Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#43
అనిరుద్ర H/o అనిమిష - 13వ భాగం

సాయంత్రం అనిమిష ఆఫీసు నుండి వచ్చేసరికి అనిరుద్ర చపాతీలు చేస్తూ కనిపించాడు. అలసటగా హ్యాండ్ బ్యాగ్ ను సోఫాలోకి గిరాటు వేసి, బాత్రూమ్లోకి వెళ్లి ఫ్రెషప్ అయ్యి... శారీ విప్పేసి, నైటీ కోసం చూస్తోంది అలవాటుగా.

అప్పుడే కాఫీ పట్టుకొచ్చిన అనిరుద్ర పెట్టీకోట్, బ్లౌజ్తో వున్న అనిమిషను చూసి అలాగే నిలబడిపోయాడు.

“ఏయ్... ద్విముఖా... ఏం చేస్తున్నావే...” అంటూ ఎదురుగా వున్న అనిరుద్ర చూసి కెవ్వున అరిచి రెండు చేతులను క్రాస్లా గుండెలకు అడ్డుపెట్టుకుంది.

“థాంక్యూ” అని కాఫీ కప్పు అక్కడ పెట్టి వెళ్లాడు . గబగబా చీర కట్టుకొని ఓరకంటి హాలులో కూర్చున్న అనిరుద్ర వైపు చూసింది. తనకు పెళ్లయ్యిందన్న విషయమే మర్చిపోయింది ద్విముఖ ఉన్నట్టే ఫీలై, అలవాటుగా నైటీ మర్చిపోయింది. తనని చూసిన అనిరుద్ర 'సారీ' చెప్పకుండా 'థాంక్స్” అని ఎందుకు వెళ్లిపోయాడు.

వెంటనే సిగ్గును పక్కన పెట్టి అనిరుద్ర దగ్గరకెళ్లి, “హలో... ఏమిటీ.. ఫ్రీ షో చూసినట్లు చూసి... చప్పున సారీ చెప్పకుండా 'థాంక్స్' అని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి?” అని అడిగింది.

“శారీ లేకుండా మలయాళ కుట్టేలా కనిపించారు. ఇలాంటి క్లిప్పింగుల కోసం సినిమాలకెళ్తాం. నా పెళ్లాం అలా కనిపించేసరికి కర్టెసీ కోసమైనా థాంక్స్ చెప్పొద్దా. అయినా , ఇందులో మిస్టేక్ ఏముంది? డోర్ ఓపెన్ చేసి, షట్టర్ ఓపెన్ చేసినట్టుగా అందాల్ని క్యాట్ వాక్లా చూపిస్తుంటే నా తప్పేముంది...” అన్నాడు అనిరుద్ర.

“ఛీఛీ... మీ నోట్లో నోరు పెట్టడం నాదీ తప్పు” అంది అనిమిష.

“నా నోట్లో నువ్వు నోరెప్పుడు పెట్టావు? కనీసం ముద్దు కూడా పెట్టలేదు. కమల్ హాసన్ ఈ డైలాగ్ వింటే సంతోషపడిపోతాడు” అనిమిష రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్లిపోయింది.

****

అనిరుద్ర చేసిన కాఫీ ఆమెకు బాగా నచ్చింది. చపాతీ వాసన అదిరిపోతోంది.

“చపాతీలోకి ఏం చేస్తున్నారు? బంగాళాదుంప అయితే అదిరిపోతుంది” అంది కిచెన్ లోకి వచ్చి అనిమిష.

“అదిరిపోతే చెయ్... నాకూ ఆకలి దంచేస్తోంది” అన్నాడు అనిరుద్ర.

“నేనా... ఇప్పుడా...”

“నువ్వు కాకపోతే కరీనాకపూర్ వచ్చి చేస్తుందా? ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం చేస్తావా?” అడిగాడు అనిరుద్ర.

“మీరు చేయరా?”

“హలో... ఈవెనింగ్ డ్యూటీ నీదే... ఆఫీసుకు వెళ్లే హడావుడిలో వున్నావని మార్నింగ్ ఎక్స్ట్రా పనులు కూడా చేశాను”

అనిమిష వెంటనే బంగాళాదుంప కూర చేయడంలో మునిగిపోయింది.

* **

రాత్రి పది దాటింది. హాలులో కూర్చొని టీవీ చూస్తున్నాడు అనిరుద్ర. అనిమిషకు నిద్ర ముంచుకొస్తోంది. అనిరుద్ర పడుకున్నాక అతని పడగ్గదికి బయట్నుంచి తాళం వేయాలన్నది ఆమె ఆలోచన.

“హలో... నువ్వు పడుకునే వరకూ పడుకోను. నేను ముందే పడుకుంటే బయట్నుంచి తాళం వేసినా వేస్తావు” ఆమె మనసులోని ఫీలింగ్స్ చదివినట్టు అన్నాడు అనిరుద్ర.

“ఈ మనిషికి ఫేస్ రీడింగే కాదు... హార్ట్ రీడింగ్ కూడా తెలుసునేమో” అనుకుంది అనిమిష “మరి నేనేం చేయాలి?

. “ఓ పని చేద్దాం. నా కళ్లకు గంతలు కడతావా?” అడిగాడు అనిరుద్ర. “చేతులు కట్టేస్తాను” అంది అనిమిష.

“థాంక్స్... కళ్లకు గంతలు కట్టనందుకు”

“రెండూ... కళ్లకు గంతలు కడితే చేతుల్తో విప్పేసుకుంటారు”

“పోనీ కళ్లకు గంతలు కట్టకుండా చేతులు కట్టేయ్”

“అప్పుడు కళ్లు మిటకరిస్తూ అర్ధరాత్రి వచ్చి నా గదిలోకి తొంగి చూస్తే”

“ఛఛ... నీకింత అనుమానం అయితే ఎలా? పోనీ పక్కింటికెళ్లి పడుకోనా?” అడిగాడు ఒళ్లు మండి అనిరుద్ర.

“పక్కింటాయన ఊర్కోడు... ఒళ్లు చీరేస్తాడు” అంది అనిమిష.

రాత్రి పదకొండు అవుతుండగా అనిరుద్ర అనిమిష గది దగ్గరకొచ్చి, పిలిచాడు. అనిమిష తలుపు తీసి, 'ఏంటి?' అని అడిగింది.

“నోటితే చెప్తేగానీ నీకు సమ్మగా ఉండదా? బాత్రూమ్ కి వెళ్లాలి” కోపంగా చూసి.

“వెళ్లండి” అంది పక్కకు జరిగి.

“ఎలా వెళ్లను. గుడ్డి ముండావాడిని తీస్కెళ్లు” అన్నాడు అనిరుద్ర.

“నేనా.. ఛఛ... నేను తీసుకెళ్లను”

“అయితే కళ్ల గంతలు, చేతికి వున్న కట్లు విప్పు”

అనిమిష అతణ్ణి బాత్రూమ్ దగ్గరకి నడిపించుకుంటూ వెళ్లి, అతని చేతికి వున్న కట్లు విప్పింది. అయిదు నిమిషాల తర్వాత బాత్రూమ్లో నుండి బయటకు వచ్చాడు. మళ్లీ అతని చేతుల్ని కట్టేసింది. తాపీగా నడుచుకుంటూ బయటికెళ్లాడు అనిరుద్ర.

“అదేంటి... కళ్లకు గంతలు కట్టినా అలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తున్నావ్...'

“అలవాటైంది... అన్నట్టు ఓ విషయం తెలుసుకో... కళ్ల గంతలు, చేతులకు , కడితే సరిపోదు. మనసుకు గంతలు కట్టుకోవద్దు” తన గదిలోకి వెళ్తూ చెప్పాడు అనిరుద్ర..

ఇంకెప్పుడూ అలా కళ్లకు గంతలు కట్టకూడదని, చేతులు కట్టి పడేయకూడదని నిర్ణయించుకుంది అనిమిష.

***

ఆఫీసు వదిలే సమయానికి వచ్చింది ద్విముఖ. .

“కొత్త కాపురం ఎలా ఉంది?” అడిగింది ద్విముఖ క్యాంటీన్లో కూర్చొని సమోసా తింటూ.

“నాకేం కొత్తగా అనిపించడంలేదు.. నీ బదులు అతను... కాకపోతే ఒక్కోసారి నాకే గిల్టీ ఫీలింగ్...”

“నీలో గిల్టీ ఫీలింగ్ మొదలైందీ అంటే అనిరుద్ర మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవుతోందన్నమాట... నువ్వు అతడి ప్రేమలో పడిపోతున్నావన్నమాట” అంది ద్విముఖ.

“ఛఛ... అలాంటిదేమీ లేదు”

“లేదని నీ నోరు చెప్తోంది. ఉందని నీ బుగ్గలోని ఎరుపు చెప్తోంది. ఇంతకీ నీ పని ఎంతవరకు వచ్చింది?”

“చాలావరకూ అయిపోయినట్టే.. అనిరుద్ర పేరు మీద బైక్ తీసుకోవాలని మా బాస్ ను 'లోన్' అడిగాను. అనిరుద్రతో మాట్లాడికానీ లోన్ శాంక్షన్ చేయనని చెప్పాడు. ఈ విషయం అనిరుద్రకు చెప్పాలి. ఆయన్నెలా కన్విన్స్ చేయాలో అర్ధంకావడంలేదు. పైగా చెక్ ఆయన పేరుతోనే ఇస్తాడట”

“పోనీ అనిరుద్రతో నేను మాట్లాడనా?” అంది.

“వద్దోద్దు... బావోదు... అతను అపార్ధం చేసుకుంటాడేమో” “ఏం చేస్తావ్?”

“ఏదో విధంగా నేనే మేనేజ్ చేస్తాను”

“సరే... అప్పుడే మీకు పెళ్లయి ఇరవై రోజులు దాటిందంటే నమ్మబుద్దేయడం లేదు” అంది ద్విముఖ.

“అవునవును” నవ్వుతూ అంది అనిమిష.

****

అనిమిష ఇంటికొచ్చేసరికి అనిరుద్ర పేపర్ చదువుతున్నాడు. అనిమిష ఫ్రెషప్ అయి వచ్చి, అనిరుద్ర పక్కనే కూర్చుంది.

“హలో... నేను అనిరుద్రని”

“తెలుసు... నా మొగుడు...” అంది అతనికి మరి కాస్త దగ్గరగా జరుగుతూ.

“ఏమో.. మళ్లీ గతంలోకి వెళ్లి... మన పెళ్లయిన విషయం మరిచి, నీ ఫ్రెండ్ ద్విముఖ అని కూర్చున్నావేమోనని”

“ఛఛ... అలాంటిదేం లేదు... అన్నట్టు మీకిష్టమైన స్వీట్ తెచ్చాను” అంటూ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది.

“నాకిష్టమైన స్వీటా... నా దృష్టిలో ముద్దు తప్ప... ఇంకేమీ స్వీట్గా వుండదే” అనిమిష పెదవుల వంక చూస్తూ అన్నాడు.

మరోసారి అయితే ఉక్రోషంగా ఏదో ఓ సమాధానం చెప్పేదే... కానీ ఇప్పుడలా కాదు.

“అది కాదు... మీకు తిరుపతి లడ్డు ఇష్టం కదా. మా కొలీగ్ తిరుపతి వెళ్తుంటే మీ కోసం ఓ లడ్డూ తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చింది” అంటూ లడ్డూ ప్యాకెట్ తీసి ఇచ్చింది.

ఓసారి అనిమిష వంక చూసి, “ఏంటీ.. ఈ రాత్రి లడ్డూలో మత్తు కలిపి ఇచ్చి పడుకోబెడదామనే...”

“ఛఛ... నిజంగా మీ కోసమే... మీకు నమ్మకం లేకపోతే నేను తింటాను...” అంటూ కొద్దిగా చిదిమి లడ్డూ కళ్లకు అద్దుకొని నోట్లో వేసుకుంది.

“కొద్దిగా తింటే నమ్మేస్తానా... సగమైనా తినాలి” అనిమిష సగం లడ్డు తను తీసుకొని మిగతా సగం అనిరుద్రకు ఇచ్చింది. అనిరుద్ర లడ్డూను కొద్దికొద్దిగా తింటూ, “ఇక రాసెయ్” అన్నాడు.
“ఏంటి?” అడిగింది అర్ధంకాక.

“ఐస్ రాసే పని ఏమైనా ఉందా?” అనిమిష వంక చూసి అడిగాడు.

“మీరలా అంటే నేనేమీ రాయను” అంది అలిగిన ఎక్స్ప్రెషనిస్తూ.

“సరే... ఏమీ అననుగానీ ఏంటీ విషయం?”

“పాప ఏడ్చిందా?”

“అలా కాదు సీరియస్... నేను మీ కోసం బైక్ కావాలని లోన్ కు అప్లయ్ చేశాను”

“బైకా... ఆల్రెడీ నాకోటి ఉంది. టివియస్ విక్టర్... మళ్లీ ఎందుకు? అయినా నేనంటే మీకు ఎంత ప్రేమ అనిమిషా? ఇంతకీ ఆ బైక్ ఫ్రీనా? ఇన్స్టాల్మెంట్లు నేను కట్టుకోవాలా? లేదా ఆ బైక్ మీద రోజూ నిన్ను దింపాలా?”

“అసలు బైకే కొనడం లేదు”

“కొనడం లేదా... మరి లోనెందుకు?”

"ఆ డబ్బుతో నాకు కాస్త పర్సనల్ పని ఉంది. నేను లోన్ ఇన్స్టాల్ మెంట్స్ పే చేస్తాను”

“అంటే లోన్ పేరుతో తీసుకుంటున్నావన్నమాట... అవునూ నాకో డౌట్... నన్నేమి ఇరికించవు కదా... నిన్ను చూస్తుంటే కృషీ బ్యాంక్ గుర్తిస్తోంది. నాకేం టెండర్ పెట్టవు కదా..

'ఒక్క క్షణం ఆమె కళ్లలో నుండి నీళ్లు ఉబికివచ్చాయి.

“అంత నమ్మకం లేకపోతే అప్పు వున్నట్టు ప్రామిసరీ నోటు రాసిస్తాను. ఆఫ్రాల్ అరవై వేలు నమ్మరా?” అంది ఏడుపును అదిమిపెట్టుకుంటూ..

“వద్దు... నవరసాల్లో నాకు నచ్చని రసం ఒకే ఒకటి... అది శోక రసం” చెప్పాడు అనిరుద్ర.

“అయితే మా బాస్ మీకు ఫోన్ చేసి లోన్ కావాలా? అని అడుగుతాడు. కావాలని చెప్పండి. చెక్ ఇస్తానంటాడు. తీసుకోండి. ఆ తర్వాత ఆ చెక్ క్యాష్ చేసి నాకివ్వండి”

“మనలో మాట ఈ డబ్బుతో షేర్లు కొంటున్నావా? బిజినెస్ చేస్తున్నావా?”

“ఏదో ఒకటి... ప్లీజ్” అని అనిమిష వెళ్లబోతుంటే...

“మీ బాసాసురుడు పొద్దున్నే ఫోన్ చేసి డిటైల్స్ అడిగాడు. చెక్ కూడా పంపించాడు. చెక్ ని క్యాష్ చేశాను. ఆ డబ్బు నీ గదిలో వుంది” అని చెప్పాడు అనిరుద్ర.

ఒక్క క్షణం ఆగి తన గదిలోకి వెళ్లి టేబుల్ మీద అరవై వేలు చూసింది అనిమిష. వెనక్కి పరుగెత్తుకొచ్చి అనిరుద్రను గట్టిగా వాటేసుకుంది చాలా గట్టిగా.

“థాంక్యూ.. థాంక్యూ...” అంది అతణ్ణి అలా పట్టుకొని. అప్రయత్నంగానే అతని చెయ్యి ఆమె తల నిమిరింది.

****
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:23 PM



Users browsing this thread: 2 Guest(s)