Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.53%
653 87.53%
Good
9.92%
74 9.92%
Bad
2.55%
19 2.55%
Total 746 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 199 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : ఏమైనా ఎవిడెన్స్ దొరికాయా…

ఇన్స్‍పెక్టర్ : ఇంకా ఏమీ దొరకలేదు సార్….డ్రస్, బాడీ వీపు మీద ఉన్న నాలుగు అంకెల నెంబర్, తలకు మాస్క్….మీ శివానంద్ కేసులాంటిదే సార్…..
రాము : అవును….అలాగే కనిపిస్తున్నది…
ఇన్స్‍పెక్టర్ : తరువాత ఇంకో విషయం సార్….(అంటూ తన జేబులో నుండి ఒక కాగితం మీద ఉన్న ఫోన్ నెంబర్ రాముకి ఇస్తూ) చివరగా ఈ చనిపోయిన డాక్టర్ గారి సెల్ నుండి ఈ నెంబర్‍కి కాల్ వెళ్ళింది సార్….
అంతలో ప్రసాద్ రాము పక్కకు వచ్చి అతని చేతిలొ ఉన్న నెంబర్ చూసి, “ఉదయం చెప్పాను కదా సార్….ప్రాంక్ కాల్ గురించి….ఇదే అయ్యుంటుంది,” అన్నాడు.
ఇన్స్‍పెక్టర్ : ఈ నెంబర్ మీకు తెలుసా సార్….
రాము : అవును….ఈ నెంబర్ ప్రసాద్‍ దే…నిన్న హత్య చేసిన తరువాత ప్రసాద్‍కి ఫోన్ చేసాడు…ఇదే విధంగా ఇంతకు ముందు శివానంద్ హత్య జరిగినప్పుడు కూడా మా వందనికి ఇలాగే ప్రాంక్ కాల్ వచ్చింది…దమ్ముంటే పట్టుకో అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు.
అంతలొ వందన కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న సెల్‍లో ఫోటో చూపిస్తూ….
వందన : సార్…కార్ టైర్ గుర్తులు కూడా ఇంతకు ముందు శివానంద్ హత్య జరిగిన కార్ టైర్ గుర్తులకు మ్యాచ్ అవుతున్నాయి…
రాము సెల్‍ని వందన్ చేతిలో నుండి తీసుకుని అందులో ఉన్న ఫోటో చూస్తున్నాడు.
ఇన్స్‍పెక్టర్ : (పైన వేలాడుతున్న బాడీని చూపిస్తూ…) సార్….ఈ లాయర్ డ్రస్….ఎందుకు వేసాడు….
రాము : ఇంకా అర్ధం కాలేదా….తరువాత ఎవరిని చంపబోతున్నాడో చెబుతున్నాడు….(అంటూ ప్రసాద్ వైపు తిరిగి) వీడు ఖచ్చితంగా ఒక సైకో అయి ఉంటాడు…
అంటూ అక్కడ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేసుకుని బయటకు వచ్చారు.
రాము : (తన పక్కనే ఉన్న ci తో) ఈ కేసు నేను డీల్ చేస్తాను…శివానంద్‍ని, ఇప్పుడు లోపల డాక్టర్ రమ్యని చంపింది ఒకే హంతకుడు…
ఇన్స్‍పెక్టర్ : అలాగే సార్….ఈ కేస్ విషయంలో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సార్….(అంటూ వెళ్ళిపోయాడు.)
రాము వెనక్కు తిరిగి ప్రసాద్ వైపు చూస్తూ, “ప్రసాద్…నువ్వు….” అంటూ ఉండగా ఒక కానిస్టేబుల్ ఒకతన్ని తీసుకొచ్చి, “సార్….ఇతను రాత్రి ఎవరినో చూసినట్టు చెబుతున్నాడు,” అన్నాడు.
రాము : ఎవరిని చూసావు….
అతను : సార్….నిన్న రాత్రి దాదాపు రెండు గంటలు అవుతుంది…ఆ గోడౌన్ నుండి ఒకతను బయటకు వెళ్ళడం నేను చూసాను సార్….
ప్రసాద్ : అతని మొహం చూసావా….
అతను : లేదు సార్….చూడ్డానికి పొడుగ్గా ఉన్నాడు….చీకట్లో మొహం చూడలేకపోయాను…మొహం కనిపించకుండా ముసుగు వేసుకుని ఉన్నాడు సార్….
వందన : షర్ట్‍కి ఎటాచ్‍అయి ఉండే క్యాప్ సార్….ఈ మధ్య చాలా సినిమాల్లో చూస్తున్నాం కదా…..అదేనా…
అతను : అవును మేడమ్….
ప్రసాద్ : ఏయ్…మేము కూడా సినిమాలు చాలా చూసాంలే కాని….ముందు నువ్వేం చూసావో అది చెప్పు చాలు….
అతను : వాడు బయటకు వచ్చి పెద్ద జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్….
ప్రసాద్ : కార్ కలర్ ఏంటి….
అతను : స్ట్రీట్ లైట్ల వెలుగులో చూసాను సార్….బ్లాక్ కలర్…జీప్….
ప్రసాద్ : జీపు కంపెనీ ఏంటో చూసావా….ఫోర్డ్, మహేంద్రా, మారుతీ….అలా….
అతను : (ఆలొచిస్తున్నట్టుగా) లేదు సార్…కంపెనీ ఏదో నాకు తెలియదు లేదు సార్….
అంతలో వందన మహేద్ర బ్లాక్ కలర్ స్కార్పియో బొమ్మ చూపించి, “ఇదిగో ఇలాంటి జీపేనా,” అనడిగింది.
అతను : (ఆ బొమ్మను చూస్తూ) అవును మేడమ్…ఇలాంటి జీపే….
వందన : సరె….నువ్వు వెళ్ళు….
దాంతో అతను వెళ్ళిపోబోతుండగా ప్రసాద్ మళ్ళీ అతన్ని వెనక్కు పిలిచాడు.
ప్రసాద్ : రాత్రి రెండు గంటలప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు….
అతను : నేను గార్మెంట్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పని చేస్తాను సార్…కంపెనీ బస్ కూడా అక్కడే ఆగుతుంది…బస్ దిగి వచ్చేప్పుడు చూసాను సార్….
ప్రసాద్ : సరె…వెళ్ళు…ఏదైనా అవసరం అయితే పిలుస్తాను…
అతను సరె అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
వాళ్ళు ముగ్గురూ అక్కడ నుండి బయలుదేరి ఆమె హాస్పిటల్‍కి వెళ్ళి ఎంక్వైరీ చేసారు.
ఆ ఎంక్వైరీలో రమ్య చాలా మంచిదని….ఆమెను ఎందుకు హత్య చేసారో అర్ధం కావడం లేదు అని హాస్పిటల్‍లో ఉన్న వాళ్ళు చెప్పారు.
రాము : ఇంతకు ముందు శివానంద్‍ని చిత్రహింసలు పెట్టి ఉరి తీసి చంపినట్టే….రమ్యని కూడా టార్చర్ పెట్టి ఉరి తీసి చంపేసాడు…హత్య చేయడంలో బాగా కొపం కనపడుతున్నది…రాత్రి రెండు గంటల దాకా ఆమెను అనుభవించి చిత్రహింసలు పెట్టి చంపేసాడు…ఉరి తీసి వేలాడదీసిన తరువాత మూడు సార్లు కాల్చాడు…తరువాత లాయర్ కోట్ రమ్య బాడీకి తొడిగాడు….తలకు సింహం మాస్క్ వేసాడు…వెనకాల వీపు మీద లాయర్ కోట్ మీద 3660 అని రక్తంతో రాసాడు…ఈ నెంబర్ పజిల్ ఏంటి….(అంటూ తన చేతిలో ఉన్న సెల్‍తో నుదురు మీద మెల్లగా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నాడు.)
అలా ఆలోచిస్తూ వాళ్ళు స్టేషన్‍కి వచ్చేసారు.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 21-01-2023, 06:13 PM



Users browsing this thread: 10 Guest(s)