Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భార్య భర్తల కిల్లికజ్జాలు (సమాప్తం)
#15
గౌతమ్ వెంటనే నందు కాళ్లు పట్టి లాగేసి మంచం మీద పడేసి తన మీదకి చేరిపోయి "ఏమైనా రేపు చూసుకుందాం ... ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదు...." అంటూ కసిగా తన పెదవులు అందుకోవడానికి ముందుకు వస్తాడు
 
నందు వెంటనే గౌతమ్ నోటికి తన చేతిని అడ్డుపెట్టి "అలాంటిది ఏదైనా కానీ నా డిమాండ్స్ మీరు ఒప్పుకున్నా కే!!!! లేకపోతే నా సంగతి తెలుసు కదా!!!" అని వార్నింగ్ టోన్ లో అంటుంది
 
గౌతమ్ అసహనం గా "చెప్పు నీ డిమాండ్స్ ఏంటో???" అంటూ తన చేతులతో నందు శరీరాన్ని తడిమేస్తూ నడుము దగ్గర చీర పక్క జరిపి అక్కడ ముద్దులు పెడుతూనే అడుగుతాడు
 
నందు గౌతమ్ చేసే మాయలో పడి పోకూడదని గట్టిగా అనుకుంటూ "ముందు మీరు నా పైన లేవండి.... ఇలా ఉంటే నేను ఎలా చెప్పగలను???" అని బలవంతంగా గౌతమ్ ని పక్కకు జరిపి నందు పైకి లేచి బెడ్ మీద బాసిమఠం వేసుకొని కూర్చొని గౌతమ్ వైపు చూస్తుంది.
 
గౌతమ్ కూడా చిరాకుగా "చెప్పవే ఇప్పుడు కానీ నువ్వు త్వరగా నీ డిమాండ్స్ చెప్పకపోతే నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వను...." అని మధ్యలో ఆపేసింది అని సీరియస్గా అంటాడు
 
"నాకు మీరు నేను అడిగిన సారీ కొనివ్వాలి.... అది రేపే!!!" అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతుంది
 
అప్పటివరకు నందు అందాలను చూస్తూ వాటిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అని వేరే లోకంలో ఉన్న గౌతమ్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి "ఏంటి పది వేల రూపాయల సారీ కొనివ్వాలా!!! అవసరమా నందు మనకి??? నువ్వు ఎప్పుడో ఒకసారి కట్టే దానికి పది వేలు పెట్టడం ఎందుకు చెప్పు??? వాటి బదులు వేరే ఏదైనా ఇంట్లోకి తీసుకుందాం.... ఇప్పుడు మాత్రం నన్ను ఆపకు...."అని అంటూ నందు మీదకు రాబోతాడు
 
"మీరు ఏదైనా చెప్పండి నాకు మాత్రం ఆ సారీ ఖచ్చితంగా కావాలి..... కొనిస్తానంటేనే ఈ నైట్ మొత్తం మీకు ఇస్తాను లేకపోతే మీరు సైలెంట్గా అన్ని మూసుకొని దుప్పటి ముసుగు తన్ని పడుకోండి.... నేను వేరే సైడ్ తిరిగి పడుకుంటాను..." అని సీరియస్ గా ఉంటుంది
 
"అంతేనా ఇంకేమీ లేదా???" అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు
 
"హ ఇంకొక ఆప్షన్ ఉంది కావాలంటే మీ డెబిట్ కార్డు నాకు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పండి.... నేనే వెళ్లి ఆ సారీ కొనుక్కొని ఎగస్ట్రా ఇంకా ఏమైనా నచ్చితే అవి కూడా కొనుక్కొని వస్తాను.... అలా మీకు ఓకే అయితే నాకు ఇప్పుడు ఓకే...." అని నవ్వుతూ అంటుంది
 
గౌతమ్ కోపంగా "అవసరం లేదు నేను అన్నీ మూసుకుని ముసుగు తన్ని పడుకుంటాను.... నువ్వు కూడా సైలెంట్ గా పడుకో...."అని చెప్పి ముసుగేసుకొని "ఛ ఇది నన్ను దీని అందాలన్నీ ఆరబోస్తూ బ్లాక్ మెయిల్ చేస్తుంది.... ఇప్పుడు దీనికి లొంగితే నా డెబిట్ కార్డ్ కి చిల్లు పడుతుంది అవసరమా చెప్పు???? ఈ ఒక్క పూట నీ ఆత్రాన్ని ఆపుకుంటే రేపట్నుంచి దానికి నువ్వు అంటే ఏంటో చూపించచ్చు" అని తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఉంటాడు
 
నందు ఒక్క క్షణం గౌతమ్ మీద కోపం వచ్చి వెంటనే కన్నింగ్ నవ్వుకుంటూ "మీరు ఎలా దారిలోకి నేను చూస్తాను???" అనుకుంటూ గౌతమ్ కి దగ్గరగా పడుకుని "ఏంటి ఈరోజు అసలు గాలే ఆడటంలేదు.... ఈ చీర వల్ల చెమటలు కూడా పోస్తున్నాయి.... చాలా చిరాకుగా ఉంది...." అని తన పైట తీసి కావాలనే గౌతమ్ మొహం మీద వేస్తుంది
 
గౌతమ్ మొహం మీద పడిన చీరని స్మెల్ చేస్తూ అది మత్తెక్కించే అరోమా ఫ్లేవర్ వస్తుంటే "ఇదేంటి ఇది నన్ను పూర్తిగా పడేయటానికి ఫుల్ గా రెడీ అయింది గా!!!! ఇప్పుడు ఇది ఏ పొజిషన్ లో ఉంది....." అనుకుంటూ తన పొజిషన్ ఊహించుకొని గుటకలు మింగుతూ మనసు నందుని దగ్గరికి తీసుకోమని ఆత్రం పడుతూ ఉంటే అయినా కూడా తన ఫీలింగ్స్ ని ఆపుకొని అంతే పడుకుని ఉంటాడు
 
నందు ఇక ఇలా కాదని వెంటనే గౌతమ్ చుట్టూ చేయి వేసి "ఇదేంటి శ్రీవారు ఈరోజు ఇలా పడుకున్నారు???? నాకు మీ గుండెల మీద పడుకో పోతే నిద్ర రాదు అని తెలుసు కదా!!!!"అని అంటూ గౌతమ్ ని బలవంతంగా వెల్లకిలా పడుకోబెట్టి తన గుండెల మీద పడుకొని గౌతమ్ చేతిని తన నడుము మీద వేసుకొని గౌతమ్ గుండెల మీద సున్నాలు చుడుతూ ఉంటుంది
 
గౌతమ్ గుటకలు మింగుతూ నందు పిడికెడంత నడుముని చేతుల్లో ఇమిడిపోతుంటే దానిని పిసికేస్తూ నందు వైపు తిరిగి గట్టిగా హగ్ చేసుకొని "సరే రేపు వెళ్లి ఆ చీర కొనుక్కుందాం.... కానీ ఈ నైట్ మాత్రం నువ్వు నన్ను ఆపకూడదు..." అంటూ నందుని తనలో కలిపేసుకుంటే ఉంటాడు
 
నందు కూడా ఆనందంగా గౌతమ్ కి సహకరిస్తూ నైట్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు....
 
@@@@@@@@
 
తర్వాత రోజు సండే అవటంవలన ఉదయాన్నే ఆరు గంటలకే నందు లేచి ఇంటి పనంతా అయిపోగొట్టి ఏడున్నరకల్లా రూమ్ లోకి వెళ్ళేసరికి గౌతమ్ నైట్ ఏ పొజిషన్లో ఉన్నాడో ఇప్పుడు అదే పొజిషన్ లో పడుకొని నిద్ర పోతూ ఉంటాడు.....
 
నందు గౌతమ్ ని చూసి నవ్వుతూ "గౌతమ్ గౌతమ్ లేవండి షాపింగ్ మాల్ కి వెళ్లాలి కదా!!!! లేట్ అవుతుంది రెడీ అవ్వండి..." అని గౌతమ్ ని తడుతూ ఉంటుంది
 
"ఎందుకు నందు షాపింగ్కి వెళ్ళడం??? నైట్ అంతా నీతో కష్టపడి అలసిపోయాను... ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు.... చాలా నిద్ర వస్తుంది.... నాకు టిఫిన్ కూడా వద్దు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేస్తాను బాగా ఎనర్జీ వచ్చేవి వండు.... ఈరోజు కూడా నైట్ ఔట్ చేయాలి కదా!!!" అని కళ్ళు తెరవకుండానే అంటాడు
 
ఆ మాటకి నందు కోపంగా గౌతమ్ వీపు మీద గట్టిగా ఒక దెబ్బ వేసి "రాత్రి ఏం చెప్పారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు???? ఇప్పుడు మీరు లేచి రడీ అయ్యి నన్ను షాపింగ్ మాల్ కి తీసుకువెళ్లండి లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా!!!! మర్యాదగా లేచి రెడీ అవ్వండి..." అని వార్నింగ్ టోన్ లో అంటుంది
 
నందు మాటలకి గౌతమ్ రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుని "కొంచెంసేపు ఫీలింగ్స్ ఆపుకొని ఉంటే ప్రశాంతంగా నీకు నచ్చిప స్మార్ట్ వాచ్ కొనుక్కునే వాడివి.... ఇప్పుడు చూడు నీ ఆత్రానికి ఏం జరిగిందో???"అని మనసులోనే అనుకుని బయటికి అనే ధైర్యం లేక సైలెంట్ గా ఫ్రెష్ అయి టిఫిన్ చేసి షాపింగ్ మాల్ కి వెళ్తారు
 
నందు నవ్వుతూ తనకి నచ్చిన సారీ తీసుకొని ఇంకా చూస్తూ ఉంటే గౌతమ్ బలవంతంగా నందుని కౌంటర్ దగ్గరికి తీసుకు వస్తూ "ఇంకా కొనుక్కొని ఏం చేసుకుంటావు నందు??? ఇప్పటికే పది వేలు వేస్ట్ అయ్యాయి కదా!!! ఇంటికి వెళ్దాం లంచ్ టైం అవుతుంది...." అని సీరియస్ గా చెప్పి బలవంతంగా నందుని ఇంటికి తీసుకువస్తాడు
 
నందు సంతోషంగా సారీ తీసి తన భుజం మీద వేసుకొని అద్దం ముందు నిలబడి చూసుకుంటూ వెంటనే గౌతమ్ దగ్గరకు వచ్చి "ఎలా ఉంది గౌతమ్???బాగుంది కదా!!! ఎంతైనా నా సెలెక్షన్ సూపర్ ఉంటుందిలే!!!"అని నవ్వుతూ అంటుంది
 
గౌతమ్ వెంటనే కోపంగా "ముందు ఆ సారీ నా ముందు నుంచి తియ్యి..... రాత్రి జస్ట్ ఒక ఐదు నిమిషాలు నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని ఉంటే నాకు ఇష్టమైన స్మార్ట్ వాచ్ కొనుకునే వాడిని ఇప్పుడు నీకు సారీ కొనివ్వాల్సి వచ్చింది..... మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు నేను దానికోసం ఆగాలి...." అని అంటాడు
 
నందు బుంగమూతి పెట్టుకుని "అదేంటి గౌతమ్ అలా అంటావు నాకు ఒక సారీ కొనడానికి నీకు అంత కష్టంగా ఉందా??? పో నేను అలిగాను నీతో మాట్లాడను..." అని చెప్పి రూమ్ లోకి వెళ్లి సారీ భద్రంగా దాచి మంచం మీద పడుకొంటుంది
 
గౌతమ్ వెంటనే పైకి లేచి "నేనెందుకిలా బిహేవ్ చేశాను??? పాపం నందు ఎంత ఫీల్ అయింది.... ఒక్క సారీ కొనుక్కుంటే ఏం పోతుంది???"అని అనుకుంటూ వెంటనే తన దగ్గరికి వెళ్లి తన పక్కనే పడుకొని తనని వెనుకనుంచి చేసుకుని హగ్ "ఏదో స్మార్ట్ వాచ్ కనుక్కోలేకపోయాను అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను.... అందుకే అలా మాట్లాడాను దానికే అంతా కోపమా నా మీద???"అని అంటూ తన వీపు మీద ముద్దులు పెడుతూ ఉంటాడు
 
"నాకు తెలుసు గౌతమ్ నీకు నాకు సారీ కొనివ్వడం నీకు కొంచెం కూడా ఇష్టం లేదు.... అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవు???? రాత్రి నీకు కావలసింది ఇచ్చాను కదా!!!! అందుకే నీ ముందు చులకన అయ్యాను...."అని చిరు కోపం గా అంటుంది
 
నందు అన్న మాటలకి గౌతమ్ నోరు తెరిచి "నువ్వెక్కడ ఈజీగా ఇచ్చావే??? నీకు నచ్చిన సారీ కొనిస్తా అంటే ఒప్పుకున్నావు కానీ!!! అయినా ఇప్పుడేమైంది నువ్వు అలగటానికి??? ఆ సారీ నీకు చాలా బాగుంది.... నేను నెక్స్ట్ మంత్ స్మార్ట్ వాచ్ కొనుక్కుంటానులే డోంట్ వర్రీ.... ఇప్పుడు నీ అలక తీరాలంటే నేనేం చేయాలి చెప్పు...." అని తన చేతులతో నందు నడుముని వత్తేస్తూ అడుగుతాడు
 
"అయితే ఈ పూట వంట మీరే చెయ్యండి.... నా దగ్గర షాపింగ్ చేసే సరికి ఓపిక లేదు..." అని అంటుంది
 
గౌతమ్ ఇక చేసేదేమీ లేక "సరేలే ఏం చేస్తాం తప్పదు.... భార్య అలక తీర్చాలి కదా!!!!"అని డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ ట్రాక్ వేసుకుని కిచెన్ లోకి వెళ్లి వంట చేసుకుంటూ "ఏంటో నా బతుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా ఈ బ్యాచిలర్ బ్రతుకు మాత్రం మారలేదు.... పెళ్ళాం వచ్చాక అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇదేమో ఇలా తయారయ్యింది..... అయినా ఇదంతా నువ్వు చేసుకున్నదే లేరా గౌతమ్!!! ఇప్పుడు ఎన్ని అనుకొని ఏమి లాభం???"అని నిట్టూరిస్తూ వంట చేస్తూ ఉంటాడు
 
నందు గౌతమ్ వంట చేస్తుంటే కిచెన్ దగ్గర ఉండే తను అన్న మాటలకి నవ్వుకుంటూ వెంటనే సీరియస్ గా మొహం పెట్టి "మరి ఎందుకు పెళ్లి చూపుల్లో చూడగానే ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు??? నా గురించి అంత అర్థమయ్యేలా చెప్పాను కదా!!! అయినా పెళ్లి చేసుకున్నాక నన్ను ఇన్ని మాటలు అంటూ రాచి రంపాన పెడుతున్నారు???" అని ముక్కు చీదుతూ అడుగుతుంది
 
నందు వాయిస్ కి టెన్షన్ గా వెనక్కి తిరిగిన గౌతమ్ నందు తన మాటలు వినిందని అర్థమై నందు రియాక్షన్ కి కళ్ళు తేలేసి "నేను అన్న మాటల్లో అంత అర్థం ఉందా నందు??? నాకు తెలియదు నేను ఏదో జస్ట్ నన్ను నేను అనుకున్నాను.... నిన్నెందుకు అంటాను నువ్వు నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవతవి, నా బంగారానివి....." అని నందుని మాటలతోనే కోటలు కట్టేసి అందులో మహారాణిని చేస్తాడు....
 
నందు ఒక కనుబొమ్మ పైకెత్తి యాటిట్యూడ్ గా గౌతమ్ వైపు చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకుని "ఇప్పుడు నిజం చెప్పండి...." అని సీరియస్గా అడుగుతుంది
 
గౌతం అమాయకంగా మొహం పెట్టి "ప్రామిస్ బంగారం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా??? రాత్రంతా చూపించాను కదా నా ప్రేమ నీ మీద ఎంత ఉందో???" అని కొంటెగా నందు కళ్ళల్లోకి చూస్తూ అంటాడు
 
గౌతమ్ చూపులకి నందు సిగ్గుపడుతూ " ఛీ పోండి గౌతమ్ ఏంటా మాటలు?? నేను ఏదో మీకు వంట లో హెల్ప్ చేద్దామని వస్తే మీరు మీ మాటల తోనే నన్ను మునగచెట్టు ఎక్కించడానికి చూస్తున్నారు...." అని నవ్వుతూ అంటుంది
 
నందు సిగ్గు పడటం చూసి గౌతమ్ మనసులో "హమ్మయ్య తప్పించుకున్నాను..." అనుకుని "అవునా అయితే ఇంకా అక్కడే ఉన్నావు ఏంటి??? ఇక్కడికి రా...." అని చెప్పి నందు చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని తనను వెనకనుంచి హగ్ చేసుకొని నందు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నందు చేతులతోనే కూరగాయలు కట్ చేస్తూ తన చేతులతోనే వంట చేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఒక గంటకి ఇద్దరూ కలిసి వంట పూర్తి చేస్తారు.....
 
ఇద్దరూ ఒకరికొకరూ తినిపించుకొని "ఇక పడుకుందామా నందు??? మళ్ళీ నైట్ నిద్రపోవటానికి లేట్ అవుతుంది...." అని కొంటెగాచెప్పి ఇద్దరు వెళ్లి హాయిగా నిద్ర పోతారు
 
@@@@@@@@

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 9 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: భార్య భర్తల కిల్లికజ్జాలు - by k3vv3 - 31-03-2023, 01:54 PM



Users browsing this thread: 1 Guest(s)