08-01-2023, 12:26 PM
'చిత్ర' కథ
- Bojja Rahul Reddy
అదృష్టమంతవైనవి నా ఊహలు..
గాలి గీతల చెరసాల లో బందీలు కావు..
పరిధులు లేని విశ్వం లో పక్షులై విహరిస్తుంటాయి.
‘మేఘ మలుపు‘ నగరం మధ్యలో.. నాలుగు అంతస్థుల ఆర్ట్ గ్యాలెరీ ‘చింతల శేషగిరి గ్యాలెరీ’ ప్రారంభ వేడుక అంగ రంగ వైభవంగా జరుగుతుంది. ప్రముఖ చిత్రకారుడు, శిల్పి అయిన కీర్తి శేషులు నిలవనూరి రంగనాథం గారు గీసిన స్వాతంత్య్ర పోరాటపు చిత్రాలు ఆ ఆర్ట్ గ్యాలెరీలో ఉంచడమైనది. ఒకప్పటి మేఘ మలుపు వాస్తవ్యులు, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడైన చింతల శేషగిరి గారి స్వాతంత్య్ర పోరాటపు సంఘటనలకు సంభందించిన చిత్రాలు అన్నింటిని గ్యాలెరీలో ఉంచారు. యువతరంలో స్ఫూర్తి నింపడానికి ఈ గ్యాలెరీ ఎంతో ఉపయోగపడుతుందని అందరి నమ్మకం. శేషగిరి గారి మనవడు, ఆ నియోజక వర్గ MLA, చింతల సురేంద్ర, గ్యాలెరీ ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గ్యాలెరీ ముందు ఉన్న ఖాళీ స్థలమంతా జనంతో కిటకిటలాడుతుంది. స్పీకర్లలో దేశ భక్తి పాటలు మారు మ్రోగుతున్నాయి. మధ్య మధ్యలో శేషగిరి గారి వీరత్వాన్ని చాటుతూ పాడిన పాటలు వస్తున్నాయి.
గ్యాలెరీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో, ఇండిపెండెంట్ హౌస్ మీద సింగల్ రూమ్ పెంట్ హౌస్. రూమ్ అంతా చిందర వందరగా పడి వేసిన వివిధ చిత్రాలతో నిండి పోయి ఉంది. ప్రాంతీయ పత్రిక ‘నేటి ప్రపంచం’ లో కార్టూనిస్ట్, ఇరవయి ఎనిమిదేళ్ల నరహరి చిన్న అద్దం ముందు నిలుచొని పాట పాడుకుంటూ కంగారుగా ఒక చేత్తో చొక్కా తొడుక్కుంటూ, ఇంకో చేత్తో గ్లాసులో టీ పోసుకుంటున్నాడు. ఆ తొందర్లో టీ కాస్తా ఒలికి చొక్కా మీద పడింది. తొందరపాటుకు తనను తానే తిట్టుకుంటూ ఆ చొక్కా తీసేసి వేరే చొక్కా వేసుకున్నాడు. ఇంటి తాళం తీసుకొని ఏదో ఆలోచించుకుంటూ మెట్లు దిగుతూ బయల్దేరాడు. కింద సైకిల్ తీసుకొని బయల్దేరబోయేటప్పుడు జేబులో ఉన్న ఇంటి తాళం తగిలింది. తొందరలో ఇంటికి తాళం వేయడం మర్చిపోయి కిందికొచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ మెట్లెక్కి పైకెవరు వెళ్తార్లే అనుకొని తాళం పక్కనే ఉన్న పూల కుండీలో దాచి పెట్టేసి సైకిల్ మీద ఆర్ట్ గ్యాలెరీ వైపు బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ కొద్ది దూరంలో రోడ్ పక్కనే ఉన్న ఇంటి వైపు దండం పెట్టుకుంటూ వెళ్ళాడు. అది అతని గురువు నిలవనూరి రంగనాథం గారి ఇల్లు. తనకు చిత్ర లేఖనాన్ని పరిచయం చేసిన ఇల్లు. తనలో అల్లకల్లోలంగా ఎగిసి పడుతున్న ఊహలకు రూపం ఇవ్వడం నేర్పిన ఇల్లు. గురువు లేక బోసిపోయి ఉండడంతో ఆ ఇంటిని చూసి నరహరకి మనసులో బాధేసింది.
ఆయాసపడుతూ రోడ్ మీదున్న గుంతల మధ్యలో సైకిల్ తొక్కుతూ కొత్త ఆర్ట్ గ్యాలెరీ దగ్గరికి చేరుకునే సరికి స్టేజీ మీద MLA చింతల సురేంద్ర గారు మాట్లాడుతున్నారు. నరహరి గుంపులో స్టేజీ కి దూరంగా నిల్చొని చూడ సాగాడు. గ్యాలెరీ ఎంట్రన్స్ ముందు స్టేజి వేశారు. స్టేజీ చుట్టూరా స్వతంత్ర పోరాట యోధుల విగ్రహాలు.
"కాల గర్భంలో కలిసిపోయే కథలెన్నో ఉంటాయి. కానీ కాలం తనతో పాటే మోసే కథలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆ కథలే మన ముందున్న ఈ అమర వీరుల జీవితాలు. ఈ అమర వీరుల్లో ఒకరు మన 'మేఘమలుపు' లో పుట్టిన మా తాత శేషగిరి గారు కావడం మనకందరికీ గర్వ కారణం.
ఆ మహానుభావుడు పుట్టి ఈ రోజుకు సరిగ్గా 110 సంవత్సరాలవుతుంది. నిలవనూరి రంగనాథం గారు తాత శేషగిరి గారి జీవితంలోని సంఘటనలకు రూపం ఇస్తున్నాడని తెలిసినపుడు చాలా ఆనందం వేసింది. ఆయన గీసే ఒక్కో చిత్రం ఎన్నో కథలు చెబుతుంది. ఈ గ్యాలెరీ ఓపెనింగ్ సమయానికి ఆ మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. రంగనాథం గారి చిత్రాల ద్వారా ఆ రోజుల నాటి కఠినమైన పరిస్థితులు, ఆ పరిస్థితులకు ఎదురు తిరిగిన వీరుల పోరాటాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఆ మహానుభావుడికి రెండు నిమిషాలు మౌనం పాటించాక గ్యాలెరీ ఓపెన్ చేస్తాం..." అని మైకు దగ్గరి నుండి పక్కకు వచ్చి రెండు నిముషాలు మౌనం పాటించారు MLA చింతల సురేంద్ర గారు. అతనితో పాటే అక్కడ ఉన్న ప్రజలంతా శ్రద్ధ తో మౌనం పాటించారు. అక్కడ ఉన్న చాలా మందికి రంగనాథం గారెవరో తెలియదు. కానీ బ్రిటిష్ వారితో శేషగిరి గారి పోరాటలెన్నిటినో పుస్తకాలలో చదువుకున్నారు, పాటల ద్వారా విన్నారు. ఇప్పుడు చిత్రాల ద్వారా చూడబోతున్నారు. నరహరి కూడా శ్రద్ధతో కళ్ళు మూసుకున్నాడు. కానీ ప్రశాంతత లేదు. తన గురువు చివరగా గీసిన చిత్రాలు చూడబోతున్నాడు ఇప్పుడు తను. తెలియకుండానే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి.
రెండు నిముషాలు అయిపోగానే ముందుగా MLA గారు రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్లారు. అతని వెనకాలే జనమంతా తమ పాసులతో వరుసగా నిల్చున్నారు. నరహరి కూడా లైన్ లో నిల్చున్నాడు. ఎంట్రన్స్ దగ్గర ఒక చిత్రం నరహరికి బాగా నచ్చింది. అప్పుడే నాటు వేసిన పచ్చని పొలాల మధ్యలో ఎత్తైన వరాలపై ఆడవాళ్ళంతా పసుపు చీరల్లో నెత్తిన చిన్న కుండలు పెట్టుకొని నడుస్తున్నారు. ఆ కుండలో నీళ్ల మధ్యలో తేలుతున్న మట్టి చిప్పలో పసుపు గౌరమ్మ, గౌరమ్మ పక్కనే వెలుగుతున్న దీపం కనిపిస్తున్నాయి. ఒక చేత్తో నెత్తి మీద ఉన్న కుండను పట్టుకొని ఇంకో చేత్తో బరిసె పట్టుకొని ఏదో పాట పాడుతూ వరుసగా నడుస్తున్నారు. కింద ఆ చిత్రం ప్రాముఖ్యత రాసుంది. శేషగిరి గారు బ్రిటిష్ వాళ్లతో పోరాడుతూ గాయపడితే అతనికి వైద్యం జరుగుతున్న సమయంలో అతన్ని కాపాడుకోడానికి ఒక వైపు గౌరి దేవిని ప్రార్ధిస్తూ ఇంకో వైపు బరిసెలతో యుద్దానికి సిద్ధం అన్న సందేశాన్నిస్తున్న చిత్రమది.
ఆ చిత్రంలో పూర్తిగా లీనమైపోయాడు నరహరి. తన ముందే వాళ్ళు పాట పాడుతూ నడుస్తున్నట్లు ఉంది. అంత గొప్ప చిత్రకారుడు తన గురువు రంగనాథం గారు.
"చూసింది చాలు ముందుకు నడవ్వయ్య యలమంచి నరహరయ్య …. " వెనకనుంచి బూర మీసాల తాత అరుస్తున్నాడు.
తనను ఇంటి పేరు పెట్టి పిలిచేడి ఎవర్రా అని వెనక్కు తిరిగి చూసాడు నరహరి. తన ఇంటి ముందుండే తాత తను.
తన ముందు లైన్ ఖాళీ అయింది. నరహరి వేగంగా ముందుకు కదిలాడు.
"పాస్ సర్ " సెక్యూరిటీ గార్డ్ అడిగాడు చేయి చాపుతూ..
చొక్కా పై జేబులో నుండి పాస్ తీయబోయాడు నరహరి, కానీ లేదు. అది తన పాత చొక్కా జేబు లోనే ఉండిపోయింది.
మళ్ళీ తన తొందరపాటు తనాన్ని తిట్టుకుంటూ
"పాస్ ఇంటి దగ్గర మర్చిపోయా సర్. ఈ బొమ్మలన్నీ గీసింది మా గురువు గారే, లోపలికి పంపించండి సర్, కావాలంటే సాయంత్రం పాస్ తీసుకొచ్చి చూపిస్తాను.." బ్రతిమాలాడు నరహరి.
"అవన్నీ కుదరవు సర్, పక్కకు నిలుచోండి, వెనుక వాళ్లకు లేట్ అవుతుంది" విసుగ్గా అన్నాడు సెక్యూరిటీ అతను.
"పోనీ ఈ 100 తీసుకొని పాస్ ఇవ్వండి సర్ ప్లీజ్" 100 నోట్ ఇస్తూ అడిగాడు నరహరి.
"పాస్ 500 సర్ ఇప్పుడు. అయినా ఇవ్వాళ్టికి పాసులు అయిపోయాయి సర్, ఇబ్బంది పెట్టకుండా ఇంటికి వెళ్లి పాస్ తెచ్చుకోండి సర్, ప్లీజ్" అంటూ నరహరిని పక్కకు నెట్టాడు సెక్యూరిటీ గార్డ్.
ఇంక చేసేదేమి లేక సైకిల్ తీసుకొని ఇంటికి బయల్దేరాడు పాస్ తెచ్చుకుందామని. ఇంటికి చేరుకున్నాక సైకిల్ స్టాండ్ వేసి, కుండీలో పెట్టిన తాళం తీసుకొని మెట్ల పైకెక్కుతుంటే , మెట్ల మీద మొత్తం తాను గీసిన చిత్రాలన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. కాలనీలో పిల్లలు తలుపు తెరిచుందని చూసి చిత్రాలన్నీ బయటికి తీసుకువచ్చి చిందరవందరగా పడేసినట్లున్నారు. ఒక్కో చిత్రాన్ని పైకి తీసి, అన్నీ కలిపి రూం మధ్యలో కుప్పగా వేసాడు. టీ పడ్డ షర్ట్ జేబులో చూస్తే పాస్ లేదు. చుట్టూ వెతికాడు, ఎంతకూ పాస్ దొరకలేదు. అలసిపోయి మెల్లగా బాల్కనీ లో కూలబడి సిగేరేట్ వెలిగించాడు. అప్పుడే ఎదురుగా స్టాండ్ పై తెల్ల పేపర్ షీట్, పెన్సిల్, వాటర్ కలర్స్ కనిపించాయి. వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలా పేపర్ షీట్, పెన్సిల్, వాటర్ కలర్స్ ఒక కవర్ లో వేసుకొని, రూమ్ కి తాళం వేసి, సైకిల్ పై గ్యాలెరీ వైపు బయల్దేరాడు. దార్లో చిన్నగా చినుకులతో వర్షం మొదలైంది.
గ్యాలెరీ ముందు చెట్టు దగ్గర సైకిల్ ఆపి, చెట్టు కింద కూర్చొని కవర్లో నుండి పేపర్ షీట్ , పెన్సిల్ బయటికి తీసాడు. ఎదురుగా ఇంకో చెట్టు కింద ఇందాకటి సెక్యూరిటీ గార్డ్ , ఒక అమ్మాయితో కలిసి చినుకుల మధ్యలో టీ తాగుతూ, నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నరహరి వేగంగా సెక్యూరిటీ గార్డ్, ఆ అమ్మాయి వర్షం మధ్యలో నవ్వుతూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నట్లు బొమ్మ గీసి, కలర్స్ నింపాడు. ఆ చిత్రం కింద ఆర్ట్ బై, రంగనాథం గారి శిష్యుడు నరహరి అని రాసాడు.
చిత్రం పూర్తవగానే నరహరి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి సెక్యూరిటీ గార్డ్, ఆ అమ్మాయికి ఎదురుగా నిలుచొని తను గీసిన చిత్రాన్ని చూపించాడు. ఇద్దరు ఆశ్చర్యంతో తమ చిత్రాన్ని చూసారు. చాలా బాగుంది. ఆ అమ్మాయి సంతోషంతో వెంటనే "థాంక్స్ బంగారం. ఐ లవ్ యు. బెస్ట్ గిఫ్ట్ ఎవర్.." అని సెక్యూరిటీ గార్డ్ ను ముద్దు పెట్టుకుంది.
సెక్యూరిటీ గార్డ్ నవ్వుతోనే నరహరికి థాంక్స్ చెబుతూ, కళ్ళతో లోపలికి వెళ్ళమని సైగ చేసి ఆ చిత్రాన్ని చేతిలోకి తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ ఇచ్చాడు.
మాటలు వర్ణించలేని మధురమైన జ్ఞాపకాలను సైతం చిత్రాలు చూపించగలవు.
ఆనందంతో నరహరి గ్యాలెరీ లోపలికి అడుగుపెట్టాడు. జనాలు అప్పటికి పలుచగా ఉన్నారు. గ్యాలెరీ లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా నాలుగు అంతస్తులను కలుపుతూ ఉన్న విగ్రహం కనిపించింది. తల పైకెత్తి చూసాడు. చింతల శేషగిరి గారు చేతిలో నాగలి పట్టుకొని గంభీరంగా నిలుచొని ఉన్న విగ్రహం అది. నాగలి పై భాగంలో భారత జెండా రెపరెపలాడుతుంది.
అది చూడగానే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
ఒక్కో ఫ్లోర్ తిరుగుతూ ఒక్కో చిత్రం చూస్తూ తన గురువు గారిని పొగుడుతూ ఉన్నాడు నరహరి రోజంతా. ఒక్కో చిత్రాన్ని చూస్తుంటే నరహరిలో ఒక్కో అనుభూతి. వేరే ఎవరు వేసిన చిత్రాలు చూసినా అందులోని లోపాలు కనిపిస్తాయి నరహరికి , ఒక్క తన గురువు గారు వేసిన చిత్రాలలో మాత్రమే కనిపించవు. చూస్తుండగానే చీకటి పడిపోయింది. గ్యాలెరీ క్లోజ్ చేస్తుంటే బయటికి వచ్చాడు నరహరి. సెక్యూరిటీ గార్డ్ కు మళ్ళీ థాంక్స్ చెప్పి ఇంటికి బయల్దేరాడు. పౌర్ణమి అవడంతో ఆ రోజు వెన్నెల నిండుగా ఉంది.
రాత్రి భోజనం చేసి, కవర్లో ఉన్న పేపర్ షీట్స్ స్టాండ్ కు తగిలించి బాల్కనీ లో చంద్రుణ్ణి చూస్తూ ఆనందంగా పడుకున్నాడు నరహరి.
కళాకారుని మనసు, సముద్రం ఒక లాంటివే, అల్లకల్లోలాలు ఉంటాయి, అలికిడి లేని ప్రశాంతత కూడా ఉంటుంది. అలసట మాత్రం ఉండదు.
పచ్చని పొలాల మధ్యలో వరాల మీద పసుపు పచ్చని చీరలలో నెత్తిన కుండ మోస్తూ చేతిలో బరిసెతో, పాట పాడుతూ నడుస్తున్నారు ఆడ వాళ్ళు. ఎదురుగా చింతల శేషగిరి గారు చేతిలో నాగలితో నిలుచున్న ఎత్తైన విగ్రహం. ఆకాశపుటంచుల్లో భారత జెండా రెప రెపలాడుతుంది.
ఆడవాళ్లు విగ్రహం దగ్గర కుండలు పెట్టి బరిసెలతో పక్కనే ఉన్న గది లోకి వెళ్లారు. వారి వెనకాలే నరహరి కూడా గది లోకి వెళ్ళాడు. గది అంతా గోడలమీద తన గురువు గారు గీసిన చిత్ర పటాలతో నిండి ఉంది. ఆడవాళ్ళెవరూ లేరు, అందరూ మాయమైపోయారు. నరహరి ఒక్కో చిత్రాన్ని గమనించ సాగాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. మొదటి సారి తన గురువు గారు గీసిన చిత్రంలో లోపం. ఒక్క చిత్రంలో కాదు, అన్ని చిత్రాల్లో ఏదో ఒక లోపం. భయమేసింది నరహరికి, ఉలిక్కిపడి నిద్ర లేచాడు. ఎండ మొహానికి గట్టిగా కొడుతుంది. చెమటలు పట్టేసాయి.
త్వరగా లేచి పెన్సిల్ తీసుకొని తాను కలలో గదిలో గోడల మీద చూసిన చిత్రాలన్నీ ఒక్కో షీట్ మీద గీశాడు. అన్నీ అమరవీరుడు శేషగిరి గారి చిత్రాలే. అవన్నీ తీసి గోడపై అతికించాడు. మధ్యలో మాత్రం ఏ లోపం లేని చిత్రం ఉంచి చుట్టూ లోపం ఉన్న చిత్రాలు అతికించాడు. అన్నింటిని గమనించాడు. ఒక్కో చిత్రం లో ఒక్కో లోపం. ఒక దాన్లో కళ్ళు తప్పుగా ఉన్నాయి, ఒక దాన్లో మీసం కట్టు తప్పుగా ఉంది, ఇంకో దాన్లో చెవులు తప్పుగా ఉన్నాయి. ఇలా ఒక్కో చిత్రంలో ఒక్కో అవయవం తప్పుగా ఉంది. ఆ అవయవాలన్నింటిని అలానే కలుపుతూ ఒక షీట్ పై గీశాడు. కొంచెం వెనక్కి వచ్చి ఆ చిత్రాన్ని చూసాడు. ఎవరో కొత్త వ్యక్తి మొఖం. ఎప్పుడూ చూడని మొఖం. నిండు ముఖం గంభీరమైన ముఖం.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ