Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ చెప్పిన కథ
#15
మహారాజు అయిన విజయరుద్ర శివలీలని దగ్గర తీసుకొని "ఎవరు చేసుకున్నది వాళ్లే అనుభవించాలి,ఇంకెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకు"అని ఆమెని అక్కడి నుండి తీసుకువెళ్తాడు.
 
"ఇదిగో వాళ్ళ పట్టాభిషేకానికి వెళితే నాకు ఈ చెవి జుంకాలు ఇచ్చారు" అని మానస తన చెవికున్న ముత్యాల జుంకాలని ఆశీకి చూపిస్తుంది.
 
"వావ్...మమ్మీ, నిజంగా వాళ్ళు ఇచ్చారా!!! చాలా బావున్నాయి" అని మానస చెవులకున్న జుంకాలని పట్టుకొని ఎక్సైట్ అవుతూ అంది ఆస్తిక.
 
"హ్మ్...పద నువ్ పడుకోవాలి" అని ఎత్తుకుని తీసుకువెళుతుంటే "మమ్మీ...ఇప్పటినుండి నువ్ ఎక్కడి కైన వెళితే నన్నూ తీసుకువెళ్లు" అని అంటే "ఎందుకు బంగారం నువ్వు?" అని అన్నా మానసతో " నాకు కూడా నీలాంటి జుంకాలు కావాలి" అని తనని ఎత్తుకున్న చెవులకున్న జూంకాలనే చూస్తూ ఉంటుంది.
 
"హ..హ..హ..ఆడపిల్ల అనిపించుకుంది నా డైమెండ్" అని మానస చేతుల్లో నుండి ఆశీ ని తీసుకొని వాళ్ళ మామయ్య గదిలో పడుకోబెట్టడానికి వెళ్తుంటే అక్కడికి ఎందుకు అని అడిగిన మానసకి కన్ను కొట్టి " ష్..." అన్నట్టు వేలు చూపిస్తాడు.
 
"నేనే నా గదిలో పడుకోబెట్టమన్నాను" అని ఆశీని తీసుకొని అతని గదిలోకి వెళ్లి "నువ్ వెళ్ళారా అబ్బాయి, ఆశీని నేను చూసుకుంటాను" అని అతను కనిష్క్ ని పంపి డోర్ వేస్తాడు.
 
"ఈయనకి ఎలా చెప్తే అర్ధం అవుతుందో!!" అని తల కొట్టుకుంటూ ఇంట్లో ఉన్న లైట్స్,గ్యాస్,వాటర్ టాప్స్ అన్ని ఆఫ్ చేసి విండోస్ క్లోస్ చేసిందో లేదోనని చెక్ చేసుకొని మానస బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే కనిష్క్ వెనక నుండి గట్టిగా కౌగిలించుకుంటాడు.
 
"మీకు కొంచెం కూడా బుద్ది లేదు,మామయ్య ముందు తల ఎత్తుకోలేకపోతున్నాను మీ వల్ల"అని ఫైర్ అవుతుంది కనిష్క్ మీద.
 
"అందులో ఏముంది మను డార్లింగ్, భార్యభర్తలు అన్నాక చిన్న చిన్న సరదాలు ఉండనే ఉంటాయి, ఆయన మన వయసులో ఉన్నప్పుడు మనలాగే ఉండివుంటారూ, గడిచిన కాలం తిరిగి రాదు డార్లింగ్" అని మరింత గట్టిగా పట్టు బిగిస్తాడు.
 
మానస కోపంగా కనిష్క్ ని విసిరికొట్టి డ్రెస్ చేంజ్ చేసుకొడానికి వెళ్లి వచ్చి చూసేసరికి బెడ్ కి చివరన ముడుచుకొని పడుకున్న కనిష్క్ కనిపిస్తాడు.
"బాగా హర్ట్ అయ్యాడు" అని అతని పక్కనే పడుకొని అతనిపై చేయి వేసి "సొరి" అంటుంది.
అతను ఆమె చేయి తీసివేస్తూ ఇంకొంచెం చివరికి జరుగుతాడు. ఆమె కూడా అతనికి దగ్గరగా జరుగుతూ మళ్ళీ "సారి" అంటుంది.
 
ఈ సారి బెట్టు చేయక ఆమెకి అభిముఖంగా తిరిగి అతను కూడా "సారి" చెప్పి ఆమెని హగ్ చేసుకుంటాడు. చూస్తుండగనే ఇద్దరు మనుషులు కాస్త రెండు కోడె నాగులై తీగల ఒకరిని ఒకరై అల్లుకుపోతారు.
 
ఉదయాన్నే అలారం మోతకి లేచిన మానస పక్కనే కనిష్క్ మెడ మీద కాలేసి నిద్రపోతున్నా ఆశీని సరిగ్గా పడుకోబెడుతుంటే "డిస్టర్బ్ చేస్తే లేస్తుంది, అలాగే వుండనివ్వు" అని నిద్రలోనే అంటాడు కనిష్క్.
 
ఆధమరిచి నిద్రపోతున్న ఆస్తికనే చూస్తూ తను ఎలా వారి జీవితాల్లోకి వచ్చిందో గుర్తు చేసుకుంది.
 
"ఇక్కడికి రాక చాలా రోజులు అయింది మను" అని మానస చుట్టే తిరుగుతూ అంటాడు కనిష్క్."అవును ఫణి పెద్దవాడు అవుతున్నాడు వాడిని చుసుకోడానికి టైం సరిపోవట్లేదు, ఇంకా ఇక్కడికి ఎలా వస్తాం " అని చెట్లని దాటుకుంటూ వెళ్తుంది మానస."నీకు..ఏమైనా సౌండ్ వినిపిస్తుందా మను "అని చెవులను తాకుతూన్న శబ్దతరంగాలని శ్రద్దగా వింటూ అడిగాడు కనిష్క్.
 
"హ....ఇక్కడికి థర్టీ ఫీట్స్ లో నుండి వస్తుంది" అని కనిష్క్ ని చూసి వేగంగా ముందుకు కదులుతుంది మానస. ఆమె వెనుకే కనిష్క్ కూడా సౌండ్ వేవ్స్ ని అబ్సర్వ్ చేస్తూవెళ్తాడు.
 
వీళ్ళు వెళ్లేసరికి అంతవరకు చేసిన చప్పుళ్ళని ఒంట్లో శక్తి లేక ఆపి మూతలు పడుతున్న కనురెప్పలని తెరుస్తూ మూస్తూ మొగలి పొద పక్కన కనిపిస్తుంది సంవత్సరం న్నర వయస్సు వున్న పాప.
 
మానస కనిష్క్ ని చూసి వెంటనే మనిషి రూపంలో కొచ్చి పాపని తన చేతుల్లోకి తీసుకుని, చల్లబడుతూ శరీర రంగుని కోల్పోతున్న పాప ని చూడగనే అర్ధం అయింది మానసకి పాప కి విషం ఇచ్చి ఇక్కడ వదిలేసి పోయారని. పాపలో వున్న విషాన్ని తీసి కనిష్క్ కి పాప ని ఇచ్చి హాస్పిటల్ కి తీసుకువెళ్ళమంటూంది.
 
"మరి నువ్వు ....?" అని అడిగిన కనిష్క్ కి "పాప కోసం ఎవరైనా వస్తారేమో చూస్తాను" అని అక్కడే వెయిట్ చేస్తుంది.
 
ఎంత సేపు ఎదురు చూసిన ఎవరు రాకపోయేసరికి ఇంటికి వెళ్తుంది మానస. ఇంట్లోకి అడుగుపెడుతుంటే నవ్వులు వినిపిస్తాయి మానసకి. లోపలికి వెళ్ళి చూడగా కనిష్క్ చేతిలో పాప, పాప ని ఆడిస్తూ నవ్విస్తూ, నవ్వుతున్నా కార్తికేయ కనిపిస్తారు. పాప కోసం ఎవరైనా వచ్చారా అని అడిగిన కనిష్క్ తో "చావడానికని వదిలేసిన వాళ్ళు తిరిగి ఎందుకు వస్తారు"అని కనిష్క్ చేతిలో నుండి పాప ని తీసుకుంటుంది.
 
"మమ్మ.....ఈ పాప నా చెల్లి నా " అని ముద్దు ముద్దుగా అడుగుతాడు చిన్ని కార్తికేయ. ఏమి చెప్పాలో తెలియక కార్తికేయ నే చూస్తున్నా మానస తో "అవును ఫణి....తొందరలోనే ఈ పాప మనతోనే ఉంటుంది" అని కింద విడిచి పెట్టి "మను...ఈ పాప ని ఆర్ఫనేజ్ లో అడ్మిట్ చేసి మనమే అడాప్ట్ చేసుకుందాం, నీకు ఇష్టమైతేనే" అని ఆమె చేయి పట్టుకుంటాడు. అతని చేతిలోకి ఆమె చేయిని పోనిస్తూ "ఫణి గురించే ఆలోచిస్తున్నాను...ఫ్యూచర్ లో వాడు కోపం లో పాప ని ఏమైన చేస్తే..." అని వీళ్లకి కాస్త దూరంలో పాప తో ఆడుకుంటున్న కార్తికేయ ని చూసి భయపడుతుంది.
 
"ఫణి...." అని పిలవగానే "డాడ్..." అంటూ ఎత్తుకోడానికి తన వయస్సు సరిపోకున్న బలవంతగా పాప ని ఎత్తుకొని వస్తాడు."నాన్న ఫణి...పాప పడిపోతుంది,జాగ్రత్త!!!" అని మానస అంటే "మమ్మ...నేను ఉండగా చెల్లి కి ఎమ్ కాదు, కానివ్వను..." అని జారిపోతున్న పాపని సరిగ్గా ఎత్తుకుంటాడు.
 
"హ్మ్.....సరే పాప మనతోనే ఉండాలంటే నువ్ ఎప్పుడు తనపై కోపం తెచ్చుకోకూడదు, తనని తిట్టకూడదు, తనని ఏడిపించొద్దు...నీకు చాలా కోపం వచ్చిన నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అంతే కాని చిన్నది కదా అని పాప పై చూపించొద్దు. నువ్ పాప తో గుడ్ గా వుంటాను అంటే పాప మనతోనే ఉంటుంది" అంటాడు కనిష్క్.
 
"హ్మ్....సరే డాడ్"అని "మమ్మ....నువ్ ఎమ్ చెప్పవా?" అని మానస ని అడిగితే " చెల్లికి ఎప్పుడు నువ్ సపోర్ట్ గా ఉండాలి, తనని ప్రొటెక్ట్ చేయాలి, తనకి ఏ ప్రాబ్లెమ్ రాకుండా, మేము ఉన్న లేకున్నా నువ్ తనని మా కంటే బాగా చూసుకోవాలి" అని "అర్ధం అయిందా మై ఫణి బాయ్...." అనగానే " యెస్....మమ్మ" అని ఆమె మీద కూర్చుంటాడు. ఆ తరువాత రోజే ఆర్ఫానేజ్ కి వెళ్లడం, అడ్మిట్ చేయటం తరువాత కొన్ని రోజులకె అడాప్షన్ ప్రాసెస్ అంత కంప్లీట్ చేసి పాప ని తెచ్చేసుకుంటారు. అలా ఆస్తిక వాళ్ళ జీవితం లో ఒక ముఖ్య భాగం అయిపోయింది.
 
ప్రెసెంట్ లోకి వచ్చి అలారం ఆఫ్ చేసి వాళ్ళకి బేడీషీట్ కప్పుతుంటే తన్నేసి ఒళ్ళు బయట పెట్టి పడుకున్నా ఇద్దరిని చూసి సరిపోయింది అనుకోని చక చక అన్ని పనులు చేసేసి గోడ గడియారం లో టైం చూసి కార్తికేయని కాలేజ్నుండి తీసుకురావాలని పనులన్నీ పూర్తి అవ్వగానే చేసిన టిఫిన్ ని టేబుల్ పై వుంచి పూజలో కూర్చుంటుంది మానస.
 
అప్పటికే లేచి రెడీ అయిపోయిన కనిష్క్ వాళ్ళ మామయ్యకి కాఫీ, కీర్తికి టిఫిన్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్తాడు."మను పూజలో ఉందా?" అన్న అతనితో అవును అని చెప్పగానే "నేను జేజకి హాయ్ చెప్పేసి వస్తాను" అని పూజ గదిలోకి వెళ్లి ధ్యానముద్రలో కూర్చొని ఉన్న మానస ని శివలింగాన్ని చూసి అక్కడ ఉన్న నంది వర్ధన, మోదుగ పూలని శివలింగానికి అలకరించి "ఈ రోజు అన్నయ్యా ఇంటికొస్తాడు, సాయంత్రం అన్నయ్య కూడా నీకు హాయ్ చెప్తాడు" అని అక్కడున్న చిన్న గంటని కొట్టేసి బాల్కనీలోకి వెళ్తుంది.
 
చేతిలో ప్లేట్ పట్టుకొని వున్న కనిష్క్ మీద కూర్చొని "డాడీ ఈ రోజు అన్నయ్య రాగానే అందరం కలిసి ఔటింగ్ కి వెళదాము" అని కనిష్క్ తినిపిస్తుంటే తింటూ అంటుంది.
 
"ఇప్పటినుండే వాడిని సైనిక్ కాలేజ్ లో చదివించటం ఎందుకుర?" అన్న బాబాయితో "మొక్కగా ఉన్నప్పుడే మనం దేన్నయినా సరియైన దారిలో పెట్టగలము బాబాయి" అనగానే "మొక్కై వంగనిది, మానై వంగునా తాతయ్యా?" అని ఎప్పుడో కనిష్క్ వాళ్ళ అమ్మ చెప్పింది విని గుర్తుకు తెచ్చుకొని తిరిగి తాతయ్యా కి చెప్పింది ఆశీ.
 
"ఆశీ లాస్ట్ వీక్ తాతయ్య చెప్పిన పోయెమ్ గుర్తు ఉందా?" అని కనిష్క్ అడిగితే "ఓ.." అని
 
"చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు ఎంత
విశ్వదాభిరామ! వినుర వేమ!! "
అని చేతులు కట్టుకుని చెప్తుంది.
 
"ఇది మాణిక్యం......!!" అంటూ ఆయన ఆశీ బుగ్గలు లాగి మళ్ళీ ఒకసారి ఆ పద్యాన్ని చెప్పి తప్పులు సవరిస్తాడు.
 
"తాతయ్యా అన్నయ్య పెద్దయ్యాక సోల్జర్... కాదు ...కాదు సీక్రెట్ ఏజెంట్ అయితే, నేను ఏమో...నేను..హ...అనిమల్ డాక్టర్ అవుతా" అని చెప్తుంది.
 
"వెరీగుడ్.....మై డైమండ్ అంటే అది" అంటాడు కనిష్క్.
 
"ఏంటి అనిమల్  డాక్టర్ హ? ఎందుకు చిన్నుతల్లి !!" అని కనిష్క్ వాళ్ళ బాబాయి అడిగితే "నా ఫ్రెండ్ రితిక ఉంది కదా , తన పెట్ కి ఏమో డిసీస్ వచ్చి చనిపోయింది,వాళ్లు డాక్టర్స్ కాదుగా అందుకే వాళ్ళకి ఎలా చనిపోయిందో తెలిదు,మళ్ళీ మన ఇంటికి వచ్చేటప్పుడు ఒక చిన్న కౌ బేబీ ఉంటుంది కదా దానికి కూడా కాలుకి దెబ్బ తగిలింది. అది చూసిన ఎవరు కూడా దానికి హెల్ప్ చేయలేదు. మా మిస్ ని అడిగాను ఎందుకు మిస్ అవి అలా అయిపోతున్నయి అంటే అవి మనల మాట్లాడలేవు, వాటికి ఏమైన ప్రాబ్లెమ్ వస్తే చెప్పుకోలేవు అని చెప్పింది. మరి వాటికి హెల్ప్ ఎలా చేయాలి మిస్ అని అడిగితే మనం ఏమి చేయలేము అనిమల్ డాక్టర్ వుంటారు వాళ్లే హెల్ప్ చేస్తారు అని చెప్పింది.
 
అందుకే నేను కూడా అనిమల్ డాక్టర్ అయి వాటికి హెల్ప్ చేస్తాను" అని చెప్పిన ఆస్తికని దగ్గరికి తీసుకొని "హెల్ప్ చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు, మనం కూడా డాక్టర్ అవ్వలని లేదు" అని మంచి నీళ్ల గ్లాస్ ఇస్తాడు ఆశీ చేతికి.
 
"అవునా డాడీ....!!" అని ఆలోచించి " అయిన సరే నేను అనిమల్ డాక్టర్ అవుతా" అని చేతులు కట్టుకొని చెప్తుంది.
 
"అది అలా మాట్లాడుతూనే ఉంటుంది,మీరు కూడా టిఫిన్ చేసేస్తే కాలేజ్ నుండి కార్తికేయని తీసుకురావచ్చు. మీరు ఇక్కడ లేట్ చేస్తే వాడికి అక్కడ కోపం వస్తుంది, తెలుసుగా వాడి కోపాన్ని కంట్రోల్ చేయలేమని, తొందరగా తినేస్తే మనం వెళ్ళాలి" అని టిఫిన్ వడ్డిస్తుంది.
 
"అవును మమ్మీ స్టోరీలో లాగానే అన్నయ్యాకి కూడా చాలా కోపం, ఒకసారి నేను ఆడుకుంటున్న బ్యాట్ ని రాజీవ్ అంకుల్ వాళ్ళ బాబు రాజ్ తీసుకున్నడని ఆ బ్యాట్ ని తీసుకొనే రాజ్ ని ఫుల్ గా కొట్టేసాడు,అప్పుడూ అన్నయ్య ఐస్ అయితే రెడ్ గా అయిపోయాయి" అని మానసకి చట్నీ అందిస్తూ అంది.
 
ఆస్తిక చెప్పింది వినగానే మానస, కనిష్క్ ఒకరినొకరు చూసుకొని సైలెంట్ అయిపోతరు."మమ్మీ ..తొందరగా తినండి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి" అని తన గదిలోకి వెళ్తుంది ఆస్తిక.
 
వీళ్ళు కార్తికేయ ఉన్న కాలేజ్ కి వెళ్లి "ఫణి కార్తికేయ" అని చేప్పి పర్మిషన్ తీసుకొని కార్తికేయని తీసుకొని ఇంటికి వస్తున్నప్పుడు "అన్నయ్యా నైట్ మమ్మీ నాకు ఒక స్టోరీ చెప్పింది తెలుసా!!" అని కార్తికేయ పక్కన కూర్చుని చెప్తుంది.
 
"స్టోరీ నా !!! వాట్ స్టోరీ ఆశీ?" అని అడగ్గానే "అవును..పెద్దా.......స్టోరీ"అని మళ్ళీ చేతులు చాచి చూపిస్తూ అంది.
 
"ఎమ్ స్టోరీ మామ్...?" అని మానసని అడగగానే "ఒక ఆంటీ స్టోరీ, అందులో హార్సెస్ ఇంకా స్నేక్స్ ..హ మనల మారిపోయే స్నేక్స్ ఉన్నాయి. చూడు మమ్మీ పెట్టుకున్నా జుంకాలు కూడా వాళ్లు గిఫ్ట్ గా ఇచ్చినవే" అని వివరిస్తున్నట్టు చెప్తుంది.
 
కార్తికేయ కనిష్క్ ని, మానస ని చూస్తూ "ఆశీ...మామ్ చెప్పింది ఓల్డ్ స్టోరీ కదా, మామ్ అక్కడికి ఎలా వెళ్తుంది చెప్పు!!ఓల్డ్ స్టోరీస్ చెప్పినప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్తారు బట్ అది నిజం కాదు. నానమ్మ కూడా మనకు స్టోరీస్ చెప్పినప్పుడు తనకి చెవి దుద్దులు, కంకణాలు గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్తుంది." ఆశీ కి అర్ధం అయ్యేలా చెప్తాడు కార్తికేయ.
 
"అవన్నీ నాకు తెలిదు...మమ్మీ జుంకాలు నాకు కావాలి అంతే " అని ముందుకు వంగి ముందు సీట్లో కూర్చున్నా మానస జూంకాలతో ఆడుతుంటుంది.
 
"ఆశీ....మామ్ డాడ్ చెప్పే స్టోరీస్ నుండి ఏదో ఒకటి తెలుసుకుంటావ్ కదా!!! మరి మామ్ చెప్పిన ఓల్డ్ స్టోరీ నుండి ఎమ్ తెలిసింది నీకు?" జుంకాలతో ఆడుతున్న ఆశీ ని అడిగాడు ఫణి. వయస్సు కు మించిన పరిణితితో కనిపిస్తున్న కొడుకునే చూస్తున్న కనిష్క్ ని తట్టి "దిష్టి తగులుతుంది ,అలా చూడకండి"అనగానే తన చూపుని తిప్పుకుంటాడు కనిష్క్.
 
"మ్.... ఏమిటంటే!! హ.....అంటీ ల అందరితో గుడ్ గర్ల్ ల బిహేవ్ చేయాలి, స్టోరీ లో బ్యాడ్ అంటీ ఇంకా గ్రాని చీ ట్ చేసినట్టు బయట ఎవరిని చీట్ చేయకూడదు, మనకి హెల్ప్ చేసిన వారిని అస్సలు మర్చిపోకుడదు, గుడ్ అంకుల్ ల ఎప్పుడు షార్ప్ గా ఉండాలి.....ఇన్ని నేర్చుకున్నాను" అంటూ చేతి వేళ్ళు చూపించింది ఆశీ.
 
"అవునా....అన్నీ నేర్చుకున్నావ!!" అంటూ కార్తికేయ ఆశ్చర్యం ప్రకటిస్తున్నట్టుగా మెహం పెట్టాడు.
 
"అయ్యో....ఒకటి మర్చిపోయాను అన్నయ్య!!" అంటూ తల పై చేయి పెట్టుకొని పెద్దవాళ్ళు అన్నట్టు అంది.
 
ఆశీ ముఖ కవళికలు,చేతలు నవ్వుతూ చూస్తున్న కార్తికేయ "ఏమ్ మర్చిపోయావ్ ఆశీ !!" అని అడిగేసరికి "స్టోరీలో ఒక అంగ్రీ అంకుల్ కూడా ఉన్నారు, అతనిల ఎక్కువ కోపం తెచ్చుకోకూడదు" అంటూ కార్తికేయ పక్కన కూర్చుంది.
 
"ఆశీ నాకు కూడా ఆ స్టోరీ చెప్పు" అని ఆస్తిక వైపు తిరిగి స్టోరీ చెప్పమని అడుగుతాడు కార్తికేయ.
 
మెరుస్తున్న కళ్ళతో నిజమా అన్నట్టు చూస్తుంది, "అవును ఆశీ నేను కూడా నీకుల గుడ్ అవ్వాలి కదా!!" అని కార్తికేయ అనగానే "యే...స్టోరీ టైం" అని మానస చెప్పిన స్టోరీ నే తన భాషలో కార్తికేయకి చెప్పడానికి రెడీ అయిపోతుంది.
 ---------
అంతే…కథ కంచికి మనమింటికి
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అమ్మ చెప్పిన కథ - by k3vv3 - 27-02-2023, 02:35 PM



Users browsing this thread: 1 Guest(s)