Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : మనం కేసు సాల్వ్ చేయకపోతే కమీషనర్ మనతో ఆడుకుంటాడు….అసలే నిన్న కమీషనర్, హోమ్ సెక్రటరీ ఇద్దరూ మంచి వేడి మీద ఉన్నారు…ఒక వారం టైం అడిగాను….అలోపు ఎలాగైనా కేస్ క్లోజ్ చేయాలి…

ప్రసాద్ : (తన చేతులకు బాక్సింగ్ బ్యాగ్స్ తగిలించుకుంటూ) హంతకుడు ఒక్క స్కార్పియో వాడుతున్నాడు….మన దగ్గర ఆ ఆధారం తప్పితే ఏమీ లేదు….
రాము : ఇంకా…..(అంటూ తన చేతులకు బాక్సింగ్ గ్లౌస్ తగిలించుకుని ప్రసాద్ చేతులకు ఉన్న బ్యాగ్స్ మీద కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు.)
ప్రసాద్ : (తన చేతులను పైకి ఎత్తి రాము చేతి పంచ్‍లను ఆపుతూ) శివానంద్, రమ్య లాంటి మంచి వ్యక్తులను హత్య చేసున్నాడని అనుకున్నా కూడా…తరువాత వాడు లాయర్‍ని టార్గెట్ చేసుకున్నాడు….(అంటూ రాము వైపు చూసి నవ్వుతూ) సార్….కొద్దిసేపు నేను weights చేస్తాను….
రాము : అలాగే….(అంటూ వందన వైపు చూసి) నువ్వు వచ్చేయ్…బాక్సింగ్ చేద్దాం….
దాంతో వందన బాక్సింగ్ బ్యాగ్‍ని వదిలి రాముతో బాక్సింగ్ చేయడం మొదలుపెట్టింది.
రాము పంచ్‍ల నుండి తప్పించుకుంటూ వందన అతని చేతుల మీద కొడుతున్నది.
రాము : ఏంటి…నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను….పంచ్ పవర్ సరిగా లేదు….ఇంత వీక్‍గా ఉన్నావేంటి….(అంటూ వందన మీద పంచ్‍లు విసురుతున్నాడు.)
ప్రసాద్ : ముందు మనకు కొరియర్‍లో మనకు పంపించిన బొమ్మకు మేక మాస్క్….తరువావ శివానంద్‍కి దున్నపోతు ముసుగు….డాక్టర్ రమ్యకు సింహం ముసుగు….వాడి ఉద్దేశ్యం ఏంటో అర్ధం కావడం లేదు….
అంతలో రాము చూపు వందన భుజం మీద ఉన్న టాట్టూ మీద పడింది.
రాము : అదేంటి…కొత్తగా టాటూ కనిపిస్తుంది….ఎప్పుడు వేయించుకున్నావు…..(ప్రసాద్ వైపు చూసి) ఏంటి ప్రసాద్… నువ్వు ఏమీ అడగవా…..
వాళ్ళీద్దరూ మాట్లాడుతున్నా వందన మాత్రం ఏమీ మాట్లాడకుండా రాముతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నది.
ప్రసాద్ : అది ఎప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటది సార్….ఎప్పుడూ ఏదో ఒక పిచ్చి పని చేస్తుంటుంది….
వందన : రేయ్ నా జోడియాక్ సైన్‍రా అది…ఊరకే వాగమాకు….
వందన అలా అనగానే రాముకి ఏదో గుర్తుకొచ్చినట్టు ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయాడు.
అది గమనించని వందన తన పంచ్ విసిరేసరికి ఆమె చెయ్యి సరిగ్గా రాము మొహం మీద పడింది.
దాంతో రాము ఒక్కసారిగా తూలి వెనక్కు పడ్డాడు.
ఇక ప్రసాద్, వందన కంగారుగా రాము దగ్గరకు వచ్చి, “సార్….సార్….దెబ్బ తగిలిందా…సారీ సార్ చూసుకోలేదు,” అంటూ వందన సర్దిచెప్పడానికి ట్రై చేస్తున్నది.
“అదేంటి అలా చూసుకోకుండా కొట్టడమేనా…” అంటూ ప్రసాద్ కోపంగా వందనని ఇంకా ఏదో అనబోతుండగా రాము వెంటనే అతన్ని ఆపుతూ, “ఒక్క నిముషం….ఒక్క నిముషం ఆగండి,” అంటూ ఇద్దరికి సర్దిచెప్పాడు.
రాము : (వాళ్ళిద్దరి వైపు చూస్తూ) శివానంద్ మర్డర్‍కి ముందు మనకు పంపించిన బొమ్మకు మేక మాస్కే కదా వేసింది…..శివానంద్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి….
ప్రసాద్ : 26 మార్చ్…..
వందన : (ఆలోచిస్తూ) అంటే సన్ సైన్ ఏరిస్….మేక ముసుగు….
రాము : డాక్టర్ రమ్య డేట్ ఆఫ్ బర్త్…..
ప్రసాద్ : ఆ….18 may….
వందన : అంటే….టారస్….దున్నపోతు ముసుగు….
వందల అలా చెప్పగానే రాముకి ఒక క్లూకి అర్ధం దొరికినందుకు చాలా సంతోషపడిపోయాడు.
రాము : యస్….మార్చ్ నెలలో పుట్టిన కమ్యూనిస్ట్‍ని….మే నెలలో పుట్టిన డాక్టర్‍ని చంపబోతున్నట్టుగా వాడు మనకు క్లూ ఇచ్చాడు….
వందన : అప్పుడు సింహం అంటే లియో….పుట్టిన నెల జులై లేకపోతే ఆగస్ట్…..
ప్రసాద్ : అంటే…వాడు తరువాత హత్య చేయబోయేది ఆ మంత్‍లో పుట్టిన ఒక లాయర్‍ని…కాని ఇక్కడ ఇంకో పాయింట్ ఉన్నది సార్…వాడు హత్య చేసిన వాళ్ళను ఉరేసే చంపాడు…ఆ తరువాత షూట్ చేసాడు కూడా… శివానంద్‍ని షూట్ చేసింది నాలుగు సార్లు….డాక్టర్ రమ్యని మూడు సార్లు షూట్ చేసాడు….సో….నాకు తెలిసినంత వరకు వాడు నలుగురుని హత్య చేయడానికి డిసైడ్ అయ్యాడు….తరువాత హత్య చేయబోయే వాడిని రెండు సార్లు షూట్ చేస్తాడు…
వందన : కాని ఆ ఫోర్ డిజిట్ కోడ్ తెలియడం లేదు సార్….అది ఏమయి ఉంటుంది….
రాము : మనం ఎలా ఆలోచిస్తామో అని వాడు కూడా ఆలోచిస్తున్నాడు….కాని మనం వాడి కంటే ఒక అడుగు ముందే ఉండాలి….
అంటూ అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయారు.
ఆ రోజు రాత్రి రాము తన బెడ్‍రూమ్‍లో నిద్ర పోతుండగా బయట వర్షం బాగా పడుతున్నది.
రాము నిద్రపోతున్నా కళ్ళ ముందు శివానంద్, డాక్టర్ రమ్యల డెడ్ బాడీస్, వాళ్ళ వీపు మీద అంకెలు గుర్తుకురావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచాడు.
ఏదో ఆలోచిస్తున్నట్టు రాము బెడ్ మీద నుండి లేచి హాల్లోకి వచ్చి ఫ్రిజ్‍లో ఉన్న వాటర్‍బాటిల్ తీసుకుని సోఫాలో కూర్చుని వాటర్ తాగుతున్నాడు.
అలా కూర్చున్న రాముకి ఏదో గుర్తుకొచ్చినట్టు వెంటనే ఫోన్ తీసుకుని మానసకు ఫోన్ చేసాడు.
అప్పటికే గాఢనిద్రలో ఉన్న మానస ఫోన్ తీసుకుని నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని, “హలో …ఇంత రాత్రి ఎవర్రా ఫోన్ చేసేది,” నిద్రమత్తులో అడిగింది.
రాము చిన్నగా నవ్వుతూ, “ఒసేయ్…నేను రాముని….అంతలా నిద్ర ఎలా పడుతుందే….” అన్నాడు.
రాము మాట వినగానే మానస నిద్ర మత్తు మొత్తం వదిలిపోయింది.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 21-01-2023, 06:20 PM



Users browsing this thread: 4 Guest(s)