02-06-2019, 10:46 PM
మైలవరం నుంచి అమెరికా దాకా
పోరాటమే ఊపిరిగా ఎదిగిన ఒక పేద యువతి ఆత్మకథ
...ఐనా, నేను ఓడిపోలేదు!
సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకట్లు ముసురుకుంటున్నాయి. పిల్లలకి పాలు కూడా పట్టలేని నిస్సహాయత, నైరాశ్యం నన్ను పూర్తిగా ఆవరించాయి. పసిపిల్లలిద్దర్నీ ఆ పొలాల్లో బోరు బావిలో పడేస్తున్నా, నేనూ దూకేస్తున్నా...~~~~~~
మూడడుగుల పొడుగు, రెండున్నర అడుగుల ఎత్తు వున్న ఆల్సేషియన్ కుక్క ఆ చీకటి రాత్రిలో కాలి నడకన రూమ్ కి వెళ్తున్న నన్ను అడ్డగించింది. "భౌ" అంటూ ఒక్కసారిగా ఎగిరి రెండు కాళ్ళూ నా భుజమ్మీద పెట్టి నమిలి మింగేసేలా నాలుక బయటపెట్టి నన్ను వాసన చూస్తోంది. చెమటలు పట్టేశాయి. నా పిల్లలు, అమ్మ నాన్న అందరూ గుర్తొచ్చారు. "ఈ రాత్రిలో ఈ కుక్క చేతిలో చచ్చిపోయాను. బ్రతికి బయటపడితే ఇంక అమెరికాలో వుండను. ఇంటికి వెళ్ళిపోతాను దేవుడా" అంటూ ఏడ్చేసాను...~~~~~~
రిక్రూటర్గా పనిచేయమన్నారు. ఒక రూమ్, ఒక ఫోన్ ఇచ్చారు. ఫోన్లో కాల్ చేయడం ఆరంభించిన మొదటిరోజునే అర్థమైపోయింది. నాకు ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అమెరికన్ ఇంగ్లీషు యాస అసలు అర్థంకాదు. ఈ ఉద్యోగం నేనేం చేస్తాను? చేయలేకపోతే, పెట్రోలు బంకులో గ్యాస్ ఫిల్లింగ్ చేయాలా? బేబీ సిట్టింగ్ చేయాలా... ఎంతకాలం? పిల్లలు, కుటుంబం గుర్తొచ్చారు. అమెరికా వచ్చి తప్పుచేశానా? ఓడిపోయానా? నాలో అంతర్మథనం మొదలైంది...~~~~~~
2008లో అమెరికాని ఆర్థిక సంక్షోభం భయంకరంగా కుదిపేసింది. అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతపడిపోయాయి. చాలామంది భారతీయులు మన దేశానికి తిరిగి వచ్చేశారు. నేనేం చేయాలి? నా కం పెనీ భవిష్యత్ ఏమిటి? అమెరికాకి తీసుకువచ్చిన నా పిల్లల భవిష్యత్ ఏమిటి? తప్పుచేశానా? జీవితంలో ఓడిపోయానా?...(పుస్తకం చివరి పేజీ నుంచి గ్రహించినది)
.
.
.
లేదు...
ఐనా, ఆమె ఓడిపోలేదు.
ఒక సామాన్య పేద యువతి... ధీర వనితగా మారి అసమాన్య దృక్పథంతో తనతో పాటుగా వందలమందికి ఉపాధినీ, జీవితాన్నీ, మనోబలాన్నీ అందించింది.
శారీరికంగా సత్తువ లేకపోయినా దృఢచిత్తంతో చావునుండి బ్రతుకు బాట పట్టి తను చదువుకున్న పదోతరగతితో, తనకలవాటైన 'మొండి'తనంతో ముందుకు సాగిపోయిన... కాదు, దూసుకుపోయిన 'జ్యోతి రెడ్డి' తన ఆత్మకథలో మనకు చెప్పిన జీవిత పాఠాలు ఎన్నో... ఎన్నెన్నో...
ఒక 'అనాథ'గా 'బాలాసదన్'లో జీవన ప్రస్థానాన్ని ప్రారంభించిన జ్యోతి, అమెరికాలో మ్యాన్ పవర్ బిజినెస్ ని స్థాపించి నడిపించిన తీరు ఆమెలోని పోరాట పటిమను, అలుపెరుగని సంకల్పాన్ని, నిరంతరం నేర్చుకునే తత్వాన్నీ తెలియజేస్తాయి.
నేడు మార్కెట్లో లభించే ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాల కన్నా ఒక మెట్టు పైనే వుంటుంది ఈ పుస్తకం అనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఎందుకంటే, ఇందులో అడుగడుగునా కనపడేది... జీవితం!
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పక చదవవలసిన పుస్తకం ఇది.
>>> DOWNLOAD <<<
ఈ పుస్తకాన్ని గురించి తెలియజేసిన లక్ష్మిగారికీ, పుస్తకం లింక్ ని అందజేసిన సోదరుడు రాజుకి నా కృతజ్ఞతలు.
ఈ పుస్తకాన్ని చదవటం ద్వారా నేను తెలుసుకున్నదేమిటంటే... ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని వదిలేసి పారిపోవటం కన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి... తప్పించుకునేందుకు సాకులు వెదకకుండా పరిష్కారానికి మరో మార్గాన్ని వెదకాలి అని.
నేను కూడా ఇదే ఆచరిస్తాను ఇప్పట్నుంచీ...
జై జ్యోతి
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK