26-12-2022, 06:10 PM
ఆకాశంలో సగం - రుద్రా
- Abhisaarika
గవర్నమెంట్ హాస్పిటల్, గద్వాల్.
ఒక అంబులెన్సు కేక పెడ్తూ వచ్చి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ముందు ఆగింది.
ఎమర్జెన్సీ అని గట్టిగ అరుస్తున్నాడు బండి నుండి దిగుతూనే కంపౌండర్. స్ట్రెచర్ మీదకు ఒక అమ్మాయి శరీరాన్నీ చేర్చారు. ఆమె చేతి మణికట్టు, కట్టయ్యి రక్తం స్రవిస్తోంది. దారిపొడుగునా అది చుక్కలు చుక్కలుగా కారుతుంది. వెంటనే ఒక నర్స్ దూదిని తీసి ఆ గాయం మీద గట్టిగా వత్తి పట్టుకుంది.
రెండు నిముషాల్లో డాక్టర్ వచ్చి, ఎమర్జెన్సీ ఓటీరూంలోకి తీసుకెళ్లమని ఆదేశించాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందనడానికి ప్రతీకగా ఎర్రబల్బ్ వెలుగుతోంది.
ఈ లోపే పత్రికల వాళ్ళు, టీవీ వాళ్ళు న్యూస్ కోసం ఎగబడ్డారు.
ప్రేమ విఫలమై ప్రాణాలు తీసుకున్న యువతీ, ప్రేమోన్మాది చేతిలో మరో ప్రాణం బలి ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టి, జరిగిందేమిటో కూడా తెలియకుండా ఇష్టానుసారం జనాల బుర్రలోకి విషాన్ని నింపడం స్టార్ట్ చేసారు.
రెండు గంటలు గడిచాక, డాక్టర్స్ బృందం బయటకి వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారోనని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి కొన్ని కెమెరా కళ్ళు. ఆపరేషన్ చేసిన ఒక డాక్టర్ మైకులకు దగ్గరగా వచ్చి నిలబడి ఆ అమ్మాయి ఎవరో, ఏమిటో వివరాలేమీ ప్రస్తుతానికి తెలియలేదు. ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కుంటున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు. ఇక ఆమె హెల్త్ విషయానికి వస్తే, తన పరిస్థితి విషమంగానే ఉంది. శరీరంపై ఉన్న గాయాలనుబట్టి ఎవరో కావాలనే ఆమెను కొట్టారు, సెక్సువల్ అస్సాల్ట్ కి సంబందించిన గాయాలేమి లేవు, కానీ ఆమె ఔటర్ బాడీపై మాత్రం గోళ్ళతో రక్కిన గాయాలు, పళ్లతో కొరికిన గాయాలు మాత్రం ఉన్నాయ్. పైగా ఆమెకు న్యూరోకానైన్, ఇంకా ఆండ్రీలిన్ అనే రెండు రకాల డ్రగ్స్ పొడి ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరిగింది. సర్ ఒక సందేహం. ఎవరో ఆమెకు ఇచ్చారని ఎలా చెప్తున్నారు?? ఆమె తీసుకుని ఉండొచ్చు కదా??? అని అన్నాడు ఒక విలేకరి నోఖచ్చితంగా ఆమెకు ఎవరో ఇచ్చారు, కారణం ఆమె స్పృహ తప్పాక కూడా, ఆమె ముక్కులో, గొంతులో ఈ పొడిని గుప్పించారు. అంతే కాదు ఈ డ్రగ్స్ ఇంజెక్ట్, డైరెక్టుగా చెయ్యకూడదు. కానీ ఆమె చేతిమీద ఉన్న సన్నటి రంద్రాలు ఇంజెక్షన్స్ కి సంబంధించినవే. అవి ఆమె లంగ్సుని, ఇంకా మెదడు వ్యవస్థని పూర్తిగా ఆక్రమించింది. దీని పర్యవసానం ఏమవుతుండొచ్చు డాక్టర్ అని మరో విలేకరి ప్రశ్నించాడు ఏదైనా జరగొచ్చు, ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా కొన్ని టెస్టులు చేసి తేలుస్తాం. కానీ ఆమె పరిస్థితి మాత్రం అంచనా వెయ్యలేకపోతున్నాం. ఇప్పుడే ప్రాణాలు వదిలేయొచ్చు లేదా ఒక నెల బతకొచ్చు. కోమాలోకి వెళ్లిపోవచ్చు, లేదా బయటకి రావొచ్చు. కానీ ఏదైనా సరే ఆమె బ్రతకడం కష్టం అని అన్నాడు చెమటలు తుడుచుకుంటూ. ఇది జరుగుతుండగానే, ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఆమె శరీరం, ఎగిరెగిరి పడుతోంది, బీపీ, పల్స్ పూర్తిగా తగ్గి, తిరిగి అమాంతం పెరిగిపోతున్నాయనడానికి సూచికగా ఆ మెషినులు వింత శబ్దం చేస్తున్నాయి. ఆమె ఒంట్లో ఎదో ఒక రసాయన ప్రక్రియ జరుగుతోంది. తెగిపోయేలా ఆమె నరాలలో రక్తం విపరీతమైన వేగంతో ప్రవహిస్తూ ఆమె గుండె వేగాన్ని అమాంతం 250 బీపీఎంకు పెంచేస్తోంది. ఇది చిరుత పులి వేటాడే సమయంలో పెరిగేంత గుండె వేగం. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. చుట్టూ చూసింది. కానీ ఆమె కళ్ళలో భయం కానీ బాధ కానీ లేవు. చాలా తీక్షణంగా దేనికోసమో వెతుకుతోంది. ఆమె మెదడు ఒక కంప్యూటరుల పనిచేస్తోంది. ఆమెకు కావాల్సిన మందులు టాబ్లెట్స్, కత్తులు, కత్తెరలు ఇంజెక్షన్స్ తీసుకుంది. వాటిని ఒక పేపరులో చుట్టుకుని, పక్కరూంలో ఉన్న నర్స్ డ్రెస్ వేసుకుని చక్క నడిచి బయటకి వెళ్ళిపోయింది. పేషెంట్కి కాపలాగా ఉన్న నర్స్ వచ్చేసరికి ఆమె లేకపోవడంతో పరుగుపరుగున వెళ్లి డాక్టర్స్ కి విషయం చెప్పింది.
ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తరవాత:
అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం, అక్కడ ఒక్క పదంతస్థుల బిల్డింగ్ సగం కట్టి ఆపేసారు. ఎనిమిదో అంతస్థులో ఉన్న చిన్న పోర్టాబుల్ టీవిలో సిటీలో నలభై ఐదు మంది కొన్ని నిముషాల వ్యవధిలోనే కనిపించకుండా పోయారు. కనిపించకుండపోయిన వాళ్ళందరి ఇళ్లలో ఒక లెటర్ మాత్రం దొరికింది, అందులో ఆకాశంలో సగం - రుద్రా అని రాసి ఉంది. వీళ్లంతా ఎవరు?? ఒకరితో ఒక్కరికి సంబంధం ఏమిటి??? అనే కోణాల్లో సెక్యూరిటీ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో విశేషమిటంటే అందరు మగవారే అయుండడం, అది కూడా అందరు చిన్నచితక సెలబ్రిటీస్ నుండి పెద్ద, పెద్ద బిగ్ షాట్స్ పిల్లలు, వాళ్ళ బంధువులు అయుండడం. వయస్సుతో నిమిత్తం లేకుండా 17 ఏళ్ళ బాలుడి నుండి 75 ఏళ్ళ ముసలివాళ్ళు కూడా ఉండడం మరో విశేషం అని అదేదో పెళ్లి వార్తల పళ్ళికిలిస్తూ చదువుతున్నాడు న్యూస్ రీడరు. ఆ న్యూస్ చూస్తూ, వేడి వేడి టీని సిప్ చేస్తోంది ఆ అమ్మాయి. ఎదో గుర్తొచ్చినదానిలా లేచి లాప్టాప్ లో ఎదో సమాచారం కోసం వెతికింది. అది దొరకగానే, ఆమె మోహంలో చిన్న సంతృప్తి కనపడింది. వెంటనే లేచి జుట్టుని గట్టిగ పైకి ముడి వేసింది. చున్నీని తలపాగాల చుట్టి దాన్నే మాస్క్ లాగా మొహానికి కట్టింది. మాములుగా అప్పటిదాకా కట్టుక్కున నల్ల చీరను పైకి మడిచి దోతిల వెనక్కి దోపింది. కొంగుని గట్టిగ నడుము చుట్టూచుట్టి ముడివేసింది. ఆమెకు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకుని మరో వస్త్రంలో మూటకట్టి భుజానికి వేసుకుంది. చూస్తుండగానే ఆమె గోడలను పట్టుకుని పదంతస్తుకు చేరుకుంది. అక్కడ నలభై ఐదు మంది తప్పిపోయినవారు తాళ్లతో బంధించి ఉన్నారు. ఎవ్వరు కూడా స్పృహలో లేరు. ఒక్కొక్కరిగా వారిని చూస్తున్న ఆమె కళ్ళలో అసహ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అక్కడే ఉన్న మోటార్ ఆన్ చేసి పైపుతో నీళ్లను వాళ్ళ మొహాలకేసి కొట్టింది. ఒక్కొక్కరిగా అందరు స్పృహలోకి వచ్చారు. వారి కళ్ళలో భయం, ప్రాణాలపై తీపి, ఊపిరి పోతుందేమోనన్న ఆందోళన కనిపిస్తోంది. రుద్రకి నవ్వొచ్చింది. అందులో ఒకడు ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇలా బంధించావు?? అని అడిగాడు భయంగా. ఇంకోకడు ఎవడ్రా నువ్వు, ఇడిసెయ్యి లేదా సంపూత నిన్ను ఈడే అని బెదిరించాడు. ఆ అమ్మాయి అక్కడ ఉన్న ప్లాస్టిక్ కుర్చీని లాక్కుని కూర్చుంటూ ఇంకా అని అంది . అందరి మొఖాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆ పైనే హేళన భావం కనిపించింది. ఏయ్ ఒక ఆడదానివైయుండి, ఇంత మంది మగాళ్లని కిడ్నప్ చెయ్యడానికి ఎంత ధైర్యమే అని అడిగాడు ఓకడు రుద్రా........ నా పేరు రుద్రా అని అన్నది ఆ అమ్మాయి ఇది దీని పనయుండదు బ్రో?? ఖచ్చితంగా దీని వెనక ఎదో పెద్ద నెట్వర్క్ ఉంది అని అన్నాడు పక్కన ఉన్నావాడు . ప్లీజ్, అక్క నన్ను వదిలేయ్. నేనేమి చేశాను? నన్నెందుకు తీసుకొచ్చారు? అని సెంటిమెంట్ ప్రయోగించాడు ఒక భయస్తుడు. ఏంట్రా?? మిమ్మల్ని వదిలేయాల?? సరే వదిలేస్తా. ఇక్కడి నుండి కిందకి వదిలేస్త, మీ ప్రాణాలు మీరే పైకి వదిలేస్తారు. అని అంటున్న రుద్రా గొంతులో కఠినత్వం తాండవిస్తోంది. ఏవతివే నువ్వు లం ..... అని అంటున్న ఒకడి మాట బయటకి రాకుండానే రుద్రా ఎగిరి గాలిలోనే పల్టీ కొడ్తూ ఒక్కటి వాడి గొంతు మీద కాలితో తన్నింది. అంతే..... వాడు అలాగే నెలకు ఒరిగి చచ్చిపోయాడు. ఆ ప్రదేశమంతా హాహాకారాలతో హోరెత్తిపోయింది. అప్పటిదాకా ధైర్యంగా జబ్బలు చరిచిన వాళ్లంతా ఒక్కసారిగా భయంతో కంపించిపోయారు. తడిసిన వారి శరీరాల్లో వణుకు ఆమెను మరింత బలవంతురాలిగా మార్చింది. అరుస్తున్న వారి ఆర్తనాదాలు వింటూన్నా ఆమెకు అలౌకిక ఆనందం కలిగింది. అరవండి, అరవండి ఇంకా అరవండి. మీరెంత అరిచినా కాపాడే వారు లేరు, రారు కూడా అని అంటున్న రుద్రా మొహంలో పైశాచిక చిరునవ్వు ఆ ముసుగులో కలిసిపోయింది. అమ్మ, వదిలేయమ్మ నీకు దండం పెడతాను, నీకు తండ్రిలాంటి వాడిని అని అన్నాడు ఒక 50 ఏళ్ళ వాడు. అమ్మ నాకు నీ వయసంత మనవరాలు ఉంది తల్లి నన్ను కూడా వదిలెయ్యమ్మ ప్రాధేయపడ్డాడు ఒక 75 ఏళ్ళ మరో వృద్ధుడు. కానీ రుద్ర ఏమాత్రం కూడా తొణకలేదు. పైగా గట్టిగ నవ్వేస్తూ అయ్యో మీ కోట మీకు ఉండనే ఉంది. వీళ్లందరికన్నా మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా, తొందరెందుకు అని అంటున్న రుద్రా కళ్ళు నిప్పు కణికల్లా మారాయి. ఆమె నరాలు పొంగి, గుండె వేగం పెరిగింది. ఆమె కళ్ళు డేగ కళ్ళకన్నా తీక్షణమైన చూపుగా మారింది. వెంటనే ఆమె తిరిగి 8వ అంతస్తులోకి దూకింది. లాప్ టాపులో సెక్యూరిటీ అధికారి హెడ్ క్వార్టర్స్ నెట్వర్క్స్ ని హ్యాక్ చేసి, ఒక కెమెరాను తీసుకుని ఆ 44 మందిని లైవ్లో ప్రసారం చేసింది.
ఇది జరగడానికి కొన్ని గంటల ముందు:
సెక్యూరిటీ అధికారి హెడ్క్వాటర్స్ హైదరాబాద్:
అన్ని ఫోనులు ఒకేసారి మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. నలభై ఐదు మంది ప్రముఖుల పిల్లలు, బంధువులు, స్నేహితులు కిడ్నపుకి గురికావడం అది ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలోనే అవడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు తలలు పట్టుకున్నారు. అత్యవసర మీటింగు ఆరెంజ్ చేసారు. IGతో పాటు రాష్ట్ర హోమ్ మినిస్టర్ మందిర నాయుడు కూడా ఆ మీటింగుకి అటెండయ్యింది. కారణాలు వెతికే పనిలో పడ్డారు మిగతా సెక్యూరిటీ ఆఫీసర్లు.ఈ కేసును అసిస్టెంట్ కమీషనర్ సూర్యకి అప్పచెప్పింది హోమ్ మిస్టర్. ఆయన టేకప్ చేసిన ఏ ఒక్క కేసు కూడా సాల్వ్ అవకుండా పెండింగులో లేదనే టాక్ ఉంది. అందుకే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ ని కాదని, ఆయనకు బాధ్యతలు అప్పగించారు. చుడండి సూర్య, మీకు ఎంత బ్యాకప్ కావాలన్నా తీసుకోండి కానీ ఐ వాంట్ దట్ బాస్టర్డ్స్ ఇమ్మీడియేట్ల్య్ అని అన్నది మందిర డెఫినెట్ల్య్ మేడం, 24 అవర్స్ లో వాళ్ళ ఎజెండా ఏమిటో కనుక్కుంటాను అని సెల్యూట్ చేసి బయటకి వస్తుండగా, ఒక కానిస్టేబుల్ కంగారుగా పరిగెడుతూ వచ్చాడు. ఏమిటన్నట్టుగా చూసాడు సూర్య. సర్ మీరొక్కసారి కంట్రోల్ రూముకి వస్తారా ??? అని అడిగాడు. అతని కళ్ళలో భయం అర్థంచేసుకున్న సూర్య కంట్రోల్ రూమ్ వైపు పరిగెత్తాడు. ఆ వెనకే మందిరతో పాటూ అందరు వెళ్లారు. టీవిలో రుద్రా నలభై నాలుగు మందిని బంధించిన వీడియో క్లిప్ చూపిస్తోంది. సెక్యూరిటీ ఆఫీసర్లకు చెమటలు పట్టాయి. నోరెళ్ళ పెట్టి చూస్తున్న అందరిని అలెర్ట్ చేసాడు సూర్య. ఆ కంప్యూటర్ IP అడ్రెస్స్ కనిపెట్టమని పురమాయించాడు. మందిర జాగ్రత్తగా ఆ వీడియో చూస్తోంది. అంతే ఒక్కసారిగా, అన్ని ఫోన్లు రింగ్ అయ్యి , ఒకేసారి కట్ అయ్యాయి. ఆలా మూడు సార్లు చేసింది రుద్రా. నాలుగోసారి ఒక్క ఫోన్ మాత్రమే ఆగకుండా మోగింది. సూర్య ఎత్తగానే, రుద్రా హలో సార్ బాగున్నారా?? అని అడిగింది. అంతే సెక్యూరిటీ ఆఫీసర్లతో పాటు మందిర కూడా ఆశ్చర్యపోయింది. వాళ్ళు వెతుకుతున్న క్రిమినల్ ఒక లేడీ అవడం వాళ్ళకి దిమ్మ తిరిగినట్టయింది. రుద్రా కొనసాగించింది. అనుకున్నాను ఈ కేసు మీ దగ్గరకే వస్తుందని. కానీ మీ ట్రాక్ రికార్డులో సాల్వ్ అవ్వని ఒక కేసుగా మిగిలిపోతుంది. మీ బ్యాడ్ లక్ అని అన్నది రుద్రా చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్, మర్యాదగా అని మాట్లాడుతున్న సూర్యని మధ్యలోనే ఆపింది రుద్రా. సారు..... నేను మాట్లాడడానికి జేసినా. మీరు చెప్తే విననికి కాదు అని అన్నది రుద్రా. సూర్య ఫోన్ ట్యాప్ చెయ్యమని సైగ చేసాడు. ఓకే మీకు కావాల్సింది, ఈ 44 మంది ప్రాణాలతో మీకు అప్పజెప్పడం, అంతేకదా. అయితే మనం ఒక డీల్కి వద్దాం. నేను ఈ 44 మందిని వదిలేస్తాను, కానీ మీరు 450 మందిని చంపాలి. అది కూడా మీరేం కష్టపడక్కర్లేదు. వాళ్ళ ఫోన్ నంబర్లు, లొకేషన్స్ తో సహా మీకు మీ స్టేషనుల పరిధిలోకి వచ్చే కేసుల లిస్ట్ పంపిస్తాను. మీరు చేయవలసిందల్లా వాళ్ళను ఎన్కౌంటర్ చెయ్యడమే అని అన్నది రుద్రా. ఆమె కళ్ళలో ఏ బెరుకు లేదు, గొంతులో గాంబీర్యం ఉట్టి పడింది. వింటున్న అందరికి ముచ్చెమటలు పట్టాయి. వాట్?? ఏమాట్లాడ్తున్నావో నీకైనా అర్ధమవుతుందా??? 45 మంది కోసం 450 మందిని చంపాలా ?? అది సెక్యూరిటీ ఆఫీసర్లే ఎన్కౌంటర్ చెయ్యాలా??? ఇంపాసిబుల్. మేము చెయ్యం అని అన్నాడు సూర్య తల పట్టుకుంటూ. రుద్రా మీ ఇష్టం సార్, మీరు చంపకపోతే నేనే చంపేస్తా, నాకది మ్యాటరే కాదు. ఎందుకైనా మంచిది మీకైతే లిస్ట్ పంపిస్తున్న చుడండి. మనలో మన మాట, ఈ ముచ్చట మీకు నాకు మధ్యనే ఉండనివ్వండి అని చెప్పి కాల్ కట్ చేసి, లిస్టులు పోలిస్ స్టేషన్లకు పంపింది. IP అడ్రెస్స్ ట్రేస్ అవట్లేదు సార్. కారణం ఆమె ఉపయోగిస్తున్న శాటిలైట్ మనది కాదు, ఇజరయిల్ దేశానిది. అది మనం హాక్ చెయ్యలేం. ఇక ఆమె ఫోన్ కూడా ట్యాప్ చెయ్యలేం ప్రతి సెకనుకి లొకేషన్ మారిపోతుంది సర్ అని అన్నాడు కమ్యూనికేషన్స్ ఆఫీసర్. సార్ లిస్టు వచ్చింది. మన పరిధిలోకి 15 మంది పేర్లు, అడ్రెస్సులు ఉన్నాయి అని అంటూ ఒక SI కొన్ని పేపర్లు చూపించాడు. మై గాడ్. ఓకే ఈ పదిహేను మంది ఇన్ఫర్మేషన్ తియ్యండి. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రి డీటెయిల్స్ అబౌట్ థెం అని అన్నాడు సూర్య. వైట్ బోర్డు మీద ఎదో రాసుకుంటూ. కాసేపటికి మరో 12 మంది కిడ్నప్ అన్న వార్త కలకలం రేపింది. మీడియా, పత్రికలూ మండిపడ్డాయి. చేతకాని సెక్యూరిటీ ఆఫీసర్లంటూ దుమ్మెత్తి పోశాయి. ఆ 12 మంది ఆమె ఇచ్చిన లిస్టులో ఉన్నవారే వేరు వేరు స్టేషన్ల పరిధిలోకి వస్తారు. రుద్రా ఫోన్ చేసింది. అప్పటిదాకా సూర్య గొంతులో వినిపించిన కాన్ఫిడేన్స్ తగ్గింది. రుద్రా సార్, నేను చెప్పింది చెయ్యడం తప్ప మరో గత్యంతరం లేదు మీకు అని అన్నది ఎగతాళిగా షట్ అప్..... ధైర్యం ఉంటె నా ముందుకొచ్చి మాట్లాడు, ఇలా దొంగలాగా దాక్కొని కాదు. మీరెంత మంది ఉన్నా, మిమ్మల్ని నేనొక్కడినే పట్టుకుని కటకటాల వెనక్కి నెడతాను. అస్సలు ఇది ఎవరు నిన్ను చెయ్యమన్నారో వాళ్ళకు చెప్పు ?? గంటలో 12మందిని కిడ్నప్ చేశావంటే చాలా నెట్వర్క్ ఉంది నీకు అని అన్నాడు సూర్య అసహనంగా ఆమె నుండి మరింత సమాచారం రాబట్టేందుకు. ఆమె మెదడు పాదరసంలా పనిచేస్తోంది. ఎంతవరకు వాళ్లకు చెప్పాలో, ఏది చెప్పాలో ముందే ఆమె నిశ్చయం చేసుకుంది. హ.... హ .....హహ...... నా వెనక ఎవరో ఉన్నారా ?? ఎందుకు ఆలా అనుకుంటున్నారు ?? ఆడదాన్ని, అశక్తురాలిని, అబలను అనేగా. ఆడదాని శక్తి యుక్తుల ముందు అస్సలు మీరెంత మీ బలగమెంత?? ఒక మగువ తలుచుకుంటే రాజ్యాలేల గలదు. శ్రీకృష్ణుడంతటి వాడికే నరకాసురుని చంపడానికి సత్యభామ అవసరం అయ్యింది. శివుని విల్లుని ఆ సీతమ్మ ఎత్తి, అది ఎత్తగలిగిన రాముడిని పెళ్లాడింది. దేవదేవుళ్లే ఆడదాని ముందు మోకరిల్లారు ఇక మీరెంత?? అయినా నా నెట్వర్క్ పక్కన పెట్టండి. మీ నెట్వర్క్ మీకుంది కదా. అదే దమ్ము మీకు ఉంటె, 24 గంటల్లో నన్ను పట్టుకోండి లేదా ఇంకెప్పుడు నన్ను పెట్టుకోలేరు అని గట్టిగా నవ్వింది రుద్రా నోరుముయ్యి, యు బిచ్, నాటకాలాడుతున్నావా ?? నువ్వు చెప్పిందల్లా చెయ్యడానికి నువ్వేం నా ఉంపుడుగత్తేవ ?? అని ఫైర్ అయ్యాడు సూర్య. రుద్రా కాల్ కట్ చేసింది. ఈ లోపు ఆ 15 మంది ట్రాక్ రికార్డ్స్ చెక్ చేసారు సెక్యూరిటీ ఆఫీసర్లు. అందరి మీద కేసులు ఉన్నాయ్, కానీ అందులో ఉన్న కామన్ పాయింట్ ఆడది. వాళ్లంతా అమ్మాయిలపై అకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడ్డ వారే. ప్రేమించలేదని ఆసిడ్ పోసిన వాడి దగ్గర నుండి అమ్మాయిలను విదేశాలకు అమ్మేసే బ్రోకర్లు, రేప్ చేసి చంపేసిన వెదవల దాక ఉన్నారు. ఈ 15 మందే కాదు, ఆమె ఇచ్చిన 450 మందికి ఇలాంటి నేర చరిత్రే ఉంది. కానీ వాళ్లెవరు జైళ్లలో లేరు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు కారణాలు చాలానే ఉన్నాయ్. మన రాజ్యాగంలో ఉన్న లొసుగులు, చట్టాల్లో బొక్కలను ఉపయోగించుకుని బయట తిరుగుతున్నారు. అప్పటికి కానీ అర్ధం కాలేదు సూర్యకి ఆమె అజెండా ఏమిటో. ఇంతలో టీవిలో న్యూస్ కిడ్నపైన పన్నెండు మంది దారుణ హత్యకు గురయ్యారని వారి శరీరాలపై ఆకాశంలో సగం - రుద్రా ఆన్నా లేఖ ఉందన్నా వార్త మళ్ళి రాష్టాలను కుదిపేసింది. స్వయంగా హోమ్ మినిస్టరే రుద్రతో మాట్లాడాలనుకుంది. ఆలా ఒక గంట తరువాత రుద్రా ఫోన్ చేసింది సార్ ఎలా ఉంది నేనిచ్చిన బహుమతి?? అని అడిగింది రుద్రా పైశాచికంగా నవ్వుతు. టెంపర్ లాస్ అయినా సూర్య ఏయ్ నువ్వు అస్సలు ఆడదానివేనా?? మనుషులను పిట్టల్ని చంపినట్టు చంపుతున్నావ్?? నువ్వు నాకు దొరికిన రోజు నిన్ను నీ చావు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది రాసిపెట్టుకో అని తిడ్తున్న అతని చేతిలోనుండి రిసీవర్ లాక్కుంది మందిర రుద్రా నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న. మీ అజెండా నాకు అర్థమైంది. ఒక మహిళగా నువ్వు చేస్తోంది సమర్థిస్తాను కానీ ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ గా మాత్రం నేను సమర్ధించలేను. నువ్వు చేస్తోంది తప్పు, వాళ్ళని వదిలి లొంగిపో, నేను హామీ ఇస్తున్న నీ ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టనివ్వను అని అన్నది మందిర. నా ప్రాణానికి హామీ మీరే కాదు మేడం, ఆ దేవుడు కూడా హామీ ఇవ్వలేడు?? అయినా సరే, మీరడిగినట్టే చేస్తా కానీ ఇప్పుడు కాదు, నేను చెప్పింది మీరు చేసాక అని అన్నది రుద్రా స్థిరంగా. ఆలా అమాయకులను చంపడం, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం?? అని అడిగింది మందిర తీవ్ర స్వరంతో అమాయకుల? ఎవడు మేడం?? నేను చంపినా 12 మందిలో ఏ ఒక్కడు కూడా మనిషి కాదు, జనారణ్యంలో యథేచ్ఛగా తిరుగుతున్నా మానవమృగలు. అభం, శుభం తెలియని ఆడపిల్లల్ని, మేకపిల్లల్ని అమ్మినట్టుగా అమ్ముతుంటాడు ఒకడు. ఆ ఆడపిల్లలకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చి, 9 ఏళ్ల పిల్లని కూడా పెద్దమనిషిని చేసి, ప్రాస్టిట్యూటుగా మార్చి డబ్బులు దండుకుంటాడు, మరొక్కడు. వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి, వాడు పాడుచేసేదే కాక ఫ్రెండ్లకి ప్రసాదం పంచినట్టు పంచి, అమ్మాయిని 6 నెలలుగా అత్యాచారం చేసేవాడు మరొక్కడు అని అంటున్న రుద్రా గొంతు జీరా పోయింది. తిరిగి ఆమె ఈ12 మందే కాదు 450 మందికి కూడా ఇలాంటి చరిత్రే ఉంది. మీరు వదిలిపెట్టిన, వాళ్ళను నేనొదిలిపెట్టను. ఒక్కొక్కడిని వెతికి, వేటాడి, వేంటాడి చంపుతాను. ఆడదాని ప్రాణంతో, మానంతో ఆటలాడే ప్రతి ఒక్కడిని, వంతుల వారీగా లెక్కలేసి మరి చంపుతాను అని గట్టిగా పళ్ళు కొరుకుతూ చెప్పింది రుద్రా. రుద్రా నేను అర్ధం చేసుకోగలను. కానీ మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం, కొన్ని చట్టాలు చేసుకున్నాం. వాటిని మనం మన చేతుల్లోకి తీసుకోలేము. నా మాట విను, కచ్చితంగా ఆ క్రిమినల్స్ అందరికి శిక్ష పడేలా నేను చూస్తాను అని అంటున్న మందిర మాటను పూర్తికాకుండానే రుద్రా శిక్ష..... శిక్ష?? ఒక అమ్మాయిని సాక్షాత్తు రాజధానిలో నగరమంతా తిప్పుతూ అత్యాచారం చెయ్యడమే కాకా ఆమె ప్రాణాలుపోడానికి కారణమైన వాడిని, వయస్సు తక్కువని 3 సంవత్సరాల జైలు శిక్ష వేసి, బయటకి పంపడమా మీరు వేసే శిక్ష. 17 సంవత్సరాల అడ్డగాడిద అత్యాచారం చేస్తే, వాడు బాలుడా?? ఇదేనా మీరు చెయ్యబోయే న్యాయం. ప్రేమించలేదని అమ్మాయి మొహం మీద ఆసిడ్ పోస్తే, ఈవ్ టీసింగ్ కేసు కింద FIR రాసి, వాడిని మూడు నేల్లకే వదిలేయడమా, మీరు చేసే చట్టం?? మీరు చెప్పిన అదే సమాజంలో తప్పుచేసిన వాడు తలెగరేసి తిరుగుతుంటే, ఆ తప్పుకు బలైపోయిన ఆ అమ్మాయి మాత్రం, మొహానికి ముసుగేసుకుని, అవమానాలను భరిస్తూ, ఆ మచ్చను జీవితాంతం మొయ్యాలి. అలంటి అమ్మాయిలకు జరిగిందా మీరు చెప్పిన న్యాయం?? సగటున ప్రతి పదిమంది అమ్మాయిల్లో, ఇద్దరమ్మాయిలు ఇలాంటి అకృత్యాలకు, అఘాయిత్యాలకు బలవుతున్నారంటే మీరు పుట్టించాల్సింది 'చట్టాలు' కాదు, తప్పు చెయ్యాలనే ఆలోచన వచ్చిన ప్రతి మగవాడి ఒంట్లో 'భయాన్ని', చంపాల్సింది ఈ 'మృగాల'నే కాదు, ఆడపిల్లలకు న్యాయం జరగదనే 'అభిప్రాయా'న్ని అని అంటున్న రుద్రా మాటల్లో నిజాన్ని గ్రహించింది హోమ్ మినిస్టర్ మందిర సరే నువ్వు అంటోంది నిజం కానీ నువ్వు అడుగుతోంది మా చేతుల్లో లేనిది?? ఎన్కౌంటర్ 450 మందిని ఒకేసారి చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలియంది కాదు. హ్యూమన్ రైట్స్ అని, కోర్ట్స్ అని మా నెత్తి మీద ఉన్నాయి కదా అని అడిగింది మందిర. మీరేం భయపడకండి. దీనికి కూడా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తానంటే వాళ్ళందరిది నాచురల్ డెత్ లాగా క్రియేట్ చేయొచ్చు అని అన్నది రుద్రాచెవిలో ఉన్న బ్లూ టూత్ ని సరిచేసుకుంటూ ఎలా? అని అడుగుతున్న మందిర వైపు చూస్తూ సైగ చేసాడు సూర్య. నో మేడం ఇది చెయ్యడానికి మీరు ఒప్పుకుంటున్నారా ?? అని అడిగాడు విందాం ఎం చెప్తుందో అన్నట్టుగా సైగ చేసింది మందిర పక్కనే ఉన్న గ్లాస్ లోని నీళ్లు రెండు గుటకలు వేసి రుద్రా సింపుల్ మేడం వాళ్ళను షూట్ చెయ్యడమో లేక కత్తితో చంపడమొ కాకుండా నేను చెప్పే ఒక డ్రగ్ కంపొజిషన్ మెడ వెనక భాగంలో ఇంజెక్ట్ చెయ్యండి అంతే హార్ట్ ఎటాకనో, లేక కార్డియాక్ అరెస్టనో అంటారు. పోస్ట్ మార్టంలో కూడా కనిపెట్టలేరు అని అన్నది చైర్లో వెనక్కి వాలి కూర్చుంటూ బ్రిలియెంట్, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకుని చెప్తాను. ఒక అరగంట తరువాత ఫోన్ చెయ్యి అని మందిర పెట్టేసింది మేడం ఏంటిది ?? ఆమె చెప్తోంది మనం చెయ్యలేం. అది మీకు కూడా తెలుసు అని అన్నాడు సూర్య ఐనో ఎవరిథింగ్ సూర్య. నేను వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ చెక్ చేయించాను. ప్రతి వాడు క్రిమినలే. అలంటి వాళ్ళు చచ్చిన దేశానికి వచ్చిన నష్టంమేమి లేదు. పైగా అలంటి వాళ్ళని చంపితే అలంటి మృగాళ్లకు కూడా బుద్దొస్తుంది, ఆలోచించండి. మనకు ఆమె చెప్పినట్టు, చెయ్యడం తప్ప మరొ మార్గం లేదు. అవసరమైతే నేను సీఎంతో మాట్లాడతాను మీరు ఆ పనిలో ఉండండి. అని అంటూ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, ఫైల్ నా టేబుల్ మీదకి పంపించామని ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోయింది. సూర్య మెల్లిగా లేచి నిలబడ్డాడు. చెప్పండి టీం, ఏంచేద్దాం. మీ అభిప్రాయాలూ చెప్పండి అని అడిగాడు. సర్, రాజకీయ వత్తిళ్లకు లొంగి, పై అధికారుల మాటలకూ దడిచి మా డ్యూటీ మేము చెయ్యలేదు. కానీ ఇప్పుడు మనల్ని ఆపె వాళ్లే లేరు. అని అన్నది ఒక లేడీ SI లేదు సర్ దీనివల్ల మనం చాలా సమస్యలు ఎదురుకోవాలి. ఈ నిజం బయటకి వస్తే మన తప్పు లేకున్నా ట్రాన్స్ఫర్లు చేస్తారు, సస్పెండ్ చేస్తారు ఒక్కోసారి ఉద్యోగమే పోవచ్చు. అప్పుడు మనం మన ఫామిలీస్ తో రోడ్డుపైకి వస్తాం అని అన్నాడు మరో SI అమ్మాయిల పై అఘాయిత్యాలకు పాల్పడే వారిని మనం ఎం చేయగలిగాము సర్? నాకు 13 ఏళ్ల అమ్మాయి ఉంది. అది రోజు కాలేజ్కి సిటీ బస్సులో వెళ్లివస్తోంది. ఒకడు ఆమె చెప్పుకోలేని చోట గోర్లు దిగేలా గాయం చేస్తే, వచ్చి చెప్పుకుని ఏడ్చింది. కానిస్టేబుల్ ఐన నేనే కేసు పెడితే, వాడు ఒక 'రౌడి'. కేసు వాపసు తీసుకోకపొతే మా ఇంట్లో ఆడవాళ్ళని బజారులో చూసుకుంటానని బెదిరించాడు. ఏమి చెయ్యలేని నిస్సహాయత కేసు వాపసు తీసుకున్నాను. సెక్యూరిటీ ఆఫీసర్ కూతురుకే న్యాయం జరగకపోతే ఇక సామాన్య జనానికి ఎలా జరుగుతుంది ?? అప్పుడు నా బిడ్డ పడ్డ కష్టం చిన్నదయుండొచ్చు కానీ ఆమె మనసుకు తాకిన గాయం ఎప్పటికి మానదు. ఇప్పుడు అలాంటి కుక్కలని వీధిలో నిలబెట్టి కాల్చే అవకాశం వచ్చింది అన్నాడు ఆవేశంగా ఏడుస్తూ. అక్కడ అందరి కళ్ళు చెమ్మర్చాయి. ఈ ఆపరేషనులో ఎంతమంది నాతో ఎస్ అంటున్నారు అని అడిగాడు సూర్య అందరు చేతులు లేపారు. టీంని అలెర్ట్ చెయ్యండి, అందరిని మనం చంపేస్తున్నాం. అండర్గ్రౌండ్ కాప్స్ కూడా ఇవాళ ఆన్ డ్యూటీలో ఉండమనండి. గంటకు 30 మంది చొప్పున 15 గంటల్లో పని పూర్తవ్వాలి. అప్పటిదాకా నో రిలాక్సేషన్ అని చప్పట్లు చరుస్తూ పని పురమాయించాడు సూర్య. 15 గంటలు గడిచేసరికి మొత్తం 450 మంది వివిధ ప్రాంతాలలో ఒకే విధంగా చచ్చారు. ఈ విషయం ఎక్కడ మీడియాలో రాలేదు. కారణం లేకపోలేదు. ఒక్క చిన్న క్లూ కూడా వాళ్లకు దొరకలేదు, దొరికిన చెప్పే ధైర్యం చెయ్యలేదు. రుద్రా ఫోన్ చేసే సమయానికి పని పూర్తయింది. చాలా థాంక్స్, సూర్యగారు. నాకు తెలుసు మీరు ఈ పని చేస్తారని అని అన్నది. 'రుద్రా..... ఆ నలభై ఐదు మందిని విడిచి పెట్టి, ఇప్పటికైనా నువ్వు కూడా లొంగిపో అని అన్నాడు సూర్య. సారీ సర్ 44 మందే ఉన్నారు, ఒక్కడిని ఆల్రెడీ చంపేసాను అని అంటు రుద్రా లాప్టాప్ మూసింది ఎక్సపెక్ట్ చేశాను రుద్రా..... అస్సలు నువ్వు ఆ 45 మందిని ఎందుకు కిడ్నప్ చేసావో నాకు తెలుసు అని అన్నాడు సూర్య మీరు ఉహించగలరని, అతడి సమర్థులని కూడా నాకు తెలుసు. వీళ్లంతా నేరాలు చేసినవాళ్ళే కానీ ప్రముఖులు, వారి పిల్లలు, బంధువులు వీళ్ళలో మీ డిపార్టుమెంటుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళను అడ్డంపెట్టుకుంటే నాకు రెండు పనులు జరుగుతాయి. ఒకటి వీళ్లకోసమైన నేను చెప్పింది మీరు చేస్తారు. రెండోది, నేను ఇచ్చిన లిస్టులో ఇలాంటి బిగ్ షాట్స్ ఉంటె మీరు వాళ్ళకి మినహాయింపు ఇస్తారు. అందుకే అలాంటోళ్ళనే ఏరి కోరి కిడ్నప్ చేశాను అని అంది నవ్వుతు మరి వాళ్ళనేం చెయ్యబోతున్నావ్?? అని అడిగాడు సూర్య రుద్రా ఏమి మాట్లాడకుండా మిన్నకుండిపోయింది. సరే చెప్పొద్దూ..... ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు, వీళ్లందరి డేటా నీ దగ్గరకు ఎలా వచ్చింది?? నువ్వు ఎలా సంపాదించావు ?? నీకు ఎవరు సహాయం చేస్తున్నారు ?? ప్లీజ్ చెప్పు ?? అని అడిగాడు సూర్య తప్పు చేసిన వాడు చట్టం నుండి, న్యాయం నుండి తప్పించుకోవచ్చు కానీ వాడి 'కర్మ' నుండి తప్పించుకోలేడు. ఆ కర్మ 'నేనే' అని చెప్పి ఫోన్ పెట్టేసింది రుద్రా. ఆలా పెట్టేసిన గంట తర్వాత న్యూస్లో 45 మందిని కిరాతకంగా హత్య చేసారని న్యూస్ వచ్చింది. సూర్య బాధ్యత తీసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి, పదవికి రాజీనామా చేసాడు. ఈ హత్యలు జరగడానికి కారణాలు ఏవైనా, ఈ కేసు సాల్వ్ చేయనందుకు నేనేమి బాధపడట్లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను అని అన్నాడు సూర్య.
రెండు రోజుల తరువాత
కేరళలో ఆకాశం ప్రకృతి - రుద్రా అన్న లేఖతో పాటు 45 మంది కిడ్నప్ అయ్యారని వార్త చదివిన సూర్య, వెంటనే లేచి ఆకాశంవైపు చూస్తూ సెల్యూట్ చేసాడు. రుద్రా ఒక పాడుబడ్డ బంగ్లా టెర్రస్ పై నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకుని, చీకటిలో వెలిగిపోతున్న నగరాన్నీ చూస్తూ చిరునవ్వు నవ్వింది.
************** సమాప్తం*********

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ