Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చక్ర భ్రమణం
#1
చక్ర భ్రమణం
-     Sarath Chandra

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా... రావులకొల్లు గ్రామం.. ప్రఖ్యాత వృద్దాశ్రమం గూగుల్ సర్చ్ చేస్తున్న త్రివిక్రం భృకిటి ముడివడింది...... భార్య అరుణ ని కేకెశాడు. అరుణ.... రావులకొల్లు ఓల్డ్ ఏజ్ హోమ్ లో అమ్మనాన్న కు ఆకామిడేషన్ దొరికితే ఈ దీపావళి మనకు దేదీప్యమానమే.. అన్నాడు ఆనందంగా. అదేంటండి అదంత ఫేమస్ ఆహ్  అని అడిగింది అరుణ. ఇండియా లో హోంలీ వాతావరణం లో నడిచే కొద్ది ఓల్డ్ ఏజ్ హోముల్లో దాని స్థానం పదిలొనే ఉంటుంది చెప్పాడు త్రివిక్రమ్. కాస్ట్ ఎక్కువగా ఉంటుందేమో.. మన సంపాదనంత ఆ వృద్ధాశ్రమానికి దారపోయాల్సిందేనా..? అంది నిష్టూరంగా అరుణ. అదే ఇక్కడ ట్విస్ట్ ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు చేప్పాడు త్రివిక్రమ్. ఓ ఇంట్రెస్టింగ్ ఒకసారి నన్ను డీటెయిల్స్ చూడనివ్వండి  అంటూ తరుగుతున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టి త్రివిక్రమ్ ముందున్న లాప్టాప్ లో తలా దూర్చింది. ఓల్డ్ ఏజ్ హోమ్ కన్నుల పండుగ గా కనిపించాయి అరుణ కి. పచ్చని ప్రకృతి మధ్య పాతిక ఎకరాల సువిశాల విస్తీర్ణం మధ్య నిర్మించబడి ఉంది. ఒకవైపు చర్చ్ మరోవైపు దేవాలయం... ఎదురుగా మసీదుతో ఎవరు ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్దించుకునేలా నిర్మాణం జరిగి ఉంది. షటిల్ కోర్ట్ బాడ్మింటన్ కోర్ట్లతో పాటు ఇన్డోర్ గేమ్స్ కి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. క్యారమ్స్, చెస్, టెన్నీస్ తదితర క్రీడలకు తగ్గ రీతిలో స్టేడియం నిర్మాణాలు ఉన్నాయి. సరస్వతి నిలయం పేరుతో గ్రంధాలయం. పురాణం కాలక్షేప వేదికలు ఒకటా రెండా సర్వ సౌకర్యాలు ఉన్నాయి. అద్భుతం అంది అరుణ. మనం కూడా భవిష్యత్ లో ఇక్కడే చేరవచ్చు.... నాని గాడిని ఆశ్రయించకుండా అంది నవ్వుతూ. తన పేరు ప్రస్తావన లోకి వచ్చేసరికి ఏంటి మమ్మీ అని వచ్చాడు. హర్ష అలియాస్ నాని భవిష్యత్ లో నువ్వు మమ్మల్ని చూసుకోకపోతే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరుతాం రా అంది కొడుకు బుగ్గల్ని మురిపెంగా సాగదీస్తూ. భార్య ని నిరాశ పరుస్తూ అసలు ట్విస్ట్ వినకుండా నువ్వు సంబరపడిపోతే ఎలానే..... అన్నాడు భార్య అరుణ ను గద్దిస్తూ త్రివిక్రమ్. ఏంటండి.... అది....  అని అడిగింది. ఇక్కడ చేరేవారికి పిల్లలు ఉండకూడదు, ఉన్నా సంపాదనా పరులై ఉండకూడదు బాంబ్ పేల్చాడు త్రివిక్రం. అరుణ ముఖంలో రక్తం తోడేసినట్టయింది. ఏంటండి మీరు చెప్పేది... అంది ఫీలింగ్స్ మారుతుండగా. అవును బేబీ నిజం... అక్కడ అకామిడేషన్ అనాదలైన వృద్దులకు మాత్రమే చెప్పాడు త్రివిక్రమ్. అరుణ బుర్ర పాదరసం లా పంచేసింది. అదేమంత కష్టం అత్తయ్య కు మావయ్య కు పిల్లలు లేరని డాక్యుమెంట్ సృష్టిద్దాం.... అంది. ఏంటి అంత మాట అన్నావ్ నిలువెత్తు విగ్రహం లా నేను బ్రతికే ఉన్నాగా. అన్నాడు త్రివిక్రం. చనిపోండి.... అంది. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు త్రివిక్రమ్ భర్త ఫీలింగ్స్ ని గమనించి అన్నిటికి అలా ఫ్రీజ్ ఐతే ఎలా..... లాయర్ తో మాట్లాడి మీరు రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయినట్టు ఎవిడెన్స్ క్రీయేట్ చేద్దాం అంది మంగళ సూత్రాలు కళ్ళకు అద్దుకుంటూనే... నన్ను చంపాలి అనుకున్న తరువాత అంత భక్తి ఎందుకో దెప్పిపొడిచాడు త్రివిక్రమ్. నిజంగా మీరు పోవాలని కోరుకుంటానటండి ఎదో అవసరార్థం అంది. సర్లే ఇక్కడ గైడ్లైన్స్ ఉంది చూడు అన్నాడు. అరుణ మళ్ళీ తల దూర్చింది లాప్టాప్ లోకి ఆసాంతం చూసి ......ఈ కండిషన్ ఎదో బాగుందండి పిల్లలు లేనట్టు అత్తయ్య మావయ్య లు అఫిడవిట్ సమర్పిస్తే చాలుట అంది చదువుతూ ఇదంతా వింటున్న నాని అమ్మా... నాన్న మధ్యకు వచ్చి.. తాతయ్య నాన్నమ్మని ఇక్కడికి తెస్తాం అన్నారు కదా మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ గొడవేంటి అడిగాడు ఇదంతా నీకు తెలియదు రా నువ్వు వెళ్లి చదువుకో అంది అరుణ. కాదు నాకు అర్దం అవుతుంది చెప్పండి మీరు తాతయ్య ని నానమ్మ ని ఏం చేయబోతున్నారు. అదేదో సినిమాలో లా ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చబోతున్నారా.. అడిగాడు విసురుగా నా బిడ్డ పిచ్చ ఇంటెలిజెంట్ అండి సులువుగా అని అర్ధం చేసుకుంటాడు అంది అరుణ మురిపెంగా. వద్దమ్మా తాతయ్య ని జేజమ్మ ని ఇంటికి తెచ్చుకుందాం ఊర్నించి అన్నాడు నాని. ఇదంతా బుర్రకు పట్టించుకోక చదువుకోరా కన్నా అన్నాడు త్రివిక్రమ్. అరుణ కొడుకు ను దగ్గర తీసుకొని అరేయ్ బడవాఖాన వీకెండ్ కదా మేము కాస్త రిలాక్స్ గా ఉండేది మిగతా వారమంత వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు తాతయ్య కు మెడిసిన్ నానమ్మ కు భోజనం ఇతర సదుపాయాలు కలిపించాలంటే జరిగే పని కాదు హోమ్ లో అన్ని సౌఖ్యలుంటాయి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అరుణ వివరించడానికి ప్రయత్నిచింది. ఎంటో మీరు చెప్పేది నాకు ఏమి అర్దం కావట్లేదు...... అని గొణుగుతూ తన గదిలోకి వెళ్ళాడు నాని.
*******
అమ్మ నాన్న ప్రమేయం లేకుండా వాళ్ళిద్దరి పేరు మీద త్రివిక్రమ్ అప్లికేషన్ ఆన్లైన్ లో పంపాడు. తెలిసిన వాళ్ల రిఫరెన్స్ కింద తన నెంబర్ ఇమెయిల్ అడ్రస్ ఇచ్చాడు. వారం తర్వాత త్రివిక్రమ్ కి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ పై జంట సంతకాలు ఉన్నాయి. పేర్లు మరోసారి ఉచ్చరించ్చాడు. డాక్టర్ రాం మనోహర్.... సుమిత్రదేవి..... మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్న వృద్ధ దంపతులు ఆది నారాయణ రావు సుగునమ్మల ఆశ్రమానికి తీసుకురండి. అని దృవీకరిస్తూ పంపిన మెయిల్ సారాంశం అది. మనం పగడ్బందీగా లెటర్ పెట్టాం కనుక కిక్కురుమనకుండా లెటర్ పంపారు చెప్పాడు త్రివిక్రమ్ భార్య తో. నిజమే అడ్వకేట్ రామచంద్రయ్య అన్నయ్య పకడ్బందీగా అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి ఇది సాధ్యమైంది చెప్పింది అరుణ. నిజమే... అడ్వకేట్ రామచంద్రరావు ను అభినందించారు మనస్ఫూర్తిగా. రేపు ఫ్లైట్ కి బుక్ చేస్తున్నా... చెప్పాడు త్రివిక్రమ్ నేనూ వస్తా ఇండియా కి.... అన్నాడు నాని. వద్దురా ఫ్లైట్ ఛార్జ్ లు దండగ అంది అరుణ. కాదు తాతయ్య ని చూడాలి మొండికేశాడు నాని. వీడొస్తే మొత్తం కథ బయట పడిపోతుంది వీడు తాతయ్య అంటాడు. మీ నాన్నేమో ‘నాన్నలు’ అని దగ్గరకు తీసుకుని మురిసిపోతాడు. వీళ్లిద్దరి సీన్ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకుల చూస్తే మన బండారం బయట పడుతుంది. లోగుంతుకతో అంది అరుణ. కాంప్రమైస్ ధోరణి లో నాని ని దగ్గరకు తీసుకొని చెప్పాడు త్రివిక్రమ్. అరేయ్ నాన్న మేము వెళ్ళి మొత్తం పరిస్థితుల్ని చక్కదిద్ది ఈసారి నిన్ను తీసుకు వెళతాం చెప్పాడు. చక్కదిద్దేది ఏముంది తాతయ్య వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెయ్యడానికే కదా వెళ్తున్నారు. నేను వచ్చి గ్రాండ్పా కి సెండాఫ్ ఇస్తాను. మళ్ళి తీసుకెళ్తారో లేదో అన్నాడు నాని. అరుణ కళ్ళు ఉరుమింది. అలా కళ్ళు ఉరమడం అంటే పక్క నిమిషం పిడి గుద్దులు అని తెలుసు నాని కి అయినా సరే దెబ్బలకు సిద్ధమై ఉన్నాడు. నన్ను కొట్టండి చంపండి నేను వస్తా... తెగేసి చెప్పారు నాని. చేసేది ఏమి లేక సరే రా ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర కానీ ఇతర ముఖ్య ప్రదేశాల దగ్గర కానీ వాళ్ళని గ్రాండ్పా గ్రాండ్మ అంటూ గారాల పోయేది లేదు. హెచ్చరించింది అరుణ సరే అన్నాడు నాని. ఫ్లైట్ ఇండియా లో దిగాక నేలను ముద్దాడాడు నాని. ఒరేయ్ వెర్రి వెంగలప్ప ఈ నెలలో బాక్టీరియా లు ఉంటాయి మరి పడిపోకు అంది అరుణ. మదర్ లాండ్ సెంటిమెంట్ నీకు అర్దం కాదులే మమ్మీ అని కొట్టిపడేశాడు నాని. హైద్రాబాద్ నుండి కాకినాడ చేరుకొని హోటల్ లో దిగారు ముగ్గురు.
*******
అదేంటి డాడీ పాతిక కిలోమీటర్ ల దూరం లోనే కదా గ్రాండ్పా ఇల్లు అన్నాడు నాని. ఉందిలేరా కాదన్నది ఎవరు. అక్కడ ఏ గదిలోను ఎ. సి ఉండదు. పైగా దుమ్ము ధూళి ఎక్కువ. అసలే డస్ట్ ఎల్లెర్జి నీకు... మాత్రలు వాడలేక చావాలి అన్నాడు త్రివిక్రం. అరుణని, నానిని గదిలో వదిలి... అమ్మ.. నాన్న... దగ్గరకు కాల్ టాక్సీ లో బయలుదేరాడు త్రివిక్రం. కాకినాడ దగ్గర్లోని కొత్త చెరువు గ్రామంలో కి చేరేసరికి కాస్త పొద్దు బోయింది. హతాట్టుగా వచ్చిన కొడుకు ని చూసి ఆనంద పడ్డారు వృద్ద దంపతులు. అదేంట్రా అయ్యా చెప్ప పెట్టకుండా వచ్చావు... అని అడిగాడు ఆదినారాయణ.  నా ఇల్లే కదా నాన్న ఎపుడొస్తే ఏమైంది .... అన్నాడు త్రివిక్రమ్. అది కాదురా అమెరికా నుండి ఏకా ఏకిన రావడం అనే మాటలా.. అన్నాడు. సర్లేవయ్య విమానంలో ఎంతసేపు రావాలి?.... ఇదిగో నాయన మంచి నీళ్ళు  ఇచ్చింది సుగుణమ్మ. కారులోనే కదమ్మా వచ్చాను.. ఏ.సి కదా గొంతు తడార లేదు  చెప్పాడు త్రివిక్రమ్. వేడి వేడిగా మంచి ‘టీ’ పెట్టివ్వవే చెప్పాడు అది నారాయణ. సరేనని లోపలికి వెళ్ళింది సుగుణమ్మ. టీ కాఫీ లు ఆపేశాను నాన్న అన్నాడు త్రివిక్రమ్. సరే నిమ్మరసం అన్నా కలిపి ఇవ్వవే చెప్పాడు ఆది నారాయణ. సిట్రస్ కదా వద్దు నాన్న జలుబు చేస్తుంది చెప్పాడు కొడుకు తీరుకు నొచ్చుకున్నాడు ఆదినారాయణ. లోపల్నుండి సుగుణమ్మ వచ్చి.. కోడలు మనవడు ఎక్కడ రా అని అడిగింది.. ఇద్దరికి కాస్త ఫీవర్ గా ఉంది అమ్మ అందుకే ఇక్కడికి రాలేదు హోటల్ లో ఉన్నారు చెప్పాడు త్రివిక్రమ్. సరే రా అబ్బాయి ఇంత సడన్ గా ఊడి పడ్డావ్ ఏమైనా విశేషం ఉందా.... అని అడిగాడు ఆదినారాయణ. విశేషమే నాన్న రావుల కొల్లు ఉంది కదా..... అడిగాడు. అవున్రా.. ఏం అడిగాడు ఆయన. అక్కడ మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది నాన్న. మిమ్మల్ని చేరిస్తే చాలా బాగా ఉంటుంది నేను మీ కోడలు అనుకున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి చెప్పాడు త్రివిక్రమ్. ఆదినారాయణ మొఖం చప్పున చల్లారిపోయింది. అప్పటి వరకు ఊర్లో అందరికి మావాడు అమెరికా కి రమ్మని గొడవ పెడుతున్నాడు అని నేను సిద్ధమే మా ఇంటావిడ మొండికేస్తుంది అని గొప్పలు చెప్పుకునేవాడు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
చక్ర భ్రమణం - by k3vv3 - 29-12-2022, 07:15 PM
RE: చక్ర భ్రమణం - by Manoj1 - 27-01-2023, 08:40 AM
RE: చక్ర భ్రమణం - by sri7869 - 25-07-2023, 12:23 PM



Users browsing this thread: 1 Guest(s)