Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance రామ్ weds సీత
#4
రామ్ కోపం గా సీత ని చూస్తూ "నీ చావు నువ్వు చావు నీతో పాటు నన్ను కూడా చంపు" అంటూ బాధగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు...
 
వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉండగానే పెళ్లి ముందు రోజు రానే వచ్చింది... ఆ రోజు నైట్ పెళ్ళికొడుకు అమ్మాయి నచ్చలేదని పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పి తన అమ్మ నాన్న లని తీసుకొనివెళ్ళిపోయాడని తెలుస్తుంది... అది తెలిసి మణికంఠ, రాగిని బాధపడుతుంటే మాధురి రామ్ దగ్గరికి వెళ్లి "రామ్ నువ్వు సీతని పెళ్లి చేసుకో ప్లీజ్" అంటుంటే
 
"అమ్మ నేను సీతని పెళ్లిచేసుకునేది ఏంటి నీకు పిచ్చి గాని పట్టిందా!!!" అని కోపంగా అరుస్తుంటే
 
ఆ మాటకు సీత బాధగా రామ్ ని చూస్తుంది
 
మణికంఠ రామ్ దగ్గరికి వచ్చి రామ్ చేతులు పట్టుకుని "ఇవి చేతులు కాదు కాళ్లు అనుకో అల్లుడు... నా కూతుర్ని పెళ్లి చేసుకొని దానికి జీవితాన్ని ఇవ్వు.... ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే నా కూతుర్ని అందరూ నష్ట జాతకురాలు అంటారు.... ఇక జీవితంలో దాని పెళ్లి జరగదు...దానిని అలా చూసి మేము బ్రతకలేము" అని బ్రతిమాలుతుంటే
 
మాధురి "మీరాగండి అన్నయ్య నేను వాడితో మాట్లాడతాను" అని చెప్పి రామ్ ని ఒక రూం లోకి తీసుకుని వెళ్లి డోర్ వేసి "నీ ప్రాబ్లమ్ ఏంటి రామ్???? ఎందుకు సీతని పెళ్లి చేసుకోను అంటున్నవు??? దాని కంటే అందమైన గుణవంతురాలైన అమ్మాయి నీకు దొరుకుతుందా!!! ఎందుకిలా తయారవుతున్నవు???" అని అసహనంగా అడుగుతుంది
 
"అమ్మ నాకు అది అంటే ఇష్టం... ఇష్టం కూడా కాదు ప్రాణం... నేను దానికి నా ప్రేమ విషయం చెప్తే పరువు ప్రతిష్ట అని చెత్త కారణాలు చెప్పి నన్ను వద్దు అనుకుంది ఇప్పుడు మీరు అడిగితే చేసుకోవాలా???" అని ఆవేశంగా అడుగుతాడు
 
"ఏంటి మీ ఇద్దరి ప్రేమించుకున్నారా??? ఎప్పుడు జరిగింది రా ఇదంతా!!! కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు!!!" అని ఆనందంగా అడుగుతుంటే
 
"నాక్కూడా తెలియదు అమ్మ నేను దానిని ప్రేమిస్తున్నానని... బెంగళూరు వెళ్ళినప్పుడు అర్థమైంది దాన్ని వదిలి నేను ఉండలేనని అందుకే దానికి సర్ప్రైజ్ చేద్దామని వెంటనే ఇక్కడికి వచ్చాను... కానీ నేను వచ్చేలోపే దానికి నిశ్చితార్థం జరిగిపోయింది... అది చూసి ఏం మాట్లాడలేక వెళ్ళిపోయాను.... కానీ నా ప్రేమని చంపుకోలేక సీత ఒప్పించి పెళ్లి చేసుకుందామని అడగడానికి వస్తే అని జరిగిందంతా చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పింది... ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి" అని ఆవేశంగా అడుగుతాడు
 
"అది చిన్న పిల్ల దానికేం తెలుసు... మాకైనా చెప్పచ్చు కదా!!! మేం చూసుకునేవాళ్ళం" అని కోపంగా అడిగితే
 
"చేసుకోవాల్సిందే ఒప్పుకోకపోతే మీకు చెప్పి ఏం లాభం అమ్మ అందుకే నా ప్రేమని చంపుకొన్నాను... నాను దానిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు" అని ఖరాఖండిగా చెప్పేస్తాడు...
 
దాంతో మాధురి కి కోపం వచ్చి "నువ్వు ఇప్పుడు సీతని పెళ్లి చేసుకోకపోతే నాశవాన్ని చూస్తావు... నేను బ్రతికి ఉండడం నీకు ఇష్టం అయితే వచ్చి పెళ్లి ఇష్టమని చెప్పు లేకపోతే నీ ఇష్టం" అని కోపంగా చెప్పి బయటికి వెళ్లి పోతుంది
 
రామ్ కొంచెంసేపు ఆలోచించుకుని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తనలో తానే నవ్వుకొని బయటకు వచ్చి "సరే మావయ్య నేను సీతని పెళ్లి చేసుకుంటాను... కానీ నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని అంటాడు
 
రామ్ ఒప్పుకోవడమే మహాభాగ్యం అన్నట్టు "సరే రామ్ మీరిద్దరూ సీత రూమ్ కి వెళ్లి మాట్లాడుకోండి" అని చెప్పి సీత రూమ్కి పంపిస్తాడు
 
రూమ్ కి వెళ్ళాక సీత భయంగా తల దించుకొని నిలబడితే రామ్ సీత ని కోపంగా చూస్తూ "ఇప్పుడు సంతోషంగా ఉన్నావా???" అని కోపంగా అడుగుతాడు
 
సీత అయోమయంగా తల పైకెత్తి చూసి "అదేంటి బావా అలా అడిగావు??" అని నిదానంగా అంటుంది
 
"మరి ఏమనాలి వాడు పోయాడు అని నన్ను చేసుకుంటున్నావు... లేకపోతే నన్ను చేసుకునేదానివా??? ఏదో తప్పక చేసుకోవాల్సి వస్తుంది తప్ప లేకపోతే నా మొహం కూడా చూసే దానివి కాదు" అని కోపంగా అంటుంటే
 
సీత ఏడుస్తూ "అలా మాట్లాడకు బావ... నువ్వంటే నాకు ప్రాణం... తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అంతే తప్ప నిన్ను వదులుకోవాలని కాదు" అని బాధగా ఉంటుంది
 
"ఏదైనా కానీ మనకి పెళ్లి జరిగిన నేను నిన్ను మరదలు గా మాత్రమే చూస్తాను పెళ్ళాంగా చూడను... ఈ విషయం గుర్తుంచుకొని పెళ్లి పీటల పై కూర్చో" అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు
 
"నువ్వు ఎలా చేసుకున్న పెళ్లయితే చేసుకో బావ నిన్ను నేను మార్చుకుంటాను ఇంతకు ముందులాగా" అనుకొని కన్నీరు తుడుచుకొని సంతోషంగా నవ్వుతూ ఉంటుంది
 
అప్పుడే మాధురి లోపలికి వచ్చి "ఏమంటున్నాడు నా కొడుకు???" అని అడిగితే
 
సీతా ఆనందంగా "బావ పెళ్ళికి ఒప్పుకున్నాడు" అని రామ్ చెప్పిందంతా చెప్తుంది
 
"మరి మనం ప్లాన్ చేస్తే అవ్వకుండా ఉంటుందా ఏంటి!!! వాడు అలాగే అంటాడు మనం మన ప్లాన్ లో ఉండాలి అంతే" అని ఇద్దరు నవ్వుతూ హైఫై ఇచ్చుకుంటారు....
 
అలా ఒకరు కోపంతో ఒకరి ఆనందం తో రామ్ వెడ్స్ సీత గా మారిపోయింది పెళ్ళి....
 
అదంతా గుర్తుతెచ్చుకొని రామ్ సీత వైపు చూసి "రాక్షసివే నువ్వు... నిన్ను చేసుకోడానికి వాడిని తప్పించాల్సీవచ్చింది" అనుకుని పెళ్లి కొడుకు తో మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటాడు...
 
పెళ్ళికొడుకు విడది ఇంట్లో దిగగానే రామ్ పెళ్లి కొడుకు తో మాట్లాడి పెళ్లి ఆపేయాలని వెళ్లి పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని పెళ్లి కొడుకు రూమ్ లోకి వెళ్లి "మీరేనా పెళ్లి కొడుకు???" అని అడిగితే
 
అతను "అవునండి" అని నవ్వుతూ చెప్పి "ఇంతకీ మీరెవరు???" అని అడుగుతాడు
 
"నేను రామ్ సీత కి కాబోయే భర్త ని" అని నవ్వుతూ చెప్పి డోర్ బోల్టు పెట్టి బెడ్ పై కూర్చుంటాడు
 
అతను అయోమయంగా రామ్ ని చూస్తూ "అదేంటి సీతని చేసుకోబోయేది నేను కదా!!!మీరు అంటున్నారు ఏంటి???" అని అడిగితే
 
"అవును నేనే సీత ని పెళ్లి చేసుకుంటాను అది ఎలాగైనా గాని దానికి మిమ్మల్ని తప్పించటానికి కూడా వెనుకాడను... దానికి కూడా నేనంటే ప్రాణం" అని ఈపెళ్లి గురించి తన గురించి మొత్తం చెప్తాడు
 
"అయితే ఇప్పుడేంటి పెళ్లి జరిగాక సీత నన్ను ప్రేమిస్తుంది తన ప్రేమ కోసం నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను" అని కోపంగా అంటాడు
 
రామ్ మనసులో "వీడు నాకు మగసవితి అయ్యేలా ఉన్నాడు... ఎలాగైనా వీడిని తప్పించాలి" అనుకొని "ప్లీజ్ బాస్ నా మాట విని సీత ని నాకు వదిలెయ్" అని బ్రతిమాలుతుంటే
 
"నేను ఒప్పుకోను... నాకు సీత బాగా నచ్చింది పెళ్ళంటూ చేసుకుంటే సీతనే చేసుకుంటా!!!" అని అంటుంటే
 
రామ్ కి కోపం వచ్చే అతని చెంప మీద గట్టిగా కొడతాడు దెబ్బకి బెడ్ మీద పడతాడు...
 
రామ్ కోపం గా "చెప్తే అర్థం కాదా!!! నేను సీత గాఢంగా ప్రేమించుకుంటున్నాం... మా మధ్యలో నువ్వు గొట్టం గాడిలా వచ్చి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా????" అని కోపంగా అతనిని కొడుతుంటే అతను కుయ్యె మొర్రో అంటూ మూలుగుతూ భయంగా ఒక మూల నిలబడి రామ్ ని చూస్తూ ఉంటాడు
 
అతన్ని అలా చూసి రామ్ బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని "ఇప్పుడు చెప్పు నా సీత ని పెళ్లి చేసుకుంటావా???" అని ఒక ఐబ్రో ఎగరేసి స్టైల్గా అడుగుతాడు
 
"లేదు లేదు నేను చచ్చినా చేసుకోను... ఇప్పుడే పారిపోతాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతాను" అని రామ్ కాళ్ళమీద పడి పోతాడు
 
"దెబ్బ పడితే గాని దారిలోకి రారే... మామూలుగా చెప్పినప్పుడు వినచ్చు కదా ఇలా కొట్టే వాడిని కాదు" అని కోపంగా అంటూ భుజం మీద చరవగానే "ఆ...ఆ" అంటూ అరుస్తాడు
 
"అయ్యో సారీ బ్రదర్ కోపంలో కొట్టేశాను... ఏమనుకోకు హాస్పిటల్ కి వెళ్లి చూపించుకో ఇప్పుడు నువ్వు వెళ్ళిపో" అని చెప్పి రామ్ వెళ్ళిపోతాడు
 
అతను మనసులో "ఈ పెళ్లి నా చావుకొచ్చింది... ఆ సీత వద్దు ఈ పెళ్ళి వద్దు" అనుకొని తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోయేంతలో
 
మాధురి సీత ఇద్దరూ కలిసి పెళ్లి కొడుకు రూమ్ లోకి వచ్చి అతన్ని అలా చూసి "ఎక్కడికి వెళ్ళిపోతున్నారు???" అని మాధురి అడిగితే (రామ్ దెబ్బలు కనిపించట్లేదా అనుకోకండి రామ్ పైకి కనిపించకుండా కొట్టాడు అందుకే అతను నార్మల్గా ఉన్నట్టు కనిపించాడు)
 
(మాధురి సీత రూమ్ లోకి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంది... కంగారుగా తన దగ్గరికి వెళ్లి "ఎందుకు ఏడుస్తున్నావ్ సీత???" అని అడిగితే
 
"నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అత్త... బావ అంటే ప్రాణం...ఈపెళ్ళి నాన్న కోసం చేసుకుందామనుకుంటున్నాను కానీ నావల్ల కావడం లేదు" అని ఏడుస్తూ మాధురిని హత్తుకుంటుంది
 
మాధురి సీత ని ఊరుకోబెట్టి "ఈ విషయం ముందే చెప్పి ఉంటే ఏమైనా చేసే దాన్ని కదా!!!" అని నిదానంగా అడుగుతుంది
 
"చెప్తామనే అనుకున్న అత్త కాని కి
బావకి నేనంటే ఇష్టం లేదని చెప్పలేకపోయాను ఇప్పుడు బావ కి కూడా నేనంటే ఇష్టమే" అని వాళ్ల మధ్య జరిగింది చెప్తుంది...
 
"ఇంత పిచ్చిగా ఎందుకు బిహేవ్ చేసావే... మీకంటే మాకు పరువు ముఖ్యమా???" అని కోపంగా అడుగుతుంది
 
సీత బిక్క మొహం వేసుకొని "అప్పుడు తెలియలేదు ఇప్పుడు కష్టంగా ఉంది" అని అంటుంది
 
"మరి ఇప్పుడేం చేయాలి???" అని ఆలోచించి "ముందు పెళ్లి కొడుకు తో ఒకసారి మాట్లాడదాం పదా" అని సీతను తీసుకొని వెళుతుంది...)
 
అతను సీతని చూసి "ఇంత అందగత్తెని నేనెందుకు వదులుకోవాలి పెళ్లి పీటల మీద కూర్చున్నక ఏం చేస్తాడు" అనుకొని "ఎక్కడికి లేదండి అన్నీ బట్టలు ఉన్నాయా లేవా అని చూసుకుంటున్నాను!!!" అని నవ్వుతూ అంటాడు
 
"మీతో కొంచెం మాట్లాడాలి అండి" అని సీత అనగానే
 
"చెప్పండి" అని నవ్వుతూ సీతని చూస్తూ ఉంటాడు
 
అతని చూపు ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత ఇంకెప్పటికీ మాట్లాడలేను... అనుకొని "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి... నేను మా బావ రామ్ ని ప్రేమించాను... తననే పెళ్లి చేసుకుంటాను" అని తల దించుకొని అంటుంది
 
అతను కోపంగా "మీ బావ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నన్ను ఎందుకు ఇక్కడి వరకు తీసుకొచ్చారు???" అని కోపంగా అరుస్తాడు
 
"అప్పుడు మా బావకి నామీద ప్రేమ లేదండి... మీతో ఎంగేజ్మెంట్ అయ్యాక చెప్పాడు... నేను మా నాన్న ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను... కానీ చేసుకోలేకపోతున్నాను!! మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను బ్రతికున్న శవంలాగే బ్రతకాలి... అందుకే ధైర్యం చేసి మీతో మాట్లాడదామని వచ్చాను" అని అంటుంది
 
అతను అసహనంగా అయితే "ఇప్పుడు నన్నేం చేయమంటారు???" అని అరుస్తాడు
 
"ఏం లేదండి మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపొండి... మా బావని ఎలాగోలా మా అత్త ఒప్పిస్తుంది" అని నవ్వుతూ ఉంటుంది
 
"మీ అందరికీ నేను ఒక జోకర్లా కనిపిస్తున్నానా??? మీ ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి!!! నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునే తీరుతాను" అని కోపంగా అంటాడు
 
మాధురి కోపంగా వెళ్లి అతని చెంప మీద కొడుతుంది
 
ఆ దెబ్బకి అతనికి కళ్ళు బైర్లు కమ్ముతాయి తల పట్టుకుని బెడ్ మీద కూర్చుంటాడు
 
"అయ్యో అత్త అలా ఎలా కొట్టేసావు!!! పాపం అతను ఎలా ఉన్నాడో చూడు..." అని జాలిగా ఉంటే
 
"అత్త అంటే మీకు ఏమవుతుంది??" అన డౌట్ గా అడిగితే
 
"మా రామ్ బావ వాళ్ళ అమ్మ... నాకు కాబోయే అత్త" అని నవ్వుతూ చెప్తుంది
 
"అతనికి ఈమె పోలికే అనుకుంటా అతను కూడా ఇలాగే కొట్టాడు" అనుకొని "సరే నేను వెళ్ళిపోతా లెండి.. నావల్ల మీరు ఇద్దరు కలిస్తే అంతే చాలు" అని సెంటిమెంట్ డైలాగ్స్ కొడతాడు
 
"అయ్యో సారీ బాబు నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు... లేకపోతే ఇంకో నాలుగు తగిలిద్దాం అనుకున్నా" అని నవ్వుతూ ఉంటుంది
 
"ఆహా ఎంత మంచి వారండి వెళ్లకపోతే ఇంకో నాలుగు తగిలించైనా పంపించాలి అనుకున్నారా??? మీలాంటి మంచి వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఉండరు... మీకోక నమస్కారం ఈ పెళ్ళి కో నమస్కారం" అని చేతితో?? పెట్టి బ్యాగ్ పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న లని తీసుకొని వెళ్ళి పోతాడు...
ఇంకా ఉంది

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 9 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
రామ్ weds సీత - by k3vv3 - 25-01-2023, 10:58 PM
RE: రామ్ weds సీత - by Manoj1 - 26-01-2023, 10:01 PM
RE: రామ్ weds సీత - by k3vv3 - 27-01-2023, 09:44 AM
RE: రామ్ weds సీత - by k3vv3 - 27-01-2023, 09:46 AM
RE: రామ్ weds సీత - by Manoj1 - 27-01-2023, 03:16 PM
RE: రామ్ weds సీత - by Ravi9kumar - 27-01-2023, 11:39 PM
RE: రామ్ weds సీత - by prash426 - 31-01-2023, 10:00 AM
RE: రామ్ weds సీత - by k3vv3 - 01-02-2023, 11:50 AM
RE: రామ్ weds సీత - by Manoj1 - 02-02-2023, 01:55 AM
RE: రామ్ weds సీత - by k3vv3 - 02-02-2023, 06:59 PM
RE: రామ్ weds సీత - by Manoj1 - 03-02-2023, 08:48 PM
RE: రామ్ weds సీత - by prash426 - 04-02-2023, 09:58 AM
RE: రామ్ weds సీత - by Udaykumar - 08-02-2023, 12:10 PM
RE: రామ్ weds సీత - by Takulsajal - 08-02-2023, 09:59 PM
RE: రామ్ weds సీత - by sri7869 - 18-08-2023, 10:18 PM
RE: రామ్ weds సీత - by utkrusta - 05-03-2024, 06:56 PM



Users browsing this thread: 1 Guest(s)