికీ ముంచి పోయింది ఏమీ లేదు అక్కడ మానేసి ఇక్కడే మన ఊరిలోనే ఏదైనా జాబ్ చూసుకుంటే పోతుంది కదా!!!!"అని అంటూ కొడుకు మీద ప్రేమ కురిపించేస్తారు
 
గౌతమ్ నవ్వుతూ "అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చిన ఇదే కదా అనేది!!! నేను నీకు అదే సమాధానం చెప్తున్నాను నేను బాగా ఉన్నాను.... నేనే వండుకొని తింటున్నాను.... ఆ ఉద్యోగం వదిలేసి రాలేను.... నువ్వు నా గురించి బెంగ పెట్టుకునే అవసరం లేదు....అని" అని నవ్వుతూ చెప్తాడు
 
ఇదంతా గౌతమ్ నాన్నగారు చూసి నవ్వుకుంటారు....
 
గౌతమ్ నాన్నగారు వెంటనే సీరియస్గా ఫేస్ పెట్టి "రేపే పెళ్లిచూపులు కి వెళ్ళాలి సిద్ధంగా ఉండు...."అని చెప్పగానే గౌతమ్ సరే అని అంటాడు...
 
 
నెక్స్ట్ రోజు ఉదయాన్నే పది గంటలు అప్పుడు గౌతమ్ రెడీ అయ్యి తన అమ్మానాన్నలతో పాటు నందుని పెళ్లిచూపులు చూసుకోవడానికి వెళతారు.....
 
@@@@@@@@@
 
నందు కూడా తన నాన్నగారు నందు కి అంతా చెప్పటం వలన కనీసం గౌతమ్ ఫోటో కూడా చూడకుండానే ఒప్పుకొని ఎలాగైనా ఫస్ట్ పెళ్లిచూపుల లోనే వచ్చే పెళ్లి కొడుకు కి తను నచ్చాలని అందంగా రెడీ అవ్వాలని ఆ వారం రోజుల్లో బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతుంది.....(అందరూ అమ్మాయిలు ఇంతే ఉంటారేమో కదా!!!! ఎలాగైనా ఫస్ట్ పెళ్లిచూపులు లోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని అనుకుంటారు కదా!!!!)
 
పెళ్లిచూపులు ముందురోజు షాపింగ్ మాల్ కి వెళ్లి తనకు నచ్చిన పట్టు సారీ కొనుక్కోని వచ్చి తన అమ్మానాన్నలకి చెల్లెలకి చూపించి వాళ్లు బాగుంది అనగానే సంతోషంగా పెళ్లిచూపులు కి అదే కట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది.....
 
అలా గౌతమ్ వాళ్ళు వచ్చేసరికి నందు నాన్నగారు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి సోఫా లో కూర్చోబెడతారు(నందు నాన్నగారిది సామాన్య మధ్యతరగతి డాబా ఇల్లు.... ఆ ఇంటిలో రెండు బెడ్రూంలు ఒక కిచెన్ ఒక హాల్ ఒక పెరడు ఉంటాయి....) గౌతమ్ ఇంటిని అంతా చూస్తూ "బాగుంది చాలా నీట్ గా ఎరేంజ్ చేసుకున్నారు" అని మనసులోనే అనుకుంటాడు....
 
గదిలో తన చెల్లెలి సహాయంతో రెడీ అవుతున్న నందు కార్ సౌండ్ కి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు అనుకొని నందు మనసులో "ఇతను అందంగా ఉంటాడా?? లేకపోతే యావరేజ్ గా ఉంటాడా??? బాగా సంపాదిస్తున్నాడా??? డైలీ నేనడిగింది లేదు కాదు అనకుండా కొనిస్తాడా??? నన్ను బాగా చూసుకుంటాడా???" అని ఆలోచించుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది(పెళ్లిచూపులు కి రెడీ అయిన ప్రతి అమ్మాయి మనసులో ఉండేది ఇదే కదా!!!!)
 
నందు అమ్మ గారు గౌతమ్ వాళ్ళకి కాఫీ టిఫిన్ పెట్టి అబ్బాయి గురించి అన్నీ వివరాలు తెలుసుకున్నాకా గౌతమ్ అమ్మగారు వాళ్ళు అమ్మాయి ని రమ్మని చెప్పగానే నందు అమ్మగారు, తన చెల్లెలు ఇద్దరు వెళ్లి నందు చెల్లెలు నందుని రెడీ చేస్తూ ఆటపట్టిస్తూ ఉంటే వాళ్ళిద్దర్నీ నవ్వుతూ చూసి నందుని పై నుంచి కింద వరకు చూసి మెటికలు విరుస్తూ"చాలా అందంగా ఉన్నావు నందు... కచ్చితంగా వాళ్ళ అబ్బాయికి నువ్వు నచ్చుతావు.... అబ్బాయి కూడా చాలా బాగున్నాడు.... ఈ సంబంధం గాని ఫిక్స్ అయితే మీ ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంటుంది.... వాళ్లు నిన్ను చూసుకోవటానికి పిలుస్తున్నారు పదా..." అని అంటుంది
 
నందు కొంచెం బిడియంగా సిగ్గుగా ఫస్ట్ పెళ్లి చూపులు అవటం వలన ఎలాగైనా "అమ్మ చెప్పిందంటే అబ్బాయి చాలా అందంగా ఉండి ఉంటాడు....ఎలాగైనా ఈ అబ్బాయి తోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని...." మనసులో దేవుని కోరుకుంటూ ఉంటుంది
 
గౌతమ్ కూడా "అమ్మాయి అందంగా ఉండాలని ఈ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అవ్వాలని" దేవుని కోరుకుంటూ ఉంటాడు....(అందరూ అబ్బాయిల మనసుల్లోనూ ఇదే ఉంటుందా??? కొంచెం మీ ఒపీనియన్ షేర్ చేయండి....)
 
నందు తలదించుకునే బయటికి వచ్చి తన నాన్నగారి పక్కన కూర్చుంటుంది....
 
నందు బయటికి రాగానే గౌతమ్ కి నందు వాడే పర్ఫ్యూమ్ ఆరోమా స్మెల్ వచ్చే సరికి ఏమరుపాటుగా తలెత్తిన గౌతమ్ నందు ని అలా పట్టు సారీ లో పైనుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటే తనని అలా చూసి ఫిదా అయిపోయి మనసులో "ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది.... ఈ అమ్మాయికి ఎన్ని పద్ధతులు వచ్చి ఉంటే ఈ అమ్మాయి కానీ నా వైఫ్ అయితే చాలా బాగుంటుంది!!!"అని అనుకుంటూ నందు తీక్షణంగా చూస్తూ ఉంటాడు
 
నందు స్కై బ్లూ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్న లైట్ వెయిట్ పట్టు సారీ కట్టుకుని మెడలో ఒక నెక్లెస్, చెవులకి పెద్ద బుట్టలు, రెండు కనుబొమల మధ్య రెడ్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని, తలలో మల్లెపూలు పెట్టుకుని సింపుల్ గా రెడీ అయ్యి ముట్టుకుంటే మాసిపోయే రంగులో పైనుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది....
 
గౌతమ్ ఆరడుగుల కి ఒక్క ఇంచ్ తక్కువ ఎత్తులో వైట్ అండ్ బ్లూ కలర్ చెక్స్ షర్ట్ డార్క్ బ్లూ జీన్స్ వేసుకొని ఇన్ షట్ చేసుకుని ట్రిమ్ చేసిన గడ్డంతో చురు కత్తి లాంటి చూపులతో నందు కి ఏ మాత్రం తీసిపోని రంగులో హ్యాండ్సమ్ గా ఉంటాడు....
 
నందు కి గౌతమ్ చూపులు తాకుతున్న సైలెంట్గా మనసులోని టెన్షన్ పడుతూ తలదించుకుని ఉంటుంది.....
 
గౌతమ్ అమ్మగారు నాన్నగారు గౌతమ్ నందు వచ్చిన దగ్గరనుంచి చూస్తూ ఉండేసరికి వాళ్ళకి గౌతమ్ కి నందు నచ్చిందని అర్థమై నందుతో "తలదించుకునే ఉంటావా మా కొడుకుని కూడా చూసేదేమైనా ఉందా కోడలు పిల్ల???" అని గౌతమ్ అమ్మగారు నవ్వుతూ అంటారు
 
అయినా నందు తలదించుకునే ఉండేసరికి నందు అమ్మగారు నందు చెవిలో "ఒకసారి అబ్బాయిని చూడు నందు...." అని చెప్పగానే నందు చిన్నగా తలెత్తి గౌతమ్ వైపు చూసి తన చూపుల బాణాల్ని గౌతమ్ గుండెల్లో గుచ్చి సైలెంట్ గా వెంటనే తల దించుకొని ఉంటుంది
 
ఆ చూపుకి గౌతమ్ గుండె పేలిపోయి మనసులో"గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనే పట్టు మీద రాయి వేసి కొట్టినట్టుందే...."అనే సాంగ్ కూడా వేసుకొని "ఇక ఫిక్స్ ఇదే నా పెళ్ళాం"అనుకోని వెంటనే తన అమ్మానాన్నలతో "అమ్మాయి నాకు బాగా నచ్చింది మమ్మీ .... అమ్మాయికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం...." అని నందు వైపే చూస్తూ ఆత్రంగా మాట్లాడుతాడు
 
ఆ మాటకి గౌతమ్ నాన్నగారి సీరియస్ గా గౌతమ్ వైపు చూస్తూ "నీకు అమ్మాయి నచ్చిందని మాత్రమే చెప్పు ఎప్పుడు మీకు పెళ్లి చేయాలి అనేది మేము చూసుకుంటాం...." అని గౌతమ్ కి మాత్రమే వినిపించేలా అంటారు
 
గౌతమ్ మాటలకి నందు ఫ్యామిలీ అంతా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే గౌతమ్ నాన్నగారు వెంటనే నందు నాన్నగారితో "ఏమనుకోకు రా వీడికి కొంచం ఆత్రం ఎక్కువ.... ఏది దాచుకో లేడు వెంటనే బయటికి కక్కేస్తాడు...." అని నవ్వుతూ అంటారు
 
నందు నాన్నగారు పర్వాలేదు అనగానే నందు మనసులో "ఓహో అబ్బాయి గారికి చాలా తొందరగా ఉన్నట్టుందే నన్ను పెళ్లి చేసుకోవడానికి!!!!" అని నవ్వుకుంటుంది
 
గౌతమ్ మనసులో "ఈ నాన్నలు ఉన్నారే ఎప్పుడు ఇంతే కొడుకుని ఎప్పుడు ఏదో ఒక మాట అందామా అని చూస్తూ ఉంటారు...." అని అనుకొని బయటికి ఏమీ తెలియని అమాయక చక్రవర్తి సైలెంట్ గా సరే అని చెప్పాడు
 
గౌతమ్ ఎక్స్ప్రెషన్ని ఓరగా చూస్తున్న నందు నవ్వుకుంటుంది.....
 
నందు నాన్నగారు "నందు నీకు అబ్బాయి నచ్చాడా???" అని అడిగితే "నేను కొంచెం అబ్బాయి తో మాట్లాడాలి నాన్న..." అని అడుగుతుంది
 
గౌతమ్ వెంటనే పైకి లేచి "నేను రెడీ వెళ్దామా మాట్లాడుకోవడానికి!!!!" అని పళ్ళన్ని బయటికి పెట్టి నవ్వుతూ అంటాడు
 
గౌతమ్ నాన్నగారి సీరియస్ గా గౌతమ్ వైపు చూసేసరికి అప్పుడు గౌతమ్ ఏం చేశాడో గుర్తుకు వచ్చి "ఛ ఇలా చేశాడేంటి??? ఈ అమ్మాయి నా గురించి ఏమనుకోని ఉంటుంది???" అనుకుంటూ ఇబ్బందిగా అందరి వైపు చూస్తూ ఉంటాడు
 
నందు నాన్నగారు గౌతమ్ వైపు చూసి నవ్వుతూ "నీ గదిలోకి తీసుకు వెళ్ళు నందు ఇద్దరు మాట్లాడుకోండి...." అని అంటారు
 
నందు సరే అని నెమ్మదిగా పైకి లేచి అడుగుల్లో అడుగులు వేస్తూ ఒక అయిదు నిమిషాలకి తన రూమ్ చేరుకుంటుంది.....
 
గౌతమ్ నందు వెనకే అడుగులు వేస్తూ "ఏంటి ఈ అమ్మాయి ఇంత స్లోగా నడుస్తుంది????"అని నందుని బ్యాక్ సైడ్ నుంచి చూసి "బ్యాక్ సైడ్ నుంచి సూపర్ ఉంది...." అని నందు చీర జాకెట్ కలవని చోట గౌతమ్ చూపు నడుము దగ్గర ఆగిపోయి "దీని నడుము ఎంత ఒంపులు తిరిగి ఉంది??? పైగా దానిలో నెలవంక ఎంత అందంగా ఉంది??? ఇప్పుడే దాన్ని ముద్దు పెట్టుకోవాలని పిస్తుంది..... ఇన్ని సంవత్సరాలు నా బ్రహ్మచర్యానికి వెంటనే స్వస్తి పలకాలి అనిపిస్తుంది..... ఎలాగైనా సరే ఈ అమ్మాయికి నేను నచ్చి మా పెళ్లి వెంటనే జరిగేలా చూడు స్వామి...." దేవుడు మెక్కేసుకుంటూ ఉంటాడు
 
 
నందు లోపలికి వెళ్లి గౌతమ్ లోపలికి రాగానే వెంటనే డోర్ లాక్ చేసి తల పైకెత్తి సూటిగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ తన చీర చెంగు నడుము దగ్గర దోపుకుని "ఏంటి నేను బయటికి వచ్చిన దగ్గర నుంచి ఆ తినేసేలా చూడటం???? అయినా ఎప్పుడు అమ్మాయిలని చూడనట్టు అలా చూస్తున్నావ్ ఏంటి????" అని తన నడుము మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: భార్య భర్తల కిల్లికజ్జాలు - by k3vv3 - 13-04-2023, 01:27 PM



Users browsing this thread: 1 Guest(s)