25-01-2023, 10:58 PM
రామ్ weds సీత
- Devanshika janu
ఒక పల్లెటూరు లోని ఒక ఇంట్లో ఆ ఊరంతా అంతా పెళ్లి అని తెలిసేటట్టు అలంకరించబడి ఉంది...పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు కోపంగా పంతులు గారు చెప్పే పూజ చేస్తుంన్నాడు... పెళ్లి కూతురు మాత్రం మౌనంగా తలదించుకుని బాధపడుతోంది....
పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు తల్లిదండ్రులు సంతోషంగా పెళ్లిని చూస్తున్నారు...
ఇంతలో పంతులుగారు మాంగల్యధారణ అనగానే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వైపు చూస్తే వాళ్ళ అమ్మ కోపంగా పెళ్లి కొడుకు వైపు చూస్తుంది.. పెళ్ళికొడుకు ఏమీ చేయలేక నిస్సహాయంగా తాళి ని తీసుకొని పెళ్లి కూతుర్ని కోపంగా చూస్తూ మెడ బిగుసుకునేలా తాళి కడుతుంటే పెళ్లి కూతురు భయంగానే తలెత్తగా పెళ్లి కొడుకుని చూస్తుంది... పెళ్ళికొడుకు కోపంగా పెళ్లికూతురు కళ్ళల్లోకి చూస్తాడు... ఆ కోపానికి భయపడి తలదించుకుంటే పెళ్లికూతురు పూలజడ పట్టుకున్న పెళ్లి కూతురు చెల్లెలు వరుసయ్యే అమ్మాయి "బావ తాళి మెడ వరకు వచ్చింది కిందకి కట్టు" అని నవ్వుతూ చెప్తుంది...
పెళ్ళికొడుకు కోపంగా తన ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి సైలెంట్ అయిపోతుంది... పెళ్ళికొడుకు తాళికట్టి పెళ్లి కూతురు పక్కన అసహనంగా కూర్చుంటాడు
పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తల్లిదండ్రులు సంతోషంగా వాళ్లపై అక్షింతలు వేస్తారు...
అలా పెళ్లి అయిపోయి అప్పగింతల కార్యక్రమం లో పెళ్లి కూతురు ఏడుస్తుంటే పెళ్లి కూతురు అమ్మ రాగిని"వదిన నీకు నా కూతురు గురించి చెప్పనవసరం లేదు... నా కూతురు గురించి మొత్తం తెలుసు జాగ్రత్త అని మాత్రం చెప్తాను... ఏదైనా తప్పు చేస్తే తల్లిలా కడుపులో పెట్టుకో బాధ పెట్టకు" అని ఏడుస్తూ అంటుంది
పెళ్లి కొడుకు తల్లి మాధురి"నీకు తెలుసు కదా వదిన నాకు ఇదే అంటే ఎంత ఇష్టమో!!! నేను దాన్ని నా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను నువ్వు భయపడొద్దు"అని భరోసా ఇస్తుంది
పెళ్లి కూతురు తండ్రి మణికంఠ పెళ్లి కొడుకు తో"అల్లుడు నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశానని నా కూతురిని బాధ పెట్టకు... దాని అర్థం చేసుకో దాన్ని అర్థం చేసుకున్నాక అది అందించే ప్రేమ నీకు ఎవరిని గుర్తుకు రానివ్వదు అంత ప్రాణంగా ప్రేమిస్తుంది... అది అసలే అమాయకురాలు దాని బాధ్యత నీదే జాగ్రత్త అల్లుడు"అంటుంటే
పెళ్ళికొడుకు మణికంఠ వైపు సీరియస్ గా చూస్తాడు...
పెళ్లి కొడుకు తండ్రి మహేశ్వర్"వాడితో ఏంటి బావ!!! మేమున్నాం కదా మేము జాగ్రత్తగా చేసుకుంటాము" అని భరోసా ఇస్తాడు
పెళ్లి కూతురు వాళ్ల అమ్మని హగ్ చేసుకొని "మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ నేను లేనని నువ్వు అమ్మ బెంగ పెట్టుకోవద్దు... నేనూ అక్కడ జాగ్రత్తగానే ఉంటాను" అని ఏడుస్తూ చెబుతుంది
"సరే తల్లి నువ్వు వెళ్ళేది నీ సొంతమే నేను ఇంటికే ఇక నుంచి అదే నీ ఇల్లు జాగ్రత్తగా మసలుకో... బావ ని ఎప్పుడు బాధ పెట్టకు" అని చెప్తుంది
"సరే సరే వర్జం వస్తుంది పదండీ"అని మాధురి అనగాని
పెళ్లికూతురు ఏడుస్తూ అందరికీ వీడ్కోలు చెప్పి కార్ లో పెళ్ళికొడుకు పక్కన కూర్చుంటుంది.. కార్ని మహేశ్వర్ గారు నడుపుతుంటే పక్కన మాధురి కూర్చుంటుంది వెనుక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంటారు...
అలా పెళ్ళికొడుకు ఫ్యామిలీ మొత్తం కలిసి పెళ్లికూతురు ఊరికి రెండు ఊర్ల అవతల వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గుమ్మంలోనే ఆపి దిష్టి తీసి పెళ్ళికొడుకు చెల్లి వరుసయ్యే అమ్మాయి "పేర్లు చెప్పి లోపలికి రండి" అని ఆటపట్టిస్తూ ఆపేస్తుంది...
పెళ్లి కొడుకు కోపంగా ఆఅమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి భయపడి పక్కకు తప్పుకుంటుంది...
అలా పెళ్ళికొడుకు గబగబా లోపలికివెల్తూ ఉంటే పెళ్ళికూతురు కొంగుముడి వల్ల పెళ్లి కొడుకు తో పాటు ఇద్దరు కలిసి కుడి కాలు పెట్టి లోపలికి వెళ్తారు
అలా మెట్ల వరకు వెళ్ళిన పెళ్ళికొడుకు వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి పెళ్ళికూతురు తల దించుకొని ఉండటం చూసి కోపంగా తన కండువా తీసి పెళ్లికూతురు మొహం మీద విసిరేసి స్పీడ్ గా తన రూం కి వెళ్ళి పోతాడు
పెళ్ళికొడుకు అలా వెళ్ళిపోవడం చూసి పెళ్లికూతురు బాధగా పెళ్ళికొడుకు రూమ్ వైపు చూస్తుంటే మాధురి వచ్చి "బాధపడుకు బుజ్జి వాడు మారుతాడు... నీ ప్రేమతో నువ్వే మార్చుకోవాలి... అంతా నీ చేతుల్లోనే ఉంది... నువ్వు కూడా రెస్ట్ తీసుకో రేపు వ్రతం ఉంది..." అని ఒక రూం లోకి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోమని మాధురి వెళ్ళిపోతుంది
పెళ్లికూతురు రూమ్ లోకి వెళ్లి మనసులో "నాకు తెలుసత్తా బావ మనసుకి గాయం అయింది... అది కూడా నా వల్లే... దాన్ని నేనే ప్రేమగా మార్చుకుంటాను" అని ఆలోచించుకుంటూ నిద్రపోతుంది...
తర్వాత రోజు ఉదయాన్నే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత వ్రతం చేయిస్తారు...
ఆ సాయంత్రం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి ఇద్దర్నీ లోపలికి పంపించి అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లిపోతారు
లోపలికి వచ్చిన పెళ్లికూతురు ఎక్కడ తన బావ కనిపించకపోవటంతో మొత్తం వెతుకుతూ బాల్కనీలో చూస్తే అక్కడ ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు...
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్లి "ఏంటి బావ ఇక్కడ ఉన్నవు??? ఈ రోజు ఏంటో గుర్తులేదా???" అని కవ్విస్తూ నడుము కనిపించే లాగా వయ్యారంగా నిలబడి అడుగుతుంటే
పెళ్లి కొడుకు కోపంగా పెళ్లికూతురు వైపు చూసి ఒక్క క్షణం మెస్మరైజ్ అయ్యి తనని పై నుంచి కింద వరకు స్కాన్ చేసి తన నడుం వైపు వైపు అలాగే చూస్తూ ఉంటే పెళ్లికూతురు సిగ్గుపడుతూ "అంత అందంగా ఉన్నానా బావ!!! అయితే ఒక ముద్దు పెట్టొచ్చు కదా" అని గారంగా అడుగుతుంది
పెళ్ళికొడుకు అప్పుడు స్పృహలోకి వచ్చే" ఏయ్ ఎక్కువ చేస్తున్నవు మూసుకొని పోయి పడుకో నన్ను విసిగించకు" అని నడుం వైపు చూపు తిప్పకుండా అంటాడు
పెళ్లికూతురు మనసులో "నీ కోపం ఎందుకో నాకు తెలుసు బావ... ఆ కోపం నేనే చెరిపేస్తా!!!" అనుకుంటూ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్లి మెడ చుట్టూ చేతులు వేసి "అదేంటి బావా ఈరోజు ఏంటో మర్చిపోయావా!!! మన ఫస్ట్ నైట్ ఇద్దరం కలిసి అలసిసొలసి నిద్ర పోవాలి కానీ ఇలా ఎడమొహం పెడమొహం పెట్టుకొని కాదు"తన బుగ్గ మీద ముద్దు పెడుతూ అని మత్తుగా అంటుంటే
పెళ్లికూతురు అలా చెప్తుంటే పెళ్లి కొడుకు వశం తప్పి పెళ్లికూతురు నడుం చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు
పెళ్లికూతురు నవ్వుతూ పెళ్లి కొడుకు ని చూసి "ప్రొసీడ్ అయిపోదామా మా బావ" అని మెడ మీద ముద్దు పెడుతూ ఉంటుంది
పెళ్ళికొడుకు వెంటనే స్పృహలోకి వచ్చి పెళ్లి కూతుర్ని వెనక్కి జరిపి "ఎయ్ సీత నన్ను విసిగించకుండా వెళ్లి పడుకో "అని విసుగ్గా చెప్పి మనసులో "నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను కమిట్ అయ్యేటట్టు ఉన్నాను!!! వెళ్ళవే బాబు"అని కష్టంగా అనుకుంటాడు
పెళ్ళికొడుకు అలా తన మీద విసుకు చూపించేసరికి సీత బాధగా "నా మీద ప్రేమ తగ్గిపోయిందా బావా???" అని అడిగే సరికి
పెళ్ళికొడుకు కి బాధగా అనిపించింది వెంటనే జరిగింది గుర్తుకు వచ్చి "అవును నా ప్రేమ కాదని వేరే వాడిని చేసుకోవాలి అనుకున్నావ్ కదా!!! అందుకే నీ మీద నా మనసు విరిగిపోయింది అది ఇప్పుడప్పుడే అతుక్కోదు నన్ను విసిగించకు పో" అని కసురుతాడు
ఆ మాటకి సీతకి బాధగా ఏడిస్తూ రూంలోకి వెళ్ళి పోతుంది...
సీతా అలా ఏడుస్తూ వెళ్ళటం చూసి పెళ్ళికొడుకు కి బాధగా అనిపించి తన వెనకే వెళ్ళిబోయి మనసులో "ఇప్పుడు నేను దానిని దగ్గరికి తీసుకుంటే నా ప్రేమ విలువ తెలిసి రాదు... కొన్నాళ్ళు ఇలాగే ఉండాలి అప్పుడు తెలిసింద్ది నా బాధ" అనుకొని అక్కడే రైలింగ్ కి తన చేతిని గట్టిగా కొట్టి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు
"ఎందుకు రామ్ బావ ఇలా మాట్లాడుతున్నవు??? నువ్వు నన్ను కాదని అంటేనే కదా మా నాన్న వేరే వాడిని చూసి పెళ్లి వరకు తీసుకుని వచ్చింది" అనుకుంటూ ఏడుస్తూ అలాగే నిద్ర పోతుంది
సీత నిద్రపోయాక రామ్ లోపలికి వచ్చి తన మొహం చూస్తే మొహం కొంచెం ఉబ్బి, ముక్కు ఎర్రగా అయిపోయి కన్నీటి ఛారలు తన చెంపల మీద కనిపిస్తుంటే బాధగా అనిపించి "ఎందుకే నన్ను ఇలా తయారు చేశావు... నువ్వు అలా చేయబట్టే కదా ఇప్పుడు ఇలా" అనుకుంటూ తన పక్కనే పడుకొని గుండెల మీదకి తీసుకుని తన చుట్టూ చేయి వేసి జరిగింది గుర్తు చేసుకుంటాడు....
రాగిని, మహేశ్వర్ గారు అన్నా చెల్లెళ్ళు అలా మహేశ్వర్ గారికి మాధురి గారిని ఇచ్చి పెళ్లి చేసారు... తర్వాత రాగినిని మాధురి గారి అన్నగారు మణికంఠ గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు... అలా ఇద్దరు కుండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకుంటారు...
అలా మాధురి గారికి మహేశ్వర్ గారికి ఒక సంవత్సరానికి రామ్ పుడతాడు... రామ్ పుట్టిన ఇంకొక సంవత్సరానికి రాగిని, మణికంఠ లకి సీత పడుతుంది... తర్వాత ఇద్దరు పిల్లలు వద్దనుకుని ఒక్కొక్కరితో ఆపేస్తారు....
వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు... అలా ఇద్దరు పెరుగుతూ ఒకరినొకరు అస్సలు పడక ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు... అలాగని వేరే వాళ్ళు రామ్ ని అరిస్తే సీత ఒప్పుకునేది కాదు... సీతని అరిస్తే రామ్ ఒప్పుకునేవాడు కాదు... అలా ఇద్దరు ఒకరికొకరు పడరు కానీ ఒకరి మీద ఒకరు ఈగ కూడా వాళ్ళ నిచ్చేవాళ్ళు కాదు... అలా ఇద్దరూ పెరిగి పెద్దయి చదువు ఐపోయి రామ్ కి ఉద్యోగం వస్తుంది... ఇప్పుడు సీత అపరంజి బొమ్మలా అయితే ఆరడుగుల అందగాడిలా తయారవుతాడు...
అప్పుడే మొదలైంది అసలైన కథ ఒకరోజు ఇద్దరి తల్లిదండ్రులు మణికంఠ గారి ఇంట్లో కలుసుకొని సీతని,రామ్ ని పిలిచి ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నామని వాళ్ల నిర్ణయం చెబుతారు...
రామ్ వెంటనే "దీన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి??? అది ఎప్పటికీ జరగదు!!! నాకు ఇది అంటే అస్సలు ఇష్టం లేదు... మీకు అలాంటి ఆలోచన ఉంటే మానుకోండి" అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు
అది వినగానే అందరూ బాధపడతారు... సీత మనసులో బాధగా ఉన్నా "నాకు కూడా బావ అంటే ఇష్టం లేదు... నేను కూడా ఈ పెళ్ళి చేసుకోను" అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి వెక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తుంది... ఎందుకంటే సీతకి చిన్నప్పటినుంచే రామ్ అంటే ప్రాణం కానీ ఎప్పుడూ చూపించలేదు అదే ఇప్పుడు తనకి బాధని మిగిల్చింది...
అలా రామ్ తన జాబ్ కి వెళ్తే అక్కడ ఎప్పుడూ సీతే గుర్తుకొస్తుంటే ఎందుకు గుర్తుకు వస్తుంది అని ఆలోచించి సీత ని ప్రేమిస్తున్నాను అని తెలుసుకుని తన ప్రేమ విషయం చెప్పాలనుకొని సర్ప్రైస్ ఇవ్వాలని అనుకుంటాడు కానీ తనకి ఎదురు షాక్ తగులుతుందని తెలియదు...
రామ్ సెలవులకు ఇంటికి వెళ్లేసరికి సీతను కలవాలని ముందు మణికంఠ గారి ఇంటికి వెళితే అక్కడ సీతకీ నిశ్చితార్థం జరుగుతుంది....
అది చూసి రామ్ గుమ్మం దగ్గరే నిలబడి బాధగా చూస్తూ ఉంటే మాధురి గారు రామ్ ని చూసి పిలిచి "ఇంకొక వారం రోజుల్లో సీత పెళ్లి" అని ఆనందంగా చెప్తుంది కానీ మనసులో మాత్రం "నువ్వు చేసిన వెధవ పని వల్లే వేరొక ఇంటికి కోడలిగా వెళుతుంది"అని కోపంగా అనుకుంటుంది
నిశ్చితార్థం జరుగుతున్నంతసేపు సీత కనీసం తల కూడా ఎత్తదు....
అలా నిశ్చితార్థం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతే రామ్ బాధగా సీతను చూసి "నాకు అర్జెంట్ వర్క్ ఉంది మళ్ళీ వస్తాను" అని చెప్పి తన ఇంటికి వెళ్లి రూమ్ కి వెళ్లి బాధగా మంచం మీద కూర్చుని పోతాడు
"ఎలా సీత నన్ను కాదని వాడిని ఆగొట్టం గాడిని చేసుకోవాలి అనుకుంటున్నావు??? కనీసం నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా!!! అయినా ఇదంతా నేను చేసుకున్నదేలే" అనుకుంటూ బాధగా ఆ రోజంతా రూమ్ లోనే ఉండిపోతాడు
తర్వాత రోజు ఎలాగైనా తన ప్రేమ విషయం సీతకి చెప్పి తనని ఒప్పించి పెళ్లి ఆపేయాలి అనుకొని ఇంటికి వెళ్తే అప్పటికే పసుపు దంచే పని అయిపోయి పెళ్లి పనులు స్టార్ట్ చేశారు... ఇవన్నీ చూస్తూ అసహనంగా డైరెక్ట్ గా సీత రూమ్ కి వెళ్లి చూస్తే సీతా రామ్ ఫోటో పట్టుకుని ఏడుస్తూ "ఎందుకు బావ నేను నీకు నచ్చలేదు... నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా!!! నిన్ను కాదని వేరే వాళ్లని చేసుకోవాలంటే ప్రాణం పోతున్నట్టుంది" అని అనుకుంటూ ఉంటే
అది విని ఆనందంగా రూమ్ బోల్ట్ పెట్టి సీత దగ్గరికి వెళ్లి "నాఫోటోలు ఏం చూస్తావ్ కానీ డైరెక్ట్ గా వచ్చాను చూడు" అని నవ్వుతూ తన ముందు నిలుచొని అంటే
సీత కంగారుగా ఫోటో దిండు కింద దాచి లేచి నిలబడుతుంది...రామ్ వెంటనే సీతని హత్తుకుని "నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను సీత... నిన్ను వదిలి వెళ్లాకే నాకు అర్థమైంది నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానని... పద వెళ్లి మనం మన అమ్మానాన్నలకి మన ప్రేమ విషయం చెప్పి ఈపెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్దాము" అని సీత చెయ్యి పట్టుకొని తీసుకు వెళ్తుంటే
సీత రామ్ చేతిలో నుంచి తన చెయ్యి తీసుకొని "ఆలస్యం అయిపోయింది బావ... ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు... అమ్మ నాన్న పరువు తీయలేను నేను... ఇక నుంచి మన జీవితం ఇంతే నువ్వు కూడా నన్ను మర్చిపోయి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో" అని బాధగా అంటుంది
రామ్ కోపం గా సీత చెంపమీద కొట్టి "ఏంటే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నవు!!! బుర్ర పోయిందా??? మనమిద్దరం ప్రేమించుకుంటున్నం పెళ్లి చేసుకుందాం అనుకుంటే పరువు మర్యాద అంటూ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నావు???" అని కోపంగా అరుస్తాడు
సీత చెంప మీద చేయి పెట్టుకుని"నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను బావ మన విషయం బయటకు తెలిస్తే నేను చచ్చినంత ఒట్టే" అని ఆవేశంగా అంటుంది
ఇంకా ఉంది

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ