Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : కాని ఆ డాక్టర్ డ్రస్ శవానికి ఎందుకు వేసాడు….

వందన : సార్…శివానంద్‍కి ఈ మధ్యనే డాక్టరేట్ ఇచ్చారు…దాంతో అందరూ ఆయన్ని డాక్టర్ అని పిలుస్తున్నారు… ఒకవేళ ఈ హంతకుడు డాక్టర్‍ని చంపాడని అనుకుంటున్నాడా…..
ఆ మాట వినగానే రాము, ప్రసాద్ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.
వాళ్ళిద్దరూ అలా ఎందుకు నవ్వారో అర్ధం కాని వందన వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ, “ఎందుకు నవ్వుతున్నారు…” అనడిగింది.
ప్రసాద్ : ఇలాగే సార్….ఇది ఓవర్‍గా బుక్స్ చదివి….పక్కన వాళ్ళ బుర్ర తినేస్తుంటారు….
వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా ఒక కానిస్టేబుల్ వచ్చి ఫైల్ ఇచ్చి వెళ్ళాడు.
ప్రసాద్ : (ఆ ఫైల్ తీసుకుని రాము వైపు చూస్తూ) సార్….మనకు వచ్చిన బొమ్మకి మేక మాస్క్….శివానంద్ శవానికి ఎద్దు ముసుగు…ఈ రెంటికి లింక్ ఏంటి….
వందన : అది కూడా మనకు ఏదో కావాలని క్లూ ఇచ్చాడని అనిపిస్తున్నది…అలాగే శవానికి వెనకాల డాక్టర్ కోటు మిద రాసిన నాలుగు అంకెల నెంబర్ లాగా….
ప్రసాద్ : సార్….ఇంకో విషయం ఏంటంటే….శివానంద్ ఫోన్ నుండి వెళ్ళిన లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ మూడు గంటలకు వెళ్ళింది….
వందన : అయితే…హంతకుడే ఫోన్ చేసి ఉంటాడు…
ప్రసాద్ : అవును…వాడు కాల్ చేసిన నెంబర్…..966XX XX719…..
వందన : ఏయ్….అది నా నెంబర్…
ప్రసాద్ : ఏంటి నువ్వు చెప్పేది….
వందన : (తన ఫోన్‍లో కాల్ లిస్ట్ చూసుకుంటూ….) అవును….రాత్రి మూడు గంటలప్పుడు వచ్చింది….ఎవరూ మాట్లాడకపోయే సరికి ఏదో ప్రాంక్ కాల్ అని పట్టించుకోలేదు…(అంటూ రాము వైపు చూసి) సార్…రాత్రి మీరు అడిగారు కదా….ఈ టైంలో ఫోన్ ఎవరు….అని…..
ఆ మాట వినగానే రాము అవునన్నట్టు తల ఊపుతూ ఆలోచనలో పడ్డాడు.
వందన మాట వినగానే ప్రసాద్ ఒక్కసారిగా వందన వైపు చూసాడు.
ప్రసాద్ చూపులో భావం అర్ధం అయిన దానిలాగా వందన కళ్ళతోనే, “రాము సార్….రాత్రి నాతోనే ఉన్నాడు,” అన్నట్టు సమాధానం చెప్పింది.
దాంతో ప్రసాద్, “అబ్బా….ఛాన్స్ మిస్ అయ్యాను,” అన్నట్టు ఫేస్ పెట్టేసరికి వందన నవ్వు వస్తుంటే ఆపుకున్నది.
ప్రసాద్ : కాని శివానంద్‍ని హత్య చేయగానే….హంతకుడు నీకు ఎందుకు కాల్ చేసాడు…
వందన : ఏదో క్లూ వదులుతున్నాడు….మనకు కొరియర్‍లో బొమ్మ మనకు పంపించినట్టు….
ప్రసాద్ : మరి శివానంద్ ఒంటి మీద నాలుగు బుల్లెట్లు…..
రాము : వాడు మనకు ఈ క్లూస్ ద్వారా పట్టుకోమని చాలెంజ్ చేస్తున్నాడు….నెంబర్ పజిల్, డాక్టర్ డ్రస్, దున్నపోతు మాస్క్….ఇప్పుడు వందనకు ప్రాంక్ కాల్…దమ్ముంటే నన్ను పట్టుకోండి అని మనకు సవాల్ విసురుతున్నాడు…పెద్ద తెలివైన వాడనుకుంటున్నాడు…..(అంటూ ఒక్క క్షణం ఆలోచించి వాళ్ళిద్దరి వైపు చూస్తూ) ముందు మనకు పంపించిన బొమ్మకు ఎర్రచొక్కావేసి పంపించాడు…శివానంద్ కమ్యూనిస్ట్….అంటె…రెడ్ కలర్…ఆయన్ని లేపేసాడు… బొమ్మకు నాలుగు హోల్స్…ఇక్కడ నాలుగు బుల్లెట్లు…ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట్ వేసాడు… దానికి కారణం ఉన్నది…తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది….నా గెస్సింగ్ కరెక్ట్ అయితే వాడు తరువాత చంపబోయేది డాక్టరే…..
వందన : అదే అయ్యే చాన్స్ లు ఉన్నాయి సార్….
రాము : సరె…మీరు ఇద్దరూ ఆ కారు టైర్ ప్రింట్…గన్స్ అమ్మే వాళ్లతో రీసెంట్‍గా ఎవరికైనా గన్ అమ్మారో ఆ వివరాలు కనుక్కోండి….
దాంతో ముగ్గురూ ఇంటికి వెళ్ళడానికి బయటకు వచ్చారు.
వాళ్ళు ముగ్గురూ బయటకు రాగానే అక్కడ ఉన్న జర్నలిస్ట్‍లు వెంటనే ముగ్గుర్ని గుమిగూడి కేస్ డీటైల్స్ అడుగుతూ కేసు ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నారు.
రాము : ఎంక్వైరీ జరుగుతుంది….అది ఒక కొలిక్కి రాగానే తప్పకుండా చెబుతాను….
అంటూ అక్కడ నుండి బయటకు వచ్చి తన డ్రైవర్‍కి కాల్ చేసి కారు తెమ్మని చెప్పి రోడ్ మీదకు వచ్చాడు.
ప్రసాద్, వందన జర్నలిస్ట్‍లు అడిగిన వాటికి సమాధానాలు చెబుతున్నారు.
రాము అలా రోడ్ మిదకు రాగానే ఒక బ్లాక్ స్కార్పియో స్పీడ్‍గా తన వైపు రావడం గమనించాడు.
కాని అది ఏమాత్రం స్పీడు తగ్గకుండా తన మీదకు రావడంతో రాము వెంటనే అలెర్ట్ ఆయ్యి పక్కకు దూకేసాడు.
స్కార్పియో మాత్రం ఆగకుండా అక్కడ నుండి స్పీడ్‍గా వెళ్ళిపోయింది.
రాము అలా దూకడం గమనించి ప్రసాద్, వందన వెంటనే రాము దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పైకి లేపారు.
వందన : (కంగారు పడుతూ….రాము షర్ట్ మీద దుమ్ము దులుపుతూ) సార్….మీకు ఏం కాలేదు కదా….
రాము : ఏం కాలేదు….

ప్రసాద్ : అయినా వాడు అంత స్పీడుగా డ్రైవ్ చేస్తున్నాడేంటి…..
తరువాత డ్రైవర్ కార్ తీసుకువచ్చేసరికి రాము కారు ఎక్కి, “ప్రసాద్….నేను చెప్పిన డీటైల్స్ కలెక్ట్ చేయండి….బ్లాక్ మార్కెట్ లో గన్స్ అమ్మే వాళ్ళను….వెపన్స్ ట్రాన్సాషన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్లను ఎంక్వైరీ చేయండి,” అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు.
**********
అలా వెళ్ళిన బ్లాక్ స్కార్పియో ఒక షాపింగ్ కాంప్లెక్స్‍కింద ఉన్న పార్కింగ్ ఏరియా లోకి వెళ్ళింది.
అపుడే ఆ షాపింగ్ కాంప్లెక్స్‍లో ఉన్న తన హాస్పిటల్‍లో పని పూర్తి చేసుకుని కిందకు వచ్చిన ఒక లేడీ డాక్టర్ ఆ స్కార్పియో హెడ్ లైట్లు పడే సరికి కళ్ళు మూసుకున్నది.
అందులో నుండి ఒకతను దిగి తన వైపు రావడం చూసి లేడీ డాక్టర్ రమ్య మనసు ఏదో కీడు శంకించింది.
వెంటనే అక్కడ నుండి పారిపోవాలని అనుకుని వెనక్కు తిరిగింది.
కాని రమ్య పరిగెత్తే లోపే అతను ఇంకా స్పీడుగా వచ్చి ఆమెను పట్టుకుని తన చేతిలో ఉన్న కర్చీఫ్ ఆమె ముక్కు మీద పెట్టాడు.
ఆ కర్చీఫ్ క్లోరోఫామ్ ఉండటంతో లేడీ డాక్టర్ రమ్య వెంటనే సృహ తప్పి తల పక్కకు వాల్చేసింది.

(2 B Continued.....)
(తరువాత అప్డేట్ 718 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-718.html)
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 11-12-2022, 09:00 PM



Users browsing this thread: 2 Guest(s)