Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy ఎలకలు కొరికిన కథలు - కుమాత నభవతి
#4
జూలీ లేచిపోయింది
 
 “ఎక్కడినుంచి వస్తున్నావ్?” గుర్రుమంది టామీ.
నిర్లక్ష్యంగా పోయి పక్క మీద పడుకుంది జూలీ.
“నిన్నే!” రెట్టించింది టామీ.
“ఎందుకలా ఊరికే మొరుగుతావు... ఊరకుక్కలాగా”
"నీ వ్యవహారం నాకేం నచ్చట్లేదు”
“నాకూ నచ్చట్లేదు నీ వ్యవహారం....అయినా నేనెప్పుడూ పల్లెత్తు మాట అన్లేదు నిన్ను” తోక నాక్కుంటూ జవాబిచ్చింది జూలీ.
“అదికాదు జూలీ...నా బాధ అర్థం చేసుకో” లాలనగా దగ్గరకొచ్చింది టామీ.
“నాకు విసుగ్గా ఉంది... దగ్గరకు రాకు"
“అదే నాకు ఒళ్లుమంట... ఊర్లో ప్రతీ మగ కుక్కా  నీ వెనక్కాలే...నాకు బాధనిపించదూ?”
“మగబుద్ధే అంత” అందులో కొంత అసహ్యంతో కూడిన గర్వం ఉంది.
“నువ్వలా ఇష్టమొచ్చినట్టు తిరగడానికి వీల్లేదు” గట్టిగానే అరిచింది టామీ.
“పోయేదేదో నాదే పోతోందిగానీ నీదేం పోయింది”
“సిగ్గు లేకపోతే సరి”
“మరీ మనుషులంత మీన్ గా మాట్లాడకు”
“మొన్న సినిమా హాలు దగ్గర నువ్వూ, ఆ బ్రౌనీ...చీ...చీ....అసహ్యంగా ఎంతమంది చుట్టూ మూగి రాళ్ళేసారు....సిగ్గనించలేదూ!"
“వాళ్ళు పబ్లిగ్గా పొందలేని సుఖాన్ని మనం పొందేస్తున్నామన్న కుళ్లు...ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఫెలోసొచ్చి కార్లాపి కళ్లప్పగించి మరీ చూసారో తెలుసా...నాకు ఎంత థ్రిల్ గా అనిపించిందో!”
“నువ్వు చేసింది తప్పనించకపోగా సమర్థించుకుంటున్నావ్”
“యస్...నీది ఇండియన్ మెంటాలిటీ.. నీ నరనరాల్లో నీతి సాంప్రదాయ భయం ఇంకా ఎంతో మురికి ప్రవహిస్తోంది...నిజంలో బ్రతకడం మీకు చేతకాదు”
“నువ్విప్పుడే ఇంగ్లాండ్ నించొచ్చినదాన్లాగా మాట్లాడకు"
“అక్కర్లేదు! నా తండ్రి ఆస్ట్రేలియన్..తల్లి ఇండియన్. అయినా మా తండ్రి పోలికలే ఎక్కువొచ్చాయ్. మా ఫాదరెప్పుడూ నా తల్లిమీద నీలా విసుక్కోలేదు. పగలల్లా ఎక్కడ తిరిగినా రాత్రికి తనే వొచ్చేది నా ఫాదర్ దగ్గరికి. అంత మగతనం నీ దగ్గరా ఉంటే నాకు ఈ ఖర్మేవిటి?”
“అంటే నేను చేతకాని వాడిననా...”
“ఆ తెలుస్తూనే ఉంది. పుట్టిన బిడ్డల్లో ఒక్కదానికి నీ రంగుందా... బుద్దులు మాత్రం వచ్చాయి.... ఛండాలంగా”
“అంత ఇష్టం లేని దానివి ఎందుకు కాపురం చేస్తున్నావ్...”
“ఏమన్నావ్? 'కాపురమా?' అంటే ఏమిటీ...నీకు కొవ్వెక్కినప్పుడల్లా నీ ముందు కదలకుండా నిలబడ్డవేనా...అంతకన్నా ఏమైనా చేసావా? యజమాని తిండెడుతున్నాడు. అదీ ఊరికే గాదు... రాత్రల్లా ఇల్లు కాస్తున్నాను గనుక...పని మనిషి స్నానం చేయిస్తోంది... ఇక నువ్వు చేస్తున్న దేవిటో?.. నువ్వున్న గుంజకే మరో చైన్ తో కట్టిపడేయడమేనా నీ దృష్టిలో కాపురం అంటే...ఆ చైను కూడా రోజూ ఆ జయమ్మ కడ్తుంది. అదేం నువ్వు కట్టిన మంగళసూత్రం కాదు...”
“ఏమో మనుషులకు మల్లే నువ్వూ నీతి లేకుండా ప్రవర్తిస్తావనుకోలేదు”
“ఏమిటి నీతి? మొగుడెక్కడొస్తాడే అని భయంతో బిక్క చచ్చిపోయి బలవంతంగా అదేదో డ్యూటీలాగా కోరికలు తీర్చుకుని... మొగుడొచ్చే వేళకి కాళ్లకు చెంబు నీళ్ళు అందిస్తూ జయమ్మలాగా...అది నీ దృష్టిలో నీతి ఔనా? చెప్పు?
“నీతో వాదించలేను”
“వాదించడం నీకు రాక్కాదు...నీ దగ్గర పాయింట్ లేదు”
“ఏమిటి పాయింట్ లేదు....నీకూ నాకూ జత....అలాంటప్పుడు నువ్వు వేరే కుక్కలతో...”
“ఔను నేను పిల్లల్ని కని ఎటూ వెళ్ళలేని స్థితిలో నాకోసం గోడదూకి నువ్వెక్కడ చూస్తావో అని... భయంకాదు మళ్ళీ నీతో పోట్లాడాలని నీకు ఏం అపకారం జరిగినా నేను బాధపడతాననీ... రెండు ఎముకలు ఎంత ప్రేమగా తెచ్చి పెట్టాడు.....నీ జీవితంలో ఎన్నడైనా ఇచ్చావా?”
“నేనివ్వడం ఏ ఖర్మ...రోజూ వంట మనిషి కడుపు నిండుగా పెడ్తోందిగా!"
“అదే మరి... అలా అయినప్పుడు నేను నా యజమానికి కృతజ్ఞతగా ఉండాలి గానీ...నీకెందుకూ?"
“అంటే నాకు నీ మీద ప్రేమ లేదంటావ్!”
“ఉంది...నీకవసరం అయినప్పుడు మాత్రం ”
“ఆ బ్రౌనీగాడు తెచ్చే ఎంగిలి ఎముకలు నీకిష్టం"
“అవును..ఆ ఎంగిలి ఎంతో మాధుర్యంగా ఉంటుంది. అసలలా నా చుట్టూ తిరిగి నన్ను కోరుకునే వారంటే నాకిష్టం....బయటికెళ్తే చాలు నీడలా వస్తాడు. కానీ వాడికీ నీ రోగమే..మరో కుక్కని నావెంట పడనీయడు...మొన్నోరోజు ఎంతమందితో పోట్లాడాడు హీరోలా..నాకోసం... కేవలం నాకోసం...ఎన్ని గాయాలు...ఎంత రక్తం చిందించాడు. వాడికోసం నా వెధవ శరీరం ఎంతిస్తే రుణం తీరుతుంది...?"
********
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: ఎలకలు కొరికిన కథలు - by k3vv3 - 05-03-2023, 01:46 PM



Users browsing this thread: 2 Guest(s)