Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ చెప్పిన కథ
#7
బయట కొచ్చి చూసేసరికి కలలో కనిపించిన అమ్మాయి వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తాడు ఆ అమ్మాయేన అని,ఆమె నిజంగానే కనిపించేసరికి పూటకుళ్ల పెద్దమ్మ వద్దకి వెళ్లి "పెద్దమ్మ ..ఇక్కడ అందరూ ఇంత ఉదయమే లేస్తారా?" అని ఆ అమ్మాయిని చూపిస్తూ అడిగాడు.
 
"లేదు బాబు.....అదిగో అక్కడ కనిపిస్తుందే అమ్మాయి,ఆమె మాత్రమే ఇంత ఉదయమే లేచి పనులు చేస్తుంది,లేదంటే ఆమె సవతి తల్లి ఊరుకోదు. చాలా గుణవంతురాలు, సౌమ్యశీలి అందరితో సౌమ్యంగా మెసులుకుంటుంది,కానీ దురదృష్టవంతురాలు" అని చెప్పేసరికి ఎందుకు అని అడిగిన అతనికి ఆమె గురించి,ఆమె సవతి తల్లి గురించి మొత్తం చెప్తుంది.
 
అంత విన్నాక అతను కొద్దిసేపు ఆలోచించి ఎదో నిర్ణయానికి వచ్చినట్టయి రెండు రోజులు అక్కడే ఉండి పూటకుళ్ల పెద్దమ్మ చెప్పింది నిజమా కాదా అని రుజువు చేసుకొని అతని స్నేహితుడితో అక్కడ నుండి తమ రాజకోటకి వెళ్ళిపోయి తన తండ్రితో తను చేసిన దేశాటన విషయాలు,విచిత్రాలు చెప్పి తన స్వప్న సుందరి గురించి చెప్తాడు.
 
రాజు,రాణి గారు రాకుమారుడి ఇష్టాన్నే తమ ఇష్టంగ భావించి శివలీల ఇంటికి వివాహ విషయమయి మాట్లాడడానికి వస్తారు.
 
రాజభటులు తమ ఇంటికి రావటం చూసి ఏమై ఉంటుంది అని ఆలోచించిన భానుమతి తన భర్త వర్తకుడు అని గుర్తుకువచ్చి అతన్ని పిలుస్తుంది. శివలీల తండ్రి భానుమతి ఇద్దరు కలిసి వాళ్ళకి స్వాగతమ్ చెప్పి మర్యాదపూర్వాకంగా ఆహ్వానించారు.
 
రాకుమారుడు అక్కడ అందరికి దూరంగా నిల్చున్న శివలీలని చూపించి ఆమెనే నేను ఇష్టపడింది అని రాణి, రాజు వాళ్ళకి చెప్పేసరికి రాణిగారు శివలీలనే చూస్తూ వుంటారు. భానుమతి శివలీల తో రాజు,రాణి రాకుమారుడికి తినుబండరాలు ,పానీయాలు తెమ్మని చెప్పి పంపిస్తుంది.
 
రాజు గారు శివలీల తండ్రితో మేము మీ అమ్మాయిని మా యువరాజు వారికిచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాం అని చెప్పగానే భానుమతి సంతోషంతో ఉబ్బితబ్బాయ్ "మహా అదృష్టం, మీ మాటని జవదాటే హక్కు మాకు లేదు,ఇదంతా మా మందర భాగ్యం, మీరు ఎలా అంటే అలానే" అని మందరని చూసి మురిసిపోతుంది.
 
రాణి గారు చెప్పింది విని "సంతోషం అమ్మాయిని రమ్మనండి మా తరుపున చిన్న కానుక ఇవ్వాలి"అని రాజా కుటుంబానికి చెందిన గొలుసు బయటికి తీస్తుంది.
 
వెళ్లు వెళ్లు అని మందరని ముందుకు తొస్తుంటే పానీయాలు తినుబండరాలు పట్టుకొని శివలీల అప్పుడే అక్కడికి వస్తుంది. తమ ముందు ఉన్న మందరని పట్టించుకోకుండా "కుమారి ఇలారా" అని ఆ గొలుసుని శివలీల మెడలో వేస్తుంది. రాణి గారు అలా చేసేసరికి భానుమతి చేష్టలుడిగి శివలీలని కోపంగా చూస్తూ "రాణివారు పొరపడుతున్నారు మా అమ్మాయి ఇక్కడ ఉంది,ఆమె మా పనిమనిషి" అని చెప్తుంది. అది విన్న శివలీల తండ్రి భానుమతి ని కోపంగా చూడటం తప్ప ఏమి చేయలేకపోయడు.
 
అప్పుడు రాణిగారు మాకు మీ పనిమానిషే నచ్చింది,మీ అమ్మాయి కాదు అనేసరికి మనసులో రాణిగారిని చంపేయాలానంత కోపం వచ్చిన తమాయించుకొని పైకి మంచిగా నటిస్తూ "మా శివలీల అదృష్టం మా ఇంటి పిల్లేగా అన్ని మేము చూసుకుంటాము " అని రాణిగారికి చెప్తుంది.
 
రాణిగారు మాత్రం ఆమె చెప్పేది వినకుండా శివలీల నీకు మా యువరాజుని పెళ్లిచేసుకోడం ఇష్టమేనా అని అడుగుతుంది. శివలీల తననే చూస్తూ మందహసం చేస్తున్నా రాకుమారుడిని చూసి తన తండ్రి వైపు చూసి అతను నిలువుగా తల ఊపేసారికి ఆమెకి కుడా ఇష్టమే అన్నట్టు తల ఊపుతుంది. తండ్రి మాట జవదాటని కూతురు కదా,అప్పట్లో అందరూ అలాగే వుండేవారు.
 
రాజుగారు రాకుమారుడిని చూసి నవ్వి "మేము మా రాజగురువులని సంప్రదించి వివాహ ముహూర్తం గురించి మీకు వర్తమానం అందిస్తాము" అని రాజాకుటుంబన్ని తీసుకుని రాజా కోటకి వెళ్ళిపోయాడు.
 
వాళ్ళు వెళ్ళగానే భానుమతి తన ద్వేషాన్ని అంత శివలీల పై చూపిస్తూ కొట్టడానికి వెళ్తుంటే శివలీల తండ్రి "తను ఇప్పుడు కాబోయే యువరాణి తన మీద నీ కోపము చూపిస్తే నీకె నష్టము" అని చెప్పి వెళ్ళిపోతాడు.
 
రాజకోట నుండి ముహూర్త వర్తమానం రావడం శివలీల ని తీసుకువెళ్ళటం, నిశ్చయించిన సుమూహుర్తానికి విజయ రుద్ర యువరాజుకి శివలీలకి పెళ్లి జరగటం అయిపోతుంది. అప్పటివరకి కష్టాల కొలిమిలో ఉన్న శివలీలకి అమ్మ నాన్న ప్రేమ రాజు రాణి వారి నుండి లభించగా, తనని వివాహమాడి తనకి కొత్త అస్థిత్వన్నీ ప్రసాదించిన తన పతియైన యువరాజూనే సర్వస్వంగా భావించి అమితంగా ప్రేమిస్తుంది.
 
యువరాజు అయిన విజయరుద్ర వారి పెళ్లినాటి మొదటిరాత్రి ఆమెకి ఒక ఉంగరం బహుకరించి "స్వప్న ములో నిన్ను చూసినప్పటి నుండి నా మనసు మనసులో లేదు. ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తాన అని మనసు ఉవ్విళ్లూరుతుండేది. చివరకి నిన్ను నా దాన్నిచేసుకున్నను. నీకు నేనంటే ఇష్టమున్నదా?"అని ఆమె కళ్లలోకి చూస్తూ అడుగుతాడు. "స్వామి...ఇంతవరకు మా తండ్రిని తప్ప నేను ఏ పురుషుడిని కూడాకన్నెత్తి చూడలేదు. మీరు మా ఇంటికి రాకముందే నేను మిమ్మల్ని మొదటి సారి పూటకూళ్ల వాళ్ళ ఇంట్లో చూసి మనసు పడ్డాను,కానీ ఆడపిల్లను, అందులో మా తండ్రి గీసిన గీతను దాటను. మీరు వెళ్ళిపోయాక మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు. కానీ మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నాకెంత సంతోషం వేసిందో అంతలోనే ఒక రాజ కుమారుడిన నేను మనసు పడింది అనుకోని బాధ తో విలవిల్లాడను.
 
చిన్నప్పటి నుండి ఆ దేవుడి ని ఏమి కోరుకొని నేను నా ప్రేమ నిజం అయితే మీరే నా భర్త కావాలని కోరుకున్నాను. ఆ దేవుడు, మీ తల్లిదండ్రులు కరుణించి నన్నూ ధన్యురాలిని చేసారు. ఇక ఈ జీవితం మీకు అకింతం" అని విజయ రుద్ర కాళ్ళ మీద పడుతుంది.
 
"లీల....నువ్వు నా హృదయరాణివి నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ "అంటూ ఆమెని గుండెలకు హత్తుకుని
"నువు లేకుండా నేను ఉండలేను,వున్న నా జీవితానికి అర్ధం లేదు. నా ప్రాణమైన నీకూ చిరు కానుక" అంటూ ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగి ఇది ఎప్పటికి తీయకూడదు" అని ఆమె చేతిని ముద్దుపెట్టుకుంటాడు.
 
వాళ్ళ ప్రేమలో రోజులే కాదు నెలలు కూడా గడిచిపోయాయి. ఒక రోజు రాజకోట మొత్తం ఒక శుభవార్తతో సంబురాలు జరుపుకుంది. ఆ నోట ఈ నోటా యువరాణి వారు గర్భవతి అని త్వరలో మనకు చిన్ని రాకుమారుడు రాబోతున్నాడని శివలీల తండ్రి చెవి పడుతుంది. శివలీల తండ్రి సంతోషంగా ఇంటికి వెళ్లి ఆ శుభవార్తని భానుమతి కి చెప్తాడు.
 
అది విన్న భానుమతి "నా కూతురికి దక్కవల్సిన భాగ్యాన్ని ,భోగాలని అనుభవిస్తున్న నిన్నూ పాతాళానికి పంపిస్తాను" అని శపథం చేసుకొని శివలీల తండ్రికితన మనోభావాలు కనిపించకుండా "మన అమ్మాయి తొలిసారి గర్భవతి అయింది,ఏ ఆడపిల్లకైన తొలికానుపు అమ్మగారింట్లో చేయాలి,అది పుట్టబోయే బిడ్డకి తల్లికి మంచిది"అని చెప్పటంతో తన భార్య మారింది అనుకొని "సంతోషం ...నేను వెళ్లి శివలీలని తీసుకువస్తాను "అని వెళ్ళిపోతాడు.
 
"ఏంటమ్మా నువ్వు చేసింది, అది మళ్ళీ ఈ ఇంటిలోకి ఎలా వస్తుంది? నేను చేసుకోవాల్సిన యువరాజుని గద్దలా తన్నుకుపోయింది!!" మందర తన కోపాన్ని తండ్రి వెళ్లిపోగానే బయటపెట్టింది.
 
"పిచ్చిదాన పిలిచి శ్రీమంతం చేస్తాను అనుకుంటున్నావ, దానికి పాడేకట్టడానికి మీ నాన్నతో అలా చెప్పాను. ఇప్పటినుండి నేను ఎలా చెబితే నువ్వు అలా చేయాలి, అప్పుడే నువ్వు యువరాణివి అవుతావు" అనగానే మందర తన తల్లి చెప్పినదానికి సరే అంది.
 
ఇవేవీ తెలియని శివలీల తండ్రి రాజకోటకి వెళ్లి రాజా వారి కి "శివలీలని తమ ఇంట్లో కొన్ని రోజులు వుండడానికి అలాగే అక్కడే శ్రీమంతం, మొదటి కానుపుకని పుట్టినింటికి తీసుకువెళ్ళడానికి అనుమతి కోరుతూ" లేఖ పంపిస్తాడు.
 
అది అందిన రాజు గారు శివలీలని పంపించటం ఇష్టం లేక రాణి గారి సలహా తీసుకుంటాడు. ఆమెకి కూడా శివలీలని పంపించటం ఇష్టం లేక వద్దు అంటుంది. విజయరుద్ర అయితే వాళ్ళ గూర్చి తెలుసు కాబట్టి అతను శివలీల వెళ్ళడానికి ఒప్పుకోలేదు,అందునా గర్భవతియైన తన ప్రియామైన భార్యని ఆ సమయంలో విడిచిపెట్టి ఉండుటకు మనసు రాక వెళ్లొద్దు అంటాడు.
 
యువరాజు నిర్ణయం విన్న శివలీల బాధపడుతూ "ప్రసవానికి కాకున్నా కొన్ని రోజులు అక్కడే ఉండి తొందరగా వచ్చేస్తాను" అని నచ్చచెప్తుంది. అదే సమయంలో రాజ కోటకి వేగుల నుండి ముఖ్యమైన వర్తమానం వస్తుంది. "వచ్చే కొన్ని రోజులలో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి" అని ఆస్థాన మంత్రివర్యులు వర్తమాన సారాంశాన్ని చదివి రాజుగారికి వినిపించారు.
రాజు గారు యువరాజు పిలిచి "మన పొరుగు రాజ్యానికి మనవంతు సహాయం చేయవలసిన సమయం వచ్చింది. మనం కొన్ని రోజులలో సైనికులను తీసుకొని దక్షిణదిశగా వెళ్లి రాజుకి యుద్ధంలో సహకరించాలి" అనిచెప్తాడు. దానితో విజయరుద్ర తండ్రితో సరే అని చెప్పి శివలీల దగ్గరికి వచ్చి "నీ సంతోషం కోసం నువ్వు మీ తండ్రిగారితో వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాను. నేను కూడా యుద్ధభూమి కి వెళ్లాల్సివచ్చింది,యుద్ధం ఎన్ని రోజులలో ముగుస్తుందో చెప్పలేను. నువ్వు మన బిడ్డ జాగ్రత్త" అని చెప్పి ఆమెను తండ్రితో పంపిస్తాడు.
 
అలా శివలీల తండ్రి ఆమెని పుట్టింట్లో దిగబెట్టి "నేను కూడా వర్తక విషయమయి కొన్ని రోజులు పొరుగు రాజ్యానికి వేళ్ళాలి, మీరూ జాగ్రత్త "అని భానుమతి,మందర లకి శివలీల ని చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు.
 
శివలీల ఇంటికి రాగానే భానుమతి తన కపట బుద్ధిని దాచి మంచిదానివలే నటిస్తుంది,ఆమె తో పాటు మందర కూడా మరిపోయినట్టు "అక్క అక్క .." అంటూ శివలీల చుట్టే తిరుగుతూ రాజాకోట సంగతులు చెప్పమంటుంది.
 
శివలీల కూడా తన సవతి తల్లి, చెల్లి మారిపోయి సఖ్యతగా ప్రేమగా వుంటున్నారని అన్ని విషయాలు చెప్తుంది. భానుమతి, మందర కి సైగ చేయడంతో మందర "అక్క,మీరు బావ గారితో ఎలా వుంటారు? అదే మనం మాములు వర్తక కుటుంబనికి చెందిన వాళ్ళము, వారేమో రాజులు కదా నువ్వు బావగారితో ఎలా నడుచుకునేదానివి?" అని తెలివిగా శివలీల ని అడుగుతుంది.
 
శివలీలకు చెల్లిబుద్ధి తెలియక తనని సొంత సోదరిలా ఆదరించే సరికి ముందు వెనక ఆలోచించక తాను రాజకోటలో ఎలా వుండెదో, యువరాజుతో ఎలా మెలిగెదో అన్ని పూసగుచ్చినట్టు మందరకి చెబుతుంది. అలా అన్ని విషయాలను తెలుసుకున్న మందర శివలీలతో " అక్క మనం కొలను కి వెళ్లక చాలా రోజులు అవుతుంది నువ్ ఒప్పుకుంటే ఈ రోజు సాయంత్రానికి వెళ్దాం"అని చెప్పెసరికి శివలీలకి కూడా వెళ్లాలనిపించి "సరే సాయంత్రము తొందరగానే వెళదాము" అంటుంది.
 
సాయంత్రం అవ్వకముందే భానుమతి వాళ్ళిద్దరిని వెళ్ళమని చెప్పి "చీకటి పడక ముందే వచ్చేయండి" అని పంపిస్తుంది. వాళ్ళు వెళ్లిపోయక తన పన్నాగాన్ని నెరవేర్చడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది.
 
అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుంటు మాట్లాడుకుంటు కొలను లోకి దిగిన మందర "అక్క నువ్ కూడా వచ్చేయ్" అంటుంది."వద్దు చెల్లి నువ్ కానియ్ నేను రాను " అన్న పదేపదే రమ్మనటంతో దిగడానికని పైబట్టలు తీసి పక్కన పెడుతుంటే "అక్క నీ నగలు తీసేసిరా,నీటిలో పడిపోతే వేతకలేము" అని చెప్పేసరికి వంటి మీద వున్న గాజులు, నగలు అన్ని తీసేస్తుంటే "అక్క... మంగళ సూత్రం కూడా తీసేయ్, ఈ కొలను లో గనుక పడిపోయిందంటే రాజ కుటుంబానికి, బావ గారికి కీడు జరుగుతుంది" అని అనుమానం పుట్టించి అది కూడా తీసేలా చేస్తుంది.
 
మందర కూడా పైకి వచ్చి తన నగలు కూడా తీసి మూటగట్టింది. శివలీల "నీ భర్త కి కీడు అనగానే తన నగలతో పాటు మంగళసూత్రం కూడా తిసి ఉంగరాన్ని కూడా తీయడానికి ప్రయత్నిస్తుంటే అది రాకపోయే సరికి తీసిన నగలను మూటగట్టి పక్కన పెట్టి తాను కూడా కొలనులోకి దిగుతుంది.
 
కొద్దీసేపు కాగానే "అక్క చీకటి పడుతుంది" అని మందర గబ గబ పైకి వచ్చి బట్టలు కట్టుకుంటున్నట్టు చేసి రెండు నగల మూటని దూరంగా ఉన్న గుబురు చెట్లలో వేసేసి "అక్క.....అక్క..మన నగల మూటలు కనిపించటం" లేదు అని గట్టి గట్టిగా అరుస్తుంది.
 
మందర అరుపులు విన్న శివలీల నీటిలోనుండి బయటికి వచ్చి చూసేసరికి నగల మూటలు కనిపించక కంగారుగా అటు ఇటు వెతుకుతుంది."అయ్యో ....దొంగలు మా నగలు ఎత్తుకుపోయారే " అని ఏడిచినట్టు నటించి "అక్క అటు వైపు ఎవరో వెళ్లినట్టు అనిపించింది" అని నగల మూట ఉన్న వైపు వెళ్తున్న శివలీల ని పిలిచి వేరే వైపు చూపిస్తుంది.
 
"వెళ్లి చూద్దాం చెల్లి ..." అని అన్న శివలీలతో "వద్దు అక్క అసలే నువ్వు ఒట్టిమనిషివి కాదు,ఎవరినైన పిలుచుకువద్దాం" అని అక్కడి నుండి తీసుకువస్తుంది.
 
మందర తన పాచిక నెరవేరినందుకు సంతోషంగా ఉండగా, శివలీల పోయిన నగల గురించి కాక తన భర్త గురించి ఆలోచిస్తుంది. తమకు ఎదురువస్తున్నా భానుమతి ని చూడగానే " అమ్మ ....మా నగలు దొంగలు ఎత్తుకుపోయారు" అంటూ మీద పడి ఏడుస్తుంది మందర.
 
"అయ్యో తల్లి ...నగలు పోయాయా? నువ్వేం బాధపడకు మీ నాన్నకు చెప్పి ఇద్దరికి కొత్తవి చేపిస్తాను"అని ఓదార్చి ఇద్దరిని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. ముభావంగా వున్న శివలీలతో "ఏమైంది శివలీల ...నగలు పోయాయని చింతిస్తున్నావా?" అని అడుగుగా "లేదు పిన్నమ్మ..ఆయన గురించి ఆలోచిస్తున్నాను,ఎందుకో ఈ రోజు ఆయన పదే పదే గుర్తొస్తున్నారు" అని చెప్తుంది.
 
"నీకు ఇదే చివరి రోజు అందుకే అతను గుర్తుకొస్తున్నాడు" అనుకోని "శివలీల నీ కోసం పాలు పండ్లు తీసుకొచ్చాను" అని చెప్పగానే "నాకు ఆకలిగా లేదు పిన్నమ్మ" అని వాటిని పక్కన పెడుతుంటే "ఒక స్వామీజీ గుడికి వస్తే ఆయన దగ్గరుండి నీ కోసం ఈ పండ్లు తెప్పించాను, కనీసం ఒక్క పండు అయిన తిను,
నీ కోసం కాకపోయినా నీకు పుట్టేవారి కోసం అయిన తినాలి" అని పళ్లెంలో పైన ఉన్న పండుని కోసి ఇస్తుంది.
 
"నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం అయిన తిను" అనగానే "ఆమె చెప్పింది నిజం..నా కోసం కాకపోయినా ఆయన వారసుడి కోసం అయిన తినాలి" అని కోసిన పండుని తింటుండగానే "పిన్నమ్మ ఈ పండేంటి ఇలా ఉంది" అని అడిగితే "స్వామీజీ ప్రసాదం అలాగే ఉంటుందేమో" అని సమాధానం ఇస్తుంది భానుమతి.
 
తిన్న కొన్ని నిమిషాలలోనే మత్తువచ్చినట్టు పడుకుండి పోతుంది శివలీల. ఆమెకి మత్తు ఎక్కింది అని నిర్దారించుకొని మందర ని పిలుస్తుంది భానుమతి.
అలా ఇద్దరు కలసి శివలీల ని ఒక మూటలో పడుకోబెట్టి ఆమె చుట్టూ పాత బట్టలన్నీ వేసి పెద్ద బట్టల మూటల చేస్తారు. దారిన పోయే ఒకతన్ని పిలిచి "మా ఇంట్లో పాత బట్టల మూట ఒకటి ఉంది, దాన్ని కాస్త పాడవేయడానికి మాకు సాయం చెయ్యండి" అని బ్రతిమిలాడి శివలీల ని వుంచిన బట్టల మూటని వీళ్ళు వుండే ఊరి చివరన వున్న బావిలో వేయమంటారు.
 
అతను మూట బరువుగా వుండడంతో "ఇది నిజంగా బట్టల మూటనేన ఇంత బరువుంది " అనగానే "పాతబట్టలు కదా మళ్ళీ అవి మాములు బట్టలు కావు నేతపోసి రాళ్లు ఒదిగిన ఖరీదైన బట్టలు. పాతవిగా అయి పోవడంతో ఇలా పాడవేస్తున్నము" అని ఎదో సర్ధిచెప్పి అతనితో ఆ మూటని నీళ్లు లేని పాతబావిలో పడవేస్తుంది. పని అయిపోయిందని అతను వెళ్లిపొగానే భానుమతి మందర కూడా వికారంగా నవ్వుకుంటూ కొలను దగ్గరికి వెళ్ళి మందర దూరంగా విసిరేసిన రెండు నగల మూటలను తీసుకొని ఇంటికి వెళ్లిపోతారు.
 
శివలీలని వుంచిన పాతబట్టల మూట వేగంగా వెళ్లి ఒక పెద్ద రాయి లాంటి ఆకారం మీద పడుతు పెద్దగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి చాలా వయసు గల పెద్ద ఆడపాము అక్కడికి వచ్చి చూస్తుంది. ఆ నాగు అక్కడ ఉన్నది చూసి సంతోషంగా ఎదురుగా ఉన్న మగ నాగపాముని అల్లుకుని ఎవరినో పిలుస్తుంది. వాళ్ళు అలా వుండగానే ఏడుగు నాగుపాములు వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి.
 
ఇన్నాళ్లకు తమ తండ్రికి ఉపశమనం లభించిందని అవి కూడా తండ్రి నాగుపాముని అల్లుకున్నాయి. ఇది ఎలా జరిగిందని ఆడనాగు అడగగా "ఇదిగో ఈ మూట నాపై పడగానే తల మీద ఉన్న రాచపుండు పగిలిపోయింది" అని సంతోషంగా చెప్తాడు. ఇందులో ఏముందని మూటని తెరచి చూడగా "కుందనపు బొమ్మల, హాయిగా నిద్రాపోతున్నా శివలీల వాళ్ళ కంటికి చిన్ని పాపయిల" కనిపిస్తోంది.
 
"ఎవరండి ఈ మానవస్త్రీ ?" అని ఆడ నాగు అడగగా "తెలియదు రాణి మేము ఎప్పటిలా ఆసీనుడినై బాధతో విలవిలాడుతుంటే మాత పార్వతి దేవి అనుగ్రహించిన్నట్టు ఏదో వస్తువు బలంగా నా తలపై పడి నూరు సంవత్సరముల నుండి రాచ పుండుతో తల్లడిల్లుతున్న నన్నూ ఈ బాధ నుండి విముక్తిడిని చేసింది,ఏమిచ్చి ఈమె రుణం తీర్చుకోగలను" అని నిద్రపోతున్నా శివలీలని చూపిస్తాడు.
 
"స్వామి ఈ మానవ స్త్రీ ఈ మూటలో కెలా వచ్చింది?"అని సందేహం వెలిబుచ్చాగా శివలీలనే పరీక్షగా చూస్తూ "ఎవరో పాపాత్ములు ఈమె చనిపోయుంటుందని భావించి ఇలా మూటలో కట్టి ఎవరు రాని ఈ బావి లో పడవేసుంటారు" అని ఆమెని తీసుకొని ఒక గదిలో పడుకోబెడతాడు.
 
"ఏమిటి స్వామి ఆ కన్యని అలా చూస్తున్నారు?" అని అడిగితే "మనకు ఉన్న ఏడుగురు సంతానం మగపిల్లలే ఒక్క నాగబాలిక కూడా లేదు,వుంటే తను కూడా ఇలాగే వుండేది" అని ఆమెకి గాలి విసురుతు ఉంటాడు.
 
"మనకు పుత్రిక సంతానం లేకపోతేనేమి!! ఆ పరమశివుడు ఇచ్చిన ఈ మానవ కన్య ఉందిగా ఈమెనే మన పుత్రికలాగా చూసుకుందాం" అని అతనికి చెప్తుంది.
 
"ఒక సమస్య ఉన్నది తండ్రి" అని నాగరాజు అయిన శేషాద్రి మొదటిసంతానం అయిన పెద్దనాగు అంటాడు.
 
" ఏమిటా సమస్య ?" అని నాగరాజు అడుగగా "మనము ఆ మహాదేవుడిని పూజించే నాగులము, వీళ్ళు మనల్ని మన మహాదేవుడిని కొలిచే మానవులు. ఈమెకి సృహ వచ్చిన తరవాత మనల్ని చూసి భయపడుతుందే తప్ప మనతో కలిసిపోదు"అని చెప్తాడు.
 
బాగా ఆలోచించిన నాగరాజు అక్కడున్న అందరితో "ఈమె కనుతేరిచే సమయానికి మనం అందరం మానవరూపాన్ని సంతరించుకొని ఆమెతో అలాగే మెలగాలి" అని అమెకోసమని వారు వుంటున్న బావి లోపలి భాగాన్ని పెద్ద ఇల్లులా మార్చేస్తాడు. వాళ్ళు అందరూ కూడా తమకున్న మానవరూపాల్లోకి వచ్చేస్తారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అమ్మ చెప్పిన కథ - by k3vv3 - 23-02-2023, 10:05 PM



Users browsing this thread: